టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచి 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన భారత జట్టుకు మరో జాక్ పాట్ తగిలింది. విశ్వవిజేత టీమిండియాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.
భారత విన్నింగ్ టీమ్‌లో సభ్యులైన కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలు ముంబై చెందిన క్రికెటర్లన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ నలుగురిని శుక్రవారం విధాన్ భవన్ (స్టేట్ లెజిస్లేచర్ కాంప్లెక్స్) సెంట్రల్ హాల్‌లో సీఎం ఏక్‌నాథ్ షిండే సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా పాల్గోనున్నారు.
ఈ సందర్భంగానే నగదు బహుమతిని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో అద్బుత క్యాచ్‌ను అందుకున్న సూర్యకుమార్ యాదవ్‌ను షిండే ప్రత్యేకంగా అభినందించారు. కాగా జగజ్జేత నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ సైతం రూ. 120 కోట్ల భారీ ప్రైజ్‌మనీ అందించింది.
Comments
Please login to add a commentAdd a comment