Hospitals
-
పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు
-
ప్రజారోగ్యంతో చెడుగుడు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ప్రజారోగ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 104, 108 నిర్వహణను అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా అంబులెన్స్‌లను మూలన పడేయగా.. బీమాను తెరపైకి తెచ్చి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను అతలాకుతలం చేయడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా జిల్లా, బోధనాస్పత్రులకు మందులు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది. ఆస్పత్రులకు అత్యవసర మందులు సరఫరా కోసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసింది. డీ–సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులను ఆస్పత్రులే స్థానికంగా కొనుగోలు చేసే పాత విధానాన్ని పునరుద్ధరించింది. కేంద్రీకృత విధానంతో జవాబుదారీతనం జిల్లా, బోధనాస్పత్రులకు మందుల కొనుగోలు కోసం కేటాయించే మొత్తం బడ్జెట్లో 80 శాతం మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌ను అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తారు. 2022 జూలైలో అత్యవసర మందుల సరఫరాకు కేంద్రీకృత విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టెండర్లలో శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఎంఆర్పీలో 35.6 శాతం రాయితీపై మందులు సరఫరా చేస్తూ వచ్చింది. అత్యవసర మందులతో పాటు కొన్ని సందర్భాల్లో 80 శాతం బడ్జెట్లోని ఎసెన్షియల్ డ్రగ్స్‌లో అందుబాటులో లేని మందులను సరఫరా చేసేలా అనుమతులు ఇచ్చారు.తద్వారా లోకల్ టెండరింగ్‌లో నడిచే అవినీతి అక్రమాలతో పాటు ఆస్పత్రుల్లో మందుల కొరతను అరికట్టేలా చర్యలు తీసుకుంది. దీంతో గతంలో ఆస్పత్రులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తే అంతా ఖర్చైందని అదనపు బడ్జెట్ కోసం అడిగే పరిస్థితుల నుంచి రోగులకు మందుల కొరత లేకుండా ప్రజాధనం ఆదా అయ్యేలా పరిస్థితులు మెరుగయ్యాయి. 2022–23 నుంచి ఇప్పటి వరకు అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం రూ.84 కోట్లు కేటాయించగా అందులో రూ.37.09 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయింది. ఈ విధానంలో ఆస్పత్రుల్లో మందులకు ఇండెంట్ పెట్టిన దగ్గర నుంచి సరఫరా సంస్థకు బిల్లులు చెల్లింపు వరకు ప్రతి దశలో ఉన్నతస్థాయి పర్యవేక్షణతో పాటు జవాబుదారీతనం ఉంటుంది.అవినీతికి గేట్లు ఎత్తిన సర్కార్రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరతో ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షణలో పారదర్శకంగా మందులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేసి స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి సర్కారు అవినీతికి గేట్లు తెరిచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో కొందరు వైద్యులతో తమకున్న పరిచయాలతో కమీషన్ ఆశ చూపిన సంస్థలకు మందులు సరఫరా చేసేలా టెండర్ నిబంధనలు రూపొందించి అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఈ విధానంలో మందుల ధరల్లో ప్రతి జిల్లాకు వ్యత్యాసం ఉంటుంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బోధనాస్పత్రుల సంఖ్య, మందుల వినియోగం, బడ్జెట్ భారీగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఉన్న పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం గమనార్హం.ఆస్పత్రుల్లో గందరగోళంఅత్యవసర మందుల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నట్లు సూపరింటెండెంట్లకు గత వారంలో డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నఫళంగా ప్రస్తుత విధానాన్ని రద్దు చేశారు. స్థానికంగా కొనుగోళ్లకు సరఫరా సంస్థలను ఎంపిక చేసే వరకూ జన్స్టోర్స్లో ఎంఆర్పీపై మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే బోధనాస్పత్రులకు అవసరమైన మందులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని మందులు ఆ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ ఆస్పత్రులకు అవసరమైన స్థాయిలో సరఫరా చేయలేమని నిర్వాహకులు తేల్చిచెప్పినట్టు తెలిసింది.కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి 80 శాతం బడ్జెట్‌కు సంబంధించి 608 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఎక్కడ చూసినా 100 నుంచి 200 మేర మందులు అందుబాటులో ఉండటం లేదు. ఈ కొరత ఉన్న మందులను సైతం ఆస్పత్రులు అత్యవసర మందుల సరఫరా సంస్థ నుంచే పొందుతున్నాయి. ఉన్నఫళంగా సరఫరా వ్యవస్థను రద్దు చేయడంతో గుంటూరు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ సహా చాలా ఆస్పత్రుల్లో ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబిలిన్స్, క్రిటికల్ కేర్, థియేటర్, ఎమర్జెన్సీ డ్రగ్స్ కొరత నెలకొంది. దీంతో రోగుల చికిత్సలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పలువురు సూపరింటెండెంట్లు స్థానికంగా సరఫరాదారులను ఎంపిక చేసే వరకు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని లేఖ కూడా రాసినట్టు సమాచారం. -
భవిష్యత్తు కోసం బాబు గారి ప్లానింగ్ అన్ని అమ్మేసి అస్సాం కు ఆంధ్రను..!
-
ఉత్తర గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీట్ లాహియా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారితో ఉత్తర గాజాలోని ఆస్పత్రులు పోటెత్తాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మౌనిర్ అల్–బర్‡్ష పేర్కొన్నారు.ఆస్పత్రులపై దాడులు ఆపాలి: ఎంఎస్ఎఫ్ఉత్తర గాజాలోని ఆసుపత్రులపై వారి దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్)ఇజ్రాయెల్ దళాలకు పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో రెండు వారాలుగా కొనసాగుతున్న హింస, నిర్విరామ ఇజ్రాయెల్ సైనిక చర్యలు భయానక పరిణామాలను కలిగిస్తున్నాయని ఎంఎస్ఎఫ్ ఎమర్జెన్సీ కోఆర్డినేటర్ అన్నా హాల్ఫోర్డ్ తెలిపారు. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది. దీంతో దాడుల సమాచారమే కాదు సహాయక చర్యలు కష్టంగా మారాయని తెలిపారు. రహస్య పత్రాలపై అమెరికా దర్యాప్తుఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలను అంచనా వేసే రహస్య పత్రాలు లీకవడం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ సైనిక ఆస్తులను తరలిస్తోందని యూఎస్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఈ పత్రాలు సూచిస్తున్నాయి. సిన్వర్ హత్య తర్వాత గాజాలో కాల్పుల విరమించాలని అమెరికా ఇజ్రాయెల్‌ను కోరుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. తమ వాహనంపై ఇజ్రాయెల్సైన్యం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్‌లో పౌరుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా బీరుట్‌తోపాటు చుట్టుపక్కల కొన్ని దాడులను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను కోరారు.ఉత్తర గాజాలో భారీ ఆపరేషన్ ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అక్కడ తిరిగి చేరిన హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ దళాలు జబాలియాకు తిరిగి వచ్చాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గత ఏడాది చివరి నుంచి ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టిన ఉత్తర గాజా యుద్ధంలో భారీ విధ్వంసాన్ని చవిచూసింది. -
గిరిజనుల ఆరోగ్యంపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారు లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసి స్తున్న ప్రజలు అరగంట లోపలే చేరుకునేలా ఐటీ డీఏల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్ ఉండాలన్నారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూ నిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీ ఏల పరిధిలో ఉన్న ఆసుపత్రులు, వైద్య సౌకర్యా లు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్షించారు. హైదరా బాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.ప్రత్యేక వార్డులు.. బర్త్ వెయిటింగ్ రూంలు..ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, రోడ్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గర్భిణి, ఆమెతోపాటు వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం, మంచినీరు ఇతర వసతులు కల్పించాలన్నారు. 108 అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న ప్రిమిటివ్ ట్రైబ్స్ కోసం ఆదిలాబాద్ రిమ్స్ వంటి పెద్ద దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వారి భాషలో మాట్లాడగలిగే వైద్య సిబ్బందిని ఆ వార్డుల్లో నియమించాలని సూచించారు. -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్‌కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్‌కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్‌ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్‌ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
క్యాష్ లెస్.. యూజ్ లెస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అటకెక్కింది. నగదు రహిత వైద్యసేవలు అందక ఉద్యోగులు, పింఛన్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వా పోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా, పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు బకాయిలతో.. ఈహెచ్ఎస్ పరిధిలో సుమారు 5.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 20 లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ఆస్పత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం.. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దాదాపు రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. రీయింబర్స్‌మెంట్‌తో మరింత సమస్య ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతోపాటు రీయింబర్స్‌మెంట్‌ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వానికి సమరి్పస్తే.. ఆ సొమ్ము రీయింబర్స్మెంట్ అవుతుంది. కానీ దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. రూ.10 లక్షల బిల్లు అయితే.. రూ.లక్ష, లక్షన్నర మాత్రమే వెనక్కి ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్య పథకం సరిగా అమలవకపోవడం, రీయింబర్స్మెంట్ పూర్తిగా రాకపోవడంతో.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని, ఏటా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్‌పై అస్పష్టత గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందు ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ)’ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత కలిపి జమ చేయాలని పేర్కొంది. అది అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఈ స్కీంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగదు రహిత వైద్యం అందేలా చూడాలి హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి. రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి మొత్తం అందడం లేదు. ఉపాధ్యాయుల మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లిస్తామని, ప్రత్యేక ట్రస్టుతో పథకం అమలు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరాం. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. విధివిధానాలు ఖరారుకాలేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఎం.పర్వత్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయడంలేదు హెల్త్‌కార్డులు నామ్ కే వాస్తేగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. – కొమ్ము కృష్ణకుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లా బిల్లు కట్టి.. ఎదురుచూపులు నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ ప్రభుదాస్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. రూ.లక్ష బిల్లు అయింది. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలైంది. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తల్లికి చికిత్స చేయించి.. నిజామాబాద్ జిల్లాలోని డీఆర్డీవో ఆఫీసులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రూ.లక్షకుపైగా బిల్లు అయితే సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, మూడు నెలలైనా ఇంకా రాలేదు. రూ.28 వేలు ఖర్చయితే.. రూ.12 వేలు వచ్చాయి మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించడం కోసం రూ.28 వేలు ఖర్చయ్యాయి. రీయింబర్స్మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు రూ.12 వేలు మాత్రమే, అదీ ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్సఅందిస్తేనే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం -
హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా!
హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి చోట్ల నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన సీబీడీటీ.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించకుండా నిఘా పెట్టాలని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. -
నిలిచిపోయిన ఓపి సేవలు.. రోగుల ఇబ్బందులు..
-
పథకాలకు డబ్బులు లేవు సరే... మరి అన్న క్యాంటీన్లకు ఎక్కడివి..?
-
పీపీపీ విధానంలోనే ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో పీపీపీ విధానంలో ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఆస్పత్రికి స్థలాన్ని ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ, పీపీపీ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తెస్తామని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖలో 2014–19 మధ్య అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ యాప్‌ను రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరే వ్యక్తుల వివరాలు, అక్కడ రోగికి అందించే వైద్య సేవలు, పరికరాలు, మందుల వివరాలు కూడా ఉండాలన్నారు. దీని ద్వారా ఆస్పత్రి పనితీరు తెలుస్తుందన్నారు. మండలాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలు సేకరించాలని, సమస్యకు కారణాలు, వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఉద్దానంలో పూర్తిస్థాయి అధ్యయనంతోనే సమస్యను గుర్తించగలిగామన్నారు.ఆసుపత్రులలో శిశువుల అపహరణ కేసులు అరికట్టాలని చెప్పారు. తల్లులకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్స్ అందించాలన్నారు. సదరం నకిలీ ధ్రువపత్రాల జారీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీల్లో డోలీ మోతలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ అయ్యే మెడ్‌టెక్ జోన్ పట్ల గత పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సీఎస్ నీరబ్‌కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 15 శాతం వృద్ధి రేటే లక్ష్యం దేశంలోని టాప్–5 రాష్ట్రాలతో పోటీ పడేలా, 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందులో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024–29 ముసాయిదాను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అధికారులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నూతన పాలసీలో పిపిపి, పి–4 విధానాలను పొందుపర్చాలని చెప్పారు. పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇవ్వాలన్నారు. ఈనెల 16న పారిశ్రామకవేత్తలతో సమావేశమవుతామని చెప్పారు. ఆ తర్వాత ఈనెల 23న మరోసారి సమావేశమై విధానంపై చర్చిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్, ఏపీఐఐసీ ఎండీ అభిíÙక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
Mumbai: 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు
మహారాష్ట్రలోని ముంబైలో గల బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. ఈ నేపధ్యంలో బీఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బీఎంసీ కార్యాలయంతో పాటు బాంబు బెదిరింపులు అందిన అన్ని ఆసుపత్రులలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాలేదు.వీపీఎన్ నెట్వర్క్ ద్వారా ఈ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. బెదిరింపులకు పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. ముంబైలోని బీఎంసీ ప్రధాన కార్యాలయం, జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేఈఎం హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆస్పత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. గతంలో దేశంలోని 41 విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. 'కేఎన్ఆర్’ అనే ఆన్లైన్ గ్రూప్ ఈ నకిలీ బెదిరింపు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బృందం మే ఒకటిన ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. -
ఢిల్లీలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి బాంబు బెదిరింపుల బెడద ఎక్కువైంది. ఢిల్లీలోని మ్యూజియాలు, ఆస్పత్రులను బాంబులతో పేల్చేస్తున్నట్లు ఆగంతకులు పంపిన ఈ మెయిల్స్ బుధవారం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. ముమ్మర తనిఖీలు చేసి అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని లేదని తేల్చారు. నేషనల్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ బిహేవియర్, విద్యాసాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో, అలైడ్ సైన్సెస్ మానసిక వైద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఢిల్లీలో ఎయిర్‌పోర్టులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆఫీసులకు నెల రోజులుగా బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. -
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
ఢిల్లీ హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని నాలుగు హాస్పిటల్స్‌కు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమన ప్రభుత్వం యంత్రాంగం, ఫైర్ సర్వీసు బృందాలు చేరుకొని తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని దీప్ చంద్ బంధు, జీటీబీ, దాదా దేవ్, హెడ్గేవార్ హాస్పిటల్స్‌కు వచ్చిన బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.ఆదివారం కూడా పది హాస్పిటల్స్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రాగా.. తనిఖీ చేసిన ఢిల్లీ పోలీసులు వాటిని నకిలీ బాంబు బెదిరింపులుగా తేల్చారు. తమకు ఎటువంటి బాంబు ఆనవాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక, మే 1వ తేదిన దాదాపు 150 స్కూళ్లకు ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఈ మెయిల్స్‌పై దర్యాప్తు చేసిన పోలిసులు రష్యన్ మెయిల్ సర్వీస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. -
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆగంతకుల బాంబు బెదిరింపులు మరోసారి కలకలానికి కారణమయ్యాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)తోపాటు ఎనిమిది ఆస్పత్రులకు ఈ–మెయిల్ హెచ్చరికలు అందాయి. మే ఒకటో తేదీన దేశ రాజధాని పరిధిలోని 150కి పైగా స్కూళ్లకు కూడా ఇదేవిధంగా బెదిరింపు మెయిళ్లు అందడం, పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం అవన్నీ వట్టివేనని తేలడం తెల్సిందే. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐజీఐ టెరి్మనల్–3లో బాంబులు పెట్టినట్లు మెయిల్ అందడంతో తనిఖీలు చేపట్టారు. భారీగా పోలీసులను మోహరించారు. అంతకుముందు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీ ప్రాంతంలోని 8 ఆస్పత్రులకు బెదిరింపులు అందాయి. అదేవిధంగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ అందింది. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆయాచోట్లకు ఫైరింజన్లను పంపించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసు బృందాలు పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టాయి. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదని ఢిల్లీ నార్త్‌జోన్ డీసీపీ ఎంకే మీనా చెప్పారు. బురారీ ఆస్పత్రి, సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్, దాదాదేవ్ హాస్పిటల్, గురు తేజ్ బహదూర్ హాస్పిటల్, బారా హిందూరావ్ హాస్పిటల్, జనక్‌పురి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రి, అరుణా అసఫ్ అలీ గవర్నమెంట్ ఆస్పత్రులకు ఈ బెదిరింపులు వచ్చాయి. -
చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజేఎంఆర్‌లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు. జలుబుకు ఇన్ని మందులా..! సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్ట్రోమితార్పాన్,రాబిప్రజోల్+డోమ్‌పెరిడోన్ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్+డోమ్‌పెరిడోన్ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్ కోవిడ్‌కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు. నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్+డోంపెరిడోన్ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. రియాక్షన్లు..దుష్ప్రభావాలు కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. డోసులు ఎక్కువ తక్కువ! నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్‌లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్ మందులు, హార్మోన్ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు. డాక్టర్లకు అవగాహన కల్పించాలి ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్ తీసుకువచ్చిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ కేవలం వెబ్‌సైట్‌కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త -
Health Insurance: ఎక్కడైనా నగదు రహిత వైద్యం!
ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల్లో ఒకటి నగదు రహిత వైద్యం. ముందస్తు ప్రణాళికతో లేదా అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో అక్కరకు వస్తుంది. సాధారణంగా బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేది. నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే, సొంతంగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తప్పిస్తూ.. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత వైద్యం పొందేందుకు వీలుగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ ఏడాది జవనరి నుంచి ‘ఎక్కడైనా నగదు రహితం’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలేమిటో చూద్దాం. బీమా సంస్థ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోనూ నగదు రహిత చికిత్స పొందడమే నూతన విధానంలోని సౌలభ్యం. ప్రతి బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ పేరుతో ఒక జాబితా నిర్వహిస్తుంటుంది. ఆ జాబితాలోని ఏ హాస్పిటల్లో చికిత్స పొందినా బీమా సంస్థే నేరుగా చెల్లింపులు చేస్తుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ నెట్వర్క్ ఆస్పత్రిలోనే చికిత్స పొందాలంటే సాధ్యపడకపోవచ్చు. ప్రమాదానికి గురైనప్పుడు వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఆస్పత్రి బీమా నెట్‌వర్క్‌లో భాగంగా లేకపోతే? బిల్లు భారీగా వస్తే..? ఆ మొత్తాన్ని రోగి సంబందీకులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, సత్వర వైద్యం అందాల్సిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి తరుణంలో సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎక్కడైనా నగదు రహితం ఉపయోగపడుతుంది. అత్యవసరమనే కాదు, ముందుగా అనుకుని నిర్ణిత సమయానికి తీసుకునే చికిత్సలకు సైతం నాన్ నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కడైనా నగదు రహితం విధానం ఎలా పనినిచేస్తుందో తెలుసుకోవడం అవసరం. నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే.. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రావడానికి ముందు కూడా కొన్ని బీమా సంస్థలు నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ జనరల్, బజాజ్ అలియాంజ్ జనరల్ సైతం నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశాయి. ముందస్తుగా నిర్ణయించుకుని, తీసుకునే చికిత్స విషయంలో బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్ (టీపీఏ)కు రెండు నుంచి మూడు రోజుల ముందు (48–72 గంటలు) తెలియజేయడం తప్పనిసరి. ఈ మెయిల్ లేదంటే ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా లేదంటే లిఖిత పూర్వకంగా బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరిన 24 నుంచి 48 గంటల్లోపు (బీమా సంస్థ ఆధారంగా వేర్వేరు) విషయాన్ని తెలియజేయాలి. 15 పడకలు తప్పనిసరి.. నగదు రహిత వైద్యం పొందేందుకు ఎంపిక చేసుకునే ఆస్పత్రిలో కనీసం 15 పడకలు (బెడ్స్) ఉండాలన్నది నిబంధన. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, హాస్పిటల్ అనే నిర్వచనానికి అనుగుణంగా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పనిచేస్తూ ఉండాలి. గుర్తింపు కార్డులు, పాలసీ డాక్యుమెంట్లు, మెడికల్ రిపోర్ట్లు, పి్రస్కిప్షన్లు, బిల్లులు నిర్ధేశిత ఫార్మాట్లో బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది. నగదు రహిత వైద్యానికి అనుమతించే ముందు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఆమోద లేఖను చాలా బీమా సంస్థలు కోరుతున్నాయి. ఆస్పత్రి బిల్లులు నిజమైనవేనా? ప్రామాణిక అడ్మిషన్ ప్రక్రియ విధానాన్నే అనుసరిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగానే చికిత్సా విధానాలు ఉన్నాయా? అని బీమా సంస్థలు పరిశీలిస్తాయి. ఇక పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధుల చికిత్సా క్లెయిమ్‌లో వేచి ఉండాల్సిన కాలం), కోపే క్లాజ్, మినహాయింపులు, ముందస్తు వ్యాధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని గమనించాలి. కొన్ని చికిత్సలకు సంబంధించి (ఉదాహరణకు కేటరాక్ట్) ఉప పరిమితులు ఉంటే, వాటి విషయంలోనూ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పాలసీలో ప్రత్యేకమైన రైడర్ తీసుకుంటే తప్ప కాటన్, ఫేస్ మాస్‌్కలు, సర్జికల్ గ్లోవ్‌లు, నెబ్యులైజేషన్ కిట్లకు పరిహారం రాదు. ఏవైనా అదనపు చార్జీలు (కవరేజీలోకి రానివి) విధిస్తే, పాలసీదారు సొంతంగా చెల్లించుకోవాలి. చార్జీల పట్ల అవగాహన నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రకాల చికిత్సలకు వసూలు చేసే చార్జీల వివరాలు బీమా సంస్థ రికార్డుల్లో ఉంటాయి. దీనివల్ల పాలసీదారు సొంత పాకెట్‌పై భారం పడదు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్సలకు ఎంత చార్జీ వసూలు చేస్తారన్నది కీలకం అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్‌కు మించి నాన్ నెట్వర్క్ ఆస్పత్రి చార్జీ చేస్తే, అప్పుడు క్లెయిమ్ పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆస్పత్రి పడకలు, ఏ ప్రాంతంలో ఉందన్న దాని ఆధారంగా చికిత్సల ధరలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చికిత్సకు నెట్వర్క్ హాస్పిటల్లో రూ.50,000 పరిమితి ఉందనుకోండి. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇదే చికిత్సకు రూ.70,000 వేలు చార్జ్ చేస్తే, పాలసీదారు తాను సొంతంగా రూ.20,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకని నగదు రహిత వైద్యం కోరుకునే వారు తమ పాకెట్ నుంచి పెద్దగా చెల్లించొద్దని భావిస్తే, అప్పుడు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్భాల్లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అలాంటప్పుడు పాలసీదారు సొంతంగా చెల్లించి, డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లాల్సి వస్తుంది. రోగికి శరవేగంగా చికిత్స అవసరమైతే తప్పించి, మిగిలిన వాటికి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్‌ను ఎంపిక చేసుకోకపోవడం మంచిది. నెట్వర్క్–నాన్ నెట్వర్క్ బీమా సంస్థ నగదు రహిత వైద్యం అందించేందుకు వీలుగా పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందానికి వచ్చిన ఆస్పత్రులు నెట్వర్క్ జాబితాలో ఉంటాయి. ఇలా ఒప్పందం చేసుకునే సమయంలోనే చికిత్సల ధరల విషయంలో బీమా సంస్థ ఆస్పత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. దీనివల్ల బీమా సంస్థకు కొంత భారం తగ్గుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్‌తో ఈ అనుకూలత బీమా సంస్థలకు ఉండదు. బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది.. చికిత్స కోసం ఎంపిక చేసుకునే నాన్ నెట్వర్క్ ఆస్పత్రి బీమా సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు. బ్లాక్ లిస్ట్‌లోని ఆస్పత్రిలో చేరడం వల్ల నగదు రహిత వైద్యం అందదు. రీయింబర్స్‌మెంట్‌కు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల మొత్తానికే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు కూడా బీమా సంస్థ పోర్టల్‌కు వెళ్లి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితాను ఓ సారి పరిశీలించడం ఎంతో మంచిది. ఇక ముందస్తు ప్రణాళికతో తీసుకునే చికత్సలకు బీమా సంస్థ నెట్‌వర్క్‌లోని హాస్పిటల్‌కు వెళ్లడమే మేలు. ఎందుకంటే నెట్వర్క్ ఆస్పత్రులు బీమా సంస్థ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు దాదాపుగా ఎదురుకావు. నెట్వర్క్ హాస్పిటల్‌తో లాభాలు ► నెట్వర్క్ (ఎంపానెల్డ్) ఆస్పత్రుల్లో టారిఫ్‌లు బీమా సంస్థతో కుదిరిన అంగీకారం మేరకు ఉంటాయి. చికిత్సల చార్జీలు నిర్ధేశిత పరిమితుల పరిధిలోనే ఉంటాయి. దీంతో క్లెయిమ్‌కు సత్వర ఆమోదం లభిస్తుంది. వేగంగా డిశ్చార్జ్ కావచ్చు. ► నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ పరిష్కారం సాఫీగా, వేగంగా జరుగుతుంది. ► నెట్వర్క్ ఆస్పత్రులు అన్నింటిలోనూ చికిత్సల నాణ్యాత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో రోగులకు చికిత్సల తర్వాత సమస్యల రిస్క్ తగ్గుతుంది. ► ఆస్పత్రి, బీమా సంస్థ మధ్య విశ్వసనీయమైన బంధం వల్ల చికిత్సల బిల్లులను మరీ పెద్దవి చేసి చూపించడం ఉండదు. అనవసర ప్రక్రియలు, ఔషధాల వినియోగం ఉండదు. మోసాల రిస్క్ తగ్గుతుంది. -
వైఎస్ జగన్ పాలనలో రూపురేఖలు మారుతున్న ప్రభుత్వ హాస్పిటల్స్
-
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్‌కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్‌లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్‌లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టర్‌కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్‌కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్‌కు టీమ్‌గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్‌లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్‌గా ఈ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్‌కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్‌కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్‌ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్‌ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్‌కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్‌ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
ఇకపై చిన్న ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ వైద్యం
ముంబై: ఆరోగ్య బీమా పాలసీదారులు త్వరలోనే అన్ని రకాల ఆస్పత్రుల్లోనూ నగదు రహిత వైద్యం పొందే దిశగా అడుగులు పడుతున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఇందుకు సంబంధించి ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. జాబితాలో లేని హాస్పిటళ్లలోనూ పాలసీదారులకు నగదు రహిత వైద్యాన్ని అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని తెలిపింది. కనీసం 15 పడకలు ఉండి, ఆయా రాష్ట్రాల్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినవి నగదు రహిత వైద్యాన్ని ఆఫర్ చేయవచ్చు. దీంతో పాలసీదారులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే తమ పాకెట్ నుంచి ఎలాంటి చెల్లింపులు చేయక్కర్లేదు. చికిత్సల వ్యయాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. క్లెయిమ్ అనుమతించడంపై చెల్లింపులు ఆధారపడి ఉంటాయని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పేర్కొంది. కొన్ని షరతులకు లోబడి పాలసీదారులు నగదు రహిత వైద్యం కోసం ఏ ఆస్పత్రిని అయినా ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. నాన్ ఎంపానెల్డ్ (బీమా సంస్థ జాబితాలో లేని) హాస్పిటల్లో చేరడానికి 48 గంటల ముందు లేదా, చేరిన 48 గంటల్లోపు బీమా సంస్థకు తెలిజేయాల్సి ఉంటుందని పేర్కొంది. బీమా సంస్థ నెట్‌వర్క్‌లో లేని ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పుడు పాలసీదారులపై భారం పడకుండా చూడడమే దీని ఉద్దేశ్యమని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ చైర్మన్ తపన్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40వేల ఆస్పత్రుల్లోనే నగదు రహిత వైద్యం పాలసీదారులకు అందుబాటులో ఉండడం గమనార్హం. -
జనరల్ అట్లాంటిక్ చేతికి ఆసుపత్రులు!
ముంబై: గ్లోబల్ పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్(జీఏ) దేశీ ఆసుపత్రుల చైన్‌ను కొనుగోలు చేసే బాటలో సాగుతోంది. 19 ఆసుపత్రుల నెట్వర్క్ కలిగిన ఉజాలా సిగ్నస్ హెల్త్‌కేర్ సరీ్వసెస్‌లో 70 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సంస్థ విలువను రూ. 1,600 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంస్థలో తొలుత ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి 51 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ప్రస్తుత వాటాదారులలో 8 రోడ్స్ వెంచర్స్ ఇండియా, ఇవాల్వెన్స్ ఇండియా ఫండ్, సోమర్సెట్ ఇండస్ హెల్త్‌కేర్ ఫండ్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రమోటర్ల నుంచి సైతం కొద్దిపాటి వాటానుచేజిక్కించుకోనుంది. వెరసి ఉజాలా సిగ్నస్ పేరుతో అమర్ ఉజాలా నిర్వహిస్తున్న సంస్థలో మొత్తం 70 శాతం వాటాను జీఏ కొనుగోలు చేయనుంది. డీల్ ప్రస్తుతం డాక్యుమెంటేషన్ స్థితిలో ఉన్నదని, కొద్ది వారాలలో పూర్తికాగలదని తెలుస్తోంది. అయితే అటు జీఏ, ఇటు ఉజాలా సిగ్నస్ ప్రతినిధులు ఈ అంశాలపై స్పందించకపోవడం గమనార్హం! ఉత్తరాదిన సర్వీసులు ఉజాలా సిగ్నస్ ప్రధానంగా ఉత్తరాదిన ద్వితీయ, తృతీయస్థాయి పట్టణాలలో 19 ఆసుపత్రులను కలిగి ఉంది. హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, జేఅండ్‌కే, ఢిల్లీలలో మొత్తం 1,800 పడకలతో హెల్త్‌కేర్ సర్వీసులు విస్తరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 600 కోట్ల టర్నోవర్, రూ. 120 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించగలదని అంచనా. సిగ్నస్ మెడికేర్‌ను 2011లో డాక్టర్లు దినేష్ బాత్రా, షుచిన్ బజాజ్ ఏర్పాటు చేశారు. తదుపరి 2019లో అమర్ ఉజాలా మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. హెల్త్‌కేర్ రంగంలో విస్తరించే ప్రణాళికలతో 10 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న సంస్థలో రూ. 130 కోట్లకు నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. ఆపై ఉజాలా హెల్త్కేర్కుగల రెండు ఆసుపత్రులను సిగ్నస్‌లో విలీనం చేసింది. తద్వారా విలీన సంస్థలో నియంత్రణతోపాటు ప్రధాన వాటాను పొందింది. కాగా.. 2018లో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్ హాస్పిటల్స్)లోనూ జీఏ 13 కోట్ల డాలర్లు(సుమారు రూ. 1,079 కోట్లు) ఇన్వెస్ట్ చేసి మైనారిటీ వాటాను కొనుగోలు చేసిన విషయం విదితమే. -
రాబోయే వ్యాధులకు ముందే చెక్!
సాక్షి, హైదరాబాద్: మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణ కోసం అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన అత్యాధునిక బయోబ్యాంక్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. 3 లక్షలకుపైగా జీవ నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ చేసేందుకు వీలుగా ఈ బయోబ్యాంక్‌లో మైనస్ 80 డిగ్రీల ఫ్రీజర్లు పదిహేను, మైనస్ 20 డిగ్రీల ఫ్రీజర్లు ఐదు, మైనస్ 160 డిగ్రీలతో కూడిన మూడు లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు ఉన్నాయి. ఈ తరహా నిల్వ కేంద్రం ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిదిగా పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ ఈ బయోబ్యాంక్‌ను మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ బయో బ్యాంక్ అర్థవంతమైన పరిశోధనలకు, వ్యాధుల నివారణకు వీలు కల్పిస్తుందని.. అంతిమంగా అత్యాధునిక వైద్య విధానాల అభివృద్ధికి దోహదపడుతుందని హుడ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, బిగ్ డేటా టూల్స్, మెషీన్ లెర్నింగ్ అల్గా రిథమ్‌ల మేళవింపుతో ఈ బయోబ్యాంక్ పనిచేస్తుందన్నారు. కేన్సర్, డయాబెటిస్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు బయటపడక ముందే కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని సంతరించుకొనే క్రమంలో బయోబ్యాంక్ ఏర్పాటును మేలిమలుపుగా లెరోయ్ హుడ్ అభివర్ణించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ ప్రెసిడెంట్, కో–ఫౌండర్ అయిన హుడ్... హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిన ఆటోమేటెడ్ జీన్ సీక్వెన్సర్ను గతంలో కనుగొన్నారు. ఇదో మైలురాయి: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి వైద్య పరిజ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని పెంపొందించే దిశగా బయోబ్యాంక్ ఓ మైలురాయి కాగలదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలకు కీలక వనరుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ బయోబ్యాంక్‌కు 3 లక్షల కంటే ఎక్కువ నమూనాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉందని వివరించారు. వ్యాధుల నివారణకు తోడ్పడే ఔషధ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బయోబ్యాంక్ ఏర్పాటు సహకరిస్తుందని చెప్పారు. దీనిద్వారా వచ్చే 5–10 ఏళ్ల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులతోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల వివరాలను సేకరించి వారి జీవ నమూనాలను విశ్లేషిస్తామని వివరించారు. వ్యాధుల నిర్ధారణ, నివారణలో విప్లవం... బయోబ్యాంక్ అనేది ఒక రకమైన నిల్వ సౌకర్యం. ఇది 3 లక్షల కంటే ఎక్కువ మానవ కణజాల నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ ఉంచగలదు. మానవ కణజాల నమూనాల నిల్వ, విశ్లేషణ ద్వారా ఇది జన్యు పరిశోధనలో సహాయ పడుతుంది. సంక్లిష్ట వ్యాధుల చికిత్స రానురానూ కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాధుల రాకను ముందే పసిగట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది. దీనికోసం వ్యక్తుల కణజాల నమూనాలను సేకరిస్తారు. వాటిని నిల్వ చేసి పదేళ్లపాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ సమయంలో ఆయా వ్యక్తుల్లో ఆరోగ్యపరంగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్ని, వ్యాధుల దాడిని, వాటికి కారణాలను పసిగట్టడం ద్వారా వారసుల ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేస్తారు. అలాగే దాదాపుగా అదే కణజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా పసిగట్టే అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యాధి రావడానికి ముందే నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుంది. -
గాజా.. మరుభూమి!
దెయిర్ అల్ బలాహ్/జెరూసలేం/టెల్ అవీవ్: గాజాలో పరిస్థితులు నానాటికీ విషమిస్తున్నాయి. కరెంటు తదితర సదుపాయాలతో పాటు నిత్యావసరాలన్నీ పూర్తిగా నిండుకోవడంతో కొద్ది రోజుల క్రితం నుంచే పూర్తిగా పడకేసిన ఆస్పత్రులు క్రమంగా మృత్యుదిబ్బలుగా మారుతున్నాయి. రోగులు, నవజాత శిశువుల నిస్సహాయ సామూహిక మరణాలకు వేదికలుగా మారుతున్నాయి. గాజాలోని ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా 179 మృతదేహాలను ప్రాంగణంలోనే ఒకే చోట సామూహికంగా ఖననం చేసినట్టు ఆస్పత్రి డైరెక్టర్ అబూ సలామియా తాజాగా నిర్ధారించడం పరిస్థితికి అద్దం పడుతోంది! వీరిలో చాలామంది ఐసీయూ రోగులు, నవజాత శిశువులేనని సమాచారం. అక్కడ 30కి పైగా శవాలను ఖననం చేస్తుండగా చూసినట్టు అక్కణ్నుంచి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షి కూడా వెల్లడించారు. పలు ఇతర ఆస్పత్రుల్లోనైతే మృతదేహాలు కుళ్లి దుర్వాసన వెదజల్లుతున్నట్టు సమచారం. ప్రస్తుతం ఉత్తర గాజాలో అల్ అహ్లి బాప్టిస్ట్ ఆస్పత్రి మాత్రమే కాస్తో కూస్తో పని చేస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఒక్క మంగళవారమే 500 మందికి పైగా క్షతగాత్రులు అందులో చేరినట్టు వివరించింది. కరెంటు లేకపోవడం, ఆక్సిజన్, ఇంధనంతో పాటు ఆహార పదార్థాలు, నిత్యావసరాలన్నీ నిండుకుంటుండటంతో అది కూడా ఏ క్షణమైనా పూర్తిగా మూతబడే పరిస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చింది. మరోవైపు గాజా అంతటా ఎటు చూసినా వ్యర్థాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మురుగు నీరు పొంగి పొర్లుతోంది. వాటిద్వారా ఇప్పటికే పలు అంటురోగాలు ప్రబలుతున్నాయి. ఇవి మరింత విజృంభిస్తే గాజా మరుభూమిగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. చలి, చెదురుమదురు వర్షాలతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. జబాలియాలో 30 మంది మృతి: మరోవైపు, గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ బీభత్సం మంగళవారం కూడా యథాతథంగా కొనసాగింది. ఆస్పత్రులతో పాటు ఇంకా చెదురుమదురుగా మిగిలి ఉన్న భవనాలన్నీ క్షిపణి, బాంబు దాడులు, కాల్పులతో అల్లాడిపోయాయి. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడులు మరో 30 మందిని బలిగొన్నట్టు తెలుస్తోంది. గాజాలోని పార్లమెంటు భవనాన్ని ఇజ్రాయెల్ సైనికులు ఆక్రమించారు. భవనం లోపల ఇజ్రాయెల్ పతాకాలతో ఉన్న సైనికుల ఫొటోలు ఆ దేశ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్)కు చెందిన గోల్డెన్ బ్రిగేడ్ గాజా పార్లమెంటును స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటిదాకా 100 మందికి పైగా ఐరాస వర్కర్లు యుద్ధానికి బలయ్యారు. మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 11,550 దాటినట్టు గాజా ఆరోగ్య శాఖ చెబుతోంది. వీరిలో మూడొంతులు మహిళలు, పిల్లలేనని పేర్కొంది. ఆస్పత్రులను కాపాడాలి: బైడెన్ బందీల విడుదలకు కృషి చేస్తున్నట్టు తాము కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అల్ షిఫాతో పాటు గాజాలో ఆస్పత్రులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా కాపాడాలన్నారు. ఏ ఆస్పత్రి మీదా ఇజ్రాయెల్ సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడరాదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, పట్టు వీడేందుకు ఇప్పటిదాకా ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ కూడా కాస్త దిగొస్తున్నట్టు కన్పిస్తోంది. గాజా ఆస్పత్రుల్లో మృత్యుముఖంలో ఉన్న నవజాత శిశువులను సురక్షితంగా తరలించేందుకు ఇంక్యుబేటర్లను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆస్పత్రులే కమాండ్ సెంటర్లు: ఇజ్రాయెల్ ఆస్పత్రులను హమాస్ తన స్థావరాలుగా మార్చుకుందని ఇజ్రాయెల్ మరోసారి ఆరోపించింది. ఇందుకు ఆధారాలున్నట్టు పేర్కొంది. రంటిసీ పిల్లల ఆస్పత్రిలో గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలతో కూడిన కమాండ్ సెంటర్‌ను గుర్తించామంటూ సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేసింది. ఇజ్రాయెల్ బందీలను కూడా అక్కడే దాచారని అనుమానం వెలిబుచ్చింది. వీటిని హమాస్ మరోసారి ఖండించింది. ఆస్పత్రులపై నిస్సిగ్గు దాడులను సమర్ధించుకునేందుకే ఇజ్రాయెల్ నిరాధారణ ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టింది. వాళ్లు రోగులు.. జంతువులు కాదు! కంటతడి పెట్టిస్తున్న డాక్టర్ ఇంటర్వ్యూ అల్ షిఫా ఆస్పత్రిని తక్షణం వీడాలన్న ఇజ్రాయెల్ ఆదేశాలను వైద్య సిబ్బంది మంగళవారం కూడా తిరస్కరించారు. 700 మందికి పైగా నిస్సహాయులైన రోగులను ప్రాణాపాయ పరిస్థితుల్లో వదిలి వెళ్లలేమని స్పష్టం చేశారు! ఈ క్రమంలో ఆస్పత్రికి చెందిన హమామ్ అల్లో అనే నెఫ్రాలజిస్టు మరణానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడందరినీ కంటతడి పెట్టిస్తోంది. ‘‘ఆస్పత్రిలో, ఐసీయూ వార్డుల్లో అంతమంది ఉన్నారు. వారంతా రోగులు. జంతువులు కారు. నేను వెళ్లిపోతే వారికి చికిత్స అందించేదెవరు? చికిత్స పొందడం వారి హక్కు. వారి కర్మకు వారిని వదిలి వెళ్లలేం. 14 ఏళ్ల పాటు వైద్య విద్య నేర్చుకున్నది ఇలా కేవలం నా జీవితాన్ని కాపాడుకునేందుకు రోగులను నిస్సహాయ స్థితిలో వదిలేసి వెళ్లిపోయేందుకు కాదు’’ అంటూ కొద్ది రోజుల క్రితం డెమొక్రసీ నౌ అనే స్వతంత్ర పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కుండబద్దలు కొట్టారు. కుటుంబంతో పాటు దక్షిణ గాజాకు వెళ్లిపోవాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలను హమామ్‌తో పాటు ఆయన కుటుంబం కూడా బుట్టదాఖలు చేసింది. అత్తగారింట్లో ఉండగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమామ్‌తో పాటు ఆయన తండ్రి, మామ, బావమరిది దుర్మరణం పాలయ్యారు! స్వేచ్ఛాయుత పాలస్తీనా కోసం హమామ్ నిత్యం కలలు కనేవాడని గుర్తు చేసుకుంటూ తోటి నెఫ్రాలజిస్టు బెన్ థామ్సన్ కన్నీటి పర్యంతమయ్యాడు. కాల్పులాపితే బందీల విడుదల: హమాస్ యుద్ధానికి ముగింపు ఇప్పట్లో కనిపించని పరిస్థితుల్లో, కనీసం కాల్పుల విరామం కోసం హమాస్ ప్రయత్నిస్తోంది. ఐదు రోజుల పాటు కాల్పులాపితే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీల్లో 70 మంది మహిళలు, చిన్నారులను విడుదల చేసేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా దీన్నిప్పటికే ఇజ్రాయెల్‌కు చేరవేసినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ చెరలో ఉన్న 200 మంది పాలస్తీనా చిన్నారులు, 75 మంది మహిళలను వదిలేస్తే తమ వద్ద ఉన్న బందీల్లో మహిళలు, పిల్లలను విడుదల చేస్తామని గత వారం కూడా హమాస్ ప్రకటించడం తెలిసిందే. హమాస్ చెరలో 240 మందికి పైగా ఇజ్రాయెలీలున్నట్టు సమాచారం. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధ్యక్షురాలు మిర్జానా స్పొల్జారిక్ మంగళవారం ఇజ్రాయెల్‌లో వారి కుటుంబాలను కలుసుకుని ధైర్యం చెప్పారు. మరణానంతర ప్రసవాలు! ఆస్పత్రులపై ఇజ్రాయెల్ దాడులు అంతులేని దారుణాలతో పాటు పలు విషాదాలకూ కారణంగా మారుతున్నాయి. సౌకర్యాల లేమి తదితరాల కారణంగా ఆస్పత్రుల్లో ఎందరో నిండు గర్భిణులు దుర్మరణం పాలైనట్టు హమాస్ ఆరోగ్య శాఖ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘అలాంటి పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ వృత్తి ధర్మం మరవలేదు. ఎప్పటికప్పుడు ఆ మృతదేహాలకు హుటాహుటిన సిజేరియన్ చేసి వీలైనంత మంది శిశువులను బయటికి తీసి కాపాడుతూ వచ్చారు’’ అని పేర్కొంది. ఇంక్యుబేటర్లతో పాటు ఏ సదుపాయాలూ లేక ఆ నవజాత శిశువులు కూడా మృత్యువుకు చేరువవుతున్నట్టు చెప్పింది. బయటపడ్డ కశ్మిరీ మహిళ లుబ్నా నజీర్ షాబూ అనే కశ్మిరీ మహిళ తన కూతురు కరీమాతో పాటు గాజా నుంచి మంగళవారం సురక్షితంగా బయట పడింది. వారిద్దరూ ఈజిప్టు చేరినట్టు భర్త వెల్లడించారు. ఈజిప్టులోని భారత మిషన్ల కృషి వల్లే తాను, తన కూతురు గాజా నుంచి బయట పడ్డట్టు లుబ్నా చెప్పారు. గాజాలో సర్వం నేలమట్టమైందని ఆవేదన వెలిబుచ్చారు. -
గాజాలో ఆగని వేట
గాజా స్ట్రిప్/జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది. ఖాన్ యూనిస్, రఫా, డెయిర్ అల్–బలా నగరాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని గాజీ సిటీలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టినట్లు తెలిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. గాజాలో హమాస్‌ను అధికారం నుంచి కూలదోయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై దృష్టి పెట్టింది. గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. మరో ఐదుగురు బందీల విడుదల ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే. గాజా రక్షణ బాధ్యత మాదే: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్ రక్షణ బాధ్యతను నిరవధికంగా ఇజ్రాయెల్ తీసుకుంటుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. తద్వారా గాజా స్ట్రిప్ మొత్తం ఇజ్రాయెల్ నియంత్రణ కిందికి వస్తుందని సంకేతాలిచ్చారు. గాజాను తమఅదీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడారు. గాజాలోకి మానవతా సాయాన్ని చేరవేయడానికి లేదా హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడిపించడానికి వీలుగా మిలిటెంట్లపై యుద్ధానికి స్వల్పంగా విరామం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ! గాజాలోకి పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి. సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. రఫా పట్టణంలో ఇజ్రాయెల్ దాడి తర్వాత స్థానికుల ఆక్రందన