promoted
-
తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి
-
టీచర్ల బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్య కమిషనర్ ఎ.దేవసేన శుక్రవారం విడుదల చేశారు. రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు సంబంధించి శనివారం నుంచి మొదలయ్యే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 18,495 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మినహా మిగతాచోట్ల కోర్టు కేసు లు పరిష్కారం కావడంతో అన్ని స్థాయిల ప్రమో షన్లను ఏకకాలంలో చేపడుతున్నారు.వాస్తవానికి టీచర్ల పదోన్న తులు, బదిలీల ప్రక్రియను 2023 ఫిబ్రవరిలోనే మొదలుపెట్టారు. కానీ నోటిఫి కేషన్ ఇచ్చిన వెంటనే నాన్ స్పౌజ్‌లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్టులో కోర్టు బదిలీలు, పదోన్నతులపై స్టే ఇచ్చింది.తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడంతో స్టే ఎత్తివేసింది. దీంతో సెప్టెంబర్‌లో షెడ్యూల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మల్టీజోన్–1లో హెచ్ఎంల స్థాయిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. హెచ్ఎంలు (గ్రేడ్–2) 1,788 మందికి, స్కూల్ అసిస్టెంట్లు, సమాన కేడర్‌కు చెందిన 10,684 మందికి పదోన్నతులు కల్పించారు.ఈ సమయంలోనే జోన్ వివాదం తలెత్తడంతో జోన్–2లో హెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులు చేపట్టాలని భావించారు. కానీ ప్రమోషన్లకు టెట్ అర్హత ఉండాలన్న ఎన్సీటీఈ నిబంధనను క్రోడీకరిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే ఇవ్వడంతో మళ్ళీ పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా కేసులు పరిష్కారం కావడం, 2010 ఆగస్టు 23 కన్నా ముందు నియామకం జరిగిన టీచర్లకు టెట్ అవసరం లేదని ఎన్సీటీఈ స్పష్టత ఇవ్వడంతో బదిలీలు, ప్రమోషన్లకు మార్గం సుగమం అయ్యింది.ఎంతమందికి పదోన్నతులు?కేటగిరీ పదోన్నతి లభించే వారుహెచ్ఎం గ్రేడ్–2 763స్కూల్ అసిస్టెంట్ 5,123ప్రైమరీ స్కూల్ హెచ్ఎం 2,130లాంగ్వేజ్ పండిట్లు,స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజ్),స్కూల్ అసిస్టెంట్లు 10,479(ఫిజికల్ ఎడ్యుకేషన్) మొత్తం 18,495 -
ఆర్మీలో తొలి మహిళా సుబేదార్‌గా ప్రీతి
న్యూఢిల్లీ: ట్రాప్ షూటర్‌గా అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారిణి, ఆర్మీ హవాల్దార్ ప్రీతీ రజక్ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో సుబేదార్‌గా పదోన్నతి సాధించి, ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. 19వ ఆసియా గేమ్స్‌లో టీమ్ ఈవెంట్లో వెండి పతకం సాధించి ఛాంపియన్ ట్రాప్ షూటర్‌గా పేరొందిన ప్రీతీ 2022లో సైన్యంలో చేరారు. కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో హవాల్దార్‌గా విధుల్లో చేరారు. ఇలా చేరిన తొలి క్రీడాకారిణి కూడా ఆమే! ట్రాప్ విమెన్ ఈవెంట్ విభాగంలో ప్రీతి దేశంలో ఆరో ర్యాంకర్. పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్ కోసం ఆర్మీ మార్క్‌మ్యాన్‌షిప్ యూనిట్లో శిక్షణ పొందుతున్నారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ రావు, జస్టిస్ భట్టి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులుగా పదోన్నతి పొందారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మామిడాన సత్యరత్న శ్రీరామచంద్రరావు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సారస వెంకటనారాయణ భట్టి అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన జస్టిస్ రావు 2021లో జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు కొంతకాలం పాటు తాత్కాలిక సీజేగా సేవలందించారు. జస్టిస్ భట్టి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె. వీరితో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్‌కుమార్ గంగాపూర్వాలా (మద్రాస్ హైకోర్టు), జస్టిస్ రమేశ్ దేవకీనందన్ ధనూకా (బాంబే హైకోర్టు), జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి (రాజస్తాన్) కూడా పదోన్నతి పొందారు. జస్టిస్ ధనూకా ఈనెల 30న రిటైరవుతున్నారు. -
31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు కేసులున్నందున తుదితీర్పునకు లోబడి ఈ పదోన్నతులుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందినవారిలో ఆర్.డి.మాధురి, బి.రోహిత్‌సింగ్, ఎ.పద్మశ్రీ, గుగులోతు లింగ్యానాయక్, మహ్మద్ అసదుల్లా, కె.వి.వి.రవికుమార్, డి.రాజ్యలక్ష్మి, కనకం స్వర్ణలత, జి.వెంకటేశ్వర్లు, వి.భుజంగరావు, డి.వెంకటమాధవరావు, ఎం.వెంకటభూపాల్‌రెడ్డి, చీర్ల శ్రీనివాసులు, ఎస్.తిరుపతిరావు, చీమలపాటి మహేందర్‌జీ, కె.గంగాధర్, బి.కిషన్‌రావు, ఎస్.సూరజ్‌కుమార్, ఇ.వెంకటాచారి, వి.విక్టర్, ఎల్.కిశోర్‌కు మార్, పి.అశోక్‌కుమార్, ఎం.విజయలక్ష్మి, జె.శ్రీనివాస్, డి.విజేందర్‌రెడ్డి, కె.శ్యామలాదేవి, కె.వీరబ్రహ్మచారి, జె.ఎల్.బి.హరిప్రియ, కె.లక్ష్మి కిరణ్, డి.వేణు, టి.ఎల్.సంగీత ఉన్నారు. కాగా, డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, తహసీల్దార్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కు కృతజ్ఞతలు తెలిపాయి. -
AP: 36 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 36 మంది డీఎస్పీ (సివిల్)లకు అదనపు ఎస్పీలు (సివిల్)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో ఐదుగురు 2020 నుంచి అడ్హాక్ పద్ధతిలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందిని మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోం శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. -
పరీక్షల్లేకుండానే పై క్లాసులకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపాలని ఏప్రిల్ 19న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని అదేరోజు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. చదవండి: సెప్టెంబర్ 1నుంచి ఇంజనీరింగ్ క్లాసులు విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించరాదని స్పష్టంచేశారు. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామ్‌చంద్రన్ మంగళవారం ఉత్తర్వులు (జీవో 54) జారీచేశారు. కరోనా నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో 1 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్–2 (వార్షిక) పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారందరినీ 2020–21 విద్యా సంవత్సరంలో పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. చదవండి: జూలై 26న నీట్ -
పరీక్షల్లేవ్.. అందరూ పాస్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయా సంవత్సరాంత పరీక్షలను రద్దు చేసి, ఆ విద్యార్థులంతా పాస్ (ఉత్తీర్ణులు) అయినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా పరీక్షల వాయిదా తదితర నిర్ణయాలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం లాక్డౌన్ దృష్ట్యా స్కూళ్లు మూతపడినందున నేరుగా విద్యార్థుల ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, చిక్కీ, గుడ్ల పంపిణీని సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. అన్ని చోట్లా ఒకే నాణ్యత ఉండాలని, గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకోసం వలంటీర్ల సహాయాన్ని తీసుకోవాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 31న సమీక్ష తర్వాత పది పరీక్షల షెడ్యూల్: మంత్రి సురేష్ ►ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు, అధికారులకు కూడా మంచిది కాదు. అందుకే సీఎం ఆదేశాల మేరకు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు అవకాశం కల్పిస్తున్నాం. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ మెమో 92 విడుదల చేసింది. ►పదో తరగతి పరీక్షలను ఇప్పటికే వాయిదా వేశాం. ఈ నెల 31న జరిగే సమీక్ష తరువాత పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తాం. ►దీనిపై విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దు. ►విద్యార్థుల ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకులను అందించాలని నిర్ణయించాం. వలంటీర్ల ద్వారా పంపిణీ సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
సుప్రీంకోర్టు జడ్జీలుగా ఇద్దరికి పదోన్నతి!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జనవరి 10న సమావేశమైన కొలీజియం వీరిద్దరికి పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 12న అప్పటి కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని తాజా సమావేశంలో న్యాయమూర్తులు సమర్థించారు. ‘సుప్రీంకోర్టు జడ్జీలుగా సిఫార్సు చేసిన వ్యక్తులు అన్నివిధాలుగా అర్హులైనవారు, సమర్థులు’ అని కొలీజియం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. -
జస్టిస్ జోసెఫ్ పదోన్నతిపై నిర్ణయం వాయిదా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించే విషయంపై సుప్రీం కోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్‌కు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం గత వారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కోర్టు కార్యకలాపాలు ముగిసిన అనంతరం సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జస్టిస్ జోసెఫ్ అంశం కాకుండా కొలీజియంఎజెండాలో కలకత్తా, రాజస్తాన్, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లోని కొందరు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించే అంశంపైనా చర్చ జరిగింది. అయితే నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సమావేశం తీర్మానం కాపీని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం కోర్టుకు హాజరుకాని జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అయితే కొలీజియం తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందనే విషయంపై ఎటుంటి అధికారికా ప్రకటనా వెలువడలేదు. -
పరీక్షలయ్యాక బడికెళ్లాల్సిందే
నల్లజర్ల : వార్షిక పరీక్షలు పూర్తవ్వగానే వేసవి సెలవులు వచ్చేసేవి. ఇకపై ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఇచ్చేందుకు నిర్ణయించినా.. పరీక్షల షెడ్యూల్ మాత్రం మారింది. మరోవైపు వేసవి సెలవులకు నెల రోజుల ముందుగానే విద్యార్థులకు పై తరగతిలో ప్రవేశం కల్పించి.. ఆ పాఠాలను బోధించనున్నారు. ఈ విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తోంది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జి.గంగాభవాని తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విద్యావిధానంలో కొత్త పద్ధతులు అమల్లోకి రానున్నాయని..ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను సరిచేసి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం కూడా తరగతులు కొనసాగుతాయన్నారు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరి నెల రోజుల్లో రెండో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తామని, ఇలా 1నుంచి 9వ తరగతి విద్యార్థులందరికీ పై పాఠాల బోధన ఉంటుందని వివరించారు. దీనివల్ల విద్యార్థులు పై తరగతిలోకి వెళ్లేసరికి వారికి పాఠ్యాం శాలు కొట్టిన పిండిలా మారతాయన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 22వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినమని, అప్పటివరకు దాదాపు నెల రోజులపాటు సంసిద్ధత తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో తదుపరి తరగతులకు సన్నద్ధం చేస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. సీబీఎస్ఈ విధానంలోనూ ఇదే పద్ధతి అమల్లోకి వస్తుందన్నారు. తొలిసారి సమగ్ర మూల్యాంకనం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం చేపట్టేందుకు రంగం సిద్ధమైందని డీఈఓ చెప్పారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో అన్ని సబ్జెక్ట్‌లకు 80 మార్కులకే ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. మిగిలిన 20 మార్కులకు విద్యార్థులు అంతకు ముందు రాసిన పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్నెల్ మార్కులు కలపనున్నట్టు చెప్పారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తుండటం వల్ల ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండబోదన్నారు. టెన్త పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు జిల్లాలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఈఓ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 246 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు 60వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఆమె వెంట కొయ్యలగూడెం డీవైఈవో తిరుమల దాసు ఉన్నారు. -
18 మంది ఎస్సైలకు సీఐలుగా పదోన్నతి
1 సాక్షి, గుంటూరు: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 18 ఎసై ్సలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని ఏలూరు, గుంటూరు రేంజ్ పరిధిలో ఎసై ్సల పదోన్నతులకు బీపీసీ రెండు నెలల క్రితమే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏలూరు రేంజ్ పరిధిలో 42 మంది ఎసై ్సలకు సీఐలుగా పదోన్నతులు ఇస్తూ రెండు నెలల క్రితమే అక్కడి ఐజీ పోస్టింగ్‌లు కేటాయించగా, గుంటూరు రేంజ్ పరిధిలో మాత్రం రెండు నెలలుగా పదోన్నతుల కోసం 18 మంది ఎసై ్సలు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి ఆశలు ఫలించి శుక్రవారం పదోన్నతి లభించింది. పదోన్నతితోపాటు అందరికి సీఐడీ, ఏసీబీ, పీటీసీ వంటి లూప్‌లైన్ లో పోస్టింగ్‌లు ఇచ్చారు. -
అడ్డదారుల పదోన్నతులకు చెక్!
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : విద్యాశాఖలో అడ్డదారుల్లో పదోన్నతులకు ఇకపై చెక్ పడనుంది. పదోన్నతులకు సంబంధించి రెండుసార్లు గైర్హాజరైతే ఇక శాశ్వతంగా పదోన్నతి ఉండదు. పైగా సీనియార్టీ ప్రకారం పెరిగిన స్కేలును కూడా రికవరీ చేస్తారు. పదోన్నతులు వద్దనుకున్నా...సీనియార్టీ ప్రకారం వేతన స్కేలు మాత్రం పెరుగుతుంది. ఉదాహరణకు 1995 డీఎస్సీ ఉపాధ్యాయులు పదోన్నతులు లేకపోయినా 18 ఏళ్ల స్కేలు తీసుకుంటుంటారు. ఇకపై రెండుసార్లు పదోన్నతులను తిరస్కరిస్తే మాత్రం శాశ్వతంగా పదోన్నతులు కోల్పోవడంతో పాటు అప్పటిదాకా వారు పొందిన ఆర్థికపరమైన లబ్ధిని కూడా రికవరీ చేస్తారు. పైగా సర్వీసు పుస్తకంలో నమోదు చేస్తారు. అడ్డదారుల్లో ఇలా.. ఇన్ని రోజులూ కొందరు ఉపాధ్యాయులు ధన, రాజకీయ బలాలను ఉపయోగించి అక్రమంగా పదోన్నతులు పొందారు. ఈ క్రమంలో అర్హత ఉన్నా ఏళ్ల తరబడి దూర ప్రాంతాల్లో పనిచేస్తూ.. ఇక కావాల్సిన చోటుకు వస్తామనే ఆశలు పెట్టుకున్న సామాన్య ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. అక్రమాలకు డీఈఓ కార్యాలయ సిబ్బంది కొందరు పూర్తిస్థాయిలో సహకరించారు. పదోన్నతులకు సంబంధించిన జీఓ 145 అమలుకు తూట్లు పొడిచారు. ఈ జీఓ మేరకు ఒకసారి (ప్యానెల్ జాబితా నుంచి) మినహాయింపు పొందవచ్చు. ఆ తర్వాత ఏడాది ప్రకటించే తొలి ప్యానెల్ జాబితాలో ఖచ్చితంగా (మినహాయింపు పొందిన) పేర్లు నమోదు చేయాల్సి ఉంది. 145 జీఓను అడ్డం పెట్టుకుని కొందరు ఉపాధ్యాయులు యథేచ్చగా అక్రమాలకు పాల్పడ్డారు. ట్రిబ్యునల్‌కు వెళ్లమని సలహాలు ఇస్తూ, ఆ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని డీఈఓ కార్యాలయ సిబ్బంది సీనియార్టీ జాబితాలో చేర్చారు. దూరప్రాంతాల్లో ఖాళీలు ఉన్నప్పుడు జాబితాలో లేని పేర్లు, జిల్లా కేంద్రానికి సమీపంలో ఖాళీలు ఏర్పడే సమయానికి జాబితాలో చేరిపోతుండేవి. జీఓ 145 మేరకు ఒక ఏడాది మినహాయింపు పొంది తర్వాత ఏడాది ప్యానల్ జాబితాలో చేరని వారిని పదోన్నతులు తిరస్కరించినట్లుగా భావించాల్సి ఉంది. అయితే జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్వాకంతో రాజకీయ, ధనబలం ఉన్న ఉపాధ్యాయుల పేర్లు ఎప్పుడుపడితే అప్పుడు సీనియార్టీ జాబితాలో చేరుతుండేవి. తాజాగా విడుదలైన జీఓ 227 మేరకు ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ఉపాధ్యాయుల హర్షం ఈ జీఓ పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన సామాన్య ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని వారంటున్నారు. రెండుసార్లు గైర్హాజరైతే శాశ్వతంగా పదోన్నతి కోల్పోవడంతో పాటు ఆర్థిక లబ్ధిని రికవరీ చేయనుండడంతో ఖచ్చితంగా పదోన్నతులు పొందుతారని చెబుతున్నారు. అధికారులు చిత్తశుద్ధితో 227 జీఓ అమలు చేయాలని కోరుతున్నారు.