టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్‌కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.
ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.
తిప్పేసిన స్పిన్నర్లు..
అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ
Comments
Please login to add a commentAdd a comment