![New Twist In Preeti Assasination Case Ketepalli Mandal Nalgonda - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/17/NLG.jpg.webp?itok=Vxq7OAFy)
మృతురాలు ప్రీతి; పోలీస్ స్టేషన్‌లో నిందితుడు
నల్లగొండ: కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రీతి(17) హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. జూలై 13న వ్యవసాయబావి వద్ద ప్రతీ అనుమానాస్పద స్థితిలో అయితే తమ గ్రామానికే చెందిన దోరెపల్లి పవన్ కొంత కాలంగా ప్రీతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని.. తమ కూతురును అతనే హత్య చేశాడని ఆమె తల్లి నాగమ్మ, బంధువులు పోలీసుల ఎదుట ఆరోపించారు. ఈ ఘటనపై దళిత, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో డీఐజీ రంగనాథ్ రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టడానికి ఎస్పీ సతీష్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రసుత్తం నిందితుడిగా అనుమానిస్తున్న పవన్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
కాగా దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటికి వచ్చాయి. ప్రీతిని హత్య చేయడానికి ముందు ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో ప్రీతి మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ రామకృష్ణను డీఐజీ రంగనాథ్ వీఆర్‌కు అటాచ్ చేశారు. పారదర్శకంగా కేసు విచారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని డీఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. కాగా చనిపోయిన ప్రీతి కుటుంబాన్ని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment