
బ్రాహ్మణపల్లిలో అగ్ని ప్రమాదం
వైఎస్సార్(గోపవరం): వైఎస్సార్ జిల్లా గోపవరం మండలంలోని బ్రాహ్మణపల్లిలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 20 పూరి గుడిసెలు పూర్తిగా కాలి పోయాయి. ప్రజలందరూ కూలీ పనికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానిగల కారణాలు తెలియాల్సి ఉంది.