కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 10 నెలలు కావస్తున్నా ఇంకా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. డిసెంబర్ 25 క్రిస్‌మస్ పండుగ ఉన్నప్పటికీ కాల్పులను తాత్కాలికంగా కూడా విరమించే ప్రసక్తే లేదని రష్యా తేల్చి చెప్పింది. కీవ్‌పై మరోసారి భీకర దాడులకు సిద్ధమవుతోంది.
రానున్న రోజుల్లో 2,00,000 బలగాలతో తమపై విరుచుకుపడేందుకు రష్యా వ్యూహం పన్నుతోందని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ జనరల్ వలేరియ్ జులుజ్నీ తెలిపారు. ది ఎకానమిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. తమకు మరిన్ని ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు కావాలన్నారు. రిజర్వ్ బలగాలను, అవసరమైతే పౌరులను కదన రంగంలోకి దించి రష్యా దాడులను తిప్పికొడతామని చెప్పారు.
రష్యాపై ఆంక్షలు..
మరోవైపు రష్యా వెనక్కి తగ్గకపోవడంతో ఐరోపా సమాఖ్య మరోమారు ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఇలా చేయడం ఇది 9వ సారి కావడం గమనార్హం. అలాగే రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు 18 బిలియన్ యూరోల ప్యాకేజీని సాయంగా అందించనున్నట్లు ప్రకటించింది.
అమెరికా అండ..
ఉక్రెయిన్‌కు యుద్ధంలో సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికాను రష్యా హెచ్చిరింది. అయితే అగ్రరాజ్యం మాత్రం మాస్కో వార్నింగ్‌ను లైట్ తీసుకుంది. ఉక్రెయిన్‌కు సాయం చేసి తీరతామని స్పష్టం చేసింది.
యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. గురువారం కూడా కీవ్‌పై క్షిపణులతో భీకర దాడులు చేసింది.
చదవండి: బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత!
Comments
Please login to add a commentAdd a comment