రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నా: జగన్ | YS Jaganmohan Reddy meets Nithish kumar in Patna | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నా: జగన్

Published Fri, Dec 13 2013 9:53 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నా: జగన్ - Sakshi

రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నా: జగన్

రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో గురువారమిక్కడ జగన్ సమావేశమై సమైక్యాంధ్రకు మద్దుతు ఇవ్వాల్సిందిగా కోరారు. జగన్ విన్నపానికి నితీష్ సానుకూలంగా స్పందించారు. ఆయనతో చర్చించిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. తమకు మద్దతు ఇచ్చినందుకు నితీష్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలనుకున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఇదే రోజు అంతకుముందు ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి సుర్జీత్ సింగ్ బాదల్లను కలసి మద్దతు కోరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ ఇటీవల జాతీయ నాయకులతో సమావేశమై మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement