నితీష్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మమత | Mamata Banerjee to attend Nitish Kumar's oath-taking ceremony | Sakshi

నితీష్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మమత

Published Fri, Feb 20 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

నితీష్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మమత

నితీష్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మమత

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

కొల్కత్తా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని నితీష్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని... అందుకు తాను సమ్మతం తెలిపినట్లు తెలిపారు. మరోమారు బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్కు శుభాకాంక్షలు తెలిపినట్లు మమతా బెనర్జీ తెలిపారు. 

ఈ మేరకు మమతా దీదీ ట్విట్ చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం మమతా బెనర్జీ గురువారం బంగ్లాదేశ్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.  బీహార్లో ప్రస్తుత సీఎం మాంఝీ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆదివారం నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement