యూనివర్సిటీలు, కాలేజీల్లో ఫ్రీ వైఫై
పట్నా: యూనివర్సిటీలు, కాలేజీల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని బిహార్ ప్రభుత్వం ప్రారంభించింది. బిహార్ దివాస్ ఉత్సవాల్లో భాగంగా సీఎం నితీశ్ కుమార్ విద్యార్థులకు ఉచితంగా ఈ సౌకర్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రధానంగా ఇచ్చిన ఏడు హామీల్లో ఉచిత వైపై కూడా ఒకటని ఆయన చెప్పారు.
ప్రస్తుత సమయంలో ఇంటర్నెట్ అనేది జీవితంలో ఒక భాగమై పోయిందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సీఎం సూచించారు.విద్యార్థులు ఉచిత వైఫై(ఇంటర్నెట్)ని సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి కాకుండా, పుస్తకాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని నితీశ్ సూచించారు.