హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ డెటాను డిజిటలైజ్ చేస్తున్నామని.. త్వరలో బస్తీ దవాఖానాలు, మాల్స్‌లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. కాగా, బుధవారం హైదరాబాద్‌లో 3 వేల ఉచిత హాట్ స్పాట్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యాక్ట్ ఫైబర్ నెట్‌వర్క్‌తో కలిసి హైఫై సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ హాట్ స్పాట్‌ల ద్వారా ప్రతిరోజు 1 జీబీ డేటాను.. 45 నిమిషాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తదితర ప్రదేశాల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment