ఆర్మీలో తొలి మహిళా సుబేదార్‌గా ప్రీతి | Preeti Rajak is Indian Army first woman Subedar | Sakshi
Sakshi News home page

ఆర్మీలో తొలి మహిళా సుబేదార్‌గా ప్రీతి

Published Sun, Jan 28 2024 5:47 AM | Last Updated on Sun, Jan 28 2024 5:47 AM

Preeti Rajak is Indian Army first woman Subedar - Sakshi

న్యూఢిల్లీ: ట్రాప్‌ షూటర్‌గా అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణి, ఆర్మీ హవాల్దార్‌ ప్రీతీ రజక్‌ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో సుబేదార్‌గా పదోన్నతి సాధించి, ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. 19వ ఆసియా గేమ్స్‌లో టీమ్‌ ఈవెంట్‌లో వెండి పతకం సాధించి ఛాంపియన్‌ ట్రాప్‌ షూటర్‌గా పేరొందిన ప్రీతీ 2022లో సైన్యంలో చేరారు.

కార్ప్స్‌ ఆఫ్‌ మిలిటరీ పోలీస్‌లో హవాల్దార్‌గా విధుల్లో చేరారు. ఇలా చేరిన తొలి క్రీడాకారిణి కూడా ఆమే! ట్రాప్‌ విమెన్‌ ఈవెంట్‌ విభాగంలో ప్రీతి దేశంలో ఆరో ర్యాంకర్‌. పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌ కోసం ఆర్మీ మార్క్‌మ్యాన్‌షిప్‌ యూనిట్‌లో శిక్షణ పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement