ketepalli
-
మైనర్ ప్రీతి హత్యకేసులో కొత్త ట్విస్ట్
నల్లగొండ: కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రీతి(17) హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. జూలై 13న వ్యవసాయబావి వద్ద ప్రతీ అనుమానాస్పద స్థితిలో అయితే తమ గ్రామానికే చెందిన దోరెపల్లి పవన్ కొంత కాలంగా ప్రీతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని.. తమ కూతురును అతనే హత్య చేశాడని ఆమె తల్లి నాగమ్మ, బంధువులు పోలీసుల ఎదుట ఆరోపించారు. ఈ ఘటనపై దళిత, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో డీఐజీ రంగనాథ్ రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టడానికి ఎస్పీ సతీష్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రసుత్తం నిందితుడిగా అనుమానిస్తున్న పవన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటికి వచ్చాయి. ప్రీతిని హత్య చేయడానికి ముందు ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో ప్రీతి మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రామకృష్ణను డీఐజీ రంగనాథ్ వీఆర్‌కు అటాచ్ చేశారు. పారదర్శకంగా కేసు విచారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని డీఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. కాగా చనిపోయిన ప్రీతి కుటుంబాన్ని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. -
మా ప్రీతిని కచ్చితంగా పవనే హత్య చేశాడు
కేతేపల్లి: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని కొప్పోలులో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన చింతమళ్ల దశరథ అలియాస్ శ్రీను, నాగమ్మ దంపతుల కుమార్తె ప్రీతి(17) నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో ఉంటోంది. మూడు రోజుల క్రితం ప్రీతి స్వగ్రామానికి వచ్చింది. సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో పడుకుంది. అర్ధరాత్రి తర్వాత శ్రీను లేచి చూసే సరికి ప్రీతి కనిపించలేదు. ఇంట్లో ఉన్న ఇతర గదులతో పాటు బాత్రూంలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామంలో రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. వ్యవసాయ భూమిలో విగతజీవిగా... మంగళవారం ఉదయం కొప్పోలు శివారులోని రైస్‌మిల్లు వెనుక ఉన్న రైతు నంద్యాల వాసుదేవరెడ్డి వ్యవసాయ భూమిలో ప్రీతి విగతజీవిగా పడి ఉంది. ప్రీతి మెడ చుట్టూ చున్నీ బిగించి లాగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. నోట్లోనుంచి నురగలు వస్తున్నాయి. మృతదేహం వద్ద పగిలిన బీరుసీసా గాజు పెంకులు పడి ఉన్నాయి. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడి వెళ్లి చూడగా ప్రీతి మృతిచెంది ఉంది. ప్రీతి తమ్ముడు అనారోగ్యంతో ఏడాది కిత్రం మృతిచెందాడు. ఏడాది కాల వ్యవధిలోనే తమకున్న ఇద్దరు సంతానం మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వ్యవసాయ భూమిలో ప్రీతి మృతదేహం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సమాచారం అందుకున్న కేతేపల్లి ఎస్ఐ బి.రామక్రిష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం రాత్రి ప్రీతి ఫోన్లో ఎవరెవరితో మాట్లాడింది? ప్రీతిది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హత్య చేశారని ఆరోపణలు కొంత కాలంగా ప్రీతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న గ్రామానికి చెందిన దోరెపల్లి పవన్ తన కూతురును హత్య చేశాడని ఆమె తల్లి నాగమ్మ, బంధువులు ఆరోపిస్తున్నారు. విష యం తెలిసి తాము పవన్‌ను మందలించడంతో ప్రీతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తమను కూడా నమ్మించాడని తెలిపారు. ప్రేమిస్తున్న తనతో కాకుండా నల్లగొండలో ఇతరులతో తిరుగుతున్నాంటూ పవన్ ప్రీతిపై అనుమానం పెంచుకున్నాడని, ఈ క్రమంలో ఇటీవల ఇంటికి వచ్చి కూతురుపై చేయి చేసుకున్నాడని, చంపుతానంటూ బెదిరించాడని వాపోయారు. రాత్రి తమతో ఇంట్లో పడుకున్న ప్రీతికి ఫోన్లో మాయమాటలు చెప్పి, బయటికి రప్పించి హత్య చేశాడని ఆరోపించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
వృద్ధురాలి మీదినుంచి వెళ్లిన ట్రాక్టర్.. కేతేపల్లి, న్యూస్‌లైన్ : ట్రాక్టర్ ట్రాలీ కింద నిద్రిస్తున్న వృద్ధురాలి మీదుగా అదే ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన చెర్కుపల్లి ఐకేపీ కేం ద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నిమ్మనగోటి రాములమ్మ(75) వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులనుంచి ధాన్యం యాచించేందుకు మంగళవారం ఐకేపీ కేంద్రానికి వెళ్లింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధాన్యం రాశుల పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టరుట్రాలీ కింద నీడలో విశ్రమించింది. గమనించని ట్రాక్టరు డ్రైవరు ఇంజిన్ స్టార్ట్ చేసి వెనక్కిపోనిచ్చాడు. రాములమ్మకు వినికిడి లోపం ఉండడంతో ట్రాక్టరు స్టార్టు అయిన విషయం తెలియక అలాగే ఉండిపోయింది. దీంతో రాములమ్మ తలమీదుగా ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి కుటుంబీకులు, గ్రామస్తులు అందించిన సమాచారంతో కేతేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బైక్ పైనుంచి పడి.. కోదాడ రూరల్, న్యూస్‌లైన్ : బైక్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండల పరిధిలోని తొగర్రాయి సబ్‌స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన చిత్తలూరి కిరణ్‌కుమార్ (36) తన జేసీబీల పనినిమిత్తం కోదాడకు వచ్చాడు. పని ముగిసేసరికి రాత్రి అయ్యింది. తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలోని తొగర్రాయి సబ్‌స్టేషన్ సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో కిరణ్‌కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. రోడ్డువెంట వెళ్తున్న వారు గమనించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని అతన్ని కోదాడకు తరలించి చికిత్స చేస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు హెడ్ కానిస్టేబుల్ సత్యం తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు డ్రైవర్లు, మహిళ దుర్మరణం
హైదరాబాద్: చిత్తూరు, గుంటూరు, నల్గొండ జిల్లాలలోలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు డ్రైవర్లు, ఒక మహిళ మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీనడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల డ్రైవర్లు మృతి చెందారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం వేపూరికోట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌ను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నల్గొండ జిల్లా కేతేపల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై నడుస్తున్న మహిల అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ పంజాగుట్టలో స్కోడా కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగలేదు.