second anm
-
రెండో ఏఎన్ఎంల ఆందోళన ఉధృతం
మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి యత్నం ఆదిలాబాద్ టౌన్ : రెండో ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఇంటి ముట్టడికి ఏఎన్ఎంలు యత్నించారు. మంత్రి ఇంటి సమీపంలోకి చేరుకున్న ఏఎన్ఎంలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దాదాపు గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు వెంకటమ్మ, లలిత, పుష్ప, సుమంగళి, సునిత, మమత, అరుణ, సువర్ణ, ముంతాజ్, పద్మ, లక్ష్మి, సుజాత పాల్గొన్నారు. నిర్మల్‌లో... నిర్మల్ రూరల్ : తమను క్రమబద్ధీకరించాలంటూ రెండో ఏఎన్ఎంలో చేపట్టిన ఆందోళన శనివారం తీవ్రమైంది. కొన్ని రోజులుగా దీక్ష చేపడుతున్న తమను పట్టించుకోవడం లేదంటూ నిర్మల్‌లోని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పీఏకు వినతిపత్రం అందించారు. రెండో ఏఎన్ఎంలు రాధ, లతీఫా, శోభ, మంజుల, పద్మ, సునీత, అనిత, అనసూయ, ఉమ పాల్గొన్నారు. ఖానాపూర్‌లో... ఖానాపూర్ : సెకండ్ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల అన్నారు. శనివారం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని సెకండ్ ఏఎన్ఎమ్ల ఆధ్వర్యంలో ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంటిని ముట్టడించారు. నాయకులు సముద్ర, విజయప్రభ, యోత్సేనా, చంద్రకళ, స్వాతి, ఆర్.గంగామణి, గంగరాజు, శోభ, లక్ష్మి, పార్వతి, రాద, పద్మ, సుగుణ, కమల, స్వరూప, సారిక, విమల పాల్గొన్నారు. -
హామీలను విస్మరించిన సర్కార్
రెండో ఏఎన్ఎంల డిమాండ్లు పరిష్కరించాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు సంగారెడ్డి జోన్: వైద్యశాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు అన్నారు. సంగారెడ్డిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట రెండో రోజు జరిగిన ముట్టడి కార్యక్రమానికి చుక్కరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 18 నుంచి ఆందోళన నిర్వహిస్తున్నా పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. జీవో 14 ప్రకారం పెంచిన వేతనాలను రెండో ఏఎన్ఎంలకు వర్తింపజేయాలన్నారు. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు మల్లేషం, రాజయ్య, బాలమణి, నర్సమ్మ, రెండవ ఏఎన్ఎం నాయకులు వినోద, విజయలక్ష్మి, పద్మ, కృష్ణవేణి, సంగీత తదితరుల పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు
కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌చౌహాన్ రెండో ఏఎన్ఎంల ఆందోళనకు మద్దతు ఉట్నూర్ : రెండో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్ చౌహాన్ విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం రెండో ఏఎన్ఎంలు ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి భరత్‌చౌహాన్ మద్దతు తెలిపారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన రాస్తారోకోలో ఆయన మాట్లాడుతూ రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండో ఏఎన్ఎంలు లేకుంటే వైద్య వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, మండల అధ్యక్షుడు ఎక్బాల్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ నిస్సార్, సీఐటీయు నాయకులు రాజేందర్, రెండో ఏఎన్ఎం సంఘం ఉపాధ్యక్షురాలు జ్యోతి, సభ్యులు రెండో ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు
కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌చౌహాన్ రెండో ఏఎన్ఎంల ఆందోళనకు మద్దతు ఉట్నూర్ : రెండో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్ చౌహాన్ విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం రెండో ఏఎన్ఎంలు ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి భరత్‌చౌహాన్ మద్దతు తెలిపారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన రాస్తారోకోలో ఆయన మాట్లాడుతూ రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండో ఏఎన్ఎంలు లేకుంటే వైద్య వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు. సమస్యలు పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, మండల అధ్యక్షుడు ఎక్బాల్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ నిస్సార్, సీఐటీయు నాయకులు రాజేందర్, రెండో ఏఎన్ఎం సంఘం ఉపాధ్యక్షురాలు జ్యోతి, సభ్యులు రెండో ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
రెండో ఏఎన్ఎంలపై వివక్ష తగదు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నగేశ్ చొప్పదండి : రెండో ఏఎన్ఎంలపై ప్రభుత్వానికి వివక్ష తగదని, వారిని రెగ్యులరైజ్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండో ఏఎన్ఎంలు చేపట్టిన రిలే దీక్షలకు ఆయన గురువారం మద్దతుతెలిపి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగుపడతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైందన్నారు. తక్కువ వేతనాలు ఇస్తూ, వెట్టిచాకిరీ చేయించుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడుతారన్నారు. -
కళ్లకు గంతలు కట్టుకుని..
సమ్మెలో కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్ఎంలు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు వికారాబాద్ రూరల్: ఎనిమిదేళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్ఎంలను వెంటనే క్రమబద్ధీకరించి వారి సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్ఎంలు చేస్తున్న సమ్మె గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. సబ్ కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న వారికి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి జే.రత్నారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్ నర్సింలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్ఎంలను వెంటనే క్రమబద్ధీకరించాలని, వారి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ మాట్లాడుతూ.. వైఎస్ ఇంకా కొన్ని రోజులు జీవించి ఉంటే కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుని ఉండేవారన్నారు. డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి జె.రత్నారెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టు సెకెండ్ ఏఎన్ఎంల సమస్యల పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మహిపాల్, కేవీపీఎస్ కార్యదర్శి మల్లేశ్, నాయకులు సీహెచ్ భాస్కర్, ఖాలీద్, తొర్మామిడి వీరేశం, ఏఎన్ఎంలు స్రవంతి, శోభారాణి, సుజాత, నర్సమ్మ, పాపమ్మ, అంజలి, స్నేహలత, సుహాసిని, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
రెండో ఏఎన్ఎంల రాస్తారోకో
మేడ్చల్: తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన రెండో ఏఎన్ఎంలు గురువారం మేడ్చల్‌లో రాస్తారోకో నిర్వహించారు. సీఐటీయూ నాయకులతో కలిసి 44వ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. -
కొనసాగుతున్న రెండో ఏఎన్ఎంల సమ్మె
మూడో రోజుకు చేరిన సమ్మె నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మెలో ఏఎన్ఎంలు కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో ఏఎన్ఎంలుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ ప్రభుత్వం తమను రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 10వ పీఆర్సీని అమలు చేయాలని, యునిఫాం అలవెన్సులు చెల్లించాలని కోరారు. అపరిష్కతంగా ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో రెండవ ఏఎన్ఎంలు లక్ష్మి, వెంకటలక్ష్మి, సురేఖ, విజయ తదితరులు పాల్గొన్నారు. కౌటాల : మండలంలోని కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంలను రెగ్యూలర్ చేయాలని రజక సంఘం మండల అధ్యక్షులు రాచకొండ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నా రెండో ఏఎన్ఎంలకు సరిౖయెన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిర్పూర్(టి) : రెండవ ఏఎన్ఎంల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం మండలంలోని రెండవ ఏఎన్ఎంలు ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ రెండవ ఏఎన్ఎంలను రెగ్యూలరైజ్ చేయాలని, 10వ పీఆర్స్ ప్రకారం కనీస వేతనం చెల్లించాలని, డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్‌లు అందించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, 35 రోజుల క్యాజువల్ లీవ్‌తో పాటు 180 రోజుల మెటర్నిటీ లీవ్ సౌకర్యం కల్పించాలని, సబ్ సెంటర్ అద్దె, స్టేషనరీ ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకుడు కష్ణమాచారి, రెండవ ఏఎన్ఎంలు పుణ్యాబాయి, శైలజ తదితరులు పాల్గొన్నారు.