
2007లో టీ20 ప్రపంచకప్ గెలిన భారత జట్టు
భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు మేనేజర్‌గా పనిచేసిన సునీల్ దేవ్(75) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గరువారం తుది శ్వాస విడిచారు. గతంలో సునీల్ దేవ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సునీల్ దేవ్ బీసీసీఐ సబ్ కమిటీలలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా తన సేవలు అందించారు.
ముఖ్యంగా ఆయన 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా వ్యవహరించారు. 2007 టీ20 ప్రపంచకప్‌ను ధోని సారధ్యంలోని భారత జట్టు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 1996లో దక్షిణాఫ్రికా పర్యటన, 2014 ఇంగ్లండ్ టూర్‌లో కూడా ఆయన టీమిండియాకు మేనేజర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Virat Kohli: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచారు! ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! జడ్డూను చూశారా?