free Wifi
-
HYD: పబ్లిక్ వైఫై వాడాడు.. పైసలు పొగొట్టుకున్నాడు!
కుమార్.. (పేరు మార్చాం) చదువు పూర్తి చేసుకుని గ్రూప్స్ కోచింగ్ కోసం నగరానికి వచ్చాడు. కోచింగ్ కోసం ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరేందుకు ఇంట్లోవాళ్లు డబ్బులు పంపించారు. బయటకు వెళ్లిన కుమార్.. ఓ షాపింగ్ మాల్ బయట ఫ్రీ వైఫైను ఉపయోగించుకునేందుకు యత్నించాడు. ఓటీపీతో లాగిన్ అయ్యి.. మెరుపు వేగంతో వస్తున్న ఇంటర్నెట్ నుంచి ఆశ్చర్యపోయాడు. అలా నెట్‌ను వాడుకున్న కాసేపటికే.. అతని మొబైల్‌కు మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న 50 వేలు కొంచెం కొంచెంగా మాయం అయ్యాయి. భయాందోళనతో.. షాపింగ్ మాల్ వాళ్లను నిలదీశాడు. అసలు తమ మాల్‌కు ఫ్రీ వైఫై యాక్సెస్ లేదని చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్లు.. మినిమమ్ 1 జీబీకి తక్కువ కాకుండా ఇంటర్నెట్ప్యాక్లు ఉపయోగిస్తున్నారు. అయితే అవసరానికి పబ్లిక్ వైఫైలు వాడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా. నెట్‌తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ చదువుల మొదలు.. ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్నిసార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి ఈ–మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం, ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే.. మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉచిత వైఫై వాడాల్సి వస్తే.. అది అధికారికమేనా? సురక్షితమేనా? అనేది క్రాస్ చెక్ చేస్కోవాలి. అలాగే నమ్మదగిన వీపీఎన్‌ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
హైదరాబాద్‌లో 3 వేల ఉచిత హాట్‌స్పాట్ సెంటర్లు.. ఎక్కడంటే..
హైదరాబాద్: తెలంగాణ ప్రజల హెల్త్ డెటాను డిజిటలైజ్ చేస్తున్నామని.. త్వరలో బస్తీ దవాఖానాలు, మాల్స్‌లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. కాగా, బుధవారం హైదరాబాద్‌లో 3 వేల ఉచిత హాట్ స్పాట్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యాక్ట్ ఫైబర్ నెట్‌వర్క్‌తో కలిసి హైఫై సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ హాట్ స్పాట్ల ద్వారా ప్రతిరోజు 1 జీబీ డేటాను.. 45 నిమిషాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తదితర ప్రదేశాల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. -
మన రైల్వే.. మొత్తం వైఫై
సాక్షి, హైదరాబాద్: ఉచిత వైఫై సేవలు అందించడంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. జోన్‌లోని అన్ని స్టేషన్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలో ఆ ఘనత సాధించిన రెండో జోన్‌గా నిలిచింది. ప్రస్తుతం 574 స్టేషన్లలో ఈ వసతిని కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్‌టెల్ ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఈ సదుపాయాన్ని అందజేస్తున్నారు. హాల్టింగ్ స్టేషన్లు మినహా జోన్‌లోని అన్ని ఏ–1 కేటగిరీ నుంచి ఎఫ్ కేటగిరీ స్టేషన్ల వరకు హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. 2015లో ఈ పనులకు శ్రీకారం చుట్టి నాలుగేళ్ల సమయంలోనే అన్ని స్టేషన్లకు విస్తరించటం పట్ల అధికారులను ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. తక్కువ సమయంలో వైఫై సేవలు ప్రారంభించటంలో కీలకపాత్ర పోషించిన అధికారులను జీఎం గజానన్ మాల్యా కూడా ప్రత్యేకంగా అభినందించారు. స్టేషన్ పరిధిలోకి వచ్చిన వారు తమ ఫోన్ ద్వారా ఉచితంగా వైఫై సేవలు పొందొచ్చు. నిర్ధారిత గడువు పూర్తయ్యాక మళ్లీ లాగిన్ అయి సేవలను కొనసాగించుకోవచ్చు. గొల్లపల్లి అనే గ్రామీణ ప్రాంతంలోని రైల్వేస్టేషన్ వైఫై ద్వారా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజ్ఞాన సముపార్జనతోపాటు నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారని అధికారులు తెలిపారు. 2015లో ఏ–1 స్టేషన్ అయిన సికింద్రాబాద్‌లో ఉచిత వైఫై ప్రారంభించారు. ఇప్పటివరకు 5 ఏ–1 స్టేషన్లు, 31 ఏ కేటగిరీ స్టేషన్లు, 38 బీ కేటగిరీ స్టేషన్లు, 21 సీ కేటగిరీ స్టేషన్లు, 78 డీ కేటగిరీ స్టేషన్లు, 387 ఇ కేటగిరీ స్టేషన్లు, 2 ఎఫ్ కేటగిరీ స్టేషన్లు, 12 కొత్త స్టేషన్లలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. -
400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రైల్‌టెల్‌తో కలిసి దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అస్సాంలోని దిబ్రూగర్‌లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడం ద్వారా 400 స్టేషన్లలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్టయిందని అధికారులు తెలిపారు. లక్షలాది ప్రయాణీకులకు హైస్పీడ్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడం మరుపురాని అనుభవంగా గూగుల్ ఇండియా పార్టనర్షిప్స్ డైరెక్టర్ కే. సూరి పేర్కొన్నారు. 2016 జనవరిలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో వైఫై కనెక్టివిటీ కార్యక్రమానికి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో శ్రీకారం చుట్టారు. రైల్‌టెల్ సమకూర్చిన మౌలిక వసతులతో గూగుల్ తన వైర్లెస్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ను జోడించి ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. -
ఫ్రీ వైఫై.. జీవితాన్ని మలుపు తిప్పింది
తిరువనంతపురం: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తమ చుట్టూ పుస్తకాలు వేసుకుని గంటల తరబడి కుస్తీ పట్టడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ యువకుడు ఫ్రీ వైఫై సాయంతో తన తలరాతను మార్చుకున్నాడు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల రాత పరీక్షలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన ఓ రైల్వే కూలీ స్టోరీ ఇది. మున్నార్‌కు చెందిన శ్రీనాథ్ పదో తరగతి పాసయ్యాడు. కుటుంబ ఆర్థిక స్తోమత అంతగా లేకపోవటంతో చదువుకు స్వస్తి చెప్పి ఐదేళ్ల క్రితం ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పనిలో చేరాడు. ఓవైపు కుటుంబానికి సాయంగా ఉంటూనే.. మరోపక్క ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని భావించాడు. అయితే అందుకు అవసరమైన మెటీరియల్ కొనుక్కునేందుకు అతని దగ్గర డబ్బులేదు. అయినప్పటికీ ఎలాగోలా కష్టపడి రెండుసార్లు పరీక్షలు రాశాడు. అలాంటి సమయంలోనే రైల్వే స్టేషన్లో ప్రవేశపెట్టిన ఫ్రీ వైఫై అతని జీవితాన్ని మలుపు తిప్పింది. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను వైఫై వాడటాన్ని గమనించిన శ్రీనాథ్‌కు ఓ ఆలోచన తట్టింది. బంధువుల దగ్గర అప్పు చేసి ఓ స్మార్ట్ ఫోన్ కొనుకున్నాడు. దాని ద్వారానే పోటీ పరీక్షలకు కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుకోవటం ప్రారంభించాడు. ఓవైపు లగేజీ మోస్తూనే.. మరోవైపు ఇయర్ ఫోన్స్ ద్వారా ఫోన్లో ఆడియో పాఠాలు విన్నాడు. తెలిసిన కొందరు లెక్చరర్ల సాయంతో ఫోన్ కాల్ ద్వారా పాఠాలు చెప్పించుకున్నాడు. రాత్రిపూట ఆ పాఠాలను రివిజన్ వేసుకుంటూ కష్టపడ్డాడు. చివరకు ఈ మధ్యే కేపీఎస్సీ, విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించాడు. త్వరలోనే శ్రీనాథ్ ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్నాడు. అందులో విజయం సాధిస్తే అతని కష్టాలు తీరినట్లే. ‘పరిస్థితులను మనకు అనుకూలంగా మల్చుకుంటే ఎతంటి కష్టానైనా అధిగమించొచ్చు’ అని శ్రీనాథ్ చెబుతున్నాడు. -
సర్కారు స్కూళ్లలో వైఫై..
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఇక ఉచితంగా వైఫైతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు జియోసిమ్తోపాటు రూటర్లను ఆయా జిల్లాల డీఈఓ కార్యాలయాలకు పంపించారు. అక్కడి నుంచి ఎంపిక చేసిన పాఠశాలలకు చేరవేసే ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలలోని కొన్ని పాఠశాలలకు ఇప్పటికే పంపిణీ కాగా మిగితా జిల్లాలకూ అందజేయడానికి సిద్ధం చేస్తున్నారు. అనేక ప్రయోజనాలు.. ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే కంప్యూటర్లు ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఆన్లైన్లో వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే సమాచారం డౌన్లోడు చేసుకోవటం లాంటివి చేసుకోలేకపోతున్నారు. వైఫై ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోనికి వస్తే ఆయా పాఠశాలల నుంచి ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు అడిగే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపే అవకాశాలుంటాయి. ఇప్పటికే ఐసీసీ అందుబాటులో పాఠ్యాంశాలు ఎస్సీఈఆర్టీ అధికారులు 8, 9, 10 తరగతులకు సంబంధించిన వివిధ పాఠ్యాంశాల లైవ్వీడియోలను తీసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇతర సంస్థలు సైతం పాఠ్యాంశాలను వీడియోలను తయారు చేసి యూటూబ్ లాంటి వాటిలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే వివిధ పాఠ్యాంశాల బోధన లైవ్ వీడియోలను డౌన్లోడు చేసుకొని స్కూళ్లలోని విద్యార్థులకు చూపించే అవకాశం లభించనుంది. అలాగే పాఠశాలల్లోని సమగ్ర సమాచారాన్ని సులువుగా సంబంధి విద్యాశాఖ ఉన్నతాధికారులకు చేరవేడంతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే అంశాలను డౌన్లోడు చేసుకునే వీలుంటుంది. వందకు పైగా విద్యార్థులున్న పాఠశాలలకే అవకాశం.. వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్‌ను ఎంపిక చేసి వాటికి వైఫై ఇంటర్నెట్ ఉచిత సేవలను అందించేందుకు నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 417 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 136 ఉన్నత పాఠశాలలుంటే 84, రూరల్ జిల్లాలో 103 ఉండగా 91, జయజశంకర్ భూపాలపెల్లిలో 120కి గాను 93, జనగామలో 129 ఉండగా 99, మహబూబాబాద్‌లో 100 పాఠశాలలు ఉండగా 50 ఎంపిక చేశారు. -
ఉచిత వైఫై, పింక్ టాయిలెట్లు!
లక్నో: ప్రముఖ ప్రదేశాల్లో ఉచిత వైఫై, మహిళల కోసం ప్రత్యేకంగా ‘పింక్ టాయిలెట్లు’, ఉచిత మంచినీటి కనెక్షన్లు.. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇస్తున్న హామీలివి. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఆదివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ తదితరులతో కలసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం యోగి మాట్లాడుతూ, ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తామని చెప్పారు. నవంబర్–డిసెంబర్లో 16 మున్సిపల్ కార్పొరే షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 652 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉచిత కమ్యూనిటీ టాయిలెట్లు, వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.20 వేల గ్రాంటు, జంతువులకు షెల్టర్లు, ఈ–టెండరింగ్.. తదితర 28 హామీలను మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చింది. మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ విడుదల చేసినది సంకల్ప్ పత్ర కాదని, ఛల్ పత్ర (ప్రజలను మోసగించే పత్రం) అని సమాజ్‌వాదీ పార్టీ విమర్శించింది. గతంలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగనున్న తొలి ముఖ్య ఎన్నికలు కావడంతో.. ఆయనకు పాలనకు ఇవి పరీక్షగా మారనున్నాయి. -
యూనివర్సిటీలు, కాలేజీల్లో ఫ్రీ వైఫై
పట్నా: యూనివర్సిటీలు, కాలేజీల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని బిహార్ ప్రభుత్వం ప్రారంభించింది. బిహార్ దివాస్ ఉత్సవాల్లో భాగంగా సీఎం నితీశ్ కుమార్ విద్యార్థులకు ఉచితంగా ఈ సౌకర్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధానంగా ఇచ్చిన ఏడు హామీల్లో ఉచిత వైపై కూడా ఒకటని ఆయన చెప్పారు. ప్రస్తుత సమయంలో ఇంటర్నెట్ అనేది జీవితంలో ఒక భాగమై పోయిందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సీఎం సూచించారు.విద్యార్థులు ఉచిత వైఫై(ఇంటర్నెట్)ని సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడానికి కాకుండా, పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని నితీశ్ సూచించారు. -
ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రుణ మాఫీ
► విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై ► రాజ్యాంగ పరిధిలో రామ మందిర నిర్మాణం ► యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ వరాల జల్లు లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికీ వరాల జల్లు కురిపించింది. యువత, రైతులే లక్ష్యంగా ఉచిత నజరానాలతో పాటు వివాదాస్పద రామ మందిర నిర్మాణం, త్రిపుల్ తలాక్ వంటి అంశాలనూ చేర్చింది. యూపీలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ పరిధులకు లోబడి రామ మందిరాన్ని నిర్మిస్తామని, త్రిపుల్ తలాక్‌పై ముస్లిం మహిళల అభిప్రాయాలు సేకరించి.. వాటిని సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని పేర్కొంది. యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లతో పాటు వన్ జీబీ డేటా, భారీ స్థాయిలో ఉద్యోగాలు... రైతులకు పంట రుణాల మాఫీ, 24 గంటల విద్యుత్ అందిస్తామంది. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామంది. శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ మేనిఫెస్టో... ‘లోక్ కల్యాణ్ సంకల్ప పత్ర్’ను విడుదల చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల ఎస్పీ, బీఎస్పీ పాలనలో యూపీ అన్నింటా వెనుకపడిందని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ నాయకత్వంలో తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని అమిత్‌షా చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా స్థాయిల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. యూపీ ఎన్నికలు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు ఏడు దశల్లో 403 స్థానాలకు జరగనున్నాయి. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు... ♦ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లతో పాటు 1జీబీ డేటా ♦ అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉచిత వైఫై... ♦ ‘అహల్యాబాయి విద్యా పథకం’ కింద రాష్ట్రంలోని బాలికలందరికీ డిగ్రీ వరకు ఉచిత విద్య ♦ అలాగే బాలురకు 12వతరగతి వరకు ఉచిత విద్య ♦ దళిత నాయకుడు అంబేడ్కర్, ఓబీసీ నాయకుడు అహల్యాబాయి హోల్కర్ల పేరిట ఎస్సీ, ఓబీసీలకు స్కాలర్షిప్లు ♦ 90 శాతం ఉద్యోగాలు యువతకు ♦ ఐదేళ్లలో అన్ని ఇళ్లకూ గ్యాస్ కనెక్షన్ .. నగరాల్లో గ్యాస్ పైప్‌లైన్ ♦ చిన్న, సన్నకారు రైతులకు పంట రుణాల మాఫీతోపాటు ఇకపై వడ్డీలేని రుణాలు. – రాష్ట్రంలో 24/7 విద్యుత్ సరఫరా... పేదలకు చౌక ధరకే విద్యుత్ ♦ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్ పార్కులు ♦ క్లాస్–3, 4 ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలను అరికట్టేందుకుఇంటర్వూ్యలు లేకుండా మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ ♦ అక్రమంగా నడుస్తున్న జంతువధ శాలల తొలగింపు ♦ కాల్ చేసిన 15 నిమిషాల లోపే పోలీసులు ఘటనా స్థలికి చేరేలా డయల్ 100 సేవలు మరింత మెరుగు ♦ కళాశాలల్లో ఈవ్‌టీజింగ్ నుంచి బాలికలను రక్షించేందుకు ‘యాంటీ–రోమియో స్క్వాడ్’. దీంతో పాటు ముగ్గురు మహిళల చొప్పున బెటాలియన్లు. ♦ పేదింట పుట్టిన ప్రతి ఆడ పిల్లకు రూ.5 వేలు ♦ భూ, గనుల మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యదళం -
బీఎస్ఎన్ఎల్ ‘టాటా కామ్’ ఆఫర్
ముంబై: టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) శుక్రవారం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ చందాదారులకు అంతర్జాతీయంగా ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. తన వినియోగదారులకు అపూర్వమైన డాటా అనుభవాన్ని అందించే క్రమంలో టాటా కమ్యూనికేషన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హై క్వాలిటీ, వేగవంతమైన డాటా అందించేలా టాటా కమ్యూనికేషన్స్ తో వై ఫై, వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కో్సం ఒక భాగస్వామ్యాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. దాదాపు 100కు పైగా దేశాల్లో 4.4 కోట్ల (44మిలియన్ల) వై ఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ విమానాలు, రైల్వేలతో సహా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు టాటా కమ్యూనికేషన్స్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. టాటా కామ్ బిఎస్ఎన్ఎల్ చందాదారులు భారతదేశం వెలుపల ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రపంచంలో వైఫై నెట్వర్కుకు అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు వివిధ పాస్ వర్డ్ లను గుర్తుంచుకోవడంలో గజిబిజి లేకుండానే....వై ఫై హాట్ స్పాట్ కు ఒక్కసారి నమోదు అయితే చాలని చెప్పింది. దీంతో వారు వేరు వేరు నగరం, దేశం లేదా ఖండం ఎక్కడున్నా సమీపంలోని వైఫైకి ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతారని టాటా కామ్ వెల్లడించింది. ప్రపంచంలో్ ఎక్కడున్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారుల బిల్లు షాక్ గురించి చింతలేకుండా ఇంటర్నెట్ అనుభూతిని అందించడమే తమలక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. -
వర్సిటీలు, కళాశాలల్లో ఫ్రీ వైఫై: సీఎం
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలతోపాటు అన్ని కళాశాలల్లో నెలరోజుల్లోనే ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇకనుంచి క్లాసుకెళ్లి మాత్రమే కాకుండా, ఎప్పుడు చదువుకోవాలనిపించినా చదువుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఉన్న 41,174 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో సైతం డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,212 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను గురువారం విశాఖ ఏయూ కాన్వొకేషన్ హాలు నుంచి సీఎం ప్రారంభించారు. -
అటకెక్కిన ఉచిత వైఫై ప్రాజెక్టు
సాక్షి,సిటీబ్యూరో: మహానగరాన్ని వై–ఫై సిటీగా మార్చేందుకు సర్కారు గతంలో సిద్ధంచేసిన ప్రణాళికలు అటకెక్కాయి. బీఎస్ఎన్ఎల్ సంస్థ నగరంలో 45 చోట్ల ఏర్పాటు చేసిన వై–ఫై హాట్స్పాట్ల వద్ద కూడా ఉచిత సేవలు తొలి పదిహేను నిమిషాలకే పరిమితమయ్యాయి. ఆపై ప్రతి మెగాబైట్ డేటా వినియోగానికి 8 పైసల చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో మూడువేల ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో వై–ఫై ప్రాజెక్టు అలంకార ప్రాయంగా మారిందని ఆరోపణలు వినవస్తున్నాయి. నగరంలో హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్కు 4500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నా..వీటి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, రాయితీలపై వారికి సహకారం అందించేందుకు సర్కారు ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అటకెక్కిన వై–ఫై ప్రాజెక్టు..! హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా మూడువేల ఉచిత వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు బీఎస్ఎన్ఎల్ సహకారంతో నగరంలో జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో 45 వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేశారు. తొలుత 30 నిమిషాలు ఉచితంగా వై–ఫై సేవలను అందించినా..గిట్టుబాటు కావడం లేదన్న కారణంగా వాటిని ప్రస్తుతానికి 15 నిమిషాలకు కుదించారు. ఆ తరవాత డేటా రీఛార్జి కార్డులను కొనుగోలు చేసి వాడుకునే సౌకర్యాన్ని కల్పించారు. 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ పరిధిలో మరో మూడువేల హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు సుమారు రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తూ, సదరు సంస్థ ప్రభుత్వం నుంచి 50 శాతం రాయితీని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వీటిని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ నుంచి ఉచిత అనుమతులు కోరుతోంది. ప్రతి హాట్‌స్పాట్ పరికరానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరుతుండగా, మీటర్ కనెక్షన్ తీసుకోవాల్సిందేనని సీపీడీసీఎల్ మెలిక పెట్టడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఐటీ జోన్‌లోనూ మూన్నాళ్ల ముచ్చటే.. తొలి అరగంట ఉచిత వై–ఫై సేవలు అందించేందుకు మాదాపూర్,సైబర్టవర్స్ ప్రాంతాల్లో ఎయిర్టెల్ సంస్థ ఏడాది క్రితం ఏర్పాటు చేసిన 17 హాట్‌స్పాట్స్ వద్ద ప్రస్తుతంSఉచిత సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సహకారం,రాయితీలు అందకపోవడంతో ఉచిత వై–ఫై సేవలను నిలిపివేసినట్లు విశ్వసనీయ సమాచారం. నాగ్‌పూర్ జిల్లా ఆదర్శం.... నగరంలో వై–ఫై ప్రాజెక్టు అటకెక్కినా..మహారాష్ట్రలో బీఎస్ఎన్ఎల్ సంస్థ ఆధ్వర్యంలో నాగ్‌పూర్ జిల్లాలో 770 వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే 300కు పైగా హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఆ జిల్లా వ్యాప్తంగా వై–ఫై సేవలు అందించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోందని, హైదరాబాద్‌లో ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం కనిపించడంలేదని ఆ సంస్థ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉచిత సేవల వినియోగంలో ఎంజీబీఎస్ టాప్.. ఉచిత వై–ఫై వినియోగానికి సంబంధించి బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన హాట్స్పాట్లలో మహాత్మగాంధీ బస్ స్టేషన్ అగ్రగామిగా నిలిచింది. స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణీకులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా అత్యధికంగా ఉచిత వై ఫై సేవలు వినియోగించుకుంటున్నట్లు బీఎస్ఎన్ఎల్ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మహా నగరం లోని సుమారు 45 రద్దీ ప్రాంతాల్లో హాట్స్పాట్లు ఏర్పాటు చేయగా, ఇందులో 15 హాట్ స్పాట్స్ వద్ద వినియోగం అధికంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మొత్తం హాట్ స్పాట్స్‌లో మే నుంచి సెప్టెంబర్ వరకు సుమారు లక్షకు పైగా మంది 6563.13 (జీబీ)నిడివిగల సమాచారాన్ని వినియోగించుకునట్లు తెలుస్తోంది. ఇందులో ఎంజీబీఎస్ వద్ద సుమారు 27,534 మొబైల్ ఫోన్లæ ద్వారా 792.64 జీబీ వినియోగించుకున్నారు. ప్రతి హాట్ స్పాట్స్ లో ఉచిత వై ఫై సేవల ద్వారా ప్రతి రోజు 80 నుంచి 100 జీబీ వరకు డేటా వరకు వినియోగమవుతోంది. ప్రతిరోజు సుమారు మూడు వేల మంది వరకు ఉచిత సేవలను వినియోగిస్తున్నట్లు అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. -
వికారాబాద్‌లో ఫ్రీ వైఫై సేవలు
వికారాబాద్ రూరల్: సైబర్నెట్ వారు ఉచిత వైఫై సేవలను ప్రారంభించడం అభినందనీయమని, దీన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ సీఐ జి.రవి అన్నారు. పట్టణంలోని సైబర్నెట్ వారి ఆధ్వర్యంలో మొదటివిడతగా ప్రధాన కూడళ్లలో ఉచిత వైఫై సేవలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి పనులకు, సమాచార సేకరణకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్నెట్ అధినేత మోసిన్‌ఖాన్ మాట్లాడుతూ. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ముఖ్య లక్ష్యంగా సైబర్ నెట్ పనిచేస్తుందన్నారు. పట్టణంలో మొదటి విడతగా ఎన్టీఆర్ చౌరస్తా, బీజేఆర్ చౌరస్తా, రైల్వేస్టేషన్, కొత్తగడి, శివారెడ్డిపేట ప్రాంతాల్లో సేవలు ప్రారంభించామన్నారు. సైబర్నెట్ వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగు పరిచేలా కృషి చేస్తామన్నారు. వికారాబాద్ ఎస్ఐ రవీందర్, సైబర్నెట్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మూడు వేల ప్రాంతాల్లో ఉచిత వైఫై
♦ త్వరలో కన్జర్వెన్స్ పోర్టల్ ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థల సేకరణ ♦ అధికారుల సమన్వయ సమావేశంలో నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు వేల ప్రాంతాల్లో ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య పూర్తి స్థాయి సమన్వయం కోసం కన్జర్వెన్స్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వీలైనంత త్వరగా సేకరించనున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో శనివారం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని 200 ఉచిత వైఫై కేంద్రాలను రోజుకు సగటున 21 వేల మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన కన్జర్వెన్స్ పోర్టల్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు ప్రతి శాఖ ప్రత్యేకంగా ఒక్కో నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆయన సూచించారు. వేసవి దృష్ట్యా నీటిని పొదుపుపై ప్రజలకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు మాట్లాడుతూ మూసీకిఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వివరాలు అందజేయాల్సిందిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు. ఈ భూముల్లో పర్యాటక, వాణిజ్యపరమైన భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, వాటిలో కనీస సదుపాయాలు కల్పించాలని రెండు జిల్లాల కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని కోరారు. రోడ్లపై విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాల్సిందిగా ట్రాఫిక్ అధికారులు సూచించారు. సింగిల్ లేన్ రోడ్లపై బస్‌బేల కోసం స్టీల్ బారికేడ్లు ఏర్పాటు చేయవద్దని కోరారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, కంటోన్మెంట్ సీఈఓ సుజాత గుప్తా, ట్రాఫిక్ డీసీపీ ఎల్ ఎస్ చౌహాన్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ఈజీ కమ్యూట్’తో హ్యాపీ ప్రయాణం
ఉద్యోగుల కోసం హైదరాబాద్‌లో ఏసీ బస్ సర్వీసులు ♦ జీపీఆర్ఎస్ వాహనాలు, ఏసీ, ఉచిత వైఫై కూడా.. ♦ ఈ ఏడాది చివరి నాటికి ముంబై, ♦ బెంగళూరుకు విస్తరణ ♦ రూ.50 లక్షల నిధుల సమీకరణపై దృష్టి ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో ఈజీ కమ్యూట్ కో-ఫౌండర్ రాహుల్ జైన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్‌లో ప్రయాణం.. అది కూడా బస్సులో అంటే మాములు విషయం కాదు. బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చినా సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు! పోనీ ఆటోలో వెళదామంటే మీటర్ పేరుతో జేబుగుల్ల! బైక్ మీదో కారులోనో వెళదామంటే ట్రాఫిక్ చిక్కులు!! ఈ కష్టాలన్నీ నగరవాసులకు నిత్యం ఎదురయ్యేవే. వీటి నుంచి బయటపడేయడానికి వచ్చిన స్టార్టప్ కంపెనీయే... ఈజీ కమ్యూట్. ఇంట్రా సిటీ ఏసీ బస్ సర్వీసెస్‌లను అందిస్తున్న ఈ స్టార్టప్ సేవల గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. జీపీఆర్ఎస్తో వాహనం ఎప్పుడొస్తుందో తెలుసుకునే వీలు.. సౌకర్యవంతమైన సీటు, ఫుల్లీ లోడెడ్ ఏసీతో పాటూ ఉచిత వైఫై!! ఉద్యోగ రీత్యా కొన్నేళ్ల పాటు స్వయంగా ఎదుర్కొన్న ప్రయాణ కష్టాలే ఈజీ కమ్యూట్ స్టార్టప్ స్థాపనకు కారణమంటున్నారు సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ జైన్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. నా స్వస్థలం బెంగళూరు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డా. హైటెక్‌సిటీలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసేవాణ్ణి. లింగంపల్లిలోని కొత్తగూడలో నివాసం. ఇంటి నుంచి ఆఫీసుకు రోజూ 15 కి.మీ. ప్రయాణం. దీనికోసం అష్టకష్టాలు పడేవాణ్ణి. లింగంపల్లి నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు షేర్ ఆటోలో ప్రయాణం. అది కూడా డ్రైవర్ పక్కన కడ్డీలకు ఆనుకొను వేలాడుతూ!!. ఆ వేలాడే ప్రయాణం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేం. సీటులో ఇమడలేక శరీరం పిప్పి అయ్యేది. దాని తాలుకు ప్రభావం ఆఫీసు పనిపై పడేది. ఇలా మూడేళ్లు ప్రయాణ నరకం అనుభవించా. ఓ రోజు టెక్నాలజీ మీటప్‌లో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థి మయాంక్ చావ్లాను కలిశా. మా ఇద్దరికీ ఎదురైన కామన్ సమస్య.. ప్రయాణ కష్టాలే. దీనికి టెక్నాలజీతో పరిష్కారం చూపించాలనుకున్నాం. ఇంకేముంది రూ.10 లక్షల పెట్టుబడితో 2015 అక్టోబర్‌లో మొబైల్ ఆధారిత ఇంట్రా సిటీ ఏసీ బస్ సర్వీసెస్ సేవలైన ఈజీ కమ్యూట్‌ను ప్రారంభించాం. ఎలా వినియోగించుకోవాలంటే.. ఈజీ కమ్యూట్ సేవల్ని మూడు స్టెప్పులో వినియోగించుకోవచ్చు. ముందుగా అందుబాటులో ఉన్న రూట్లలో పికప్ మరియు డ్రాప్‌ల స్థానాన్ని ఎంచుకోవాలి. తర్వాత సమయాన్ని, సీట్‌ను నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత యూజర్ తన ఈ-వ్యాలెట్ నుంచి డబ్బులు చెల్లిస్తే సరి. వెంటనే యూజర్‌కు బుకింగ్ ఐడీ, సీట్, వాహనం నంబర్, సమయం ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. వాహనం బయలుదేరిన సమయం? ప్రస్తుతం ఎక్కడుంది? నిర్ధారిత స్థానానికి ఎప్పుడొస్తుంది? గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటుంది? వంటి విషయాల్ని జీపీఆర్ఎస్ ఆధారంగా యూజర్ తన మొబైల్ నుంచే తెలుసుకోవచ్చు కూడా. కి.మీ.కు రూ.3-5 చార్జీ.. ప్రస్తుతం ఉదయం 14, సాయంత్రం 10 రూట్లలో మొత్తం 24 రూట్లలో ప్రయాణ సేవలందిస్తున్నాం. సంబంధిత రూట్లలో కొన్ని.. ఎల్బీనగర్, ఈసీఐఎల్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, రాంనగర్, రామాంతపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, నాగోల్, కొండాపూర్, ఏఎస్‌రావ్ నగర్, మారెడ్‌పల్లి, మాదాపూర్ ఉన్నాయి. ప్రస్తుతం 8,000 రిజిస్టర్ యూజర్లున్నారు. రోజుకు 210 మంది మా సేవల్ని వినియోగించుకుంటున్నారు. కి.మీ.కు రూ.3-5 చార్జీ ఉంటుంది. మొత్తంగా ఒక వైపు ప్రయాణానికి రూ.40-80 అవుతుంది. ఈజీ కమ్యూట్ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చెప్పేందుకు గాను రెండు సార్లు ఉచిత ప్రయాణాన్ని కూడా అందిస్తున్నాం. రూ.50 లక్షల నిధుల సమీకరణ.. వాహనాల కోసం పలువురితో ఒప్పందాలు చేసుకున్నాం. టెంపో ట్రావెలర్, వింగర్, జైలో, ఇన్నోవా, టవేరా మొత్తం 14 వాహనాలున్నాయి. వీటి సీటింగ్ సామర్థ్యం 210. వాహన ఓనర్లకు కి.మీ.కు రూ.2-4 మధ్య కమీషన్ రూపంలో చెల్లిస్తాం. 2 నెలల్లో యూజర్ల సంఖ్యను 20 వేలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ‘‘ప్రస్తుతం నెలకు రూ.2 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఈ ఏడాది ముగింపు లోగా బెంగళూరు, ముంబైల్లోనూ సేవల్ని విస్తరించనున్నాం. ఇందుకుగాను తొలిసారిగా నిధుల సమీకరణ చేయనున్నాం. సీడ్ రౌండ్లో భాగంగా రూ.50 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఏంజెల్ ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. మరో 2-3 నెలల్లో డీల్‌ను పూర్తి చేస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
శ్మశానాల్లోనూ ఫ్రీ వై-ఫై!
మాస్కో: రష్యా రాజధాని మాస్కో వాసులు ఇప్పటివరకు హోటళ్లు, మెట్రో స్టేషన్లలో వైర్లెస్ ఫ్రి ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆస్వాదించారు. ఇక వాళ్లు ఊహించనివిధంగా నగరంలోని శ్మశానాల్లోనూ ఉచిత వై-ఫై సేవలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొదట వాగన్కోవ్, ట్రోయెకురొవ్, నొవొడెవిచీ శ్మశానవాటికల్లో వచ్చే ఏడాది వై-ఫై ఇంటర్నెట్ సేవలు ప్రారంభించనున్నారు. ఇక్కడే మొదట ఎందుకంటే.. ఈ శ్మశానాల్లోనే రష్యా దిగ్గజాలైన ప్రముఖ రచయిత ఆంటన్ చెకొవ్, సోవియట్ నేత నికిత కృశ్చేవ్, మొదటి రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ను ఖననం చేశారు. ఈ శ్మశానాలు ప్రజలకు బహిరంగ మ్యూజియంలుగా మారిపోయాయని, ఇక్కడికి ప్రజలు తరచుగా వచ్చి ఏదో ఒక సమాధి ముందు నిలబడి.. అందులో ఖననం చేయబడిన ప్రముఖ వ్యక్తి గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటారని, అందుకే వీటిలో ఉచిత వై-ఫై సేవలు అందించాలని భావిస్తున్నామని మాస్కో శ్మశాన నిర్వహణ సంస్థ ప్రతినిధి లిల్యా ల్వొస్కాయా తెలిపారు. వీటిలో వై-ఫై సేవలు ప్రజాదరణ పొందితే నగరంలోని 133 శ్మశానవాటికలకూ ఈ సేవలు విస్తరింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. -
యాదిగిరిగుట్టలో త్వరలో ఉచిత వైఫై
భువనగిరి(నల్లగొండ): యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తుల కోసం ఉచిత వైఫై సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని రిలయన్స్ అధికారులు నిర్ణయించారు. యాదగిరికొండపైన 12 మెగాబైట్స్‌తో ఏర్పాటు చేసిన రిలయన్స్ వైఫైతో భక్తులకు అత్యంత నాణ్యమైన నెట్వర్క్ సేవలు లభించనున్నాయి. ఇందుకోసం ఆ సంస్థ దేవస్థానం పరిధిలోని కొండపైన ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. నాలుగు దిక్కుల నాలుగు రౌటర్లను ఏర్పాటు చేసింది. ఇటీవల రిలయన్స్ సిబ్బంది టెస్టింగ్ సిగ్నల్‌ను కూడా పరిశీలించారు. చిన్న చిన్న లోటుపాట్లను సవరించారు. దేవస్థానం ఉద్యోగులకు ఉచితం? కొండపైన పనిచేసే ఉద్యోగులకు వైఫై సౌకర్యం ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం సంస్థ దేవస్థానం ఈవో నుంచి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాల సమాచారం తీసుకుంటున్నారు. అలాగే కొండపైకి వచ్చే భక్తులకు పరిమిత కాలం ఉచిత సేవలు అందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
మొదటి ఫ్రీ వైఫై పంచాయతీ..!
ఇండియాను డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దాలన్న మోడీ ఆశయాన్ని ముందుగానే ఆ పంచాయతీ అందిపుచ్చుకుంది. తనకు తానుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గ్రామ పంచాయతీ మొదటి ఫ్రీ వైఫై ప్రవేశ పెట్టి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఒక్క ఫ్రీ వైఫై తోనే కాదు... ఇంతకు ముందే ఎన్నో కార్యక్రమాలతో పలు రకాల అవార్డులు తెచ్చుకోవడంలో కేరళ రాష్ట్రంలోనే ఎరవిపెరూర్ పంచాయితీ ముందుంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు ప్రత్యేక సేవలు అందించడంలో ఎరవిపెరూర్ గ్రామం రాష్ట్రంలోనే ప్రత్యేక గ్రామంగా పేరు తెచ్చుకుంది. కేరళ పతనంతిట్ట జిల్లాలోని ఎరవి పెరూర్ పంచాయితీలో ఫ్రీ వైఫై సేవలను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోనే మొదటి వైఫై గ్రామంగా ఎరవి పెరూర్ గుర్తింపు తెచ్చుకుంది. పంచాయతీప్రెసిడెంట్ ఎన్. రాజీవ్ ఆధ్వర్యంలో గ్రామం.. అభివృద్ధి పథంలో దూసుకుపోతూ దేశంలోని ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. వైఫై హాట్ స్పాట్, ఫ్రీ వైఫై కనెక్షన్లను పంచాయతీలోని కొన్ని ప్రముఖ ప్రాంతాల్లో ప్రవేశ పెట్టి ప్రజలకు ప్రత్యేక సేవలందిస్తోంది. పంచాయతీకి ఒక కిలోమీటర్ దూరం వరకూ ఈ వైఫై పనిచేస్తుంది. అలాగే పంచాయతీలోని రూరల్ ప్రాంతాలైన వల్లచకులమ్ గ్రామ విజ్ఞాన కేంద్రం, కోజిమల పంచాయతీ ఆఫీస్, నన్నూర్ ఆయుర్వేద డిస్పెంన్సరీ, ఒథేరా ప్రైమరీ హెల్త్ సెంటర్, ఎరవి పెరూర్ ఛిల్డ్రన్ పార్క ప్రాంతాల్లో కూడ ఫ్రీ వైఫై సేవలను అందిస్తోంది. మొత్తం నాలుగు లక్షల పదిహేడు వేల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా... యాక్టివ్ ఇన్ఫోకాం లిమిటెడ్ సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. ఎరవి పెరూర్ కు ప్రత్యేక గుర్తింపు రావడం ఇదే మొదటి సారి కాదు... ఇంతకు ముందు కూడ మరో ఆరు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టిన పంచాయితీ... కేరళ రాష్ట్రంలోనే ప్రత్యేక పంచాయతీల వరుసలో ముందుంది. దేశంలోనే మొదటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్ కూడ ఎరవి పెరూర్ గ్రామం అందుకుంది. మూడేళ్ళ క్రితం నుంచీ వరుసగా గ్రామానికి పలు అవార్డులు దక్కుతూనే ఉన్నాయి. స్టేట్ బయో డైవర్సిటీ బోర్డ్ ద్వారా బయో డైవర్శిటీ కంజర్వేషన్ అవార్డ్, స్టేట్ శానిటేషన్ మిషన్ ద్వారా శానిటేషన్ అవార్డ్ లు ఎరవి పెరూర్ పంచాయితీకి లభించాయి. అలాగే పంచాయితీలో పేదలకోసం ప్రవేశ పెట్టిన ఫ్రీ పల్లియేటివ్ స్కీమ్ 2014-15 కు గాను రాష్ట్ర ప్రభుత్వ హెల్గ్ అవార్డు, పెయిన్ అండ్ పల్లివేట్ కేర్ అవార్డు పంచాయితీ దక్కించుకుంది. మంచి ఆరోగ్యం కోసం అవుట్ పేషెంట్ లో కంప్యూటర్ల ఏర్పాటు, ఫార్మసీ మోడరనైజేషన్ వంటివి పంచాయతీ ప్రారంభించింది. దీంతో ఒథేరా ప్రైమరీ హెల్గ్ కేర్ సెంటర్... ఐఎస్ ఓ-9001 సర్టిఫికేషన్ తెచ్చుకున్న మొదటిదిగా రాష్ట్రంలోనే ఎంతో పేరు తెచ్చుకుంది. ఇ-గవర్నెన్స్ ను ప్రవేశ పెట్టి... ప్రజలను ఎస్ ఎం ఎస్ ల ద్వారా అలర్ట్ చేయడం ప్రారంభించింది. అంతేకాక ఎరవి పెరూర్ గ్రామాలను హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ మోడల్ హై టెక్ గ్రీన్ విలేజెస్ గా కూడ ఇంతకు ముందే గుర్తించింది. -
400 రైల్వే స్టేషన్లలో ఉచితంగా 'వైఫై'
బెంగళూరు: దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో మరో నాలుగు నెలల్లో గూగుల్ ఉచితంగా 'వైఫై' సౌకర్యాన్ని కల్పించనుంది. భారతీయ రైల్వేల కొలాబరేషన్‌తో 'ప్రాజెక్ట్ నీలగిరి' పేరిట హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఇక్కడి గూగుల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాలో అమలు చేస్తున్న 'గూగుల్ ఫైబర్ ప్రాజెక్ట్' ఎంతో ప్రజాధరణ పొందిందని, అలాంటి ప్రాజెక్టునే భారత రైల్వేలలో ప్రాజెక్ట్ నీలగిరి పేరిట అమలు చేయాలని భారతీయ రైల్వే, గూగుల్ మధ్య అవగాహన కుదురినట్టు ఆ వర్గాల ద్వారా తెల్సింది. రైల్వే స్టేషన్లలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందే ప్రయాణికులకు తొలి 34 నిమిషాలపాటు హైస్పీడ్ యూక్సెస్ ఉంటుందని, ఆ తర్వాత స్పీడ్ తగ్గుతుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ నెట్ సౌకర్యం 24 గంటలపాటు ఉచితంగానే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దేశంలో వైఫై సౌకర్యం కల్పించాల్సిన 400 రైల్వే స్టేసన్లను ఎంపిక చేయాల్సిన బాధ్యత భారతీయ రైల్వేదే. నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న డిజిటల్ ఇండియా స్కీమ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నారా, లేదా అన్నది, ప్రాజెక్టు కింద భారతీయ రైల్వే గూగుల్‌కు ప్యాకేజీ కింద ఎంత సొమ్ము చెల్లించేది తదితర వివరాలు వెలుగులోకి రాలేదు. -
కుండీలో చెత్తవేస్తే.. వైఫై ఫ్రీ
న్యూఢిల్లీ: ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ అవసరాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమస్త సమాచారాన్ని చిటికెలో అందిస్తూ విజ్ఞానానికి, వినోదానికి వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరంగా మారింది. అపరిశుభ్రత.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదీ ఒకటి. సగం రోగాలు అపరిశుభ్రత కారణంగానే వ్యాపిస్తాయి. ప్రస్తుతం దేశానికి ఇది ప్రాథమిక సమస్యగా మారింది. తమ వినూత్న ఆలోచనతో ఈ రెండింటికీ ఒకే పరిష్కారం కనుగొన్నారు ముంబైకి చెందిన ఇద్దరు కామర్స్ గ్రాడ్యుయేట్లు. అదెలాగో మీరూ చూడండి. 'వైఫై ట్రాష్ బిన్' పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే.. వైఫై ఉచితంగా అందించే ఓ సరికొత్త ప్రయత్నం చేశారు ముంబైకి చెందిన ప్రతీక్ అగర్వాల్, రాజ్ దేశాయ్. ఇందుకోసం 'వైఫై ట్రాష్ బిన్'పేరుతో డస్ట్‌బిన్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో చెత్తవేస్తే వైఫై ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన కోడ్ వస్తుంది. ఈ కోడ్ ద్వారా వైఫైని ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆలోచన ఇలా ముంబైలో ఓ వారంతంలో వారు వెళ్లిన ఓ పార్టీ ఈ ఆలోచనకు కారణమైంది. విశాలమైన ప్రాంతంలో జరిగిన ఆ మ్యూజిక్ ఫెస్టివల్.. మ్యూజిక్, ఫుడ్, డ్రింక్స్‌తో పాటు పెద్ద మొత్తంలో చెత్తకు కూడా వేదికైంది. నెట్వర్క్ కూడా లేని కారణంగా అక్కడ తమ స్నేహితులను గుర్తించేందుకు తమకు ఆరుగంటలకు పైగా పట్టినట్లు అగర్వాల్ తెలిపారు. దీంతో హాట్‌స్పాట్స్ ద్వారా ఉచితంగా వైఫై ఎందుకు అందించకూడదు అనే ఆలోచన ఆ సమయంలో తనకు వచ్చినట్లు చెప్పారు. ఈ ఆలోచనకు డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లో శుభ్రతకు చేపట్టిన సరికొత్త పద్ధతులు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. సొంత నిధులతో టెలికం ఆపరేటర్ ఎంటీఎస్ సహాయంతో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో జరిగే వారాంతపు వేడుకల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించాలని భావించినా అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గెయిల్ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు, చర్చలు జరుగుతున్నట్లు అగర్వాల్ తెలిపారు. కనెక్టివిటీ, మొబిలిటీ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వెలికితీసేందుకు ఎరిక్సన్, సీఎన్ ఎన్ ఐబీఎన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన 'నెట్వర్కడ్ ఇండియా'కార్యక్రమంలో ఇటీవల ఈ వైఫై బిన్స్‌ను ప్రదర్శించారు. -
తాజ్‌మహల్ పరిసరాల్లో ఉచిత వై-ఫై
-
తాజ్ మహల్ వద్ద ఉచిత వైఫై 16 నుంచి
న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం తాజ్‌మహల్ పరిసరాల్లో త్వరలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. సందర్శకులు జూన్ 16 నుంచి 30 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు పొందవచ్చు. ఆపై ప్రతి గంటకు అదనంగా రూ. 30 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజ్‌మహల్ పరిసరాల్లో 21 వైఫై కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. ప్రతి ఏటా 80 - 90 లక్షల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ని సందర్శిస్తారని, వారిలో 10 లక్షల మంది దాకా విదేశీ పర్యాటకులు ఉంటారని అంచనా. -
చార్మినార్ లో వైఫై సేవలు ప్రారంభం
హైదరాబాద్ : నగరంలో ఉచిత వైఫై సేవలు విస్తరించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలుచోట్ల ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉండగా.. ఇక చార్మినర్ ప్రాంతంలో కూడా ఉచిత వైఫై వినియోగానికి మార్గం సుగుమం అయ్యింది.రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు ఉచిత వైఫై సేవలను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. సేవలు ప్రారంభించిన అనంతరం వాటి పనితీరును ఆయన పర్యవేక్షించారు. సందర్శకుల సౌకర్యార్థం ఇటీవలే ట్యాంక్ బండ్ మరికొన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ సర్కారు ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
అన్ని జిల్లా కేంద్రాల బస్స్టాండ్లలో ఉచిత వై-ఫై
విజయవాడ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల బస్ స్టాండ్లలో ఉచిత వై-ఫై సేవలను విస్తరిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాబశివరావు చెప్పారు. ఈ మేరకు అవసరమైన పనులు చేపట్టామని, తర్వరలేనే బస్టాండ్లలో వై-ఫై సేవల్ని అందుబాటులోకి తెస్తామన్నారు. శుక్రవారం విజయగరం ఆర్టీసీ కాంప్లెక్సును ఆయన తనిఖీ చేశారు. విజయనగరం, శ్రీకాకులం డిపోలు రూ.60 కోట్ల నష్టంతో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ పెంపు సమయంలోనే బస్సు చార్జీల పెంపునకూ సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. -
వై ఫై గాలం
► యువత ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ ► నగరం మొత్తం వైఫై ఉచితం చేయాలని యోచన ► ప్రాజెక్ట్ సాంకేతిక సలహాదారుగా నందన్ నిలేకనీ సాక్షి, బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల్లో విజయం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని వనరులను వినియోగించుకోనుంది. ఎన్నికలల్లోపు కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఐటీ,బీటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో దాదాపు కోటి జనాభా ఉంది. ఇందులో 60 శాతం ఉన్న యువత ఓట్లను ఆకర్షించడంలో భాగంగా నగరం మొత్తానికి ఉచిత వైఫైను ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావిస్తోంది. నగరంలో ఇప్పటికే బ్రిగెడ్, ఎం.జీ రోడ్డు పరిధిలో ఉచిత వైఫై అందుబాటులో ఉంది. ఈ ఉచిత వైఫై పట్ల యువత నుంచి ఉత్తమ ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. దీంతో 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెంగళూరు మొత్తానికి ఉచిత వైఫ్ సదుపాయం కల్పించనుంది. ఒక వ్యక్తి రోజుకు గరిష్టంగా మూడు గంటలు లేదా 50 ఎం.బీ పరిమాణంలో ఉచితంగా వైఫైను అందించాలని ప్రభుత్వం భావన. ఇందుకు ఏడాదికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చుఅవుతుందని ఇప్పటికే ఐటీ,బీటీ శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందిందింది. కాగా, త్వరలో జరగనున్న మంత్రి మండలిలో ఇందుకు అధికారిక అనుమతి లభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సలహాదారుగా ప్రముఖ ఐటీ దిగ్గజం నందన్నిలేఖానిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఐటీ, బీటీ శాఖ ఉన్నతశాఖాధికారి ఒకరు పేర్కొన్నారు.