ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం(జులై 27) జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై ఈ సమావేశంలో పలువురు సీఎంలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో పయనిస్తున్నామన్నారు. వందేళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని(కరోనా) ఓడించామని చెప్పారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో 2047 నాటికి వికసిత్ భారత్ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, తాను మాట్లాడుతుండగా మధ్యలో మైక్ కట్ చేశారని నీతిఆయోగ్ సమావేశం నుంచి వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలిగి వెళ్లిపోయారు. ఎన్డీఏ కీలక భాగస్వామ్యపక్షమైన జేడీయూ నుంచి బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నీతిఆయోగ్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్యకారణాల వల్లనే నితీశ్ రాలేదని జేడీయూ ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment