brahmanapalli
-
డార్క్ రూమ్ లో చిత్రహింసలు
-
బ్రహ్మణపల్లి రైల్వే స్టేషన్లో విషాదం
-
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
కూడేరు : ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్మకూరు మండల కేంద్రం నుంచి కూడేరు మండలం బ్రాహ్మణపల్లికి మంగళవారం ఇసుకలోడుతో ట్రాక్టర్ బయల్దేరింది. పి.నారాయణపురం వద్దకు రాగానే మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీలో కూర్చున్న ఆత్మకూరుకు చెందిన శివారెడ్డి(48)పై ఇసుకంతా పడింది. దీంతో ఊపిరాడక ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించారు. మృతుడికి భార్య ప్రమీలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్రాహ్మణపల్లిలో అగ్ని ప్రమాదం
వైఎస్సార్(గోపవరం): వైఎస్సార్ జిల్లా గోపవరం మండలంలోని బ్రాహ్మణపల్లిలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 20 పూరి గుడిసెలు పూర్తిగా కాలి పోయాయి. ప్రజలందరూ కూలీ పనికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానిగల కారణాలు తెలియాల్సి ఉంది. -
పాముతో 40 నిమిషాలు !
హైదరాబాద్ : ఒకటి..రెండు కాదు ఏకంగా నలభై నిమిషాలు ఓ విషసర్పం వృద్ధురాలి కాలిని చుట్టుకుంది. అది ఎక్కడ కాటు వేస్తుందోనని ఆమె వణికిపోయింది. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటన మంగళవారం హయత్నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో వృద్ధురాలు కొండ్రు బాలమ్మ (91) ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఉంది. చెట్ల పొదల నుంచి వచ్చిన తాచుపాము ఆమె కాలుకు చుట్టుకుంది. దీంతో ఆమె భయంతో వణికిపోయింది. సుమారు 40 నిముషాల పాటు ఆమె కాలుకు పాము చుట్టుకుని ఉంది. దీన్ని గమనించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చెందారు. కాటు వేయకుండా పాము వెళ్లిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హయత్నగర్ 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బాలమ్మకు ప్రథమ చికిత్స అందించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు డ్రైవర్లు, మహిళ దుర్మరణం
హైదరాబాద్: చిత్తూరు, గుంటూరు, నల్గొండ జిల్లాలలోలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు డ్రైవర్లు, ఒక మహిళ మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీనడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల డ్రైవర్లు మృతి చెందారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం వేపూరికోట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నల్గొండ జిల్లా కేతేపల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డుపై నడుస్తున్న మహిల అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ పంజాగుట్టలో స్కోడా కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగలేదు.