
కీవ్: ఖేర్సన్ ప్రాంతంపై మళ్లీ ఉక్రెయిన్ సైన్యం పట్టు సాధిస్తుండటంతో అక్కడి నుంచి రష్యా సేనలు పలాయనం చిత్తగించాయి. ‘యుద్ధంలో గాయపడి ఖేర్సన్ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న తోటి సైనికులను రష్యా బలగాలు వెంట తీసుకెళ్తున్నాయి. వెళ్తూ వెళ్తూ ఖేర్సన్‌లోని ఆస్పత్రులను నిరుపయోగం చేస్తున్నాయి.
ఔషధాలు, ఉపకరణాలు, చివరకు అంబులెన్స్‌లనూ తరలిస్తున్నాయి. స్థానిక వైద్యులను తమతోపాటు రష్యాకు రావాలని బెదిరిస్తున్నాయి’ అని ఉక్రెయిన్ సాయుధ దళాల విభాగం శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. మరోవైపు, 2014 నుంచి రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా ద్వీపకల్పంలోని రష్యా నౌకల్లో పేలుళ్లు సంభవించాయి.
చదవండి: ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం: రష్యా
Comments
Please login to add a commentAdd a comment