
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నూతన కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియమితులయ్యారు. గూగుల్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా ఇటీవల పదోన్నతి పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఆమె చేరారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలను వినియోగదారులందరికీ అందించడం, ఆవిష్కరణలను పెంపొందించేందుకు వ్యూహాన్ని రూపొందించడంలో ప్రీతి కీలకపాత్ర పోషిస్తారని గూగుల్ సోమవారం ప్రకటించింది.
‘జీ–టెక్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన ప్రీతి ఇప్పుడు గూగుల్ ఇండియా విక్రయాలు, కార్యకలాపాల వ్యవహారాలకు నేతృత్వం వహిస్తారు. ‘ఇది భారత్ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కంపెనీ నిబద్ధతను పెంచుతుంది’ అని తెలిపింది. గూగుల్‌కు ముందు ఆమె నాట్‌వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఏఎన్‌జెడ్ గ్రిండ్‌లేస్ బ్యాంక్‌లలో నాయకత్వ స్థానాల్లో విధులు నిర్వర్తించారు. భారత్‌లోని విభిన్న మార్కెట్లలో వ్యాపార వ్యూహం, ఉత్పత్తి నిర్వహణ, కార్యాచరణ వంటి అంశాలలో నైపుణ్యం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment