- మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి యత్నం
రెండో ఏఎన్‌ఎంల ఆందోళన ఉధృతం
Published Sat, Aug 20 2016 11:20 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
ఆదిలాబాద్ టౌన్ : రెండో ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఇంటి ముట్టడికి ఏఎన్‌ఎంలు యత్నించారు. మంత్రి ఇంటి సమీపంలోకి చేరుకున్న ఏఎన్‌ఎంలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దాదాపు గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు వెంకటమ్మ, లలిత, పుష్ప, సుమంగళి, సునిత, మమత, అరుణ, సువర్ణ, ముంతాజ్, పద్మ, లక్ష్మి, సుజాత పాల్గొన్నారు.
నిర్మల్‌లో...
నిర్మల్ రూరల్ : తమను క్రమబద్ధీకరించాలంటూ రెండో ఏఎన్‌ఎంలో చేపట్టిన ఆందోళన శనివారం తీవ్రమైంది. కొన్ని రోజులుగా దీక్ష చేపడుతున్న తమను పట్టించుకోవడం లేదంటూ నిర్మల్‌లోని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పీఏకు వినతిపత్రం అందించారు. రెండో ఏఎన్‌ఎంలు రాధ, లతీఫా, శోభ, మంజుల, పద్మ, సునీత, అనిత, అనసూయ, ఉమ పాల్గొన్నారు.
ఖానాపూర్‌లో...
ఖానాపూర్ : సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల అన్నారు. శనివారం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని సెకండ్ ఏఎన్‌ఎమ్‌ల ఆధ్వర్యంలో ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంటిని ముట్టడించారు. నాయకులు సముద్ర, విజయప్రభ, యోత్సేనా, చంద్రకళ, స్వాతి, ఆర్.గంగామణి, గంగరాజు, శోభ, లక్ష్మి, పార్వతి, రాద, పద్మ, సుగుణ, కమల, స్వరూప, సారిక, విమల పాల్గొన్నారు.
Advertisement