T20 WC: ‘క్రికెటర్లకు క్యాష్‌ రివార్డు.. మరి నాకేం దక్కింది?’ | Thomas Cup Equivalent To World Cup Chirag Shetty Blasts Maharashtra Govt | Sakshi
Sakshi News home page

T20 WC: ‘క్రికెటర్లకు క్యాష్‌ రివార్డు.. మరి నాకేం దక్కింది?’

Published Mon, Jul 8 2024 7:06 PM | Last Updated on Mon, Jul 8 2024 7:35 PM

Thomas Cup Equivalent To World Cup Chirag Shetty Blasts Maharashtra Govt


మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ చిరాగ్‌ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెటర్లకు పెద్ద పీట వేసే షిండే సర్కారు.. తనలాంటి క్రీడాకారులను మాత్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించాడు.

క్రీడాకారుల పట్ల ఇలాంటి వివక్ష తగదని.. అందరినీ సమానంగా చూడాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు చిరాగ్‌ శెట్టి విజ్ఞప్తి చేశాడు. కాగా భారత క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2024 చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

వెస్టిండీస్‌ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో జయభేరి మోగించి ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి రాగానే ఘన స్వాగతం లభించింది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే మైదానంలో విజయోత్సవాలు నిర్వహించిన బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానాను అందించింది.

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో నలుగురు ముంబై ఆటగాళ్లు ఉండటం విశేషం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా టీ20 స్టార్లు సూర్యకుమార్ యాదవ్‌, యశస్వి జైస్వాల్‌, శివం దూబేలు టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యులు.

వరల్డ్‌కప్‌ విజేతలకు రూ. 11 కోట్ల నజరానా
ఈ నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఈ నలుగురిని తన నివాసంలో ప్రత్యేకంగా సన్మానించారు. శాలువాలు కప్పి.. వినాయకుడి ప్రతిమలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయింది.

అదే విధంగా.. వరల్డ్‌కప్‌ విజేతలకు రూ. 11 కోట్ల నజరానా కూడా ప్రకటించారు మహా సీఎం. ఈ నేపథ్యంలో చిరాగ్‌ శెట్టి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

క్రికెటర్లకు క్యాష్‌ రివార్డు.. మరి నాకేం దక్కింది?
‘‘బ్యాడ్మింటన్‌లో థామస్‌ కప్‌.. క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచిన దానికంటే తక్కువేం కాదు. థామస్‌ కప్‌ ఫైనల్లో ఇండోనేషియాను ఓడించి టైటిల్‌ గెలిచిన భారత జట్టులో నేను సభ్యుడిని.

అంతేకాదు కప్‌ గెలిచిన జట్టులో ఉన్న ఏకైక మహారాష్ట్ర క్రీడాకారుడిని. వరల్డ్‌కప్‌ గెలిచిన క్రికెట్‌ స్టార్లను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సంతోషం.

కానీ నాలాంటి ఆటగాళ్ల శ్రమను కూడా గుర్తిస్తే బాగుంటుంది. క్రీడలన్నింటికీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వాలి. క్రికెటర్లను సత్కరించడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు.

అంతెందుకు బ్యాడ్మింటన్‌ ప్లేయర్లందరం కూడా టీవీలో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చూశాం. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలవడం పట్ల గర్వపడుతున్నాం.

అయితే, గత రెండేళ్ల కాలంలో నేను కూడా గుర్తుంచుకోదగ్గ.. చిరస్మరణీయ విజయాలు సాధించాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం నన్ను కనీసం అభినందించలేదు.

ఎలాంటి క్యాష్‌ రివార్డు కూడా ప్రకటించలేదు. 2022 కంటే ముందు భారత బ్యాడ్మింటన్‌ జట్టు కనీసం సెమీస్‌ చేరిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది మేము ఏకంగా టైటిల్‌ గెలిచాం. అయినా తగిన గుర్తింపు కరువైంది’’ అని చిరాగ్‌ శెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్‌
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ ఈ బ్యాడ్మింటన్‌ స్టార్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా చిరాగ్‌ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డితో కలిసి బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అంతేకాదు ప్రఖ్యాత థామస్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్‌ సాధించాడు. సాత్విక్‌సాయిరాజ్‌తో కలిసి ఫ్రెంచ్‌ ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గెలిచాడు. 

అదే విధంగా.. మలేషియన్‌ సూపర్‌ 750, ఇండియా సూపర్‌ 750 ఫైనల్స్‌ చేరాడు. తదుపరి ఈ జోడీ ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.

చదవండి: ‘నేను డకౌట్‌ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement