
మీడియాతో మాట్లాడుతున్న అమిత్, నితీశ్
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ, జేడీయూలు సమాన సంఖ్యలో అభ్యర్థులను నిలబెడతాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌డీఏలోని మిగతా భాగస్వామ్య పక్షాలు రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ), ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ)లకు కూడా తగు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పాశ్వాన్, కుష్వాహ ఎన్డీఏలో కొనసాగుతారని స్పష్టం చేశారు. బీజేపీ, జేడీయూలకు 16 చొప్పున సీట్లు, ఎల్‌జేపీ 6, ఆర్‌ఎల్‌ఎస్పీకి 2 సీట్లు దక్కే అవకాశాలున్నట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment