nithish kumar
-
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్‌లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్‌లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.2024లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు వినేష్ ఫోగట్నితీష్ కుమార్చిరాగ్ పాశ్వాన్హార్దిక్ పాండ్యాపవన్ కళ్యాణ్శశాంక్ సింగ్పూనమ్ పాండేరాధికా మర్చంట్అభిషేక్ శర్మలక్ష్య సేన్ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు. -
రాజీనామా తర్వాత నితీష్ కుమార్ సంచలన కామెంట్స్
-
రసవత్తరంగా బీహార్ రాజకీయాలు
-
ఆచరణ సాధ్యం కాని పనుల గురించి ఎందుకు సార్.. మాట్లాడటం!!
ఆచరణ సాధ్యం కాని పనుల గురించి ఎందుకు సార్.. మాట్లాడటం!! -
వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
పట్నా: కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకివస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా (స్పెషల్ కేటగిరీ స్టేటస్) కల్పిస్తామని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ఈ హోదా దక్కుతుందని, అలా జరగకపోవడానికి కారణమేదీ తనకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. నితీశ్ గురువారం పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేయడం దారుణమని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దూరం చేయడం తగదని అన్నారు. బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్‌కుమార్ మోదీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై నితీశ్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో వారిద్దరూ తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీతో తాము చాలాకాలం కలిసి ఉండడం తప్పేనని నితీశ్ అంగీకరించారు. ప్రత్యేక హోదా కోసం బిహార్ చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిహార్‌ను విభజించడం వల్ల రెవెన్యూ, గనుల ఆదాయం మొత్తం జార్ఖండ్‌కే వెళ్తోందని నితీశ్ కుమార్ చెబుతున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే చాలు కేంద్రంలో ఏ ప్రభుత్వానికైనా మద్దతిస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. బిహార్‌లో నెల రోజుల క్రితమే బీజేపీ కూటమి నుంచి బయటకువచ్చి, ప్రతిపక్షాలతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ బరిలోకి దిగుతారని జేడీ(యూ) నాయకులు ఉద్ఘాటిస్తున్నారు. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
వాళ్లంతా నాకు టచ్‌లోనే ఉన్నారు: చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలన సాగించలేదని లోక్‌జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. త్వరలోనే జేడీ(యూ)లో చీలిక వస్తుందని, ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఉత్తర బిహార్ జిల్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తనను దెబ్బ కొట్టేందుకే తన బాబాయ్ పశుపతి పరాస్తో చేతులు కలిపిన నితీశ్ కుమార్.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారని ఆరోపించారు. జేడీయూలోని ఇతర నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్థిరంగా కొనసాగలేదని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని చిరాగ్ జోస్యం చెప్పారు. నితీశ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులుగా.. ఎన్నికల సమయానికి ఈ పొత్తు గురించి ఆలోచిస్తానని బదులిచ్చారు. పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని నేనే: పశుపతి దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని తానేనని, ఆయన సోదరుడు పశుపతి పరాస్ పేర్కొన్నారు. ‘‘హిందూ వారసత్వ చట్ట ప్రకారం చిరాగ్ ఆయన ఆస్తులకు వారసుడేమో గానీ, నేను మాత్రమే ఆయన రాజకీయ వారసుడిని’’ అని వ్యాఖ్యానించారు. కాగా బిహార్ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూను వ్యతిరేకిస్తూ అభ్యర్థులను రంగంలోకి దించిన చిరాగ్ పాశ్వాన్... తన నిర్ణయంతో ఆ పార్టీ ఓట్లకు గండికొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరాగ్‌తో విభేదించిన ఎంపీ పశుపతి ఇటీవలే ఎల్జేపీలో తిరుగుబాటు లేవనెత్తి జాతీయాధ్యక్ష పదవి చేపట్టారు. బిహార్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక జేడీయూ నేత రామచంద్ర ప్రసాద్ సింగ్ (63)కు సైతం బిహార్ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. -
వెంటాడిన దురదృష్టం: వీళ్లకు సీఎం పదవి మూణ్ణాళ్ల ముచ్చటే!
వెబ్‌డెస్క్: కాలం కలిసొచ్చినా.. దురదృష్టం వెక్కిరించింది అన్నట్లు... కథ అడ్డం తిరిగి ఎంపీ తీరత్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. పార్టీలో చెలరేగిన సంక్షోభం కారణంగా సీఎంగా అవకాశం పొందిన ఆయన.. కడదాకా పదవిని నిలబెట్టుకోలేకపోయారు. ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు మహిళల వస్త్రధారణ, ఉచిత రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి అనడం వంటి వివాదాస్పద వ్యాఖ్యలతో అధిష్టానాన్ని ఇబ్బందులుకు గురిచేసి చేజేతులా పీఠాన్ని చేజార్చుకున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండటం... ఉప ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి కారణంగానే ఆయనను కుర్చీ నుంచి దింపుతున్నారనుకున్నా.. పెద్దలు తలచుకుంటే ఆయనతో రాజీనామా చేయించి.. మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టవచ్చు. కానీ అలా జరగలేదు. ఏదేమైనా 115 రోజుల పాటు సీఎంగా ఉన్న వ్యక్తిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు తీరత్ సింగ్. ఈ నేపథ్యంలో అతితక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజకీయ నాయకుల గురించి కొన్ని వివరాలు... దేవేంద్ర ఫడ్నవిస్- మహారాష్ట్ర బీజేపీ- శివసేన మధ్య సయోధ్య కుదరకపోవడంతో దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజులకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో సీఎం పీఠం అధిరోహించిన ఆయన.. శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మహా కూటమిగా ఏర్పడటంతో రెండోసారి పూర్తిస్థాయి సీఎంగా పనిచేయాలన్న ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి అచ్చంగా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. బీఎస్ యడియూరప్ప- కర్ణాటక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2018, మేలో బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. అయితే, అప్పటికే జేడీఎస్- కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడటం, విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో విశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ముందే తన పదవికి రాజీనామా చేశారు. మే 17న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 19న సీఎంగా వైదొలిగారు. జగదాంబికా పాల్- ఉత్తరప్రదేశ్ 1998లో ఫిబ్రవరి 21-23 నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు జగదాంబికా పాల్. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం రద్దు కాగానే.. రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కళ్యాణ్‌సింగ్ తిరిగి సీఎంగా నియమితులు కాగానే జగదాంబికా పాల్ తన పదవికి రాజీనామా చేశారు. హరీశ్ రావత్- ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క రోజు సీఎం(రెండో దఫా)గా ఉన్నారు హరీశ్ రావత్. భారత రాజకీయ చరిత్రలో ఇలా ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే. ఓం ప్రకాశ్ చౌతాలా- హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత ఓం ప్రకాశ్ చౌతాలా... 1989- 2004 మధ్య 4సార్లు హర్యానా సీఎంగా పనిచేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల 1990 జూలై 12 నుంచి జూలై 17 వరకు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే సీఎంగా ఉన్నారు. అదే విధంగా... మూడోసారి పదవి చేపట్టిన ఆయన 17 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. నితీశ్ కుమార్- బిహార్ జనతా దళ్ నేత నితీశ్ కుమార్ 2000 సంవత్సరంలో మార్చి 3 నుంచి మార్చి 10 వరకు కేవలం 8 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. -
లాక్‌డౌన్‌ను పొడిగించిన మరో రాష్ట్రం
పట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. దీని వలన గత కొన్ని రోజులుగా అనేక రాష్ట్రాలలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, బిహర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జూన్ 8 లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సోమవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. అయితే, కొన్ని సడలింపులను కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం, తప్పనిసరిగా అవసరంముండే షాపులను మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇతర దుకాణా సముదాయాలను మాత్రం రోజు విడిచి రోజు తెరుచుకోవాలని సూచించారు. కాగా, ఆదివారం మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలనే డిమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ‘బాల సహయాత యోజన పథకం’ కింద నెలకు 1,500 రూపాయలు అందజేస్తామని సీఎం నితిష్ కుమార్ ప్రకటించారు. దీనితో పాటుగా వారికి ఉచిత పాఠశాల విద్యతో పాటు ఆర్థిక సహయం కూడా అందిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఇప్పటికే ప్రధాని మోదీ ‘ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం’ కింద అనాథ పిల్లలకు తోడ్పాటు అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు -
మోదీ భక్తుడిపై నీలి నీడలు
పట్నా : బిహార్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ముప్పేట దాడి చేసిన లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొండంత అండగా ఉన్న తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ అకాల మరణంతో ఒంటరి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ ఓటమే లక్క్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. చివరకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరకున్నా ఎన్డీయే కూటమిలో జేడియూ ఓట్లను చీల్చుతూ సీట్ల సంఖ్య తగ్గించగలిగారు. ఎల్జేపీ వల్లే సుమారు 35 మంది అభ్యర్థులు ఓడిపోయారని జేడియూ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమిలో భాగసామ్య పార్టీఅయిన ఎల్జేపీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్లో నితీష్ డిమాండ్ చేశారు. (చదవండి:మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్) ముందు నుయ్యి.. వెనుక గొయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది బీజేపీ పరిస్థితి. బిహార్‌లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎన్డీయే కూటమి నష్టపోయినప్పటికీ, బీజేపీ అతిపెద్ద భాగసామ్య పక్షంగా అవతరించడంతో సహాయ పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎల్జేపీ అభ్యర్థులను బరిలో నిలపలేదు. మరోవైపు ఎన్నికల ర్యాలీలలో ఎల్జేపీ యువనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హనుమంతుడిలాంటి భక్తునంటూ ప్రచారం చేశారు. రాష్ష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రావడం తన ధ్వేయమని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇలాంటి తరణంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... ‘ఎల్జేపీ జాతీయ పార్టీ కాదు. ఇది బిహార్‌కి చెందిన ప్రాంతీయ పార్టీ. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్‌ని వ్యతిరేకించారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయిస్తారు’ అని అన్నారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’) చిరాగ్‌ని చీకొట్టడానికి అడ్డంకులేంటీ? ప్రధాని మోదీ ఎన్నికల సభలో రాం విలాస్ పాశ్వాన్‌ని గుర్తు చేస్తూ.. ఒక మంచి మిత్రుడిని కోల్పోయనని పేర్కొన్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా కాకుండా దళితులకు చేరువవడంలో రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే విశేష కృషి చేశారు. రానున్న బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కూటమి నుంచి ఎల్జేపీ అవమానకర స్థితిలో బయటకు పంపిస్తే దళిత వర్గాల్లో బీజేపీ బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ అగ్రనాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఎన్డీయే నేతృత్వలో ఏర్పాటు కానున్న ప్రభుత్వానికి చిరాగ్ మద్దతు ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్
పట్నా: లోక్ జనశక్తి పార్టీని ఎన్డీయేలో కొనసాగించడంపై నిర్ణయం తీసుకునేది కూటమిలోని కీలక భాగస్వామి అయిన బీజేపీయేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాలకే పరిమితం కావడానికి ఎల్జేపీనే కారణమన్న వార్తలపై నితీశ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 71 స్థానాల్లో గెల్చడం తెల్సిందే. ఎన్డీయే మిత్రపక్షాలతో శుక్రవారం చర్చించి, ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయిస్తామని నితీశ్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29తో ముగుస్తుందని, అందువల్ల ప్రమాణ స్వీకారానికి తమకు తగినంత సమయముందని వ్యాఖ్యానించారు. నవంబర్ 29 లోపు ప్రమాణ స్వీకారం చేయాలంటే ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల సీఎంగా పాలనలో ఏమైనా ఇబ్బంది పడే అవకాశముందా? అన్న ప్రశ్నకు నితీశ్.. అలాంటిదే ఉండబోదని సమాధానమిచ్చారు. ‘నేరాలు, అవినీతి, మతతత్వం.. ఈ మూడింటి విషయంలో రాజీ ఉండదు. వాటి విషయంలో మా విధానంలో మార్పు ఉండదు. నేను సీఎం అయిన తరువాత బిహార్‌లో ఇప్పటివరకు ఎలాంటి ఘర్షణలు జరగలేదు’ అన్నారు. ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో గెలుపొందడంపై స్పందిస్తూ.. ప్రజా తీర్పు అంతిమమని వ్యాఖ్యానించారు. ‘ఇవే నా చివరి ఎన్నికల’ని ప్రచార సమయంలో తాను చేసిన వ్యాఖ్యను సరిగ్గా అర్థం చేసుకోలేదని నితీశ్‌కుమార్ తెలిపారు. ‘చివరి ఎన్నిక అంటే నా ఉద్దేశం చివరి ప్రచార సభ అని’ అని వివరణ ఇచ్చారు. సోమవారం ప్రమాణ స్వీకారం!? బిహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగో సారి నితీశ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ప్రమాణ స్వీకార తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ.. పవిత్రమైన ‘భయ్యూ దూజ్’ పండుగ రోజైన సోమవారం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని జేడీయూ వర్గాలు తెలిపాయి. -
ఒకవేళ ఓడితే.. కారణాలు ఇవే!
పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలుత వెనుకబడిన ఎన్డీఏ కూటమి.. ప్రస్తుతం అధిక స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. అయితే, కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల వరకు కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మహాఘట్ బంధన్ ఎక్కువ స్థానాల్లో లీడింగ్‌లో ఉండటం.. ఎగ్జిట్ పోల్స్ కూడా వారికే జైకొట్టడంతో జేడీయూ నేతలు ఆందోళనకు గురయ్యారు. ఒకవేళ నితీష్ తిరిగి అధికారంలోకి రాకపోతే.. దానికి ప్రధాన కారణం కోవిడ్ పరిస్థితులేనని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు ఎలా ఉన్నా స్వాగతిస్తాం. నితీష్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను కాదని ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే.. బిహార్ వెనుకబడిందనేది నిజమని ఒప్పుకున్నట్టే’అని త్యాగి పేర్కొన్నారు. వలసలు, వరదలు, కరోనా ఇలా వరుస సంక్షోభాలు నితీష్ ప్రభుత్వాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎన్నికల ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి సొంతంగా పోటీచేసిన ఎల్‌జేపీక చిరాగ్ పాశ్వాన్ తమకు నష్టం కలిగించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. (బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్డేట్స్) -
సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ..
-
నితీష్ ఇంకెప్పుడూ సీఎం కాలేరు : చిరాగ్
పట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని లోక్‌జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. నితీష్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బిహార్ ప్రజలు ఆయన పాలనలో విసుగుచెందారని విమర్శించారు. బిహార్‌లో నేడు (మంగళవారం) రెండో దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తన ట్వీట్లతో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కారని, రాష్ట్రం వెనుకబాటుతనం కారణంగా బిహారీలు తమను తాము బిహారీలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహారీ ప్రజలు విలువైన ఓటును వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీ నాయకుడు, బీజేపీతో తన స్నేహం చెక్కుచెదరకుండా ఉందని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్ 10 తర్వాత నితీశ్ కుమార్ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలనని, బిహార్ మొదట-బిహారీ మొదట ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్ తర్వాత నితీష్‌జీకి ఓటమి భయం పట్టుకుందని, ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారని అర్థమైందని అన్నారు. ‘నితీష్ ఫ్రీ బిహార్ కావాలి, గత 15 ఏళ్లలో రాష్ట్రం అపఖ్యాతి పాలై, దారుణమైన స్థితికి చేరుకుంది. వలసలు, నిరుద్యోగం, వరదలు వంటి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు చీకట్లో జీవిస్తున్నారు. బిహార్ నుంచి వలస వెళ్లిన వారు తమను తాము బిహారీ అని చెప్పుకోడానికి వెనకాడుతున్నారు. అయోధ్య రామ మందిరం కంటే పెద్దదైన సీత ఆలయాన్ని బిహార్‌లో నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. బిహార్ ఫస్ట్- బిహారీ ఫస్ట్ అనేదే మా నినాదం’ అని అన్నారు. బిహార్‌లో మొత్తం 243 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 27న మొదటి దశ ఎనికలు పూర్తి కాగా, నవంబర్ 3న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏడో తేదీన 71 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న విడుదల కానున్నాయి. కరోనా సంక్షోభం అనంతరం జరగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది. -
పొగుడుతూనే చురకలంటించిన ప్రధాని
-
వ్యూహాత్మకంగా జేడియూ అభ్యర్థుల జాబితా
-
‘ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. అవమానించినట్టే’
ముంబై: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆదివారం అధికార జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగబోయే బిహార్ ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహారాష్ట్ర పోలీసులను అవమానించిన గుప్తేశ్వర్ పాండేకు జేడీయూ టికెట్ గనుక కేటాయిస్తే అది తమను మరింత బాధిస్తుందని తెలిపింది. బిహార్ ఎన్నికల బీజేపీ ఇన్చార్జ్గా ఉన్న ఫడ్నవీస్ ఆయనకు జేడీయూ టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవాలని సూచించింది. లేదంటే మహారాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరిచినట్టు అవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, బిహార్‌లో వచ్చే నెలాఖరు నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభవుతున్నాయి. మూడు విడతల్లో.. అక్టోబర్ 28 న తొలి విడత, నవంబర్ 3 న రెండో విడత, నవంబర్ 7 న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం నితీష్ కుమార్ మరోసారి మిత్రపక్షం బీజేపీతో జట్టుకట్టారు. (చదవండి: సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు) టగ్ ఆఫ్ వార్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ముంబైలోని తన నివాసంలో జూన్ 14న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కుమారుడి మృతి పట్ల సుశాంత్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ముంబై పోలీసులు దీనికి అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తును తామే చేస్తామని స్పష్టం చేశారు. దీంతో తమకు ముంబై పోలీసుల విచారణపై నమ్మకం లేదని డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న గుప్తేశ్వర్ పాండే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్‌ని ఒప్పించి సీబీఐ విచారణకు ఆదేశాలు ఇప్పించారు. (చదవండి: నితీష్ సమక్షంలో జేడీ(యూ)లో చేరిక) -
సీఎం వైఎస్ జగన్‌కు నితీష్ కుమార్ ఫోన్
సాక్షి, తాడేపల్లి : బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఫోన్ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కి మద్దతు పలకాల్సిందిగా నితీష్ సీఎం జగన్‌ను ఫోన్లైన్లో కోరారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. 2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో హరివంశ్ మరోసారి పోటీలో నిలిచారు.(చదవండి : ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు) -
బిహార్ ప్రభుత్వం కీలక ప్రకటన!
పట్నా: రాష్ట్రం నుంచి వలసలను అరికట్టేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యం, పరిశ్రమలను మరింతగా అభివృద్ధి చేసి వలసలు అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు.. బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ వేదికగా పలు విషయాలను వెల్లడించింది. ‘‘అధిక సంఖ్యలో ప్రజలకు ఇక్కడే ఉద్యోగం, ఉపాధి కల్పించాలనేదే మా ఆకాంక్ష. తద్వారా ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. వాణిజ్య- వ్యాపారాలు, పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితే ఉద్యోగాల కల్పన సులభతరంగా మారుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాం’’ అని సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసింది.(కరోనా: కాస్త ఊరటనిచ్చే కబురు! ) కాగా లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కష్టాలు.. సొంత రాష్ట్రానికి చేరుకునే క్రమంలో పలువురు మృత్యువాత పడటం వంటి హృదయవిదారక ఘటనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ వలసలను అరికడతామంటూ తాజాగా ప్రకటన చేయడం గమనార్హం. ఇక వలస కార్మికుల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏకంగా ‘మైగ్రేషన్ కమిషన్’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వలస కార్మికులకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామన్న యోగి.. ఈ మేరకు పలు ఎంఓయూలు కుదుర్చుకుని స్థానికంగా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. (25 రోజుల్లో 376 అంత్యక్రియలు! ) -
యూపీ ప్రభుత్వ తీరుపై బిహార్ సీఎం ఆగ్రహం
పట్నా : ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వతీరుపై బిహార్ సీఎం నితీష్ కుమార్ మండిపడ్డారు. రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి 300 బస్సులను ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని యూపీ ప్రభుత్వం పంపింది. అదే రీతిలో బిహార్‌కు చెందిన వలస కార్మికులను అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించకపోవడం అన్యాయం అని నితిష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'కోటాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత కుటుంబాలకు చెందిన వారు. చాలా మంది విద్యార్థులు కోటాలోనే వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. వారిని అంత అత్యవసరంగా తరలించాల్సిన అవసరం ఏముంది. అదే సమయంలో ఎన్నో రోజులుగా నిరాశ్రయులుగా ఉన్న బిహార్‌కు చెందిన వలస కార్మికుల విషయంలో ఎందుకు ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తున్నారు' అని నిప్పులు చెరిగారు. విద్యార్థులను లాక్డౌన్ సమయంలో తిరిగి రప్పించడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. మార్చిలో ఢిల్లీ నుంచి కార్మికులను తరలించడం కూడా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇదే సమయంలో, ఎక్కడివారు అక్కడే ఉండి కరోనా వ్యాప్తి అరికట్టడానికి సహకరించాలని బిహార్‌కు చెందిన విద్యార్థులు, వలస కార్మికులకు ఉద్దేశించి నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వలస కార్మికుల రక్షణ కోసం బిహార్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంబంధిత రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని తెలిపారు. -
సుశీల్‌కు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్
పట్నా : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. సుశీల్‌ను ఉద్దేశిస్తూ.. కొంతమంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల కృతజ్ఞత చూపలేదని ఆరోపిస్తూ ప్రశాంత్ కిషోర్ శనివారం సుశీల్ కుమార్ పాత వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు. 'నితీష్ కుమార్ పార్టీలో కొంతమందికి ఎటువంటి గుర్తింపు లేకున్నా తనకున్న అధికారంతో వారికి గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారంటూ' సుశీల్ కుమార్ ఇంతకుముందు ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్ ఇస్తూ.. ప్రజలకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో సుశీల్ మోదీని మించినవారు ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. దీంతోపాటు ప్రశాంత్ సుశీల్ మోడీకి చెందిన పాత వీడియోను పోస్ట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ షేర్ చేసిన వీడియోలో సుశీల్ కుమార్ నితీశ్ కుమార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ వీడియోలో సుశీల్ మాట్లాడుతూ' నితీశ్ కుమార్ బీహారీ కాదని,17 సంవత్సరాల స్నేహం పేరుతో నితీశ్ బీజేపీకి ద్రోహం చేశారు. మోసం అనే పదం నితీశ్ డీఎన్ఏలో ఉంది కానీ బీహారీ ప్రజల్లో లేదని' తెలిపారు. అంతకుముందు జేడియూ సీనియర్ నేత పవన్ వర్మ నితీష్ కుమార్‌పై ట్విటర్లో మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. (విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్: సుశీల్ మోదీ) -
పార్టీ మారాలనుకుంటే మారవచ్చు: నితీశ్
పాట్నా: జేడీయూ సీనియర్ నేత పవన్ వర్మ ట్వీట్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..తనకు ఇష్టమైన పార్టీలో పవన్ వర్మ చేరవచ్చని, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు నితీశ్ తెలిపారు. బీజేపీతో జేడీయూ పొత్తు విషయంలో నితిశ్ కుమార్ వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తుందని పవన్ వర్మ మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ..ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయంలో నితిశ్ కుమార్ విముఖత వ్యక్తం చేశారని పవన్ వర్మ తెలిపారు. ఈ రకంగా బహిరంగంగా వ్యాఖ్యానించడం ఏ మేరకు సమంజసమని.. పార్టీ మారాలనుకుంటే మారవచ్చని పవన్ వర్మను ఉద్దేశించి నితిశ్ కుమార్ వ్యంగ్యంగా విమర్శించారు. చదవండి: బదులు తీర్చుకున్న నితీశ్ -
‘క్యాబ్’పై పీకే వ్యతిరేకతకు కారణం ఇదే !
పాట్నా : పౌరసత్వ సవరణ చట్టంపై జేడీయూ వైఖరితో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఆర్జేడీ బిల్లును వ్యతిరేకించగా, మొదట్లో వ్యతిరేకించినా అనంతర పరిణామాలతో అధికార జేడీయూ రెండు సభల్లోనూ బిల్లుకు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిలో మార్పు పట్ల జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నిర్ణయాన్ని బహింరంగంగా వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకొంది. పార్టీ సమావేశంలో ముందుగా తీసుకున్న నిర్ణయానికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్లారని పీకేతో పాటు రవివర్మ ప్రశ్నించగా, తాజాగా పార్టీ ఎంపీలు రాంచందర్ సింగ్ స్పందిస్తూ పార్టీలో నితీష్‌కుమార్ నిర్ణయమే ఫైనల్ అని నచ్చనివాళ్లు పార్టీని వదిలి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. మరో ఎంపీ రాజీవ్ రంజన్ అధినేత తీసుకున్న నిర్ణయాలను ధిక్కరించే అధికారం పార్టీలో ఎవరికీ లేదని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిణామం పట్ల విశ్లేషకులు మరో భాష్యాన్ని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ భార్య అస్సామీ. ఈ బిల్లు వల్ల ఆ రాష్ట్రం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే బిల్లును వ్యతిరేకిస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్ బిల్లుకు మద్దతివ్వడంపై మరో కోణాన్ని తెలుపుతున్నారు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రతిపక్ష ఆర్జేడీకే పడ్డాయని, ఆర్జేడీ ముస్లింలకు ఎప్పుడు కూడా ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుందని నితీష్ పసిగట్టారు. వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనునక్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తే అటు ముస్లింల ఓట్లు పడకపోగా, ఇటు బలమైన హిందూ ఓటు బ్యాంకు కూడా దూరమైపోతుందని నితీష్ గ్రహించారు. అందుకే యూటర్న్ తీసుకొని బిల్లుకు మద్దతిచ్చారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీ దెబ్బతింటుందని నితీష్‌కు తెలుసు. అయినా కూడా బీహార్‌లో హిందూ ఓట్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో మద్దతిచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై జేడీయూ సీనియర్ నాయకుడు నీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ముస్లింలకు ఎంతో చేసినప్పటికీ వారి నుంచి మాకు పడే ఓట్ల శాతంలో పెద్ద తేడాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంపై మాకు ఎవరి సలహా అక్కర్లేద’ని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
'15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు నిషేధం'
పాట్నా : బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ వాహనాలను సోమవారం నుంచే పూర్తిగా నిషేదించినట్లు నిర్ణయం తోసుకుంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇటివలే పండుగ సీజన్లో నమోదైన కాలుష్య స్థాయిని గమనిస్తే అందులో ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే పాట్నా మెట్రో పాలిటన్ ఏరియాలో 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ వాహనాలను నిషేదించామని తెలిపారు. అయితే ప్రైవేటు వాహనాలను ఈ నిషేధం నుంచి మినహాయించామని, కానీ యజమానులు తమ వాహనాలకు కొత్తగా కాలుష్య పరీక్షలు చేయించి ధృవీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా మంగళవారం నుంచి ఇంటెన్సివ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం జారీ చేస్తామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కిరోసిన్‌తో నడుస్తూ అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆటో రిక్షాలు కొత్తగా పొల్యుషన్ టెస్ట్‌ను చేయించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీజిల్‌తో నడుస్తున్న ఆటో రిక్షాలను త్వరలోనే పూర్తిస్థాయి సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్‌తో నడిచే విధంగా రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిని మార్చుకోవడానికి ఆటో యజమానులకు ప్రోత్సాహం కింద సబ్సిడీలు కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రాధిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అదే విధంగా ప్రైవేట్ భవనాలకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్‌లెస్ జనరేటర్లను మాత్రమే ఉపయోగించుకునేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. చెత్తను పారవేసే ట్రక్కులు, ఇతర వ్యాన్లు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చెత్తను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. -
బీజేపీతో జేడీయూ కటీఫ్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి బీజేపీ, జేడీయూ విషయంలో మరోసారి నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో బిహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలో కలిసి పోటీ చేసిన జేడీయూ, బీజేపీ మెజారిటీ సీట్లు సాధించాయి. ఇదే మైత్రి ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతుందని అంతా భావించారు. అయితే, తాజాగా మారిన నితీశ్ వైఖరి ఎన్డీయేకు గుడ్‌బై చెప్పేందుకేనా అన్నట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర కేబినెట్ ఏర్పాటు నుంచి.. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ మంత్రివర్గంలో జేడీయూకు ఒక్క మంత్రి పదవినే ఇవ్వజూపడం నుంచి నితీశ్‌కు అసంతృప్తి మొదలైంది. అనంతరం రాష్ట్ర కేబినెట్ విస్తరించిన సీఎం నితీశ్ బీజేపీకి కూడా ఒకే ఒక్క మంత్రిపదవి ఇవ్వజూపారు. అదేవిధంగా, తగిన మార్పులు చేయకుంటే ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరసత్వ బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటామని నితీశ్ అంటున్నారు. 370వ అధికరణ, రామాలయ నిర్మాణం వంటి అంశాల్లోనూ ఎన్డీయే వైఖరికి భిన్నంగా నితీశ్ మాట్లాడుతున్నారు. బీజేపీతో తమ మైత్రి కేవలం బిహార్‌కే పరిమితమని, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడుతామని జేడీయూ నేతలు అంటున్నారు. ఎన్నికల విశ్లేషకుడు, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో కలిసి పని చేస్తామని ప్రకటించడమూ బీజేపీని ఇరుకున పెట్టడానికేనంటున్నారు. గొడవల్లేవంటున్న జేడీయూ: ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ఇచ్చిన ఇఫ్తార్ విందులో నితీశ్ పాల్గొనడంపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను జేడీయూ తప్పుపడుతోంది. బీజేపీయే గిరిరాజ్‌తో ఈ పని చేయించిందంటోంది. అయితే, కమలనాథులతో విభేదాల్లేవని జేడీయూ అంటోంది. కీలక అంశాలపై ఎన్డీయే పక్షాల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నామే తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదంటోంది. బీజేపీతో సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని నితీశ్ అంటున్నారు. సొంత ప్రయోజనాలే ముఖ్యం నితీశ్‌కు సొంత ప్రయోజనాలే ముఖ్యమని, దానికోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు వెనుకాడరని విశ్లేషకులు అంటున్నారు. 2005లో బీజేపీతో కలిసి ఆయన బిహార్‌లో లాలూ ప్రసాద్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. కొంతకాలం బీజేపీతో ఆయన స్నేహం నడిచింది. అనంతరం ఎన్డీయేను వీడి 2014 లోక్‌సభ, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తలపడ్డారు. 2017లో తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి రాష్ట్రంలో ఉన్న 40 సీట్లలో 39 సొంతం చేసుకున్నారు. వచ్చే ఏడాది చివర్లో బిహార్ శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అప్పటి దాకా వారి మైత్రి కొనసాగేది అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ నాయకత్వం నుంచి ఎటువంటి స్పందనా వ్యక్తం కాలేదు. -
‘ఆయన చేతిలో మోసపోని వారు ఎవరు లేరు’
పట్నా : బీజేపీ జాగ్రత్తగా ఉండాలని.. త్వరలోనే ఆ పార్టీకి ద్రోహం జరగబోతుందని హెచ్చరించారు రాష్ట్రీయ్ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ. ఈ క్రమంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ నాయకులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ త్వరలోనే దోఖా నం. 2గా మారబోతున్నారు. ఆయన బీజేపీని మోసం చేస్తారు. ప్రజల ఆదేశాన్ని, కూటమి సభ్యులను మోసం చేయడం నితీష్ కుమార్‌కు కొత్తేం కాదు. నితీష్ చేతిలో మోసపోని వారంటూ ఎవరూ లేరు. ఇప్పుడు ఈ సామెత బీజేపీకి వర్తిస్తుంది. త్వరలోనే అతను ఎన్డీఏ కూటమికి ద్రోహం చేస్తాడు’ అని ఉపేంద్ర కుష్వాహ హెచ్చరించారు. గతంలో మేం నితీష్ చేతిలో మోసపోయాం. అందుకే ఇప్పుడు బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం అని తెలిపారు.