కొనసాగుతున్న రెండో ఏఎన్‌ఎంల సమ్మె | continuing second anm summey | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రెండో ఏఎన్‌ఎంల సమ్మె

Published Wed, Jul 20 2016 11:38 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

continuing second anm summey

  • మూడో రోజుకు చేరిన సమ్మె
  • నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మెలో ఏఎన్‌ఎంలు
  • కాగజ్‌నగర్‌ : కాగజ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో ఏఎన్‌ఎంలుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ ప్రభుత్వం తమను రెగ్యూలర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా 10వ పీఆర్సీని అమలు చేయాలని, యునిఫాం అలవెన్సులు చెల్లించాలని కోరారు. అపరిష్కతంగా ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమ్మెలో రెండవ ఏఎన్‌ఎంలు లక్ష్మి, వెంకటలక్ష్మి, సురేఖ, విజయ తదితరులు పాల్గొన్నారు.  
    కౌటాల : మండలంలోని కాంట్రాక్ట్‌ రెండో ఏఎన్‌ఎంలను రెగ్యూలర్‌ చేయాలని రజక సంఘం మండల అధ్యక్షులు రాచకొండ అశోక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నా రెండో ఏఎన్‌ఎంలకు సరిౖయెన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 
    సిర్పూర్‌(టి) : రెండవ ఏఎన్‌ఎంల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మండలంలోని రెండవ ఏఎన్‌ఎంలు ఎస్సీ కాలనీలోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ రెండవ ఏఎన్‌ఎంలను రెగ్యూలరైజ్‌ చేయాలని, 10వ పీఆర్స్‌ ప్రకారం కనీస వేతనం చెల్లించాలని, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్స్‌లు అందించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, 35 రోజుల క్యాజువల్‌ లీవ్‌తో పాటు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, సబ్‌ సెంటర్‌ అద్దె, స్టేషనరీ ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకుడు కష్ణమాచారి, రెండవ ఏఎన్‌ఎంలు పుణ్యాబాయి, శైలజ తదితరులు పాల్గొన్నారు. 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement