పాత నివాసం, కొత్త నివాసం
రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తి రాజప్రాసాదాల్లాంటి ఇళ్లు కట్టుకున్న ఎందరో ప్రజాప్రతినిధులను ఇప్పటిదాకా మనం చూశాం.. కానీ మూడంతస్తుల అధికారిక నివాసాన్ని కేటాయించినందుకే కృతజ్ఞతతో ఓ ఎమ్మెల్యే కన్నీటిపర్యంతం కావడం మీరెప్పుడైనా చూశారా?!! బిహార్‌లో ఎమ్మెల్యే (అలౌలీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తరఫున)గా గెలిచిన రామ్‌వృక్ష్ సదా తాజాగా తన అధికారిక ఇంటి తాళాలను అందుకుంటూ కంటతడి పెడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బిహార్‌లోని అత్యంత పేద ఎమ్మెల్యే అయిన రామ్‌వృక్ష్ ఇప్పటివరకు తన ఐదుగురు కుమారులు, కుమార్తెతో కలసి ఇందిరా ఆవాస్ యోజనలో భాగంగా కట్టిన ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కోసం రాజధాని పట్నాలో నిర్మించిన అధికారిక గృహ సముదాయంలో ఆయనకు సైతం ఇంటిని కేటాయించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా ఇంటి తాళాలు అందుకున్న ఆయన ఈ క్రమంలో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు.
కంటతడి పెట్టారు. ‘పేదవాడు ఏదైనా పొందడం అంటే అది అతనికి దీపావళి పండుగ లాంటిదే.. నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి ఇంట్లో ఉంటానని.. ఇది నాకు దీపావళే’ అని ఎమ్మెల్యే రామ్‌వృక్ష్ పేర్కొన్నారు. ఇటుకల బట్టీలో కూలీగా పనిచేసే ఈయన 1995లో ఆర్జేడీలో చేరారు. 2000లో ఆర్జేడీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన స్థిరాస్తుల విలువ రూ. 70 వేలు!!.
"हम मुसहर समाज से आते हैं!
— Rashtriya Janata Dal (@RJDforIndia) October 27, 2022
मा० @laluprasadrjd जी ने हमें नेता बनाया, MLA बनाया, देश से जोड़ा, आज उसका फल है....
अलौली के जनता मालिक को प्रणाम करते हैं!"
- सुसज्जित सरकारी आवास पाकर मा० MLA श्री रामवृक्ष सदा भावुक हुए।
लालू जी ने ग़रीबों को आवाज़ दी, @yadavtejashwi जी ताकत देंगे! pic.twitter.com/7PUoZR7dfi
(చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు?)
Comments
Please login to add a commentAdd a comment