కార్యక్రమంలో మాట్లాడుతున్న చుక్క రాములు
- రెండో ఏఎన్‌ఎంల డిమాండ్లు పరిష్కరించాలి
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు
సంగారెడ్డి జోన్: వైద్యశాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు అన్నారు. సంగారెడ్డిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట రెండో రోజు జరిగిన ముట్టడి కార్యక్రమానికి చుక్కరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 18 నుంచి ఆందోళన నిర్వహిస్తున్నా పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
జీవో 14 ప్రకారం పెంచిన వేతనాలను రెండో ఏఎన్‌ఎంలకు వర్తింపజేయాలన్నారు. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు మల్లేషం, రాజయ్య, బాలమణి, నర్సమ్మ, రెండవ ఏఎన్‌ఎం నాయకులు వినోద, విజయలక్ష్మి, పద్మ, కృష్ణవేణి, సంగీత తదితరుల పాల్గొన్నారు.