ముంగిట్లో మరో రికార్డు!
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజల కోసం ఒక ఉచిత వైఫై సెంటర్‌ను ఏర్పాటు చేయను న్నారు. రైల్‌టెల్ నెట్ వర్క్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు వేగవంతం చేస్తామని, ఇప్పటికే 70 గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించామని, మిగతా 30 గ్రామాలను త్వరితగతిన పూర్తి చేసి వంద గ్రామాలకు రైల్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. నెలలోగా వందశాతం గ్రామాలకు సౌకర్యం అమల య్యేలా చూడాలని మంత్రి హరీశ్‌రావు వారికి సూచించినట్లు సమాచారం.
రైల్‌టెల్ అధికార యంత్రాంగం చేస్తున్న కృషిని అయన ప్రశంసించారు. మండల పరిషత్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో లైవ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ కోసం సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. త్వరలో కలెక్టర్ నేతృత్వంలో రైల్‌టెల్ నిపుణులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తానని, ప్రతిష్టాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గంలో వందశాతం బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థను అమలు చేసేందుకు జరుగుతున్న ప్రక్రియను వేగవంతం చేయాలని సమీక్షలో మంత్రి సూచించినట్లు తెలిసింది.