'మా పనితీరు నచ్చినవారు మాకే ఓటేస్తారు'
పాట్నా: ప్రభుత్వ పనితీరు నచ్చినవారు తమకే ఓటు వేస్తారని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ అన్నారు. బుధవారం బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చిన నేపథ్యంలో నితీష్ స్పందించారు. అక్టోబరులో ఐదు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచడం పాత నిర్ణయమేనని, కొత్తగా తీసుకున్నది కాదని నితీష్ చెప్పారు. జనతా పరివార్ కూటమి నుంచి సమాజ్వాదీ పార్టీ వైదొలగడంపై స్పందిస్తూ.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్కు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ కూటమి గెలుస్తుందనే నమ్మకముందని జేడీయూ నేత శరద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.