రంగారెడ్డి మినహా నేటి నుంచి ప్రక్రియ మొదలు.. షెడ్యూల్ విడుదల
మొత్తం 18,495 మందికి ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్య కమిషనర్ ఎ.దేవసేన శుక్రవారం విడుదల చేశారు. రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు సంబంధించి శనివారం నుంచి మొదలయ్యే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 18,495 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మినహా మిగతాచోట్ల కోర్టు కేసు లు పరిష్కారం కావడంతో అన్ని స్థాయిల ప్రమో షన్లను ఏకకాలంలో చేపడుతున్నారు.
వాస్తవానికి టీచర్ల పదోన్న తులు, బదిలీల ప్రక్రియను 2023 ఫిబ్రవరిలోనే మొదలుపెట్టారు. కానీ నోటిఫి కేషన్ ఇచ్చిన వెంటనే నాన్ స్పౌజ్‌లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్టులో కోర్టు బదిలీలు, పదోన్నతులపై స్టే ఇచ్చింది.తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడంతో స్టే ఎత్తివేసింది. దీంతో సెప్టెంబర్‌లో షెడ్యూల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మల్టీజోన్–1లో హెచ్‌ఎంల స్థాయిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. హెచ్‌ఎంలు (గ్రేడ్–2) 1,788 మందికి, స్కూల్ అసిస్టెంట్లు, సమాన కేడర్‌కు చెందిన 10,684 మందికి పదోన్నతులు కల్పించారు.
ఈ సమయంలోనే జోన్ వివాదం తలెత్తడంతో జోన్–2లో హెచ్‌ఎంల పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీల పదోన్నతులు చేపట్టాలని భావించారు. కానీ ప్రమోషన్లకు టెట్ అర్హత ఉండాలన్న ఎన్‌సీటీఈ నిబంధనను క్రోడీకరిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే ఇవ్వడంతో మళ్ళీ పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా కేసులు పరిష్కారం కావడం, 2010 ఆగస్టు 23 కన్నా ముందు నియామకం జరిగిన టీచర్లకు టెట్ అవసరం లేదని ఎన్‌సీటీఈ స్పష్టత ఇవ్వడంతో బదిలీలు, ప్రమోషన్లకు మార్గం సుగమం అయ్యింది.
ఎంతమందికి పదోన్నతులు?
కేటగిరీ పదోన్నతి లభించే వారు
హెచ్‌ఎం గ్రేడ్–2 763
స్కూల్ అసిస్టెంట్ 5,123
ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం 2,130
లాంగ్వేజ్ పండిట్లు,
స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజ్),
స్కూల్ అసిస్టెంట్లు 10,479
(ఫిజికల్ ఎడ్యుకేషన్) మొత్తం 18,495
Comments
Please login to add a commentAdd a comment