1
సాక్షి, గుంటూరు: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 18 ఎసై ్సలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని ఏలూరు, గుంటూరు రేంజ్ పరిధిలో ఎసై ్సల పదోన్నతులకు బీపీసీ రెండు నెలల క్రితమే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏలూరు రేంజ్ పరిధిలో 42 మంది ఎసై ్సలకు సీఐలుగా పదోన్నతులు ఇస్తూ రెండు నెలల క్రితమే అక్కడి ఐజీ పోస్టింగ్‌లు కేటాయించగా, గుంటూరు రేంజ్ పరిధిలో మాత్రం రెండు నెలలుగా పదోన్నతుల కోసం 18 మంది ఎసై ్సలు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి ఆశలు ఫలించి శుక్రవారం పదోన్నతి లభించింది. పదోన్నతితోపాటు అందరికి సీఐడీ, ఏసీబీ, పీటీసీ వంటి లూప్‌లైన్ లో పోస్టింగ్‌లు ఇచ్చారు.