
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. అన్ని విధాల సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి ప్రమాద వివరాలను మోదీకి రేవంత్ చెప్పారు. చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి సీఎం తెలిపారు. మంత్రులు ఉత్తమ్, మంత్రి జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం రేవంత్ వివరించారు.
సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఈ ఉదయం 8.20గంటల ప్రాంతంలో బోరింగ్ మెషిన్ మొదలుపెట్టగానే.. సొరంగం ఊగిపోయింది. సొరంగ మార్గం వద్ద ఉన్నట్లుండి సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యలను మంత్రులు , జూపల్లి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల ఉన్న మరో 8 మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చిక్కుకున్నవారిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు ఉన్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment