రాస్తారోకో నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలు
-
కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌చౌహాన్
-
రెండో ఏఎన్‌ఎంల ఆందోళనకు మద్దతు
ఉట్నూర్ : రెండో ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్ చౌహాన్ విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం రెండో ఏఎన్‌ఎంలు ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి భరత్‌చౌహాన్ మద్దతు తెలిపారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన రాస్తారోకోలో ఆయన మాట్లాడుతూ రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండో ఏఎన్‌ఎంలు లేకుంటే వైద్య వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు.
సమస్యలు పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, మండల అధ్యక్షుడు ఎక్బాల్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ నిస్సార్, సీఐటీయు నాయకులు రాజేందర్, రెండో ఏఎన్‌ఎం సంఘం ఉపాధ్యక్షురాలు జ్యోతి, సభ్యులు రెండో ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.