Team India Victory Parade Live Updates:
విశ్వవిజేతలకు ఘన సత్కారం.. 125 కోట్ల ప్రైజ్ మనీ
వాంఖడేలో టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన భారత జట్టును బీసీసీఐ ఘనంగా సత్కరించింది. వేలాది మంది అభిమానుల మధ్య భారత ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించింది. భారత జట్టుకు 125 కోట్ల ప్రైజ్ మనీని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా అందజేశారు.
ఇక భారత ఆటగాళ్లు ట్రోఫీని పట్టుకుని మైదానం మొత్తం తిరిగారు. అభిమానులకు అభివాదం చేస్తూ టీమిండియా ప్లేయర్లు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా టీ20లకు విడ్కోలు పలికిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
"2011 వరల్డ్‌కప్ విజయం తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న నా సీనియర్ల భావోద్వేగాలతో నేను కనెక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తోంది. ఈ 15 ఏళ్లలో రోహిత్ ఇంతలా ఎమోషన్ అవ్వడం ఇదే తొలిసారి. ఇక బుమ్రా ఒక అద్బుతం. టోర్నీలో విజయం సాధించడంలో అతడిదే కీలక పాత్ర. అటువంటి ఆటగాడు భారత తరపున ఆడటం మనందరి అదృష్టం"- భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి
"మమ్మల్ని స్వాగతించడానికి అభిమానులు భారీగా తరలి రావడం చాలా సంతోషంగా ఉంది. వారు కూడా మా లాగే టైటిల్ కోసం ఎన్నో ఏళ్ల ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు అన్పించింది. భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు"- భారత కెప్టెన్ రోహిత్ శర్మ
సందడి చేస్తున్న భారత ప్లేయర్లు..
వాంఖడేలో భారత ఆటగాళ్లు డ్యాన్స్‌లు ఇరగదీస్తున్నారు. మరి కాసేపట్లో విశ్వవిజేలతకు సన్మానం జరగనుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Virat, Rohit, Hardik and others are dancing their hearts out 🔥🔥🔥🔥#T20WorldCup pic.twitter.com/UAWjL89Wxa
— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024
ముగిసిన విక్టరీ పరేడ్..
విశ్వవిజేతల విక్టరీ పరేడ్ ఘనంగా ముగిసింది. భారత జట్టు వాంఖడే స్టేడియంకు చేరుకుంది. భారత ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వగానే స్టేడియం అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది.
జేజేలు కొడుతున్న ఫ్యాన్స్..
జనసముద్రం మధ్య టీమిండియా విక్టరీ పరేడ్ కొనసాగుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ కలిసి వరల్డ్‌కప్‌ను పట్టుకుని ఫ్యాన్స్‌కు చూపించారు. దీంతో అభిమానులు రోహిత్ , విరాట్ అంటూ జేజేలు కొడుతున్నారు.
కొనసాగుతున్న టీమిండియా విజయోత్సవ యాత్ర
టీమిండియా విజయోత్సవ యాత్ర కొనసాగుతోంది. అభిమానుల నీరాజనాల మధ్య బస్ ముందుకు కొనసాగుతోంది. ఈ పరేడ్ వాంఖడే స్టేడియం వరకు జరగనుంది.
ప్రారంభమైన టీమిండియా విక్టరీ పరేడ్
ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్ ప్రారంభమైంది. నారిమన్ పాయింట్ నుంచి భారత జట్టు విజయోత్సవ యాత్ర ప్రారంభమైంది. ఓపెన్ టాప్ బస్‌లో భారత ఆటగాళ్లు ట్రోఫీతో అభిమానులకు అభివాదం చేస్తున్నారు.
విజయోత్సవ యాత్ర కాస్త ఆలస్యం
టీమిండియా విజయోత్సవ యాత్ర కాస్త ఆలస్యం కానుంది. ముంబైలో భారీ వర్షం కురుస్తుండండతో ఆటగాళ్లు ఇంకా హోటల్ గదులకే పరిమితమయ్యారు. అదేవిధంగా భారత ఆటగాళ్ల ఎక్కాల్సిన పరేడ్ బాస్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. పోలీస్‌లు తీవ్రంగా శ్రమించి నారిమన్ పాయింట్ వద్దకు బస్స్‌ను తీసుకువచ్చారు.
టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్ భారత జట్టుకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ముంబైలో అడుగుపెట్టిన భారత జట్టు హోటల్‌కు చేరుకుంది. ముంబై వీధుల్లో భారత ఆటగాళ్ల ఓపెన్ బస్ పరేడ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.
క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది. తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment