![Road accident in bihar - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/24/car.jpg.webp?itok=rjpnPQ8o)
పాట్నా : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ వాహనం అదుపుతప్పి స్కూలు బిల్డింగ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 24 మందికి తీవ్ర గాయాలపాలయ్యాయి. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దీనిపై స్పందించి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment