హైదరాబాద్తోపాటు చిత్తూరు, గుంటూరు, నల్గొండ జిల్లాలలోలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు డ్రైవర్లు, ఒక మహిళ మృతి చెందారు.
హైదరాబాద్: చిత్తూరు, గుంటూరు, నల్గొండ జిల్లాలలోలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు డ్రైవర్లు, ఒక మహిళ మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీనడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల డ్రైవర్లు మృతి చెందారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం వేపూరికోట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌ను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నల్గొండ జిల్లా కేతేపల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై నడుస్తున్న మహిల అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ పంజాగుట్టలో స్కోడా కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగలేదు.