Preeti
-
గూగుల్ ఇండియా మేనేజర్‌గా ప్రీతి
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నూతన కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియమితులయ్యారు. గూగుల్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా ఇటీవల పదోన్నతి పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఆమె చేరారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలను వినియోగదారులందరికీ అందించడం, ఆవిష్కరణలను పెంపొందించేందుకు వ్యూహాన్ని రూపొందించడంలో ప్రీతి కీలకపాత్ర పోషిస్తారని గూగుల్ సోమవారం ప్రకటించింది. ‘జీ–టెక్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన ప్రీతి ఇప్పుడు గూగుల్ ఇండియా విక్రయాలు, కార్యకలాపాల వ్యవహారాలకు నేతృత్వం వహిస్తారు. ‘ఇది భారత్ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కంపెనీ నిబద్ధతను పెంచుతుంది’ అని తెలిపింది. గూగుల్‌కు ముందు ఆమె నాట్‌వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ బ్యాంక్‌లలో నాయకత్వ స్థానాల్లో విధులు నిర్వర్తించారు. భారత్‌లోని విభిన్న మార్కెట్లలో వ్యాపార వ్యూహం, ఉత్పత్తి నిర్వహణ, కార్యాచరణ వంటి అంశాలలో నైపుణ్యం సాధించారు. -
ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా...
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ముగ్గురు కాదు... నలుగురు కాదు... ఏకంగా పదిహేను మందికి పైగా కొత్త కథానాయికలు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. ‘ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా..’ అన్నట్లు గత ఏడాదితో పోల్చితే 2024లో ఎక్కువమంది తారలు పరిచయం అయ్యారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారల గురించి తెలుసుకుందాం.ఒకే సినిమాతో దీపిక... అన్నా బెన్ బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపికా పదుకోన్. గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్‌తో తెలుగు ఎంట్రీ ఇచ్చారామె. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్. డాటర్ ఆఫ్ శ్రీదేవి దివంగత ప్రముఖ తార శ్రీదేవి తెలుగు వెండితెర, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీలో నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్నుంచి జాన్వీ తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలషించారు. వీరి నీరిక్షణ ‘దేవర’ సినిమాతో ఫలించింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో తంగమ్ పాత్రలో నటించారామె. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదలైంది. అలాగే ఇదే సినిమాతో నటి శ్రుతీ మరాఠే కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో దేవర పాత్రకు జోడీగా శ్రుతి, వర పాత్రకు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. భాగ్యశ్రీ బిజీ బిజీ పరభాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు, తొలి సినిమాకే వారి పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు. కానీ తన తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని తన పాత్ర జిక్కీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమాలో ఓ కమర్షియల్ హీరోయిన్ రోల్ భాగ్యశ్రీకి దక్కింది. తెరపై మంచి గ్లామరస్‌గా కనిపించారు. భాగ్యశ్రీ నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె దుల్కర్ సల్మాన్, రామ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భాగ్యశ్రీ బిజీ. తెలుగు తెరపై మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ (2017) మానుషీ చిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ కమాండర్ రోల్లో నటించారు మానుషి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హీరో వరుణ్ తేజ్‌కు హిందీలో తొలి సినిమా కాగా, మానుషీకి తెలుగులో తొలి సినిమా. సోనీ పిక్చర్స్, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. ఎప్పుడో కాదు... ఇప్పుడే! గత ఏడాది తెలుగులో అనువాదమైన కన్నడ చిత్రాలు ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. అప్పట్నుంచి రుక్ష్మిణి వసంత్ ఫలానా తెలుగు సినిమా సైన్ చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ సడన్‌గా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే జరిగిపోయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలైంది. కాగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోని హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్‌కు దక్కిందని తెలిసింది. ఒకేసారి మూడు సినిమాలు ఓ హీరోయిన్ కెరీర్‌లోని తొలి మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల్వడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్ నయన్ సారికకు ఇది సాధ్యమైంది. అనంద్ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల్లో నయన్ సారిక హీరోయిన్గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘ఆయ్, ‘క’ సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలవగా, ‘గం గం గణేషా’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో నటించారు కన్నడ బ్యూటీ తన్వీ రామ్. తన్వీ ఓ లీడ్ రోల్లో నటించిన తొలి తెలుగు సినిమా ‘క’. ఈ చిత్రం అక్టోబరులో విడుదలైంది. ఇటు తెలుగు... అటు తమిళం తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాదే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రీతీ ముకుందన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక కెవిన్ హీరోగా చేసిన ‘స్టార్’తో ఇదే ఏడాది తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ ఆమె హీరోయిన్గా చేస్తున్నారు. ఇంకా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో సిరీ లెల్లా, సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ, నవదీప్ ‘లవ్ మౌళి’తో పంఖురి గిద్వానీ, ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’తో సంయుక్తా విశ్వనాథన్, సాయిరామ్ శంకర్ ‘వెయ్ దరువెయ్’తో యషా శివకుమార్, చైతన్యా రావు ‘షరతులు వర్తిస్తాయి’తో భూమి శెట్టి, అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రముఖ నటుడు జానీ లివర్ వారసురాలు జేమీ లివర్ (ఓ కీలక పాత్రతో..) తదితరులు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్
తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈమెది హైదరాబాద్. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది.(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)చాన్నాళ్ల క్రితం క్రిష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ ఇప్పుడు ప్రీతి చల్లాని పెళ్లి చేసుకోవడంతో వాటికి ఎండ్ కార్డ్ పడింది. అలానే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన క్రిష్‌కి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.పవన్‌తో 'హరిహర వీరమల్లు' సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండేసరికి తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
Preeti: పనిమనిషి కావాలా... ఆస్క్కు చెప్పండి!
సాక్షి, సిటీబ్యూరో: ఏ ఇంట చూసినా ఇంతి పని అంతా ఇంతాకాదు. పొద్దుతో ఆమె పోటీ పడుతోంది. ఉద్యోగ జీవనంలో ఇంటిపని, వంటపనికి అదనంగా ఇప్పుడు ఆమెకు ఆఫీస్ పని తోడైంది. లివింగ్ కాస్ట్, ఇతర ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో భార్యాభర్తలు జాబ్ చేస్తేనే, అనుకున్న లైఫ్‌ను లీడ్ చేయొచ్చని చాలామంది భావిస్తున్నారు. మహిళాసాధికారత పెరిగిన తర్వాత భర్తతోపాటు భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. అదనపు పని, అదనపు ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆమెకు పనిమనిషి అవసరం చాలా ఏర్పడింది. హైటెక్‌సిటీ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో పనిమనుషులకు చాలా డిమాండ్ ఉంది. ఎంతగా అంటే ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఖాళీగా లేము అనేంతగా..! ఇలాంటి సమస్యకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వినూత్న పరిష్కారం చూపుతున్నారు. ‘ఆస్క్ లో’పేరుతో వాట్సాప్ వేదికగా ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఇలా నలుగురికి సాయపడేందుకు ప్రయతి్నస్తున్నారు.పనిమనుషులు, వంటవారు, డ్రైవర్లు కావాలనుకుంటే.. ‘ఆస్క్ లో’వాట్సాప్‌కు మెసేజ్ పెడితే చాలు, మీకు కావాల్సిన పని చిటికెలో అయిపోతుందని చెబుతున్నారు. మీ మెసేజ్ పనిమనుషులు, డ్రైవర్లకు వెళ్తుంది. అది కూడా వాయిస్ రూపంలో తెలుగులో ఆటోమాటిక్‌గా పంపిస్తారు. మీకు కావాల్సిన సమయంలో వాళ్లు ఖాళీగా ఉంటే తాము వస్తామని తిరిగి మెసేజ్ చేస్తారు. అయితే అప్పటివరకే కాకుండా పూర్తిస్థాయిలో కూడా ఏ టైమ్‌కు రావాలో కూడా మాట్లాడుకుని పనికుదుర్చుకోవచ్చు. ఇలా పనిమనుషులు, డ్రైవర్లకు పని దొరకడంతోపాటు అవసరం ఉన్న ఉద్యోగులకు కూడా మేలు జరుగుతోంది. రెండు పారీ్టల నడుమ మధ్యవర్తి లేకుండా నేరుగా వారే మాట్లాడుకునే వీలుంది.మహిళలకు ఉపయోగంగా ఉంటుందని..రాజస్థాన్‌కు చెందిన ప్రీతి 20 ఏళ్ల కింద హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. 10 ఏళ్ల నుంచి సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. నిత్యజీవితంలో ఎదురైన అనుభవాలు ఈ స్టార్టప్ ఏర్పాటు చేసేందుకు దోహదపడ్డాయని ప్రీతి పేర్కొన్నారు. ఎప్పటి నుంచో సామాన్యులకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదని, అది ఈ వేదిక ఏర్పాటుతో నెరవేరిందని ప్రీతి చెబుతున్నారు. అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా ఈ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. పైగా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారికి అప్లికేషన్స్ వెబ్సైట్ వాడటం రాకపోవచ్చు. అందుకే అలాంటివారికి సులువుగా పనిదొరికే విధంగా ఈ ప్లాట్ఫారం ఉపయోగపడుతుందని వివరించారు.సేవా దృక్పథంతో..సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సేవలను అందిస్తున్నా. భవిష్యత్తులో సేవలు మరింత మందికి అందించాలని భావిస్తున్నా. ఇప్పుడు నేను నివసిస్తున్న గచ్చిబౌలి ప్రాంతంలో మాత్రమే అందిస్తున్నా. చాలామంది ఈ సేవలను మెచ్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాస్త ఇబ్బంది అయినా వారి ప్రశంసలతో ముందుకు వెళ్లాలనే ఆకాంక్ష పెరుగుతోంది. – ప్రీతి, ఆస్క్ లో, వ్యవస్థాపకురాలు -
పారదర్శకతే సరైన మార్గం
-
పారదర్శకతే సరైన మార్గం
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు వరసపెట్టి లీక్ అవుతున్న తరుణంలోనే ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఎంపిక వ్యవహారం బద్దలై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైరైన ప్రీతి సుదాన్కు సంస్థ సారథ్యం అప్పగించారు. ఆమె యూపీఎస్సీని చక్కదిద్దుతారన్న నమ్మకం అందరిలోవుంది.సాధారణంగా ప్రశ్నపత్రాల లీక్ ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడల్లా యూపీఎస్సీని అందరూ ఉదాహరణగా చూపేవారు. దాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికేవారు. అలాగని యూసీఎస్సీపై అడపా దడపా ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నట్టు చూపటం, తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు దాఖలుచేయటం వంటి మార్గాల్లో అనర్హులు సివిల్ సర్వీసులకు ఎంపికవు తున్నారన్న ఆరోపణలు అధికం. ఫలితాల ప్రకటనలో ఎడతెగని జాప్యం సరేసరి. అయితే వీటికిసంతృప్తికరమైన సంజాయిషీలు రాలేదు. పరీక్ష నిర్వహణ మాటెలావున్నా ధ్రువీకరణ పత్రాల తనిఖీకి ఆ సంస్థ పకడ్బందీ విధానాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో క్రమంలో పొరపాట్లు చోటుచేసుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. వెనువెంటనే ఆరా తీసి సరిదిద్దుకుంటే అవి పునరావృతమయ్యే అవకాశాలు ఉండవు. విమర్శలు, ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ తక్షణం స్పందించే లక్షణం ఉండాలంటే జవాబుదారీతనం, పారదర్శకత తప్పని సరి. అవి లోపించాయన్నదే యూపీఎస్సీపై ప్రధాన ఫిర్యాదు. ఒకపక్క అభ్యర్థులకు నైతిక విలువల గురించి ప్రశ్నపత్రం ఇస్తూ అలాంటి విలువలు సంస్థలో కిందినుంచి పైవరకూ ఉండటంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గుర్తించకపోతే అంతిమంగా న ష్టం కలిగేది సంస్థకే. పూజ గురించిన వివాదాలు సామాజిక మాధ్యమాల్లో బయటికొచ్చాక ఇప్పటికే సర్వీసులో చేరిన కొందరిపై ఆరోపణలు వెల్లు వెత్తాయి. కాళ్లకు సంబంధించి అంగ వైకల్యం ఉన్నట్టు చూపి ఉద్యోగం పొందారంటూ ఒక అధికారి వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన నిక్షేపంగా ఉండటమేగాక సైక్లింగ్, రన్నింగ్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఆయన నిజంగానే అలాంటి తప్పుడు పత్రంతో చేరారా లేక ఆ అధికారిపై బురద జల్లారా అనేది తెలియదు. తక్షణం స్పందించే విధానం రూపొందించుకుంటే తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకునే వీలుంటుంది. లేదా సంబంధిత అధికారినుంచి సంజాయిషీ కోరే అవ కాశం ఉంటుంది. రెండూ లేకపోతే ఎవరికి తోచినవిధంగా వారు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. యూపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోజ్ సోనీ రాజీనామా ఉదంతంలో కూడా సక్రమంగా వ్యవహరించలేదు. నిరుడు మే 16న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోనీ అయిదేళ్ల కాల వ్యవధికి చాలా చాలా ముందే ఎందుకు తప్పుకున్నారు? చూసేవారికి స్పష్టంగా పూజ ఎంపిక వ్యవహారం తక్షణ కారణంగా కనబడుతుంది. కానీ ఆ సంస్థ అదేం కాదంటోంది. ‘వ్యక్తిగత కార ణాలే’ అని సంజాయిషీ ఇస్తోంది. అటు కేంద్రం సైతం ఏమీ మాట్లాడదు. దీనివల్ల ప్రజల్లో అనుమా నాలు తలెత్తితే... మొత్తంగా అది సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయదా? అభ్యర్థులు తాము బాగా రాసినా అక్కడేదో జరిగిందన్న అపోహలుపడే పరిస్థితి తలెత్తదా? అసలు ఇలాంటివి జరుగుతున్నాయన్న నమ్మకాలు బలపడితే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకూ, ఆ తర్వాత ఇంటర్వ్యూలకూ హాజరు కాగలరా? నూతన సారథి ఈ అంశాలపై ఆలోచన చేయాలి. పూజ ఉదంతంలో కోల్పోయిన విశ్వసనీయతను పెంపొందించుకోవటానికి ఏమేం చర్యలు అవసరమన ్న పరిశీలన చేయాలి. అభ్యర్థుల మదింపు విషయంలో అనుసరించే విధానాల గురించి... ముఖ్యంగా వారి జవాబుపత్రాల దిద్దుబాటుకూ, ఆ తర్వాత జరిగే ఇంటర్వ్యూలో అభ్యర్థులిచ్చే జవాబుల ద్వారా వారి శక్తియుక్తు లనూ, సామర్థ్యాన్ని నిర్ధారించే పద్ధతులకూ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారో తెలపాలి. చదువుల్లో, సమస్యలను విశ్లేషించే సామర్థ్యంలో మెరికల్లా ఉండటం, సమాజంలో అపరిష్కృతంగా మిగిలిపోతున్న అంశాల విషయంలో ఏదో ఒకటి చేయాలన్న తపన, తాపత్రయంఉండటం, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించటం సివిల్ సర్వీసుల అభ్యర్థులకు అవసరమని చాలా మంది చెబుతారు. నిజానికి ఈ సర్వీసుల్లో పనిచేసేవారి జీతభత్యాలకు అనేక రెట్లు అధికంగా సాఫ్ట్వేర్ రంగంలో లేదా వ్యాపారాల్లో మునిగితేలేవారు సంపాదిస్తారు. అందుకే ఎంతో అంకిత భావం ఉండేవారు మాత్రమే ఇటువైపు వస్తారు. కానీ అలాంటివారికి యూపీఎస్సీ ధోరణి నిరాశ కలిగించదా? నీతిగా, నిజాయితీగా పాలించటం చేతకాని పాలకుల ఏలుబడిలో పనిచేయాల్సి వచ్చి నప్పుడు సర్వీసులో కొత్తగా చేరిన యువ అధికారులు ఎంతో నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. అసలు యూపీఎస్సీయే నిర్లక్ష్యం లోనికో, నిర్లిప్తత లోనికో జారుకుంటే ఎవరిని నిందించాలి? పూజా ఖేడ్కర్‌కు సంబంధించి ఇంకా దోష నిర్ధారణ జరగలేదు. ప్రస్తుతం ఆమె కేవలం నిందితురాలు మాత్రమే. పునః శిక్షణకు రావాలన్న సూచనను బేఖాతరు చేయటంతో ఇప్పటికే యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క పోలీసులూ, యూపీఎస్సీ నియమించిన కమిటీ ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై ఆరా తీస్తున్నారు. ఆమె ముందస్తు బెయిల్ దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆమె దుబాయ్‌కి పరారీ అయ్యారన్న కథనాలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఉదంతంలోనైనా జరిగిందేమిటో వివరిస్తే, ఇది పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలేమిటో చెబితే యూపీఎస్సీపై విశ్వసనీయత పెరుగుతుంది. దాని ప్రతిష్ఠ నిలబడుతుంది. -
ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..!
లిమా (పెరూ): ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి ప్రీతిస్మిత భోయ్ మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.మహిళల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఒడిశాకు చెందిన 15 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 133 కేజీలు (క్లీన్ అండ్ జెర్క్‌లో 76 కేజీలు+స్నాచ్‌లో 57 కేజీలు) బరువెత్తి విజేతగా నిలిచింది. మూడు విభాగాల్లో (క్లీన్ అండ్ జెర్క్+స్నాచ్+టోటల్) వేర్వేరుగా పతకాలు అందించగా... ఈ మూడింటిలోనూ ప్రీతిస్మిత అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలను సొంతం చేసుకుంది.40 కేజీల విభాగంలోనే పోటీపడ్డ భారత లిఫ్టర్ జోష్నా సబర్ రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 45 కేజీల విభాగంలో పాయల్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో బాబూలాల్ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి -
అకటా... నడిబజార్లో లక లక లక
‘కంటెంట్ క్రియేటర్లు తలుచుకుంటే వైరల్‌కు కొదవా!’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీడియో వైరల్ చేయడానికి వారు చిత్రవిచిత్రములు చేయగలరని మరోసారి నిరూపించిన వైరల్ వీడియో ఇది.ప్రీతీ థాపాఅనే క్రియేటర్ చంద్రముఖి గెటప్‌లో డ్యాన్స్ చేసింది. ఇందులో వింతేముంది అనిపించవచ్చు. అయితే ప్రీతి డ్యాన్స్ చేసింది స్టేజీ మీద కాదు. ఇంట్లో కాదు. ఏకంగా అస్సాంలోని గువాహటి చౌరస్తాలో.ఈ వీడియోకు వచ్చిన విశేష ఆదరణ చూసి సంతోషంతో.... ‘గయ్స్, మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు రావడం లేదు’ అని స్పందించింది ప్రీతి.‘మీకు సంతోషంతో మాటలు రాక΄ోవడం సరే, మాకు మాత్రం షాక్‌తో నోట మాట రాలేదు. రోడ్డుపై డ్యాన్స్ ఏమిటీ!’ అని వెక్కిరించారు కొందరు నెటిజనులు.‘మీ డ్యాన్స్ స్కిల్స్ సంగతి ఎలా ఉన్నా ముందు ట్రాఫిక్ రూల్స్‌ను ΄ాటించడం నేర్చుకోండి’ అని కొందరు సలహా ఇచ్చారు. -
Preeti Rajak: సుబేదార్ ప్రీతి
ఆర్మీలో మొదటిసారి ఒక మహిళ ‘సుబేదార్’ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యింది. రెండేళ్ల క్రితం ఆర్మీలో హవల్దార్‌గా చేరిన ప్రీతి రజక్ తన క్రీడాప్రావీణ్యంతో ఆసియన్ గేమ్స్‌లో ట్రాప్ షూటర్‌గా సిల్వర్ మెడల్ సాధించింది. దేశవ్యాప్తంగా యువతులను ఆర్మీలో చేరేలా ఆమె స్ఫూర్తినిచ్చిందని ఆమెకు ఈ గౌరవం కల్పించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రీతి రజక్ ఆర్మీలో ‘సుబేదార్’ ర్యాంక్‌కు ప్రమోట్ అయ్యింది. ఆర్మీలో ‘సుబేదార్’ అనిపించుకోవడం చిన్న విషయం కాదు. ‘సిపాయి’ నుంచి మొదలయ్యి ‘లాన్స్ నాయక్’, ‘నాయక్’, ‘హవల్దార్’, ‘నాయబ్ సుబేదార్’... ఇన్ని దశలు దాటి ‘సుబేదార్’ అవుతారు. ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్ 1992లో మొదలయ్యాక సంప్రదాయ అంచెలలో ఒక మహిళ సుబేదార్‌గా పదవి పొందటం ఇదే మొదటిసారి. ఆ మేరకు ప్రీతి రజక్ రికార్డును నమోదు చేసింది. ట్రాప్ షూటర్‌గా ఆసియన్ గేమ్స్‌లో ఆమె చూపిన ప్రతిభను గుర్తించిన ఉన్నత అధికారులు ఆమెను ఈ విధంగా ప్రోత్సహించి గౌరవించారు. ► లాండ్రీ ఓనరు కూతురు ఇరవై రెండేళ్ల ప్రీతి రజక్ది మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురం. దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లాండ్రీషాపు నడుపుతాడు. తల్లి సామాజిక సేవలో ఉంది. ముగ్గురు అక్కచెల్లెళ్లలో రెండవ సంతానమైన ప్రీతి చిన్నప్పటి నుంచీ ఆటల్లో చురుగ్గా ఉండేది. క్రీడలంటే ఆసక్తి ఉన్న తండ్రి తన కూతుళ్లను శక్తిమేరకు క్రీడాకారులు చేయదలిచి ప్రోత్సహించాడు. అలా ప్రీతి షూటింగ్‌లోకి వచ్చింది. భోపాల్‌లోని స్పోర్ట్స్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రీతి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. పతకాలు సాధించింది. దాంతో ఆర్మీలో స్పోర్ట్స్ కోటాలో మిలటరీ పోలీస్ డివిజన్లో నేరుగా 2022లో హవల్దార్ ఉద్యోగం వచ్చింది. ► ఏ సాహసానికైనా సిద్ధమే ఆర్మీలో చేరినప్పటి నుంచి ప్రీతి ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్టుగా పనిచేస్తూ పై అధికారుల మెప్పు పొందింది ప్రీతి. షూటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలంటే ఖర్చుతో కూడిన పని. కాని ఆర్మీలో చేరాక ఆమెకు శిక్షణ మరింత సులువైంది. అందుకు కావలసిన గన్స్ ఆమెకు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇక చైనాలో జరిగిన 2023 ఆసియన్ గేమ్స్‌లో షార్ట్ పిస్టల్ విభాగంలో ప్రీతి రజత పతకం సాధించడంతో ఆర్మీ గౌరవంతో పాటు దేశ గౌరవమూ ఇనుమడించింది. ‘నేటి యువతులు ఇళ్లల్లో కూచుని ప్రతిభను వృథా చేయొద్దు. ఇంటినుంచి బయటకు రండి’ అని ప్రీతి ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. దాంతో చాలామంది అమ్మాయిలు ఆర్మీలో చేరడానికి ఉత్సాహం చూపారు. ఇది పై అధికారులకు మరింతగా సంతోషం కలిగించడంతో జనవరి 28, 2024న ఆమెకు సుబేదార్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ► పారిస్ ఒలింపిక్స్‌కు ఈ సంవత్సరం జూలైలో పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం తేవడానికి ప్రీతికి ఆర్మీ వారే శిక్షణ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహౌలోని ‘ఆర్మీ మార్క్స్‌మెన్‌షిప్ యూనిట్’ (ఏ.ఎం.యు.)లో ప్రీతికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతూ ఉంది. జాతీయ స్థాయిలో మహిళా ట్రాప్ షూటింగ్లో విభాగంలో ఆరవ ర్యాంక్‌లో ఉంది ప్రీతి. ఆమె గనక ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఆర్మీలో ఆమెకు దొరకబోయే ప్రమోషన్ మరింత ఘనంగా గర్వపడే విధంగా ఉంటుంది. -
ఆర్మీలో తొలి మహిళా సుబేదార్‌గా ప్రీతి
న్యూఢిల్లీ: ట్రాప్ షూటర్‌గా అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణి, ఆర్మీ హవాల్దార్ ప్రీతీ రజక్ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో సుబేదార్‌గా పదోన్నతి సాధించి, ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. 19వ ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్లో వెండి పతకం సాధించి ఛాంపియన్ ట్రాప్ షూటర్‌గా పేరొందిన ప్రీతీ 2022లో సైన్యంలో చేరారు. కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో హవాల్దార్‌గా విధుల్లో చేరారు. ఇలా చేరిన తొలి క్రీడాకారిణి కూడా ఆమే! ట్రాప్ విమెన్ ఈవెంట్ విభాగంలో ప్రీతి దేశంలో ఆరో ర్యాంకర్. పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్ కోసం ఆర్మీ మార్క్‌మ్యాన్‌షిప్ యూనిట్లో శిక్షణ పొందుతున్నారు. -
కన్నప్పలో కథానాయికగా..
కన్నప్పలో భాగమయ్యారు ప్రీతీ ముకుందన్. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రభాస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ న్యూజిల్యాండ్‌లో జరుగుతోందని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రీతీ ముకుందన్‌ను ఎంపిక చేసినట్లు గురువారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘ప్రీతికి ఇది తొలి సినిమా. ‘కన్నప్ప’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుంది. నాట్య కళలో ప్రీతికిప్రావీణ్యం ఉంది. ‘కన్నప్ప’లో ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. -
కాంగ్రెస్ కార్పొరేటర్ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు
బోడుప్పల్: కాంగ్రెస్ పార్టీ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు చామకూర ప్రీతిరెడ్డి వచ్చారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన దానగల్ల అనిత బీఆర్ఎస్లో చేరగా, వారం రోజుల క్రితం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి కలిసి మళ్లీ బీఆర్ఎస్లో చేరాలని కోరారు.. తమను బీఆర్ఎస్లో చాలా ఇబ్బందులకు గురి చేశారని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఇంటికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రలోభపెడుతున్నారని వాదించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారికి ఓట్లు వేయవద్దంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి ప్రీతిరెడ్డి కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అడ్డుకున్న వారిలో కాంటెస్ట్డ్ కార్పొరేటర్ రాపోలు ఉపేందర్, నాయకులు చెంచల నర్సింగ్‌రావు, గోపు రాము, జయేందర్‌రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. -
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా ప్రీతి
ఈనెల 29 నుంచి డిసెంబర్ 10 వరకు చిలీలో జరిగే జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హరియాణాకు చెందిన ప్రీతి కెపె్టన్‌గా వ్యవహరించనుంది. భారత జట్టు: ప్రీతి (కెప్టెన్), రుతుజా (వైస్ కెప్టెన్), ఖుష్బూ, మాధురి కిండో (గోల్‌కీపర్లు), నీలమ్, జ్యోతి, రోప్ని కుమారి, మహిమా టెటె, మంజూ చోర్సియా, జ్యోతి ఛత్రి, హీనా బానో, సుజాత కుజుర్, సాక్షి రాణా, ముంతాజ్ ఖాన్, అన్ను, దీపిక సోరెంగ్, మోనిక టొప్పో, సునెలితా. రిజర్వ్: నిరూపమా దేవి, ఈదుల జ్యోతి. -
భార్యను కడతేర్చి.. ఐదేళ్ల కూతురితో..
సాక్షి, నిజామాబాద్: ఖలీల్‌వాడి నగరంలోని సూర్యనగర్‌లో భార్యను భర్త శనివా రం రాత్రి గొంతునులిమి హత్యచేశాడు. హత్య చేసిన తర్వాత ఐదేళ్ల కూతురితో కలిసి నిందితుడు నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపునకు చెందిన ప్రీతి(26)ని, బోధన్‌కు చెందిన ప్రవీణ్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నగరంలోని సూర్యనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శనివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ప్రవీణ్ కోపంతో ప్రీతి గొంతునులిమి హత్య చేశాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. అంత కుముందే నిందితుడు ప్రవీణ్ తన కూతురుతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా సంఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ నరహరి పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రీతి అమ్మమ్మ నాయకోటి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రీతి కేసు.. సైఫ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత!
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ధరావత్ ప్రీతి(26) సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేఎంసీ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ పై సస్పెన్సన్‌ను ఎత్తేశారు. హైకోర్టు ఆదేశంతో సైఫ్ పై సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డా. మోహన్ దాస్ ప్రకటించారు. దీంతో.. తరగతులకు హాజరు అయ్యేందుకు సైఫ్‌కు అనుమతి లభించినట్లయ్యింది. డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే.. ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 22 న ఎంజీఎంలో ఆమె ఆత్మహత్యా యత్నం చేయగా.. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ 26వ తేదీన కన్నుమూసింది. మరోవైపు ప్రీతి మృతికి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ఆమె పేరెంట్స్.. పోలీసులకు, కళాశాల ప్రిన్సిపల్ కు పిర్యాదు చేశారు. ర్యాగింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రింద కేసు నమోదు చేసి సైఫ్ ను రిమాండ్ తరలించిన పోలీసులు. మరోవైపు కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ కేసు తీవ్రంగా పరిగణించింది. ఏడాదిపాటు సైఫ్ తరగతులకు హాజరు కాకుండా సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో.. బెయిల్‌పై సైఫ్ ఈ విడుదల అయ్యాడు కూడా. అయితే.. తన నుంచి వివరణ తీసుకోకుండానే కాలేజీ తనపై సస్పెన్షన్ వేటు వేసిందని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు సైఫ్. ఈ క్రమంలోనే.. సైఫ్ వివరణ తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. అయితే.. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని గత శుక్రవారం సైఫ్ కు నోటీస్ ఇచ్చారు కేఎంసీ ప్రిన్సిపాల్. కానీ, ఆ సమావేశానికి సైఫ్ హాజరు కాలేదు. దీంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రిన్సిపాల్. అయితే.. ప్రస్తుతానికి సస్పెన్షన్ ను తాత్కాలికంగా నిలిపివేసి సైఫ్‌ను తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల తర్వాత అతని వివరణ తీసుకోవాలని.. ఆపై యాంటీ ర్యాగింగ్ కమిటీదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఆదేశాల మేరకు సైఫ్ సస్పెన్సన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు కేఎంసీ ప్రిన్సిపాల్. -
ప్రకృతే ‘ప్రీతి’పాత్రం
కరీంనగర్: తన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవరాశుల గురించే అద్భుతమైన కవితలు రాస్తున్న కరీంనగర్‌కు చెందిన ప్రీతి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నోబల్ అవార్డుకు ఎంపికైంది. ఇండియన్ నోబల్ సోసైటీ కౌన్సిల్ ద్వారా బుధవారం అవార్డును స్వీకరించింది. జగిత్యాలలో జన్మించిన ప్రీతి తండ్రి విజయకుమార్ ఎస్బీఐలో బ్యాంక్ ఉద్యోగి కాగా తల్లి సౌజన్య గృహణి. ప్రీతి ఇంటర్ సమయంలో కరీంనగర్‌లోని బ్యాంక్‌కాలనీలో స్థిరపడ్డారు. స్కూల్ సమయంలో తన చుట్టూచూస్తున్న ప్రకృతిపై కవితలు రాయడం ప్రారంభించింది. తరువాత ఫేస్బుక్లో, అనంతరం పుస్తకాలు రాసి ఇండియాతో పాటు మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్ కాిపీరైట్స్ సంపాదించింది. 2019లో నెకెడ్‌లవ్, 2021లో సోలిటస్‌సోల్స్ అనే కవితల సంపుటిని సొంతంగా రాసి విడుదల చేసింది. 2020లో పెటెల్స్ అనే కవిత పుస్తకం రాయడంలో తన సహకారం అందించింది. పలు దేశాల్లో తన పుస్తకాలు అమ్మకాలు జరిగాయి. ప్రీతి రచనలు హైదరాబాద్‌లోని రైట్‌క్లబ్‌లో రెండో బహుమతి సాధించగా 2021లో ఢిల్లీలోని బుక్ ఫెయిర్‌కు ఎంపికై ంది. అమెరికాలోని పోయమ్‌హంటర్‌తో పాటు హెలో పొయోట్రీలలో ఆన్లైన్ ద్వారా పంపించి మంచి ప్రతిభ కనిబరించి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. తాను రాసిన మూడు కవిత సంపుటాలకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. -
ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే ప్రధాన కారణం : సీపీ రంగనాథ్
-
మెడికో ప్రీతి కేసు: కోర్టులో పోలీసులకు చుక్కెదురు!
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో సంచలనంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసు విషయమై కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. ప్రీతి మృతికి కారకుడిగా పేర్కొన్న నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు అతడిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. మరో నాలుగు రోజుల పాటు సైఫ్‌ని కస్టడీలో ఉంచేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ రెండు రోజులు వాయిదా పడింది. బుధవారం విచారించిన కోర్టు పోలీసుల పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతిది హత్యా, ఆత్మహత్యా తేల్చుకోలేక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. చదవండి: ప్రీతి కేసు: కోర్టుకు సైఫ్.. డీజీపీ ఆఫీసుకు ప్రీతి పేరెంట్స్ -
ప్రీతి కేసు ఎటువైపు? ఇంకెన్ని రోజులు?
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి కేసులో స్పష్టత కొరవడింది. ఆత్మహత్యనా? ఇతరత్రా ఏమైనా జరిగిందా? అనే అనుమానంపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావడం లేదు. ఓ వైపు ప్రీతిది హత్యేనంటూ ఆమె కుటుంబ సభ్యులు వాదిస్తుండగా.. ఇంకోవైపు టాక్సికాలజీ రిపోర్టు అధికారికంగా పోలీసులు వెల్లడించలేదు. అయితే.. ఎఫ్ఎస్ఎల్(Forensic Science Laboratory) రిపోర్టు వస్తేనే స్పష్టమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తుండడమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది. దీంతో కేసు చిక్కుముడి వీడేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో అని ఎదురు చూస్తున్నారంతా. మరోవైపు నిందితుడైన ఎం.ఎ.సైఫ్‌ను 4 రోజులు కస్టడీలో విచారించిన మట్టెవాడ పోలీసులు.. మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేయడంతో నిందితుడిని ఖమ్మం జైలుకు తరలించారు. ఇంకా క్లారిటీ రాలేదా? ప్రీతితో గొడవకు దారితీసిన పరిస్థితులతోపాటు ఆమెను వేధించడానికి ఎవరెవరి సహాయాన్ని తీసుకున్నాడన్న దానిపై నిందితుడు సైఫ్‌ను పోలీసులు ప్రశ్నించారు. టెక్నికల్ డేటాను కూడా సైఫ్ ముందుంచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. విష రసాయనాలు ఏమీ తీసుకోలేదని టాక్సికాలజీ రిపోర్టు చెబుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సైఫ్‌ను మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరులో పిటిషన్ వేశారు. ఈ 4 రోజుల కస్టడీలోనూ సైఫ్ పోలీసులకు చెప్పిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో మళ్లీ కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. కీలకంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రీతి కేసులో వేధింపులు, ర్యాగింగ్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించినా ఇప్పటికీ త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా టాక్సికాలజీ రిపోర్టులో ఏ విష రసాయనం తీసుకున్నట్టు లేదని నివేదిక వచ్చిందని చక్కర్లు కొడుతున్న వార్తలతో అసలు ప్రీతిది ఆత్మహత్య కాదా...మరేమైనా జరిగిందా అనే దిశగా పోలీసు విచారణ మారినట్టు తెలిసింది. ప్రీతి ఆత్మహత్య కేసును కాస్త అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎఫ్ఎల్ఎస్ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. -
వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి టాక్సికాలజీ రిపోర్ట్
-
ప్రీతిది ముమ్మాటికీ హత్యే
కొడకండ్ల: పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై కుటుంబసభ్యులతోపాటు తమ పార్టీ ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిరి్నతండాలో ప్రీతి కుటుంబసభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తప్పులేకపోతే ప్రీతి ఘటనపై ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. సీనియర్ విద్యార్థి సైఫ్‌ను కాపాడేందుకే ప్రభుత్వం డ్రామాలాడుతోందని, కేసును పక్కదారి పట్టించే యత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రీతి మతికి కారకులైన వారికి కఠినశిక్ష పడే వరకు ఆమె కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గిరిజన కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, కుటుంబసభ్యులను బెదిరించి మృతదేహాన్ని ఎత్తుకెళ్లే నీచానికి కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని దుయ్యబట్టారు. నేడు నిరసన దీక్ష.. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు దీక్ష చేపడతానని బండి సంజయ్ వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్ పాల్గొన్నారు. సంజయ్‌ను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి బండి కాన్వాయ్‌ను పంపించారు. కాగా, ప్రీతి మృతికి సంతాపంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కొవ్వొతుల ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. పీఆర్సీ ఏర్పాటు చేయాలంటూ సీఎంకు లేఖ సాక్షి, హైదరాబాద్: వెంటనే వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జూలై 1 నుంచి పెంచిన జీతాలు చెల్లించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. అలాగే బీఆర్ఎస్ ఎన్నికల హామీలైన రుణమాఫీ, ఉచిత యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూపంపిణీ వంటి వాటì అమలుకు రానున్న కేబినెట్ భేటీలో నిధులు కేటాయించాలన్నారు. -
ప్రీతి కేసు: ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ కన్నుమూసింది మెడికో ధరావత్ ప్రీతి(26). ఈ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రీతి మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా.. ఆ నివేదిక ఇప్పుడు వరంగల్ పోలీసులకు చేరింది. ప్రీతి ఉదంతంలో ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంజెక్షన్లతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత చికిత్స అందించిన వైద్యులు ప్రకటించారు. అయితే.. ప్రీతి తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని, ఎవరో ఇంజెక్షన్లు చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్‌లను సైతం వరంగల్ పోలీసులు తెప్పించుకున్నారు. ఇక ఫోరెన్సిక్ నివేదికలో ఏం ఉంది, పోలీసులు ఏం ప్రకటిస్తారనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించగా.. ఈ నివేదిక ఆధారంగా స్పష్టమైన ప్రకటనతో అనుమానాలకు తెర దించనున్నారు వరంగల్ పోలీసులు. సాక్షి, వరంగల్: మరోవైపు.. మెడికో ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. మొత్తం 9 మంది అందించిన కీలక ఆధారాలతో నిందితుడు సైఫ్ ను విచారిస్తున్నారు ఏసీపీ బోనాల కిషన్. రెండు రోజుల విచారణలో కీలకాంశాలే సేకరించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో 27 స్క్రీన్ షాట్స్, మెసేజ్‌లను.. సాంకేతిక ఆధారాలను సరిపోల్చుతూ సైఫ్‌ను విచారిస్తున్నారు. కస్టడీ గడువు ముగిసేలోపు నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు. -
ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య ఘటనపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్య అంటే కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనే మిస్టరీని ఛేదించాల్సి ఉంది. ఆ సమయంలోనే ప్రీతి కుప్పకూలి ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పుడు అక్కడ ఎవరెవరున్నారనేది పోలీసుల విచారణలో తేలినా సాంకేతిక దర్యాప్తులోనూ అనుమానమున్న వ్యక్తులు అక్కడేమైనా ఉన్నారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 24న నిందితుడైన సెకండియర్ విద్యార్థి సైఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన సమయంలో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఉన్న వివరాలు ఎన్నో అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే... ♦ గత డిసెంబర్లో ఓ ప్రమాద కేసులో రోగి గైడ్ వైర్ విషయంలో సైఫ్ ప్రీతిని వేధించాడు. ఫిబ్రవరిలో హనుమకొండలోని మెటర్నిటీ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్నప్పుడూ ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్ట్స్ (పీఏసీ) రాయమన్నాడు. దాన్ని ప్రీతి రాశాక, వాట్సాప్ గ్రూప్‌లో ఆ నివేదికను పోస్టు చేసి ఇది ఎవరు రాశారంటూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి ప్రీతి స్పందిస్తూ ‘నాతో ఏమైనా సమస్య ఉంటే హెచ్ఓడీ లేదంటే జీఎంహెచ్ ఇన్చార్జికి ఫిర్యాదు చేయ్’ అని సైఫ్‌కు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టింది. లేదంటే ఇదే విషయాన్ని హెచ్ఓడీకి చెబుతాననడంతో కోపోద్రిక్తుడైన సైఫ్ ఆమెను మరింత వేధించాలనుకున్నాడు. ♦ హెచ్ఓడీకి సైఫ్‌పై ఫిర్యాదు చేసేందుకు మద్దతివ్వాలని స్నేహితులు, సహచరులను ప్రీతి కోరింది. తన ప్రవర్తన మారకపోతే అందరినీ వేధిస్తాడని చెప్పింది. ♦ ఈ నెల 21న అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకు వేధింపులపై వచ్చిన సమాచారంతో అదేరోజు 11 గంటలకు సైఫ్‌ను పిలిపించి మాట్లాడారు. ప్రీతిని ఎందుకు వేధిస్తున్నావు, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ తర్వాత ప్రీతిని పిలిచి ఇద్దరూ ఒకేచోట డ్యూటీ చేయొద్దన్నారు. ఎంజీఎం కాకుండా అంతకుముందు డ్యూటీ వేసిన ఆస్పత్రిలోనూ చేసుకోవచ్చన్నారు. ♦ ప్రీతి అదేరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీఎంలో వి ధులకు హాజరైంది. స్టాఫ్ నర్సు మండె విజయలక్ష్మి, సె కండియర్ స్టూడెంట్ డాక్టర్ భీమని మనీశ్, థర్డ్ ఇయర్ హౌస్ సర్జన్ డాక్టర్ రూహితో కలిసి విధులు నిర్వర్తించింది. 22న ఉదయం 5 నుంచి 7 గంటల వరకు జరిగిన అపరేషన్‌లో పాల్గొంది. ఆ తర్వాత అనస్తీషి యా పీజీ రూమ్ లోకి వెళ్లింది. 7.15 నిమిషాలకు స్టాఫ్ నర్సు విజయలక్ష్మి అక్కడికెళ్లగా కిందపడి ఉన్న ప్రీతిని చూసింది. ప్రీతికి డాక్టర్ రూహి, డాక్టర్ భీమని మనీశ్ చికిత్స అందించారు. తేలాల్సినవెన్నో... ♦ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి క్లాస్‌మెట్స్, సీనియర్ విద్యార్థులకు తెలిసినా ఆమె సహాయం కోరినప్పుడు వారు ఎందుకు మద్దతివ్వలేదు. ప్రీతి క్లాస్మేట్ అనూషకు వాట్సాప్ ద్వారా ప్రీతికి సపోర్ట్ చేయొద్దంటూ సైఫ్ వ్యక్తిగతంగా పెట్టిన మెసేజ్ పోలీసులకు లభ్యమైంది. ప్రీతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనూ ఈ వైద్య విద్యారి్థనులంతా సైఫ్‌కు అనుకూలంగా ఆందోళన చేయడం వివాదాస్పదమైంది. విద్యార్థులు సీనియర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, తమ కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని వెనకడుగు వేశారా అన్నది తేలాలి. ♦ ప్రీతి కార్డియాక్ అరెస్ట్ వల్ల కుప్పకూలిందని, పీఏసీ రిపోర్టు విషయంలోనే సైఫ్ గట్టిగా మాట్లాడాడని, వేధింపులు, ర్యాగింగ్ లేవని బుధవారం నాడే ఎంజీఎం, కేఎంసీ ఉన్నతాధికారులు ఎందుకు ప్రకటించారు? సైఫ్ ర్యాగింగ్, వేధింపులు చేశాడని కౌన్సెలింగ్‌లో ఒప్పుకున్నా ఈ మాటల్ని వీరెందుకు చెప్పలేదు? ♦ ట్యాక్సికాలాజి రిపోర్టు వెల్లడించినా ఆమె ఇంజక్షన్ తీసుకుందా అన్నది పోలీసులు తేల్చాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్ సీరియస్
-
ముగిసిన ప్రీతి అంత్యక్రియలు
కొడకండ్ల/దేవరుప్పుల: వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి రెవెన్యూ పరిధిలోని గిర్నితండాలో సోమవారం ముగిశాయి. ధరావత్ నరేందర్, శారదల మూడో కూతురైన ప్రీతి గత బుధవారం కాలేజీ సీనియర్ సైఫ్ వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఐదు రోజులపాటు హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందిన ఆమె ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం ఉదయం 6:30 గంటలకు గిర్నితండాకు తెచ్చారు. ప్రీతి మృతదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అంతిమయాత్రలో మంద కృష్ణమాదిగ, బీజేపీ, గిరిజన సంఘాల నాయకులు పాడె మోశారు. ఆ తరువాత గిరిజన సంప్రదాయ పద్ధతిలో వారి వ్యవసాయ భూమిలో ఖననం చేశారు. ప్రీతికి పలువురి నివాళి ప్రీతికి గ్రామస్తులతోపాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ ఎల్.లక్ష్మీనారాయణనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండి శ్రీధర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు నివాళులర్పించారు. ప్రీతి మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలంటూ బీజేపీ నాయకులు గిర్నిబావితండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ గాంధీఆస్పత్రి: ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించగా, మృతదేహాన్ని గాంధీమార్చురీకి తరలించే క్రమంలో కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో ఆదివారం రాత్రి నుంచి గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీసంఖ్యలో మోహరించారు. ఆస్పత్రిలోకి మీడియాను అనుమతించలేదు. రోగులు, రోగి సహాయకులను ధ్రువీకరణ పత్రం చూపించాకే ఆస్పత్రిలోకి అనుమతించారు. అర్ధరాత్రి 1.46 గంటలకు ప్రీతి మృతదేహం గాంధీ మార్చురీకి వచ్చింది. ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కృపాల్‌సింగ్ నేతృత్వంలో వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. అనంరతం వేకువజాము 4.15 గంటలకు ప్రత్యేక అంబులెన్స్‌లో స్వగ్రామానికి ప్రీతి మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతదేహాం గాంధీ మార్చురీకి వచ్చినప్పటి నుంచి పోస్టుమార్టం పూర్తయి అంబులెన్స్‌లో తరలించేంత వరకు వీడియో చిత్రీకరించారు. ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా ఆందోళనలు సాక్షి నెట్వర్క్: ప్రీతి మరణానికి కారకులైన సైఫ్, కేఎంసీ కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కేఎంసీ ఎదుట ఏబీవీపీ నాయకులు, ఎంజీఎం జంక్షన్లో బీజేపీ, ఐద్వా నాయకులు ఆందోళనలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి సైఫ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ములుగులో ఎల్‌హెచ్‌పీఎస్, డీవైఎఫ్ఐ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంతోపాటు నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి తదితర మండలాల్లో ఏబీవీపీ, వీహెచ్‌పీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఏఐబీఎస్ఎస్, మహిళా కాంగ్రెస్, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కఠినంగా శిక్షించాలి ప్రీతి తండ్రి నరేందర్ తన బిడ్డలాగా మరొకరికి జరగకూడదని ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ రోదిస్తూ చెప్పారు. నిందితుడు సైఫ్‌తోపాటు కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వపరంగా రూ.10 లక్షలతోపాటు మంత్రి దయాకర్‌రావు సొంతంగా రూ.20 లక్షలు ఇచ్చి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. -
గుండెలు పగిలేలా రోదిస్తున్న ప్రీతి తల్లిదండ్రులు
జనగామ: నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన మెడికో విద్యార్థి ప్రీతి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. మరొకవైపు ప్రీతికి కడసారి వీడ్కోలు పలికేందుకు స్థానికులు తరలివస్తున్నారు. కొడకండ్ల మండలం గిర్ని తండాలో ప్రీతి భౌతికకాయానికి నేడు అంత్యక్రయలు జరుగనున్నాయి. తమతో పాటు తిరిగే కూతురు ఇలా విగత జీవిలా పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు దుఃఖం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ప్రీతి తండ్రి నరేందర్ శోకతప్ప హృదయంతో తమ కూతుర్ని హత్యే చేశారంటూ విలపిస్తున్నారు. ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని తండ్రి నరేందర్ గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ప్రీతి మృతదేహాన్ని బలవంతంగా గిర్ని తండాకు తరలించారని, బోడుప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్తామన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఆమె ఏం తీసుకుందో ఇప్పటి వరకు నిర్థారణ కాలేదు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలి. మరొకరు ప్రీతిలా మారకుండా ఉండాలంటే వేధింపులకు పాల్పడిన సైఫ్ పై ఉరితీయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడిను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. బంధుమిత్రులు వచ్చాక మద్యాహ్నం అంతిమయాత్ర చేపడుతాం.’ అని తండ్రి నరేందర్ తెలిపారు. మరొకవైపు ప్రీతి మృతి చెందడానికి సైఫ్ ఒక్కడే కాదు ఇంకా కొందరి ప్రేమయం ఉందని ఆమె సోదరి ఆరోపించింది. తనకు తానుగా మత్తు ఇంజక్షన్ తీసుకోలేదు.. కొందరు పట్టుకుంటే, సైఫ్ ఇంజక్షన్ చేశాడు. నలుగుర్ని ఎదురించే బలం కూడా ప్రీతికి లేదు. అంటూ ప్రీతి సోదరి పేర్కొన్నారు. -
TS: నేడు వైద్య కళాశాలల బంద్!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ వేధింపులతో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా సోమవారం వైద్య కళాశాలల బంద్‌కు ఏబీవీపీ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నంపై.. వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్ సాధారణమని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. కాగా, డాక్టర్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆల్ తెలంగాణ ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ఒక ప్రకటనలో కోరారు. -
ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. ప్రీతి మృతి బాధాకరమని, ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారని వివరించారు. దోషులు ఎంతటి వారైనా సరే చట్టప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. ప్రీతి ఘటన బాధాకరం: మంత్రులు ప్రీతి మృతి అత్యంత బాధాకరమని, ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం శక్తివంచన లేకుండా ప్రయత్నించిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా.. ప్రీతి మృతి బాధాకరమని, ఆమె కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కౌశిక్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దారుణం : బండి సంజయ్ ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని, ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రీతి మరణం బాధాకరమన్నారు. ‘‘ఈ దారుణ ఘటనపై సీఎం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? మీరిచ్చే రూ.10 లక్షల సాయం ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే సీఎం స్పందించలేదా? కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది’’అని విమర్శించారు. విచారణకు రేవంత్ డిమాండ్ ప్రీతి మరణంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ప్రీతి మరణానికి గల కారణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి 9.10 గంటలకు ఆమె తుదిశ్వస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ప్రీతికి చికిత్స అందించిన నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆమె మృతి చెందిన విషయాన్ని చెప్పేందుకు తల్లిదండ్రులను ఐసీయూలోకి రావాలని వైద్యులు సూచించారు. కానీ ప్రీతి ఎలా చనిపోయిందన్న విషయాన్ని చెప్పాలని అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని తేల్లి చెప్పారు ఆమె తల్లిదండ్రులు. హెచ్వోడిపై కేసు నమోదు చేయాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తనని లోపలికి అనుమతించడం లేదని ప్రీతి సోదరుడు వాపోయారు. ఐసీయూ వద్ద ప్రీతి తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతోంది. అయితే కాసేపట్లో ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రీతి మరణవార్త విన్న తెలియడంతో ఆమె గ్రామంలో ఆందోళనకు దిగారు గ్రామస్థులు. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వపరంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్ట చేశారు. -
మెడికో ప్రీతి కన్నుమూత.. మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని
సీనియర్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన మెడికల్ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) కన్నుమూసింది. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రాణాలు విడిచినట్టు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. దీనితో ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పాలని, నిందితుడు సైఫ్, కాకతీయ మెడికల్ కాలేజీ అనస్తీíÙయా విభాగం హెడ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు చేపట్టేదాకా మృతదేహాన్ని తరలించబోమంటూ నిమ్స్ వద్ద ఆందోళనకు దిగారు. దీనితో ఆదివారం అర్ధరాత్రి తర్వాతా నిమ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలేం జరిగింది? జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిరి్నతండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శారద, ముగ్గురు కుమార్తెలు పూజ, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే వారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వలస వచ్చారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రీతి.. 2022 నవంబర్ 18న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. థియట్రికల్ క్లాస్‌లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించాలి. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి సైఫ్ ఆమెపై వేధింపులకు దిగాడు. దీనిపై ప్రీతి తండ్రి నరేందర్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనస్తీíÙయా విభాగాధిపతి నాగార్జునరెడ్డి సమక్షంలో గత మంగళవారం (21వ తేదీన) ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్యూటీలో ఉండగానే అపస్మారక స్థితికి.. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రీతి.. రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సల్లో పాల్గొంది. బుధవారం తెల్లవారుజామున తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజెక్షన్ కావాలని స్టాఫ్ నర్సును అడిగింది. అయితే ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యుల గదిలో ప్రీతి అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని తోటి వైద్యులు గమనించారు. గుండెపోటుకు గురైందని గుర్తించి, సీపీఆర్‌తో గుండె పనిచేసేలా చేసి.. చికిత్స ప్రారంభించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉండటంతో.. ఉన్నతాధికారులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రీతిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే తొలుత ట్రెమడాల్ ఇంజక్షన్ ఓవర్‌డోస్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు భావించారు. అయితే ప్రీతి అపస్మారక స్థితిలో కనిపించిన గదిలో సక్సినైల్‌కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ వాయిల్స్ దొరికాయి. దీంతోపాటు ప్రీతి గూగుల్‌లో సక్సినైల్‌కోలిన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మందు తీసుకుందన్నది తేల్చేందుకు ఆమె బ్లడ్ శాంపిల్స్‌ను ట్యాక్సికాలజీ పరీక్షలకు పంపారు. ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే.. వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేస్తూ, గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు. నిమ్స్‌కు చేరుకున్న తర్వాత ఆమెకు పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో ఐదుగురు ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. హానికర ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిన్నాయని (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్), మెదడుపైనా ప్రభావం పడిందని గుర్తించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు ఐదు రోజులపాటు అన్ని విధాలా ప్రయతి్నంచారు. కానీ ఫలితం లేకపోయింది. రిమాండ్‌లో ఉన్న నిందితుడు ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి సైఫ్‌పై వరంగల్ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైతే మెడికల్ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రీతి ఘటనపై ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇప్పటికే విచారణ నివేదికను డీఎంఈకి పంపింది. ప్రీతి బాధ చెప్పుకొన్న ఆడియో కలకలం ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు రోజు ప్రీతి తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ..సైఫ్ తనను వేధిస్తున్న విషయాన్ని వివరించింది. తనలాంటి చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడని.. సీనియర్లు అంతా ఒకటేనని వాపోయింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే తనకు నేర్పించకుండా దూరం పెడతారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం బయటపడిన ఆడియో కలకలం రేపింది. అవయవాలన్నీ దెబ్బతినడంతోనే.. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించిందని, అయినా ఫలితం లేకపోయిందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రీతి డ్యూటీలో ఉండగా తన వద్ద ఉన్న సక్సినైల్‌కోలైన్ ఇంజక్షన్ తీసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని, ఆస్పత్రికి తీసుకొచి్చన తర్వాత వెంటిలేటర్‌పై, ఎక్మో యంత్రంపై అత్యవసర వైద్యసేవలు అందించామని తెలిపారు. మొత్తంగా ఆమె నాలుగు సార్లు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)కు గురైందని, అందులో నిమ్స్‌కు రాకముందే రెండుసార్లు వచ్చిందని వివరించారు. ప్రీతి తీసుకున్న మత్తు ఇంజక్షన్ కారణంగా గుండె రక్తం పంప్ చేసే సామర్థ్యం (ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ హార్ట్) 28శాతానికి పడిపోయిందని.. గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటిస్, ఊపిరితిత్తుల సమస్య ఏర్పడినట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ప్రీతి అప్పటికే థైరాయిడ్, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టు గుర్తించామని వివరించారు. నిమ్స్ వైద్యుడి వ్యాఖ్యలపై నిరసన నిమ్స్ ఐసీయూ వద్దలో ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంపై వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఐసీయూలోకి వచ్చి మృతదేహాన్ని చూసి, సంతకం చేయాలని వైద్యులు కోరగా.. ప్రీతి మృతికి కారణమేంటో చెప్పేదాకా, తగిన న్యాయం జరిగేదాకా రాబోమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఓ వైద్యుడు కలి్పంచుకుంటూ ‘అయితే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయాలా?’ అని వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. దీనిపై ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర నిరసన తెలిపారు. నిమ్స్ వద్ద ఆందోళన.. ఉద్రిక్తత ప్రీతి మృతి చెందినట్టుగా ప్రకటించిన నిమ్స్ వైద్యులు మృతదేహాన్ని నేరుగా వరంగల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చి మృతదేహాన్ని చూసి సంతకం పెట్టాలని తల్లిదండ్రులను కోరారు. కానీ ప్రీతి తల్లిదండ్రులు, బంధువులు దీనికి నిరాకరించారు. ప్రీతి మృతికి అసలు కారణమేంటో తేల్చాలని, ఏ ఇంజెక్షన్ తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆర్ఐసీయూ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్పటిదాకా మృతదేహాన్ని తరలించనివ్వబోమన్నారు. ప్రీతిని వేధించిన సైఫ్, మరో ఏడుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కేఎంసీ అనస్తీషియా విభాగం హెడ్‌ను సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారికి వైద్య విద్యార్థులు, గిరిజన సంఘాల నేతలు, కార్యకర్తలు, ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాలు, బీజేపీ నేతలు మద్దతుగా నిలవడంతో ఆదివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రీతి కుటుంబానికి రూ.5 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని గిరిజన సంఘాల నేతలు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయతి్నంచినా ఎవరూ ఆందోళన విరమించలేదు. దీనితో భారీగా బలగాలను మోహరించారు. మృతదేహాన్ని బయటికి తెచ్చి.. మళ్లీ లోపలికి.. నిమ్స్‌లో ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే.. మరోవైపు వైద్యులు, పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయతి్నంచారు. దీంతో ఆందోళనకారులు అక్కడికి వచ్చిన అంబులెన్స్ ముందు బైఠాయించి, దానిని వెనక్కి పంపారు. దీనితో అధికారులు మరో అంబులెన్స్‌ను తీసుకురాగా.. మృతదేహాన్ని ఆర్ఐసీయూ నుంచి బయటికి తీసుకురాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆర్ఐసీయూ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిమ్స్‌లో రోగులకు వైద్య సేవలు అందించడంలో అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆందోళన విరమించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం వచ్చే రోగులకు ఇబ్బందికలుగుతోందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రికి మృతదేహం సోమవారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. -
ప్రీతి కేసు.. ఠాగూర్ సినిమాలెక్కుంది!
సాక్షి, హైదరాబాద్: పీజీ డాక్టర్ ప్రీతికి అందుతున్న చికిత్స విషయంలో నిమ్స్ వైద్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇది ఠాగూర్ సినిమా లెక్కుందని ఆమె బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. ఇక.. నిన్నటిదాకా ఆమె బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, ఇవాళేమో హఠాత్తుగా బ్రెయిన్‌డెడ్ అయ్యిందని చెప్తున్నారని ఆమె తండ్రి నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కాసేపట్లో ప్రీతి ఆరోగ్య స్థితిపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో నిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డాక్టర్లు మాకేమో ఒకటి చెప్తున్నారు. ఆస్పత్రి చుట్టూ పోలీసులను పెడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి మా అమ్మాయిని బతికించాలనే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేది. కానీ, అలా చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఠాగూర్ సినిమా లెక్కే ఉంది అని ప్రీతి బాబాయ్ రాజ్‌కుమార్ ఆగ్రహం వెల్లగక్కారు. మరోవైపు ప్రీతికి నిమ్స్‌లో సరైన చికిత్స అందడం లేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రీతి కుటుంబ సభ్యులకు పరామర్శ సందర్భంగా మీడియా ముందు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెరుగైన చికిత్స పేరిట వరంగల్ ఎంజీఎం నుంచి ప్రీతిని హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితి విషమంగానే ఉందటూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు. అయితే తమకు మాత్రం ప్రీతి బ్రతుకుతుందనే భరోసా ఇస్తూ.. ఇప్పుడు హఠాత్తుగా బ్రెయిన్ డెడ్, బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పడంపై ఆమె కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గాంధీకి ప్రీతి! ఇదిలా ఉంటే నిమ్స్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. మరోవైపు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ తరుణంలో.. ఏ క్షణమైనా ప్రీతిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఏది అనేది కాసేపట్లో నిమ్స్ వైద్యులు విడుదల చేసే బులిటెన్.. కీలక ప్రకటనపైనే ఆధారపడి ఉంది. -
ప్రీతి బ్రెయిన్‌డెడ్!.. నిమ్స్ వద్ద భారీగా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ర్యాంగింగ్ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్ చేశారాయన. కాసేపట్లో ప్రీతి హెల్త్ బులిటెన్‌పై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్ డైరెక్టర్, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పూర్తిగా బంద్ కాలేదు : ఈటల
-
ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో పీజీ డాక్టర్ ప్రీతికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అంతేకాదు ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలని తెలంగాణ సర్కార్‌ను డిమాండ్ చేశారాయన. ఆదివారం నిమ్స్‌కు వెళ్లిన ఆయన.. ప్రీతి తల్లిదండ్రుల్ని పరామర్శించి, ఆమె ఆరోగ్యస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఈటల కామెంట్స్.. మెడికల్ యూజీ.. పీజీ కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో సరిపడా వైద్యులు లేరు.. భారమంతా పీజీ విద్యార్థులపైనే పడుతోంది. ప్రీతి ఘటనను ఈ ప్రభుత్వం సీరియస్‌గా భావించాలి. గిరిజన విద్యార్థిని అయిన ప్రీతిపై.. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ వేధించాడు. ఆ కారణంగా ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. హెచ్‌వోడీ, ప్రిన్సిపాల్, పేరెంట్స్ సహా అందరికీ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి చెప్పింది. అంటే.. వైద్య కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. పైఅధికారులు ప్రీతి హారస్మెంట్ గురించి చెప్పినపుడు స్పందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. మరోవైపు పోలీసులు కూడా పట్టించుకోలేదు. ప్రీతి ఇష్యూ పై సమగ్ర విచారణ జరపాలి. ఆమెకు ఇంకా మెరుగైన వైద్యం అందించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి అని ఎమ్మెల్యే ఈటల.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రీతి ఆరోగ్యం అత్యంగా విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ద్వారా వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ర్యాంగింగ్ వేధింపులు భరించలేక మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికీ ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వెంటిలేటర్ చికిత్స అందుతోందని బులిటెన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. మల్టి డిసిప్లినరీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రీతికి చికిత్స అందుతోందని నిమ్స్ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు ప్రీతి బీపీ కూడా మెయింటేన్ అవ్వటం లేదని, కిడ్నీ పనితీరు సరిగ్గా లేదని కిందటి హెల్త్ బులెటిన్‌లో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జరిగింది ఇదే.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. ఆ వేధింపులతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్య చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కానీ సీనియర్ విద్యార్థులు సైఫ్‌ను అరెస్టు చేయొద్దని ధర్నాకు దిగారు. -
ప్రీతి ఫోన్ కాల్ ఆడియో వెలుగులోకి.. తల్లితో ఏం చెప్పింది?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిమ్స్‌లో ఐదు రోజులుగా చికిత్స కొనసాగుతోంది. కాగా, సైఫ్ వేధింపులపై మెడికో ప్రీతి ఫోన్ కాల్ ఆడియో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లికి ప్రీతి ఫోన్ చేసి తన బాధను ఫోన్‌కాల్‌లో చెప్పుకుంది. ‘‘సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లు అంతా ఒక్కటే. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి’’ అంటూ తల్లితో ప్రీతి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒకటై నన్ను దూరం పెడతారని, ప్రిన్సిపాల్‌కు ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడి నాగార్జునరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రీతి ఆవేదన చెందగా, సైఫ్‌తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి చెప్పింది. కాగా, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చదవండి: నవీన్ హత్యకేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్ -
తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కాల్ కలకలం
-
ఇంకా విషమంగానే ఎంజీఎం మెడికో ప్రీతి ఆరోగ్యం
-
ప్రీతి ఆత్మహత్యయత్నం ఘటనపై కొనసాగుతున్న విచారణ
-
అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్యం
-
అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్యం
-
40 ఏళ్ల వయసులో సరికొత్త ప్రయాణం.. గిన్నిస్ రికార్డు! ఇప్పుడేమో
సాహసయాత్రలు యాత్ర వరకు మాత్రమే పరిమితం కావు. మనలో కొత్త వెలుగును నింపుతాయి. కొత్త దారి చూపుతాయి. కొత్త విజయాలు సాధించేలా సంకల్పబలాన్ని ఇస్తాయి. సైకిల్‌పై ఎన్నో సుదూరయాత్రలు చేసి రికార్డ్‌లు సాధించిన ప్రీతి మస్కే తాజాగా ఇండియా నుంచి సింగపూర్‌కు సైకిల్‌యాత్ర చేయడానికి సన్నద్ధం అవుతోంది... ఫాస్టెస్ట్ ఫిమేల్ సోలో సైకిలిస్ట్‌గా గత సంవత్సరం నవంబర్ నెలలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది పుణెకు చెందిన ప్రీతి మస్కే. 13 రోజుల 18 గంటల 38 నిమిషాలలో గుజరాత్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ సైకిల్‌యాత్రను పూర్తి చేసింది. గుజరాత్‌లోని కోటేశ్వర్ నుంచి మొదలైన ఈ సైకిల్ యాత్ర ఏడు రాష్ట్రాల గుండా సాగి అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబితులో ముగిసింది. ఈ యాత్ర చేయగలనా? ‘ప్రతి ఒక్కరూ అస్సామ్, అరుణాచల్‌ప్రదేశ్‌లను చూడాలనుకుంటారు. అయితే సైకిల్‌పై యాత్ర అనేసరికి వెనక్కి తగ్గుతారు. దీనికి కారణం అంతదూరం సైకిల్‌యాత్ర అంత సులువైన విషయం కాదు. ఈ యాత్ర చేయగలనా? అని మొదట్లో నేను కూడా సందేహించాను. కొద్ది సమయంలోనే ఆ సందేహం నుంచి బయటపడి సాహసయాత్రకు పూనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీతి. ‘యాత్ర కోసం యాత్ర’ అని కాకుండా తన యాత్రకు సామాజిక సందేశాన్ని కూడా జోడించింది. దారి పొడుగునా అవయవదానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ వెళ్లింది. చిన్నప్పుడు ప్రీతికి ఆటలు అంటే ఇష్టం. హాకీ, బాస్కెట్‌బాల్ బాగా ఆడేది. అయితే స్కూలు చదువుల తరువాత తనకు ఆటలు దూరమయ్యాయి. 2017లో సరదాగా చేసిన సైకిలింగ్ తన జీవితాన్నే మార్చేసింది. ఎంతో సానుకూల శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది. ఎన్నో కొత్త ద్వారాలు ‘ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత, నలభై ఏళ్ల వయసులో పిల్లలు, కుటుంబం తప్ప వేరే ప్రపంచం ఏదీ తెలియని ప్రపంచంలోకి వెళ్లిపోతాం. సైకిలింగ్ నా కోసం ఎన్నో కొత్త ద్వారాలు తెరిచింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సాధించాల్సింది ఎంతో ఉంది అని చెప్పింది’ అంటుంది ప్రీతి. వెనక్కి చూడలేదు 2019లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సోలోగా సైకిల్‌యాత్ర చేపట్టినప్పుడు చాలామంది భయపెట్టేలా మాట్లాడారు. అయితే ఆ భయంగొల్పే మాటలు ప్రీతిని వెనక్కి తీసుకువెళ్లకపోగా మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. పట్టుదలను పెంచాయి. అసాధ్యం అనుకున్న సైకిల్ యాత్ర విజయవంతం అయ్యేలా చేశాయి. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి చూడలేదు. సుదీర్ఘ సైకిల్‌యాత్రలు లేని సమయంలో ఆసక్తి ఉన్న వారికి సైకిలింగ్‌లో శిక్షణ ఇస్తోంది. స్విమ్ చేస్తోంది. శరీరం ఫిట్‌గా ఉండేలా రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తుంది. వారాంతాలలో 100 నుంచి 300 కి.మీ వరకు సైకిలింగ్ చేస్తోంది. ఎన్నో సుదూర సైకిల్ యాత్రలు పూర్తి చేసిన ప్రీతి ‘ప్రతి రికార్డ్ ఒక సవాలే. దేనికదే ప్రత్యేకమైనది’ అంటోంది. ఆప్యాయ పలకరింపులు ఒక మంచిపని, స్ఫూర్తిని ఇచ్చే పని చేస్తే, సాహసాన్ని తట్టిలేపే పనిచేస్తే సమాజం తనకు తానుగా ముందుకు వచ్చి భుజం తట్టి ముందుకు నడిపిస్తుంది. సైకిల్ యాత్రలో ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నోచోట్ల అపరిచితురాలైన తనను ఆప్యాయంగా పలకరించారు ప్రజలు. ఆతిథ్యం ఇచ్చారు. సైకిల్‌కు రిపేర్లు వస్తే బాగు చేయించారు. హైవే హోటళ్ల వాళ్లు కూడా మర్యాదగా పలకరించి తనకు ఆతిథ్యం ఇచ్చారు. సాధించిన దానితో సంతృప్తి చెంది అదే విజయం అనుకోవడం లేదు ప్రీతి. తాజాగా ఇండియా నుంచి సింగపూర్ సైకిల్ యాత్రకు సన్నద్ధం అవుతోంది. ‘సాధ్యం అవుతుంది’ అనడం తేలిక. ‘అసాధ్యం’ అనుకోవడం అంతకంటే తేలిక. అయితే అసాధ్యాలను, సుసాధ్యం చేయడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ప్రీతీ మస్కే ఒకరు. చదవండి: Soumya Ranjan Biswal: సాగర తీరాన సైన్యమై కదులుతున్నాడు Kangana Ranaut: వారసత్వంగా మాకు అందిన చిట్కాలు.. నా బ్యూటీ సీక్రెట్ ఇదే -
IPS Preeti Chandra: చంబల్‌ను గడగడలాడించింది.. ఆమె నిజంగానే శివంగి!
చంబల్‌లోయ అంటే మహా మహా పోలీస్ ఆఫీసర్లు కూడా ‘వద్దు సార్’ అంటారు పోస్టింగ్. ప్రీతి చంద్ర అక్కడ పోస్టింగ్ తీసుకుంది. సరిగ్గా మూడు నెలలు. బందిపోట్లు గడగడలాడారు. ‘దీని వెనుక పెద్దవాళ్లున్నారు’ అని కొన్ని కేసుల జోలికి రారు ఆఫీసర్లు. కాని ప్రీతి చంద్ర పెద్దవాళ్లు ఉన్న కేసుల్నే గట్టిగా పట్టుకుంటుంది. కటకటాల వెనక్కు తోస్తుంది. అందుకే ఆమెను రాజస్థాన్‌లో అందరూ లేడీ సింగం అని పిలుస్తారు. ఆమె శివంగి. నిజంగానే. అది 2020, మే నెల. లాక్డౌన్ నడుస్తోంది. రాజస్థాన్‌లోని జోద్పూర్ వెస్ట్ కమిషనర్‌గా విధుల్లో ఉన్న ప్రీతి చంద్ర పెట్రోలింగ్‌లో ఉంది. సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కగా ఒక కారు ఆగింది. అందులో గర్భిణీ ఉంది. ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమెను కల్యాణ్‌పూర్ నుంచి జోద్‌పూర్‌కు కాన్పు కోసం తీసుకుని వస్తుంటే మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంకా సిటీకి దూరముంది. ప్రీతి చంద్ర వెంటనే రంగంలో దిగింది. గర్భిణిని సౌకర్యం కోసం తన ఇన్నోవా బ్యాక్సీట్లోకి మార్పించింది. దగ్గర్లోనే ఉన్న టెంట్ హాల్‌ను తెరిపించి షామియానా తెరలను చుట్టూ పోలీసులు పట్టుకుని నిలబడేలా చాటు ఏర్పాటు చేసింది. ఒక టీమ్‌ను డాక్టర్ కోసం పంపించి తనతో ఉన్న మహిళా కానిస్టేబుల్స్‌ను కాన్పు పనిలో సాయం పట్టమంది. డాక్టరు వచ్చేలోపే కాన్పు జరిగిపోయింది. తల్లీబిడ్డా క్షేమం. కాని ప్రీతి చంద్ర సకాలంలో స్పందించకపోతే ప్రమాదం జరిగి ఉండేది. ఆ తల్లికి ప్రీతి చంద్ర అంటే ఎంతో కృతజ్ఞత ఏర్పడింది. తన కూతురికి ఆమె పేరే పెట్టుకుంది– ప్రీతి అని. చంబల్‌ను గడగడలాడించింది! 2019లో ప్రీతి చంద్రాను కరోలి జిల్లాకు ఎస్పిగా వేశారు. కరోలీ జిల్లాలో చంబల్‌లోయ ఒక భాగం వస్తుంది. ఆ జిల్లాకు ఎస్.పి కావడం అంటే బందిపోట్ల తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే. కాని ప్రీతి చంద్ర చార్జ్ తీసుకున్న మూడు నెలల్లోనే చంబల్‌ను గడగడలాడించింది. మగ ఆఫీసర్లు వెళ్లడానికి జంకే లోయలోని ప్రాంతాలను సందర్శించింది. వారంలో ఒకసారి చంబల్ లో క్యాంప్ చేసింది. సరిగ్గా మూడు నెలల్లో పదిమంది పేరుమోసిన బందిపోట్లను అరెస్ట్ చేసింది. వారికి ఇన్ఫార్మర్లుగా పని చేసేవారిని లోపల వేసింది. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలోని బందిపోట్లు పరార్ అయ్యారు. కొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రీతి చంద్రను అందరూ ‘లేడీ సింగం’ అని పిలవసాగారు. స్కూల్ టీచర్ నుంచి ఐపీఎస్ దాకా ప్రీతి చంద్ర రాజస్థాన్‌లో 2008 ఐ.పి.ఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఆమెది సీకర్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్.ఎఫ్‌లో పని చేసేవాడు. తల్లి నిరక్షరాస్యురాలు. ‘మా అమ్మ జీవితంలో పెన్సిల్ కూడా పట్టుకుని ఎరగదు. కాని నన్ను, నా చెల్లెల్ని, మా తమ్ముణ్ణి బాగా చదివించాలని పట్టు బట్టింది. నేను ఐ.పి.ఎస్ అవడానికి ఆమే కారణం’ అంటుంది ప్రీతి. జైపూర్‌లో ఎం.ఏ, ఎం.ఫిల్ చేసిన ప్రీతి కొన్నాళ్లు స్కూల్లో పాఠాలు చెప్పింది. మరికొన్నాళ్లు జర్నలిస్ట్‌గా పని చేసింది. నిజానికి జర్నలిస్టుగానే ఎదగాలని అనుకుందిగాని యు.పి.ఎస్.సి రాసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐ.పి.ఎస్ అయ్యింది. ప్రీతి చంద్ర ఇప్పుడు బికనీర్‌కి ఎస్.పిగా ఉంది. బికనీర్‌కి ప్రథమ మహిళా ఎస్.పి ఆమె. ‘ఈ జిల్లా ఏర్పడి చాలా కాలం అయ్యింది. నా కంటే ముందు చాలామంది మహిళా అధికారులు ఉన్నారు. ఇన్నాళ్లకు ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. వ్యవస్థలో మహిళలకు అవకాశం ఇవ్వడం సంకుచితత్వం ఉంది. అలాగే మహిళలు కూడా బాధ్యతను స్వీకరించడం లో వెనుకంజ వేయడం మానాలి’ అంటుందామె. చదవండి: ఆమె చేయని మంచి పని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!! -
మైనర్ ప్రీతి హత్యకేసులో కొత్త ట్విస్ట్
నల్లగొండ: కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రీతి(17) హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. జూలై 13న వ్యవసాయబావి వద్ద ప్రతీ అనుమానాస్పద స్థితిలో అయితే తమ గ్రామానికే చెందిన దోరెపల్లి పవన్ కొంత కాలంగా ప్రీతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని.. తమ కూతురును అతనే హత్య చేశాడని ఆమె తల్లి నాగమ్మ, బంధువులు పోలీసుల ఎదుట ఆరోపించారు. ఈ ఘటనపై దళిత, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో డీఐజీ రంగనాథ్ రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టడానికి ఎస్పీ సతీష్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రసుత్తం నిందితుడిగా అనుమానిస్తున్న పవన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటికి వచ్చాయి. ప్రీతిని హత్య చేయడానికి ముందు ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో ప్రీతి మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రామకృష్ణను డీఐజీ రంగనాథ్ వీఆర్‌కు అటాచ్ చేశారు. పారదర్శకంగా కేసు విచారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని డీఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. కాగా చనిపోయిన ప్రీతి కుటుంబాన్ని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. -
ఈ పబ్ చాలా స్పెషల్ గురూ..!
భార్యాభర్త ఇద్దరూ పని ఒత్తిడికి లోనవుతున్నప్పుడు.. రిఫ్రెష్మెంట్ మగవాళ్లకు ఎంత అవసరమో ఆడవాళ్లకూ అంతే అవసరం. మానసికోల్లాసం కోసం నగరం దాటి వెకేషన్‌కు వెళ్లడం ప్రతివారమూ కుదిరేపని కాదు. అందుకే పిల్లలు, అమ్మానాన్నలు కలిసి ఇష్టమైన ఆహారం తింటూ, మ్యూజిక్ వింటూ, చేయాలనిపిస్తే డాన్స్‌చేస్తూ తమను తాము రీచార్జ్ చేసుకోగలిగిన ‘పబ్’ని తెలుగు వాళ్లకు పరిచయం చేశారు యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రీతి. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఫ్యామిలీ పబ్ స్థాపించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్రీతి ‘‘పబ్ అనగానే అది సంస్కారవంతులు వెళ్లకూడని ప్రదేశం అని, ఆడవాళ్లు అడుగుపెట్టకూడదని.. ఇలాంటి గట్టి అభిప్రాయాలు మనలో ఉన్నాయి. ‘పబ్’ అనేది మద్యం సేవించడానికి వెళ్లే ప్రదేశంగా మాత్రమే మనకు ఒక ముద్ర బలంగా పడిపోయి ఉంది. ఇంతవరకు మన దగ్గర ఫ్యామిలీలకు పబ్‌కు లేకపోవడం వల్ల ఏర్పడిన దురభిప్రాయం ఇది’’ అంటారు ప్రీతి. ‘‘ఒక మహిళ తన భర్త, పిల్లలతో సెలవు రోజును ఆహ్లాదంగా గడపగలిగిన ప్రదేశంగా పబ్‌ని తీర్చిదిద్దడమే నా ఉద్దేశం. ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి పెరిగినట్లే ఒత్తిడి కూడా పెరిగిపోయింది. నెలకు యాభై వేలు– లక్ష రూపాయలు సంపాదించుకోవడం కోసం వారమంతా మెదడును ఒడిసిపట్టి పని చేయించక తప్పదు. వారాంతంలో రిఫ్రెష్ కాకపోతే మళ్లీ వారంలో కొత్త ఒత్తిడిని తలకెత్తుకోవడానికి సిద్ధం కాలేరు. అలాంటి వాళ్ల కోసం నా కెరీర్లో భాగంగా హైదరాబాద్‌లో నేను ఏర్పాటు చేసుకున్నదే ఈ ఫ్యామిలీ పబ్’’ అని చెప్పారామె. కొత్త సోపానం ‘‘నిజానికి ఫ్యామిలీ పబ్ అనే కాన్సెప్ట్ మనదేశంలోకి మూడు దశాబ్దాలవుతోంది. ‘షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్’ పేరుతో 1991లో బెంగళూరులో మొదలైంది. మాది తెలుగు కుటుంబమే అయినా నేను పుట్టింది పెరిగింది బెంగళూరులోనే. ఎంబీఏ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఒక యూరోపియన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో హెచ్ఆర్ స్పెషలిస్ట్‌గా పని చేశాను. మా కంపెనీ కార్యకలాపాలు ఆసియా దేశాల్లో ఏడింటిలో జరుగుతుండేవి. చైనా, థాయ్‌ల్యాండ్‌తోపాటు మా కంపెనీ హెడ్‌క్వార్టర్ ఉన్న జర్మనీకి కూడా వెళ్లాల్సి వచ్చేది. మన దగ్గర వీధి చివర కాఫీ షాప్‌లు ఉన్నట్లు అక్కడ ఫ్యామిలీ పబ్లుంటాయి. ఆ దేశాల వర్క్ కల్చర్ మన దగ్గరకు కూడా వచ్చేసింది. పైగా మన దగ్గర మహిళకు ఉద్యోగంతోపాటు ఇంటి పనులు అదనం. మన మగవాళ్లు ఇంటిపనుల్లో సాయం చేయడం నూటికి ఏ పదిళ్లలోనో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెరీర్‌కు న్యాయం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు ఆడవాళ్లు. నేను పెళ్లి చేసుకుని కోడలిగా హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత నేను గమనించిన విషయం ఇది. పెళ్లయిన తర్వాత కూడా హైదరాబాద్– సింగపూర్ల మధ్య ప్రయాణిస్తూ ఉద్యోగం చేశాను. బాబు పుట్టిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేశాను. బాబుకి ఇప్పుడు రెండేళ్లు. నేను నా కెరీర్‌ని తిరిగి నిర్మించుకోవడానికి సిద్ధమైనప్పుడు మా ఫ్యామిలీ నడుపుతున్న విద్యాసంస్థలను చూసుకోవడం అనే ఆప్షన్ నా ఎదురుగా ఉంది. అప్పుడు నేను ఫ్యామిలీ మొత్తం సంతోషంగా గడపగలిగిన నైబర్‌హుడ్ పబ్‌ల గురించి చెప్పాను. అప్పుడు మా వారు ‘ఆ కాన్సెప్ట్‌ని నువ్వు టేకప్ చేస్తేనే న్యాయం జరుగుతుంది. కానీ ఇది నీకు చాలెంజింగ్‌గా ఉంటుందేమో’ అన్నారు. నేనా చాలెంజ్‌ని స్వీకరించి ఈ ఏడాది జనవరి 15వ తేదీన పబ్‌ను ప్రారంభించాను. తొలి అడుగు పడాలి పబ్ నిర్వహణ మగవాళ్ల వ్యాపార సామ్రాజ్యం అనేది కేవలం అపోహ మాత్రమే. ఏ రంగమైనా సరే ఆడవాళ్లు అడుగుపెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యం. ఆడవాళ్లలో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే చాలు... ఆమె చూపించిన దారిలో నడవడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. నేను ఈ రంగంలో తొలి అడుగు వేశాను. ఈ రంగంలో మహిళలకు ఉద్యోగావకాశాలు పెరగాలంటే యజమాని స్థానంలో మహిళ ఉంటేనే సాధ్యం. ఏ సంస్థలోనైనా మహిళల మీద వేధింపులు లేని వాతావరణం ఉండాలంటే మహిళా ఉద్యోగుల నిష్పత్తి పెరగాలి. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర పాతిక మంది ఉద్యోగులున్నారు. ఈ నెల ఎనిమిదవ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నుంచి ఫ్యామిలీ పబ్‌లో మహిళా ఉద్యోగులు ఉంటారు. ‘ఆడవాళ్లు మీకు ఈ ఉద్యోగాలెందుకు? ఫలానా ఉద్యోగాలు చూసుకోండి’ అని తీర్పులిచ్చేస్తోంది మగసమాజం. అవకాశాలను ఆడవాళ్ల ముందు పెట్టాలి. ఉపయోగించకోవడం, ఉపయోగించుకోకపోవడం ఆడవాళ్ల ఇష్టమై ఉండాలి’’ అన్నారు ప్రీతి. మగవాళ్లు తీర్పు చెప్పడం ఎలా ఉంటుందంటే... ఒక సినిమాకి రివ్యూ రాసేటప్పుడు ‘ఇది ఆడవాళ్ల సినిమా’ అని మగవాళ్లే నిర్ణయించేస్తుంటారు. తమకు నచ్చే సినిమా ఏదో నిర్ణయించుకునే అవకాశాన్ని కూడా ఆడవాళ్ల చేతిలో ఉంచరన్నమాట. ఆ ధోరణి నుంచి మన సొసైటీ బయట పడాలి. అందుకు ఒక సాహసోపేతమైన అడుగు వేశారు ప్రీతి. – వాకా మంజులారెడ్డి రాత్రి రెండు వరకు నేను కోరుకుంటున్నట్లు యాభై శాతం ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేయడం సాధ్యమేనా... అనే సందేహం వచ్చినమాట నిజమే. అయితే మేము నిర్వహించనున్న మూడు రోజుల ఫ్రీ వర్క్‌షాప్‌కి పేర్లు నమోదు చేసుకున్న వాళ్లలో గృహిణులు కూడా ఉన్నారు. డీజే, ఆర్టిస్టులు కూడా మహిళలే ఉంటారు. నేను పెట్టుబడి పెట్టి నిర్వహణ బాధ్యత ఉద్యోగుల మీద వదిలేయడం లేదు. కౌంటర్ నుంచి కిచెన్ వరకు అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తాను. వీకెండ్స్‌లో రాత్రి రెండు గంటల వరకు కూడా పబ్‌లోనే ఉంటాను. ఇది కార్యక్షేత్రం. నేనిలా ఉండగలుగుతున్నాను కాబట్టి మహిళాఉద్యోగులకు కూడా భరోసా ఉంటుంది. మల్టీ క్విజిన్ రెస్టారెంట్లో చెఫ్‌లు, ఫ్రంట్ ఆఫీస్, స్టీవార్డ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ప్లేస్‌మెంట్స్ ఇప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. నేను సమాజంలో ఒక మెట్టు మంచి స్థానంలో ఉన్నాను. నా వంతుగా మరికొంత ఆడవాళ్లకు ఉపాధి కల్పించడం నా బాధ్యత. – ప్రీతి, షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్ నిర్వహకురాలు -
చైనాని వణికిస్తున్న మిస్టరీ వ్యాధి
బీజింగ్: చైనాని వణికిస్తున్న మిస్టరీ వ్యాధి కరొనా వైరస్ ఆ దేశంలో ఉన్న భారతీయ టీచర్‌కి సోకిందన్న అనుమానాలు అందరినీ ఠారెత్తించాయి. చైనాలో షెన్జెన్లోని స్కూలులో టీచర్‌గా పని చేస్తున్న ప్రీతి మహేశ్వరి (45)కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భర్త ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తొలుత వైద్యులు ఆమెకు ప్రమాదకరమైన కరొనా వైరస్ సోకిందని అనుమానించారు. కానీ పరీక్షల్లో ఆమెకి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది. చైనా నుంచి ప్రమాదకరమైన వైరస్ ప్రస్తుతం ఆమెను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స నిర్వహిస్తున్నట్టు టీచర్ భర్త ఆష్మాన్ ఖోవల్ తెలిపారు. న్యుమోనియా తరహా లక్షణాలు ఉండే ఈ కొత్త వైరస్ గత కొద్ది రోజులుగా దేశాన్ని వణికిస్తోంది. దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించడానికి చైనా తీవ్రంగా కృషి చేస్తోంది. భారత పర్యాటకులకు చైనా వెళ్లవద్దంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. (చదవండి: కరొనో వైరస్ కలకలం) -
ఆసియా సెయిలింగ్ పోటీలకు ప్రీతి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హుస్సేన్ సాగర్ వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన హైదరాబాద్ యాట్ క్లబ్ (వైసీహెచ్) సెయిలర్లు ప్రీతి కొంగర, ఝాన్సీ ప్రియ, లక్ష్మీ నూకరత్నం గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆసియా–ఓసియానియా అంతర్జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు వీరు ముగ్గురు ఎంపికయ్యారు. ఒమన్ వేదికగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగుతుంది. ఇందులో చైనా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు 16 దేశాలకు చెందిన 300 మంది సెయిలర్లు తలపడనున్నారు. భారత్ నుంచి 5 చొప్పున బాలబాలికలను ఈ టోర్నీకి ఎంపిక చేయగా అందులో ఆరుగురు హైదరాబాద్ యాట్ క్లబ్‌కు చెందిన వారే కావడం విశేషం. బాలుర విభాగంలో విజయ్ కుమార్, సచిన్, విశ్వనాథ్‌లు మాజీ వైసీహెచ్ సెయిలర్లు కాగా వారు ప్రస్తుతం ఆర్మీ, నేవీ సెయిలింగ్ స్కూల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టుకు ఎంపికైన ప్రీతి నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా... ఝాన్సీ, లక్ష్మీ రసూల్‌పురా ఉద్భవ్ స్కూల్ విద్యార్థులు. వీరంతా ఆర్థికంగా చాలా వెనకబడిన కుటుంబాలకు చెందిన వారైనప్పటికీ కోచ్ సుహేమ్ షేక్ ఆధ్వర్యంలో సెయిలింగ్‌పై ఆసక్తితో ఆటలో గొప్పగా రాణిస్తున్నారు. -
టైటిల్‌కు మరింత చేరువలో ప్రీతి
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యాట్ క్లబ్‌కు చెందిన ప్రీతి కొంగర టైటిల్‌కు మరింత చేరువైంది. హుస్సేన్‌సాగర్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో శనివారం మూడు రేసులు జరుగగా ప్రీతి తొలి రేసులో విజేతగా నిలిచింది. మిగతా రెండు రేసుల్ని వరుసగా 8వ, 4వ స్థానంతో ముగించింది. ప్రస్తుతం బాలికల మెయిన్ ఫ్లీట్ ఈవెంట్లో ప్రీతి కొంగర 28 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... రెండో స్థానంలో ఉన్న రితిక డాంగి (ఎస్ఎస్ఎస్ భోపా ల్) ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం 32 పాయింట్లు ఉండటం విశేషం. ఉమా చౌహాన్ (ఎస్ఎస్ఎస్ భోపాల్; 66 పాయింట్లు) మూడోస్థానంలో నిలిచింది. ఆదివారం మరో మూడు రేసులు జరగనున్నాయి. ఇందులోనూ సత్తా చాటితే ట్రోఫీ ప్రీతి సొంతం కానుంది. బాలుర కేటగిరీలో తృష్ణ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన విజయ్ కుమార్ 60 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. రాజ్ విశ్వకర్మ (ఎన్ఎస్ఎస్ భోపాల్, 90 పాయింట్లు), కలవ్య బాథమ్ (ఎన్ఎస్ఎస్ భోపాల్; 102 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గ్రీన్ ఫ్లీట్ ఈవెంట్ బాలికల విభాగంలో హైదరాబాద్ యాట్ క్లబ్ సెయిలర్లే తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. సుప్రియ (55 పాయింట్లు), వైష్ణవి (74 పాయింట్లు), శ్రీహర్షిత (127 పాయింట్లు) మెరుగైన స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో ప్రవీణ్ (34 పాయిం ట్లు), నిఖిల్ (35 పాయింట్లు), మల్లేశ్ (36 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఎయిమ్స్ మంజూరుకు సమస్యల్లేవు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మంజూరుకు, నిధులు ఇచ్చేందుకు కేంద్రం నుంచి తగిన ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ పేర్కొన్నారు. ఎయిమ్స్‌ను రాష్ట్రానికి ఇవ్వడానికి అధికారికంగా ఎలాంటి సమస్యలు లేవని, కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. మంగళవారం సచివాలయం లో మంత్రి లక్ష్మారెడ్డిని ప్రీతి మర్యాదపూర్వ కంగా కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేశారు. రెండో ఏఎన్ఎంలకు కనీస వేతనాలు పెంచా లని కోరారు. ఆశా వర్కర్లకు తెలంగాణలో నెలకు కనీసం రూ.6 వేలు చొప్పున ప్రోత్సా హకాలు అందిస్తున్నామని, కేంద్రం చొరవ తీసుకుంటే వాళ్ల వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వెల్నెస్ సెంటర్లకు ఆయుష్ సేవలు అందేలా చొరవ తీసుకోవా లని కోరారు. క్లినికల్ ట్రయల్స్‌కి జాతీయ స్థాయిలో ఒకే రకమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించారు. కనీసం జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్ ఫుడ్ సేఫ్టీ, చెకింగ్ వాహనాలు ఉంటే ఆహార కల్తీ నివారణ పటిష్టంగా వీలవుతుందని తెలిపారు. ప్రీతి స్పందిస్తూ, సిద్దిపేట, సూర్యాపేట, నల్ల గొండ వైద్య కళాశాలలకు మరిన్ని నిధులు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. మాతా శిశు వైద్యశాలలను పరిశీలించిన ప్రీతి.. ఇలాంటి మరికొన్ని ఆసుపత్రులను మంజూరు చేస్తామని తెలిపారు. -
ప్రీతీ రిటర్న్స్
గుర్తు పట్టారా... ఈ ఫొటోలో హీరోయిన్ ఎవరో? పేరు... ప్రీతి జింగ్యానియా! ఇంకా గుర్తు రాలేదా? అదేనండీ... ‘తమ్ముడు, నరసింహ నాయుడు, అధిపతి’ తదితర తెలుగు చిత్రాల్లో నటించారీమె. తర్వాత ఎక్కువగా హిందీ సినిమాలు, మధ్య మధ్యలో కొన్ని తెలుగుల్లో నటించినా... ఐదేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే... పెళ్లైంది. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మ అయ్యారు. దాంతో ఈ ఐదేళ్లూ పిల్లలే ప్రపంచంగా బతికారు. ఇప్పుడు నటిగా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ‘వజూద్’ అనే హిందీ సినిమా చేస్తున్నారు. పిల్లల్ని, సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారీ బ్యూటీ. రీ–ఎంట్రీ, పిల్లల గురించి ప్రీతి మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించాలనుకుంటున్నా. ఇతరులతో (మదర్స్) పోలిస్తే ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం నాకు ఈజీనే. నన్ను మా ఫ్యామిలీ బోల్డంత సపోర్ట్ చేస్తుంది. నేను ఇంట్లో లేకపోయినా... పిల్లల్ని ఎవరొకరు చూసుకుంటా రు. మా మదర్, సిస్టర్ కూడా సేమ్ అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో, ప్రాబ్లమ్ లేదు. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ‘వజూద్’లో ప్రీతి తల్లిగా ఎమోషనల్ రోల్ చేస్తున్నారు. ఇదొక ఆఫ్ బీట్ ఫిల్మ్ అట! దాంతో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల్లో నటించాలనుందంటూ ప్రీతి తన మనసులోని మాట బయటపెట్టారు. -
ప్రేమకు కొత్త నిర్వచనం!
శ్రీకరణ్, అమృత, ప్రీతి ముఖ్యతారలుగా నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బెస్ట్ లవర్స్’. శ్రీకరణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత గొంటి శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. గొంటి శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే చిత్రమిది. ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం. దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు. సాయికిరణ్ అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
- ప్రియురాలు మృతి - ప్రియుడే హతమార్చాడని ఆరోపణ చిత్తూరు: చిత్తూరు పట్టణంలోని గంగనపల్లిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేయగా ప్రియురాలు మృతి చెందింది. గంగనపల్లికి చెందిన శివ(21), ప్రీతి(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఈ రోజు ఉదయం శివ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రీతి ఉరివేసుకుని మృతిచెందగా.. ఆత్మహత్యాయత్నంలో ఉన్న శివ భయంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శివను అదుపులోకి తీసుకున్నారు. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పేరుతో లోబరుచుకుని శివ తమ అమ్మాయిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ప్రీతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
10 రోజుల పాపకు ఆధార్ నమోదు
ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా పది రోజుల పాపకు ఆధార్ నమోదు చేశారు. మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన దంపతులు కామ్రే పంజాబ్, జ్యోతిలకు ఈ నెల 19న పాప(ప్రీతి) జన్మించింది. మండలంలోని భోరజ్ సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్), మీ సేవా కేంద్రం నిర్వాహకుడు నివల్కర్ గజానన్ సోమవారం పాప ఇంటికి వెళ్లి ఆధార్ ఎన్రోల్మెంటు సాఫ్ట్‌వేర్‌తో కూడిన ట్యాబ్లెట్ పీసీలో పాప వివరాలు, ఫొటో, తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు నమోదు చేశారు. అనంతరం ఐదు నిమిషాల్లో పాప ఫొటో, పేరు, చిరునామాతో ఈఐడీ సర్టిఫికెట్ జారీ కాగా.. తల్లిదండ్రులకు అందజేశాడు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్‌కార్డు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం గత నెల రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధిలో ప్రారంభమైంది. జిల్లాలోని భోరజ్ కేంద్రంలో మాత్రమే ఈ అవకాశం ఉంది. -
'లోక' కల్యాణం!
ఆదర్శం పెళ్లి ఆడంబరాలకు అయ్యే ఖర్చును... మంచి పనులకు వినియోగిస్తే ఇంతకుమించి లోకకల్యాణం ఏముంటుంది! ‘మన తాహతుకు తగ్గట్టు పెళ్లి ఘనంగా జరగాలి’ అంటుంటారు. ఈ ‘ఘనంగా జరగడం’ అనేది ఇప్పుడు తాహతును దాటిపోయింది. ‘ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే పెళ్లి అంత ఘనంగా జరిగినట్లు’ అనే అపోహ ఏర్పడింది. ఖర్చు కోసమే ఖర్చు ఎక్కువైపోయింది. పెళ్లి ఖర్చును నియంత్రిస్తే, పెళ్లిని నిరాడంబరంగా జరుపుకుంటే... లోకహితమైన పనులు చేయవచ్చని నిరూపించి ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్రకు చెందిన అభయ్, ప్రీతి దంపతులు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్టాక్స్గా నియమితుడైన అభయ్‌కి శిక్షణకాలంలో నిర్వహించే ఫీల్డ్‌విజిట్‌లో భాగంగా సహోద్యోగులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకునే అవకాశం వచ్చింది. ‘‘సామాజిక-రాజకీయమార్పులకు మీరు ప్రతినిధులు కావాలి’’ అంటూ తన ఉపన్యాసంలో యువ అధికారులను ఉత్తేజపరచారు ప్రణబ్. రాష్ట్రపతి మాటలు అభయ్‌పై బలంగా ప్రభావం చూపాయి. సమాజం కోసం తనవంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ సమయంలోనే మనదేశంలో పెళ్లి ఖర్చుల గురించిన ఒక నివేదిక అభయ్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మన దేశంలో ప్రతి ఏటా పెళ్లిళ్ల కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుంది! ‘‘మనలాంటి పేదదేశంలో ఇది భారీ ఖర్చు’’ అనుకున్నాడు అభయ్. ఇదే సమయంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు అభయ్‌ని కదిలించాయి. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ఆర్థిక శాఖ కేటయించిన మొత్తం రూ.36 వేల కోట్లు. దేశంలో ఏటా జరిగే పెళ్లిళ్ల బడ్జెట్లో ఇది సగం కూడా కాదు! తనను ఆశ్చర్యపరిచిన సర్వేలో... పెళ్లి ఖర్చుల కోసం ఎలా అప్పు చేస్తున్నారో, పొదుపు మొత్తాలను ఎలా ఖర్చు చేస్తున్నారో... వీటికి సంబంధించిన వివరాలను చదివాడు అభయ్. అభయ్ తండ్రి కూడా రైతే. ఆయనకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండెకరాలను కూతురు పెళ్లి కోసం అమ్మాడు. నివేదిక చదువుతున్న సమయంలో గతం గుర్తుకు వచ్చింది అభయ్‌కి. పుణేలో యూపీఎస్సీ కోసం ప్రిపేరవుతున్న ప్పుడు బీటెక్ పూర్తయిన ప్రీతి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండు నెలల క్రితం అమరావతి జిల్లా కేంద్రంలోని అభియంత భవన్లో అభయ్, ప్రీతిల వివాహం జరిగింది. ఈ పెళ్లితోనే తమ సేవాపథానికి తొలి అడుగు పడాలనుకున్నాడు అభయ్. పెళ్లికి అయ్యే ఖర్చుతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నట్లు అభయ్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఆమోదించారు. ‘‘పెళ్లికయ్యే ఖర్చును పేదరైతుల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నాం అని నా కొడుకు, కోడలు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది’’ అంటాడు అభయ్ తండ్రి సిద్ధార్థ. అభయ్-ప్రీతి పెళ్లిలో పదిమంది పేద రైతులకు ఒక్కొక్కరికి ఇరవైవేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. దీంతో పాటు అయిదు గ్రంథాలయాలకు రూ. 52 వేల విలువ చేసే పుస్తకాలు అందించారు. ఈ డబ్బంతా తమ పొదుపు మొత్తాల్లో నుంచి వాడిందే. అభయ్, ప్రీతిల రిజిస్టర్డ్ మ్యారేజ్ నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లి సభలో మధు, రవీంద్ర ముంద్రే, ఆశిష్, రమేష్ కట్కే, అర్జున్ తోసారే... మొదలైన సామాజిక కార్యకర్తలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇచ్చారు. మామూలుగానైతే... పెళ్లివేడుకలో పూలదండలు, రకరకాల డెకరేషన్ లైట్లు కనిపిస్తాయి. అభయ్-ప్రీతి పెళ్లిలో మాత్రం స్ఫూర్తిదాయకమైన పోస్టర్లు, బ్యానర్లు కనిపించాయి. విశేషమేమిటంటే, తమ తొలి వివాహ వార్షికోత్సవానికి ఎలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహించాలనే విషయం గురించి ఇప్పుడే ఒక ప్రణాళిక వేసుకున్నారు. అమరావతి జిల్లాకు చెందిన దీపక్ దేశ్‌ముఖ్ అనే రైతు కూతురు తమ కుటుంబం ఎదుర్కొంటున్న గడ్డు పేదరికాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఒక నెల తరువాత అప్పులను తీర్చడానికి దీపక్ కూడా మూడెకరాల భూమిని అమ్మి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో అభయ్‌ని కదిలించాయి. అందుకే... ‘‘మా పెళ్లితోనే ఇది ఆగిపోవాలనుకోవడం లేదు. మరింత మందిని ప్రేరేపించి, పెళ్లి ఖర్చును పేదరైతులకు అందించాలను కుంటున్నాం’’ అంటున్నారు నవదంపతులు అభయ్-ప్రీతిలు. వారి ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం! -
హాస్య భరితంగా ఆయ్‌వుకూడం
హర్రర్ చిత్రాల ట్రెండ్ సాగుతున్న ఈ పరిస్థితుల్లో హాస్యపు జల్లులు కురిపించడానికి సిద్ధం అవుతోంది ఆయ్‌వుకూడం. సీనియర్ నటుడు పాండియరాజన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రానికి మాంగాడు అమ్మన్ మూవీస్ పతాకంపై గణపతి నిర్మించారు. నవ జంట గణపతి, సత్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రీతి, సుందర్, ప్రభురాజ్, రియాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన అన్భరసన్ చిత్ర వివరాలను తెలుపుతూ నటుడు పాండియరాజన్ ప్రముఖ శాస్తవేత్తగా నటించారన్నారు. ఆయన ఒక మానసిక వ్యాధిగ్రస్తుడి మెదడుకు ఫైటర్‌కు ఆయన మెదడును రోగికి మార్చడంతో సంభవించే సంఘటనలను హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలిపారు. చిత్రం చూసిన నిర్మాత అరివళగన్ వెంటనే విడుదల హక్కులను కొనుగోలు చేసి తన పీకేఏ ఫిలింస్ సంస్థ ద్వారా తమిళనాడుతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల్లో భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రాలు బాగుందంటూ ప్రశంసించి యూ సర్టిఫికెట్‌ను ఇచ్చారని వెల్లడించారు. రమేష్ కృష్ణ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఎస్.మోహన్ చాయాగ్రహణం అందించారు. -
నవదంపతుల ఆత్మహత్య!
-
ప్రేమపెళ్లి చేసుకున్న నవదంపతుల ఆత్మహత్య!
హైదరాబాద్: ఆ ప్రేమ జంటకు పెళ్లైన నాలుగు నెలలకే నూరేళ్లు నిండాయి. వారికి ఏం కష్టమొచ్చిందో ఏమో ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పురాలో ఈ విషాద సంఘటన జరిగింది. బహదూర్‌పల్లికి చెందిన వెంకటేష్, ప్రీతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వారి పెళ్లిని ఇరువైపుల పెద్దలు అంగీకరించలేదు. అయినా వారు ఇద్దరూ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత బహదూర్‌పురాలో నివాసం ఉంటున్నారు. అయితే వారిని పట్టించుకునేవారు లేరు. దాంతో వారికి ఆర్థిక ఇబ్బందు ఎదురయ్యాయి. దాంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ వారు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఇరువైపుల పెద్దలు వచ్చి వారి మృతదేహాలను చూసి విలపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
'హత్య చేసి సోఫా కేబినెట్లో కుక్కేసింది'
దుస్తులను వినూత్నంగా తయారు చేసే ఓ ఫ్యాషన్ డిజైనర్... ఓ మహిళను హత్య చేయటంలోనూ అంతే ప్రావీణ్యం ప్రదర్శించి చివరకు కటకటాలపాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని కోరిన మహిళను... గర్భిణి అని కూడా చూడకుండా ఫ్యాషన్ డిజైనర్ దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సోఫా కింద ఉండే స్టోరేజ్ కేబినెట్లో దాచిపెట్టింది. వివరాల్లోకి వెళితే. ముంబయిలోని బోరివ్లి ఈస్ట్‌లోని కాజుపాడలో ఫ్యాషన్ డిజైనర్ ఉజ్వల వీర్...ప్రీతి పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. గతంలో ప్రీతి భర్త దగ్గర ఉజ్వల రూ. 20వేలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న అప్పు కొంత అయినా చెల్లించాలని ప్రీతి పలుమార్లు ఒత్తిడి తెచ్చినా సమాధానం లేదు. డబ్బు విషయంలోనే కాకుండా, అవివాహిత అయిన ఉజ్వల...ప్రీతి భర్తతో సన్నిహితంగా ఉండటంపై కూడా వీరిద్దరి మధ్య గత ఆరు నెలల క్రితం వివాదం జరిగింది. దాంతో ప్రీతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఉజ్వల వీర్ నిర్ణయించుకుంది. మూడు రకాల మారణాయుధాలను ఉపయోగించి ప్రీతిని దారుణంగా హతమార్చింది. అనంతరం మృతదేహాన్నితన ఇంట్లోనే సోఫా కింద స్టోరేజ్ కేబినెట్లో దాచి పెట్టింది. ఆ తరువాత ఏమీ ఎగరనట్లు ప్రీతి.. గుర్తు తెలియని దుండగుని చేతిలో హత్యకు గురైనట్లు కేసు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపటంతో ఉజ్వల వీర్ తానే ప్రీతిని హతమార్చినట్లు అంగీకరించింది. పోలీసులు ఉజ్వల వీర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
బాలికపై అత్యాచారం... హత్య
బెంగళూరు(బనశంకరి) : స్థానిక పిల్లగుంప పారిశ్రామిక వాడలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. హుబ్లీలోని కలగటికి చెందిన మహంతేష్, యల్లమ్మ దంపతులు బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వచ్చి పిల్లగుంప పారిశ్రామిక వాడ సమీపంలో చొక్కహళ్లి గ్రామంలో తాత్కాలిక నివాసం ఏర్పరుచుకున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కూతురు ప్రీతి ఉంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. సమీపంలోని ఓ షెడ్లో బాలిక నిర్జీవంగా కనిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక నోటిలో పేపర్ కుక్కి అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సమీపంలోని అంగడి వద్ద ఉన్న సీసీ కెమెరాలోని ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అందులో ఓ దుండగుడు బాలికను కారు షెడ్లోకి తీసుకెళ్లినట్లు స్పష్టంగా ఉంది. దీని ఆధారంగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు గ్రామాంతర ఎస్పీ రమేష్ బానోత్, అదనపు ఎస్పీ అబ్దుల్ అహ్మద్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఐజీపీ చక్రవర్తి పరిశీలించారు. కాగా, ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
కాలిపోయిన వెన్నెల
నిజాలు దేవుడికెరుక జూన్ 1, 2013... ముంబై హాస్పిటల్... అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎమర్జెన్సీ రూమ్ బయట ఉన్న బెంచీ మీద ఓ యాభయ్యేళ్ల వ్యక్తి, నలభయ్యేళ్లు దాటిన మహిళ ఉన్నారు. ఆమె కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. దుఃఖం పొంగుకొస్తుంటే ఆ శబ్దం బయటకు రాకూడదని చీర చెంగును నోటిలో కుక్కుకుంటోంది. ఆమె పక్కనే కూచున్న వ్యక్తి చూపులు శూన్యాన్ని కొలుస్తున్నాయి. బాధను దిగమింగుతున్నట్టుగా గొంతు దగ్గర నరాల కదలిక చెబుతోంది. అంతలో ఎమర్జెన్సీ రూమ్ తలుపులు తెరచుకున్నాయి. నర్స్ బయటకు వచ్చింది. వాళ్లవైపు చూసి, ‘‘లోపలికి రండి’’ అనేసి లోనికి వెళ్లిపోయింది. వణుకుతోన్న కాళ్లను అతి కష్టమ్మీద నేలకు అదిమి పెడుతూ ఇద్దరూ లోనికి నడిచారు. మంచమ్మీద ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి ఉంది. ఒళ్లంతా తెల్లని దుప్పటి కప్పేశారు. ముఖం మాత్రమే కనిపిస్తోంది. చూడలేనంత దారుణంగా ఉందా ముఖం. చర్మం కాలిపోయింది. కండరాలు ఉడికి పోయి, రక్తం ఉబికి వచ్చి దయనీయంగా ఉంది. ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఆమెను పరీక్షిస్తున్నారు. గబగబా వారి దగ్గరకు వెళ్లారు ఆ భార్యాభర్తలిద్దరూ. ‘‘ఏం జరిగింది’’ అనడిగారు కంగారుగా. ‘‘తను మీతో మాట్లాడాలనుకుంటోంది’’ అనేసి వెళ్లిపోయాడు డాక్టర్. నర్సులు దూరంగా జరిగి నిలబడ్డారు. ఆ మహిళ మంచం దగ్గరగా నడిచి, వంగి ఆ అమ్మాయి ముఖంలోకి చూసింది. సగం తెరిచిన కళ్లు... ఆ కళ్ల నుంచి జాలువారుతోన్న కన్నీళ్లు... కన్నబిడ్డను ఆ స్థితిలో చూడలేక ఆ తల్లి ఘొల్లుమంది. తండ్రి గుండె చిక్కబట్టుకున్నాడు. ‘‘ఏదో మాట్లాడాలన్నావంట, ఏమైనా కావాలా తల్లీ?’’ అడిగిందామె. ఆ అమ్మాయి బలవంతాన మాట కూడదీసుకుంది. పలుకులు మూటగట్టుకుంది. గొంతు పెగల్చుకుని చిన్నగా అంది... ‘‘ఎందుకిలా జరిగిందమ్మా? నేనేం పాపం చేశాను?’’ అంతే... మరుక్షణం ఆ మాట మూగబోయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. ‘ప్రీతీ’ అన్న కేకతో ఆ ఆసుపత్రి దద్దరిల్లింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి వైద్యులు, నర్సుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి. అసలు ఎవరీ ప్రీతి? తనకేం జరిగిందో కూడా తెలియని స్థితిలో నిస్సహాయంగా ఎందుకు మరణించింది? మార్చ్ 28, 2013. బీబీఎంబీ కాలనీ (ఢిల్లీ)... రోషిణి వంట గదిలో ఉంది. ఆమె భర్త అమర్‌సింగ్ రాఠీ హాల్లో కూచుని ఏదో పత్రిక చదువుతున్నాడు. హితేష్ (21), తనూ (19) టీవీలో ఏ చానెల్ చూడాలా అని కొట్లాడుకుంటున్నారు. అప్పుడే బయటి నుంచి సుడిగాలిలా వచ్చింది ప్రీతి. చేతిలో ఉన్న కవర్ని చూపుతూ గంతులేయడం మొదలెట్టింది. ‘‘ఏంటక్కా అది’’... ఆతృతగా అడిగింది తనూ. ‘‘చెప్పనుగా. ముందు నాన్నకే చూపిస్తాను’’ అంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తి ఆయన పక్కనే సోఫాలో కూర్చుంది. చేస్తున్న పని ఆపి కూతురివైపు మురిపెంగా చూశాడు అమర్‌సింగ్. ‘‘ఏంట్రా అది’’ అన్నాడు కవర్ని అందుకుంటూ. దాన్ని తెరచి చూసిన అతడి కళ్లు ఆనందంతో, ఆశ్చర్యంతో అరమోడ్పులయ్యాయి. కూతురి ముఖంలోకి నమ్మలేనట్టుగా చూశాడు. ప్రీతి నవ్వింది. ‘‘నాకు మిలిటరీలో నర్స్‌గా ఉద్యోగం వచ్చింది నాన్నా. ఇంకో నెల రోజుల్లో ముంబై వెళ్లి జాయినవ్వాలి’’ ఆ మాట వింటూనే హితేష్, తనూలు అక్క దగ్గరకు వచ్చేశారు. ‘‘వావ్ అక్కా... కంగ్రాట్స్’’ అన్నాడు హితేష్ ప్రీతిని పట్టి ఊపేస్తూ. ‘‘మరి నా పార్టీ సంగతేంటి’’ అంది తనూ చేతులు రెండూ నడుముకు ఆన్చి, డిమాండ్ చేస్తున్నట్టుగా. ‘‘ఇస్తాలేవే’’ అంటూ చెల్లెలి నెత్తిమీద మొట్టింది ప్రీతి. ఈ సందడికి వంటింట్లోంచి వచ్చిన రోషిణి కూతురి ప్రయోజకత్వాన్ని చూసి పొంగిపోయింది. ‘‘నాకు తెలుసురా నువ్వు అనుకున్నది సాధిస్తావని’’ అంది కళ్లొత్తుకుంటూ. ‘‘అమ్మో... అమ్మ మళ్లీ ట్యాప్ తిప్పింది’’ అన్నాడు హితేష్ భయం నటిస్తూ. అందరూ ఫక్కుమన్నారు. ఆ రోజంతా ఆ ఇంట నవ్వుల పువ్వులు విరబూశాయి. మే 2, 2013... ముంబై రైల్వేస్టేషన్. గరీబ్థ్ ్రవచ్చి ప్లాట్‌ఫామ్ మీద ఆగింది. ఎస్ 2 బోగీలోంచి ప్రీతి జింక పిల్లలా చెంగున దిగింది. ఆ వెనుకే ఆమె తల్లిదండ్రులు, బాబాయ్ వినోద్, పిన్ని సునీత దిగారు. అందరూ కలిసి ‘ఎగ్జిట్’వైపు నడవడం మొదలు పెట్టారు. కబుర్లు చెబుతూ హుషారుగా అడుగులు వేస్తోన్న ప్రీతి... తన భుజాన్ని ఎవరో తట్టినట్టు అనిపించడంతో ఆగి వెనక్కి చూసింది. ఎవరో వ్యక్తి. ముఖానికి గుడ్డ కట్టుకున్నాడు. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతడెవరో పోల్చుకుందామని ప్రయత్నిస్తుండగానే అతడి చేయి పైకి లేచింది. ప్రీతి శరీరం భగ్గుమంది. ‘అమ్మా’ అంటూ ప్రీతి అరిచిన అరుపు కొన్ని కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. నేలకూలింది ప్రీతి. ఒళ్లంతా మైనంలా కరిగిపోతోంది. రక్తం ఉబికి వస్తోంది. ఒళ్లు కాలిన వాసన గుప్పుమంటోంది. ‘‘ఎవరో యాసిడ్ పోశారు’’ అరిచాడో వ్యక్తి. అమర్‌సింగ్, రోషిణిల గుండెలు అదిరిపోయాయి. ‘ప్రీతీ’ అంటూ కూతురి దగ్గరకు పరుగులు తీశారు. ఒళ్లంతా మంటలు పుడుతోంటే తాళలేక హృదయ విదారకంగా ఏడుస్తోంది ప్రీతి. ‘‘నా బిడ్డని కాపాడండి’’... కేకలు పెట్టింది రోషిణి.అంతలో రైల్వే పోలీసులు వచ్చారు. ప్రీతిని బ్లాంకెట్‌లో చుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ‘‘మీ అమ్మాయికి ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా?’’... ఆ ప్రశ్న వింటూనే ఇబ్బందిగా కదిలాడు అమర్‌సింగ్. రోషిణి మాత్రం... ‘‘మా అమ్మాయి అలాంటిది కాదు సర్’’ అంది ఆవేశంగా. ‘‘ప్రేమించడం తప్పేమీ కాదమ్మా. సాధారణంగా యాసిడ్ దాడులకు పాల్పడేవాళ్లు ప్రేమికులో, ప్రేమిస్తున్నామని వెంటబడే రోమియోలో అయివుంటారు. పోనీ మీ అమ్మాయిని ఎవరైనా వేధిస్తున్నారా?’’ ‘‘లేదు సర్. అలాంటిదేమైనా ఉంటే తను మాకు చెప్పేది.’’ తల పంకించాడు ఇన్స్పెక్టర్. ‘‘సరే... మేం ఇన్వెస్టిగేట్ చేస్తాం’’ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అతడి దృష్టి మొత్తం ప్రీతికెవరైనా బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా అన్నదాని మీదే ఉంది. ఆ దిశగానే ఎంక్వయిరీ మొదలు పెట్టాడు. విచారణలో ప్రీతికి ముగ్గురు అబ్బాయిలతో స్నేహం ఉందని తెలిసింది. కానీ ఆ ముగ్గురూ ఆమెకి మంచి స్నేహితులని నిరూపణ కూడా అయ్యింది. పైగా సంఘటన జరిగినప్పుడు వారిలో ఎవ్వరూ ముంబైలో కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ లేరు. దాంతో వారిని తన లిస్టు లోంచి తీసేశాడు. పలు కోణాల్లో పరిశోధించాడు కానీ ఫలితం లేకపోయింది. అంతలో ప్రీతి పరిస్థితి విషమించింది. ఒక కన్ను పోయింది. ముఖం, చెవులు, మెడ, మిగతా శరీరమంతా బాగా కాలిపో యింది. లోపలి అవయవాలు సైతం బాగా దెబ్బతినడంతో నెల రోజుల తర్వాత కన్నుమూసింది. చనిపోయే వరకూ ఆమె ఒక్కటే ప్రశ్న అడిగింది... ‘నాకెందుకిలా జరిగింది, నేనేం పాపం చేశాను’? ఆ ప్రశ్నకు సమాధానం దాదాపు 9 నెలల తరువాత తెలిసింది పోలీసులకు. గుర్గావ్ నుంచి రవి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రీతి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలుసన్నాడు. అతడిచ్చిన వివరాలను బట్టి, ప్రీతి పక్కింటి అబ్బాయి అంకుర్ పన్వర్ (21)ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రీతిని అంకుర్ ప్రేమించాడేమో అన్న ఆలోచనతో ఉన్న పోలీసులకు అతగాడు చెప్పిన కారణం విని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.అంకుర్ ప్రీతిని ప్రేమించలేదు. అతడికసలు ఆ ఆలోచన కూడా లేదు. అయినా కూడా ప్రీతిని చంపేయాలనుకున్నాడు. అందుకు కారణం... అసూయ. అంకుర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. కానీ దాని మీద శ్రద్ధ లేదు. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో తిరుగుతాడు. పార్టీలంటూ టైమ్ వేస్ట్ చేస్తాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కోప్పడుతూ ఉండేవారు. ‘ప్రీతిని చూసి నేర్చుకో, ఎంత చక్కగా చదువుతుందో’ అంటూ క్లాస్ పీకేవారు. వాళ్లు అలా అన్న ప్రతిసారీ ప్రీతి మీద కోపం ముంచుకొచ్చేది. అది కాస్తా ఆమెకు ఉద్యోగం వచ్చేసరికి హద్దులు దాటింది. ‘ప్రీతి అనుకున్నది సాధించింది, నీకు సెటిల్మెంట్ గురించి టెన్షనే లేదు’ అని ఇంట్లోవాళ్లు అనగానే రక్తం మరిగిపోయింది. ఆ ఆవేశంలోనే ప్రీతిని చంపేందుకు స్కెచ్ వేశాడు. ఆమెతోపాటు ముంబై బయలుదేరాడు. రైల్లోనే యాసిడ్ పోయాలనుకున్నాడు కానీ అందరూ ఉండటంతో కుదరలేదు. రైలు దిగాక తాను అనుకున్నది చేశాడు. తన పైశాచికత్వానికి ఆ బంగారు తల్లిని బలి తీసుకున్నాడు. ప్రీతి ఏ పాపం చేయలేదు. అంకుర్ అసూయ జ్వాలలకు ఆహుతైపోయింది... అంతే. కేవలం ద్వేషంతో అంకుర్ చేసిన పని... ఆమె కలల్ని మొదలంట నరికేసింది. ఆమె జీవితాన్నే అంతం చేసింది. ఆమెని అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టింది. ఓ క్షణం ఆలోచిస్తే... ఆవేశం చల్లారిపోతుంది. వాస్తవం స్ఫురిస్తుంది. కర్తవ్యం బోధపడుతుంది. మంచీ చెడుల విచక్షణ తెలుస్తుంది. ఆ ఒక్క క్షణం.. చాలా విలువైనది. అది... కొన్ని జీవితాలను నిలబెడుతుంది. కొన్ని జీవితాలను కూలదోస్తుంది. అందుకే ఏదైనా చేసేముందు ఒక్క క్షణం ఆలోచించండి. అప్పుడు మరో అంకుర్ తయారవ్వడు. మరో ప్రీతి బలవ్వదు. మరే తల్లీ కడుపుకోతతో విలవిల్లాడదు! - సమీర నేలపూడి -
జీవితాన్ని ఈదుతూ..తోటివారి కోసం పరిగెడుతూ..
పొద్దునే క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్, సాయంత్రం స్విమ్మింగ్. పద్దెనిమిదేళ్ల ప్రీతి దినచర్యలో క్రికెట్, స్విమ్మింగ్ తప్ప మరేం ఉండేవి కావు. 1998 జూలై 11 తర్వాత..ప్రీతికి జరిగిన ప్రమాదం ఆమె బతుకుచిత్రాన్ని మార్చేసింది. ప్రీతి మాటల్లో చెప్పాలంటే...‘నాకు ఈ జీవితంలో రెండు జన్మలు. ఒకటి ప్రమాదానికి ముందు, రెండోది ప్రమాదానికి తర్వాత. ఈ కొత్త జన్మలో నాకు చేతులు, కాళ్లు పని చేయవు’ అని నవ్వుతూ చెప్పే ప్రీతి పదేళ్ల తర్వాత మరోరూపంలో సెలబ్రిటీ అయ్యింది. వికలాంగుల సంక్షేమంకోసం ‘సోల్‌ఫ్రీ’ అనే సంస్థని స్థాపించి తోటివారికి అండగా నిలబడింది. ఈ ఛాంపియన్ గురించి మరిన్ని వివరాలు... స్నేహితులతో విహారయాత్రకెళ్లిన ప్రీతి తిరిగొస్తూ పాండిచ్చేరి బీచ్ దగ్గర ఆగారు. స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి సిద్ధమైన ప్రీతి సముద్రం ఒడ్డున ఎత్తుగా ఉన్న రాయి ఎక్కి నీళ్లలోకి దూకింది. నీళ్లలోకి దూకగానే ప్రీతి గట్టిగా అరిచింది... చుట్టూ ఉన్న స్నేహితులు ఆమెను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. ‘ఈత రాని అమ్మాయి నీళ్లలోకి వెళ్లడం దేనికంటూ’ చుట్టూ మూగిన వాళ్లు అంటుంటే....ప్రీతి స్నేహితురాలు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రీతి స్విమ్మింగ్‌లో స్టేట్ ఛాంపియన్. తమిళనాడు అండర్ -19 ఉమెన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్ కూడా. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగానే డాక్టర్లు చెప్పిన మాటలు విని ప్రీతి స్నేహితులు భోరుమన్నారు. ‘ప్రీతికి మెడ నుంచి కిందభాగమంతా పెరాలసిస్ అటాక్ అయ్యింది. చెయ్యి, కాలు...ఏదీ పనిచేయదు’ అన్నారు. కానీ ఓ ఏడాది తర్వాత ప్రీతి నోట వచ్చిన మాటలకు అదే స్నేహితులు ‘సలామ్’ అన్నారు. ‘నేను రెండో జన్మ ఎత్తా. ఈ జన్మలో నాకు కాళ్లు, చేతులూ లేవు. కేవలం మెదడు, మనసూ మాత్రమే ఉన్నాయి. వాటితో పరుగులు పెడతాను, అవసరమైతే ఈత కూడా కొడతాను’ అని ప్రీతి అన్న మాటలు వికలాంగులనే కాదు మిగతావారిని కూడా ఆలోచింపజేశాయి. ‘సోల్‌ఫ్రీ’ పేరుతో వికలాంగులకు ప్రీతి చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి. రెండు క్రీడల రాణి... చెన్నైకి చెందిన ప్రీతికి ఊహ తెలిసిననాటినుంచే క్రికెట్ అంటే ఇష్టం. తొమ్మిదేళ్ల వయసులోనే ఇంటిదగ్గర అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. బిడ్డ ఇష్టాన్ని కాదనలేక ప్రీతి తండ్రి ఆమెకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. ప్రీతికి చదువొక ఎత్తై, క్రికెట్ ఒక ఎత్తు. ఇష్టానికి పట్టుదల తోడవడంతో ప్రీతి ఇంటర్మీడియట్లో ఉండగా స్టేట్ అండర్ -19 ఉమెన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్ అయ్యింది. అప్పటికి ఉన్న రికార్డులు బద్దలుగొడుతూ తన సొంత రికార్డులు సృష్టించిన ప్రీతి విజయం వెనకున్న రహస్యం ఆమె స్విమ్మింగ్‌లో కూడా స్టేట్ ఛాంపియన్ కావడం. ఒకే సమయంలో రెండు క్రీడల్లో తనదైన ముద్రలు వేస్తూ ముందుకెళుతున్న ప్రీతి అనుకోకుండా ఎదురైన చేదు సంఘటన వల్ల సర్వస్వం కోల్పోయింది. కెరటం దెబ్బకి... అసలేం జరిగిందంటే... ఓ వీకెండ్ సరదాగా స్నేహితులతో బీచ్‌కి వెళ్లిన ప్రీతి ఎత్తుగా ఉన్న రాయి ఎక్కి అక్కడినుంచి నీళ్లలోకి దూకింది. నీళ్లలో ఉన్న రాయి తగిలి ప్రీతి స్పృహ తప్పిందనుకున్నారంతా. కాని ప్రీతికి తగిలింది రాయి కాదు వేగంగా వస్తున్న అల తాకిడికి ప్రీతి శరీరం మొత్తం షాక్‌కి గురైంది. వెంటనే దగ్గరగా ఉన్న పాండిచ్చేరిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ‘వెన్నెముకకి బలమైన గాయం అవడం వల్ల శరీరంలోని అవయవాల కదలిక ఆగిపోయిందని’ చెప్పారు డాక్టర్లు. అక్కడ చికిత్సకు కావాల్సిన పరికరాలు లేకపోవడం వల్ల తమిళనాడుకి తీసుకెళ్లమన్నారు. తమిళనాడు ఆసుపత్రికి వస్తే...‘ఇది యాక్సిడెంట్ కేస్’ అని ఇంకొంత సమయం వృథా చేశారు. అసలు చికిత్స మొదలుపెట్టేసరికి నాలుగు గంటల సమయం గడచిపోయింది. ‘యాక్సిడెంట్ జరిగిన గంటలోగా ఆసుపత్రికి తీసుకువస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉండేద’ని డాక్టరు చెప్పిన మాటలు ప్రీతి తల్లిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను వీల్‌చైర్‌లో చూస్తున్నందుకు ఇంకా కన్నీరు కారుస్తూనే ఉంది ఆ తల్లి. చేదు అనుభవాలు... ఏడాదిపాటు సుదీర్ఘ చికిత్స తర్వాత ప్రీతికి ఇక వీల్‌చైర్ చక్రాలే కాళ్లని అర్థమయ్యాయి. ఆటలు ఆగిపోయాయి. చదువు ఆగకూడదనుకుని డిగ్రీలో చేరడానికి తండ్రిని తీసుకుని కాలేజీకి వెళ్లింది. ప్రీతి సర్టిఫికెట్లు చూసి ‘శభాష్’ అన్న అధ్యాపకులు కాలేజీలో సీటు మాత్రం ఇప్పించలేకపోయారు. కారణం...ఆ కాలేజీ తరగతిగదులు వీల్‌చైర్ వాడకానికి అనుకూలంగా లేవు. అప్పుడు ప్రీతి బాధపడింది తనకు సీటు రానందుకు కాదు. తోటి వికలాంగుల దుస్థితి గురించి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రీతిని వెంటాడిన సమస్యలు రెండే రెండు. ఒకటి వెన్నెముక గాయానికి ఎమర్జన్సీ చికిత్స అందరికీ అందుబాటులో లేకపోవడం. రెండోది వికలాంగులకు కళాశాల చదువులు సుదూర స్వప్నాలని తెలియడం. తన కొత్త జీవితంలో ఈ రెండు సమస్యలనూ రెండు క్రీడల్లా భావించింది. ‘సోల్‌ఫ్రీ’ అనే సంస్థని నెలకొల్పి వెన్నెముకకు గాయమైనవారికి ఎమర్జెన్సీ సౌకర్యం కోసం ఒక టోల్‌ఫ్రీ నెంబర్ని పెట్టింది. రెండోది వికలాంగులకు పై చదువుల అవసరాన్ని చెబుతూ వారికి ఉపాధి అవకాశాలను వెదికి పెడుతోంది. సోల్‌ఫ్రీ ఏం చేస్తుంది? వెన్నెముకకు మాత్రమే ప్రమాదం జరిగినవారు ‘సోల్‌ఫ్రీ’ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేసి చెబితే వెంటనే అంబులెన్స్‌ని పంపడం, దగ్గర్లోని ఆసుపత్రి సమాచారం చెప్పడం, ఈలోగా డాక్టర్లతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేయడం వంటి సేవలందిస్తుంది. ఉపాధి అవకాశాల్లేని వికలాంగులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా, టెలిఫోన్ మార్కెటింగ్, బుక్ రీడర్స్‌గా, రేడియో జాకీలుగా శిక్షణ తర్వాత ఉపాధి అవకాశాలు చూపెడుతోంది. ఇంట్లో నుంచే డిగ్రీ పూర్తిచేసిన ప్రీతి తోటి వికలాంగుల సంక్షేమం కోసం ఇంకేం చేయాలో ఆలోచిస్తోంది. ‘‘వికలాంగుల జీవితం ఎలా ఉంటుందో వికలాంగులకు తప్ప మరెవరికీ తెలియదు. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో వికలాంగుల జీవనం మరీ దుర్భరం అని తెలుసుకున్నాను. వారి జీవనవిధానాలను మార్చడం ఒక్కటే నా ముందున్న లక్ష్యం. ఈ సమయంలో నా ప్రతి ఆలోచన సిక్సర్లాగా గాల్లోకి ఎగరకపోవచ్చు. నీటిలో వేగంగా ఈదలేకపోవచ్చు. కానీ ఎవరో ఒకరు మాకోసం గ్రౌండ్లో సాధన చేస్తున్నారనే ధీమాను మాత్రం ఇవ్వగలదు’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న ప్రీతికి మనం కూడా సలామ్ చెబుతాం.