Railtel Broadband
-
వైఫై ఫ్రీగా ఇస్తే ? ఇదా మీరు చేసే పని!
ఇంటర్నెట్తో ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. జీవితంలో ప్రతీ పనిలో ఇంటర్నెట్ దూరిపోయింది. టికెట్ కొనుగోలు మొదలు ప్రయాణం ముగిసే వరకు ఫోన్లకే అతుక్కుపోతున్నారు జనాలు. మారిన అవసరాల దృష్ట్యా రైల్వేశాఖ సైతం ముఖ్యమైన స్టేషన్లలో 30 నిమిషాల పాటు ఫ్రీగా వైఫై సర్వీసులు రైల్‌టెల్ పేరుతో అందిస్తోంది. ఇలా ఫ్రీగా వచ్చే వైఫై కూడా పాడు పనులకు వినియోగిస్తున్నట్టు తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలతో జాతీయ మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. యూజ్‌ఫుల్‌గా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 30 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంది. ప్రయాణానికి ముందు స్టేషన్‌కి వచ్చిన వారు తాము ప్రయాణించే రైలు వివరాలు, లైవ్ స్టేటస్, పీఎన్ఆర్ స్టేటస్, టికెట్ బుకింగ్ తదితర వివరాలు తెలుసుకునేందుకు, ముఖ్యమైన రీఛార్జ్‌లు చేసుకునేందుకు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో వీటిని ఈ సర్వీసులు అందిస్తున్నారు. కొంత మందికి కాలక్షేపం అవుతుందని అధికారులు భావించారు. స్పీడ్ తక్కువంటూ రైల్వేస్టేషన్లలో వైఫై సర్వీసులు ఆశించిన స్థాయిలో లేవని ముఖ్యంగా నెట్ స్పీడ్ తక్కువగా ఉందంటూ తరచుగా రైల్వేకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఫ్రీ వైఫై వినియోగం తీరును సంబంధించిన డేటాను రైల్‌టెల్ ఇటీవల విశ్లేషించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. తామొకటి తలిస్తే యూజర్ మరొకటి తలుస్తున్నాడనే చేదు నిజం రైల్వేకు అవగతం అయ్యింది. డేటా విశ్లేషణలో వెల్లడైన వాస్తవాలు రైల్వే అధికారులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారింది. ఏకంగా 35 శాతం రైల్వేశాఖ అంచనాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నట్టు తాజా వివరాలు చెబుతున్నాయి. ఫ్రీ వైఫైని ఎక్కువ మంది అశ్లీల కంటెంట్ చూడటానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి వినియోగిస్తున్నట్టు రైల్‌టెల్ తెలిపింది. ఆశ్లీల కంటెంట్‌కు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో కేవలం ఫ్రీగా అందించే 30 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 350 ఎంబీ డేటాను ఖర్చు చేసేస్తున్నారు. ఇలాంటి వారు ఏకకాలంలో పెరిగిపోవడంతో లోడ్ ఎక్కువైపోతున్నట్టు గుర్తించారు. ఫ్రీ వైఫై ట్రాఫిక్‌లో అశ్లీల కంటెంట్ వాటా ఏకంగా 35 శాతం ఉన్నట్టుగా తేలింది. బ్లాక్‌లిస్టులో దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి స్టేషన్లలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ పరధిలో బూతు వీడియోలు రికార్డు స్థాయిలో డౌన్లోడ్ అవుతున్నట్టు తేలింది. రైల్‌టెల్ అందిస్తున్న ఫ్రీ డేటా పథకం ఎలా పక్కదారి పట్టిందో తెలియడంతో... ఈ బూతుకు అడ్డుకట్ట వేసేందుకు అనేక సైట్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. స్టేషన్లలో బూతు భాగోతానికి తెరదించేందుకు మరింత పకబ్బంధీ ప్రణాళిక రూపొందించే పనిలో ఉంది రైల్వేశాఖ. చదవండి: సోషల్ మీడియా పైత్యం.. ‘బైకాట్ ఖతర్ ఎయిర్వేస్’.. -
ఆరు వేల రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వై-ఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి. జార్ఖండ్‌లోని హజారిబాగ్ టౌన్లో శనివారం ఈ సౌకర్యం కల్పించడంతో రైల్వే 6 వేల స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందిస్తున్నట్లు జాతీయ రవాణా సంస్థ తెలిపింది. 2016లో ముంబై రైల్వే స్టేషన్లో మొట్ట మొదట ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిదాన్‌పూర్ స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందించి 5,000 మార్కును అందుకుంది. అలాగే, మే 15 న ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని జరపాడ స్టేషన్‌కు కూడా వై-ఫై సౌకర్యం కల్పించినట్లు ఆదివారం తెలిపింది. "డిజిటల్ ఇండియాలో కార్యక్రమం కిందదేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యం" కల్పిస్తున్నారు. దీని వల్ల గ్రామీణ పట్టణ పౌరుల మధ్య డిజిటల్ అంతరం తగ్గుతుంది. తద్వారా గ్రామాల్లో డిజిటల్ మీద అవగాహన పెరుగుతుంది అని అని రైల్వే శాఖ తెలిపింది. "భారతీయ రైల్వేలు ఇప్పుడు 6,000 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నాయి" అని తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని పీఎస్‌యు రైల్‌టెల్ సహాయంతో రైల్వేలకు ఎటువంటి ఖర్చు లేకుండా స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలు కల్పిస్తున్నారు. గూగుల్, డాట్(యుఎస్ఓఎఫ్ కింద), పీజిసీఐఎల్, టాటా ట్రస్ట్ భాగస్వామ్యంతో ఈ పని చేపట్టినట్లు తెలిపింది. చదవండి: 5.5 కోట్ల యూజర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ -
గుడ్‌న్యూస్ : 4000 రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై
సాక్షి,న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేకు చెందిన బ్రాండ్‌బ్యాండ్, వీపీఎన్ సర్వీసెస్ కంపెనీ రైల్‌టెల్ దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో ఎవరైనా సరే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం ప్రయాణికులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైను 1 ఎంబీపీఎస్ వేగంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వేగవంతమైన లేదా 34 ఎంబీపీఎస్ వేగం వరకు ఇంటర్నెట్ కోసం వినియోగదారులు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5 జీబీ డేటా చార్జీ రూ.10, 10 జీబీకి రూ.15 చార్జీ, అలాగే ఐదు రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ చార్జీ రూ.20, 20 జీబీ చార్జీ రూ.30గా ఉన్నాయి. 10 రోజుల వ్యాలిడిటీతో 20 జీబీ చార్జీ రూ.40, 30 జీబీకి రూ.50, అదేవిధంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే 60 జీబీకి రూ.70 చార్జీలున్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణమైన ప్లాన్స్‌ను ఎంచుకునేలా రూపొందించామని రైల్‌టెల్ సీఎండీ పునీత్ చావ్లా తెలిపారు. -
ఇది చేస్తే రైల్వే స్టేషన్లలో ఎంతైనా వైఫై వాడొచ్చు
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేకు చెందిన బ్రాండ్‌బ్యాండ్, వీపీఎన్ సర్వీసెస్ కంపెనీ రైల్‌టెల్ దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్ టైమ్‌పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో ఎవరైనా సరే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం ప్రయాణికులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైను 1 ఎంబీపీఎస్ వేగంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వేగవంతమైన లేదా 34 ఎంబీపీఎస్ వేగం వరకు ఇంటర్నెట్ కోసం వినియోగదారులు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5 జీబీ డేటా చార్జీ రూ.10, 10 జీబీకి రూ.15 చార్జీ, అలాగే ఐదు రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ చార్జీ రూ.20, 20 జీబీ చార్జీ రూ.30గా ఉన్నాయి. 10 రోజుల వ్యాలిడిటీతో 20 జీబీ చార్జీ రూ.40, 30 జీబీకి రూ.50, అదేవిధంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే 60 జీబీకి రూ.70 చార్జీలున్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణమైన ప్లాన్స్‌ను ఎంచుకునేలా రూపొందించామని రైల్‌టెల్ సీఎండీ పునీత్ చావ్లా తెలిపారు. -
400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ రైల్‌టెల్‌తో కలిసి దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అస్సాంలోని దిబ్రూగర్‌లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రారంభించడం ద్వారా 400 స్టేషన్లలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్టయిందని అధికారులు తెలిపారు. లక్షలాది ప్రయాణీకులకు హైస్పీడ్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావడం మరుపురాని అనుభవంగా గూగుల్ ఇండియా పార్టనర్షిప్స్ డైరెక్టర్ కే. సూరి పేర్కొన్నారు. 2016 జనవరిలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో వైఫై కనెక్టివిటీ కార్యక్రమానికి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో శ్రీకారం చుట్టారు. రైల్‌టెల్ సమకూర్చిన మౌలిక వసతులతో గూగుల్ తన వైర్లెస్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ను జోడించి ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. -
ముంగిట్లో మరో రికార్డు!
- సంపూర్ణ డిజిటల్ వైపు సిద్దిపేట అడుగులు - దేశంలోనే తొలి నియోజకవర్గంగా గుర్తింపు! - ఇప్పటికే 70 గ్రామాల్లో నెట్వర్క్ - మరో 30 గ్రామాల్లో ప్రక్రియకు చర్యలు - రైల్‌టెల్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు భేటీ సిద్దిపేట జోన్: సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకు నేందుకు అడుగు వేసింది. దేశంలోనే తొలి సంపూర్ణ డిజిటల్ అసెంబ్లీ నియోజకవర్గంగా సిద్దిపేటను చరిత్ర పుటల్లో నిలిపేందుకు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వందశాతం హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం ఉన్న నియోజకవర్గంగా జిల్లా రికార్డు సృష్టించనుంది. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్‌టెల్ అధికారులు శనివారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుతో చర్చించారు. అక్కన్న పేట, కరీంనగర్ రైల్వేస్టేషన్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గానికి 160 కిలోమీటర్ల మేరకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని విస్తరించే చర్యలు పూర్తయినట్లు రైల్‌టెల్ సంస్థ దక్షిణాది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ.శ్రీకాంత్ మంత్రికి వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజల కోసం ఒక ఉచిత వైఫై సెంటర్‌ను ఏర్పాటు చేయను న్నారు. రైల్‌టెల్ నెట్ వర్క్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు వేగవంతం చేస్తామని, ఇప్పటికే 70 గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించామని, మిగతా 30 గ్రామాలను త్వరితగతిన పూర్తి చేసి వంద గ్రామాలకు రైల్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. నెలలోగా వందశాతం గ్రామాలకు సౌకర్యం అమల య్యేలా చూడాలని మంత్రి హరీశ్‌రావు వారికి సూచించినట్లు సమాచారం. రైల్‌టెల్ అధికార యంత్రాంగం చేస్తున్న కృషిని అయన ప్రశంసించారు. మండల పరిషత్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో లైవ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ కోసం సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. త్వరలో కలెక్టర్ నేతృత్వంలో రైల్‌టెల్ నిపుణులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తానని, ప్రతిష్టాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గంలో వందశాతం బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థను అమలు చేసేందుకు జరుగుతున్న ప్రక్రియను వేగవంతం చేయాలని సమీక్షలో మంత్రి సూచించినట్లు తెలిసింది.