
నితీశ్ ప్రమాణ స్వీకారానికి మమత
బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు రానున్నారు.
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు రానున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వచ్చే అవకాశముంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ, మహాకూటమి శాసనసభ పక్ష నేతగా నితీశ్ ఎన్నికయ్యారు. ఈ నెల 20న బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం చేయనున్నారు.