
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్ దిగ్గజం గూగుల్ రైల్‌టెల్‌తో కలిసి దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అస్సాంలోని దిబ్రూగర్‌లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడం ద్వారా 400 స్టేషన్లలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్టయిందని అధికారులు తెలిపారు. లక్షలాది ప్రయాణీకులకు హైస్పీడ్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడం మరుపురాని అనుభవంగా గూగుల్ ఇండియా పార్టనర్‌షిప్స్ డైరెక్టర్ కే. సూరి పేర్కొన్నారు.
2016 జనవరిలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో వైఫై కనెక్టివిటీ కార్యక్రమానికి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో శ్రీకారం చుట్టారు. రైల్‌టెల్ సమకూర్చిన మౌలిక వసతులతో గూగుల్ తన వైర్‌లెస్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ను జోడించి ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment