2024–25 విద్యా సంవత్సరం మొదలు
ఇంకా కొన్ని స్కూళ్లకు అందని పాఠ్యపుస్తకాలు, దుస్తులు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో 60 లక్షల మంది విద్యార్థులు
ఈ నెలాఖరు వరకూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి. 2024–25 విద్యా సంవత్సరం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల టీచర్లు, విద్యార్థుల్లో హడావుడి∙కన్పి స్తోంది. సర్కారీ స్కూళ్లలో ఈసారి ఎక్కువ మందిని చేర్పించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. స్కూళ్ళల్లో వసతులపై పెద్ద ఎత్తున ప్ర చారం చేస్తోంది. మార్కెట్లో దుస్తులు, పుస్తకాల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి.
ప్రైవేటు స్కూ ళ్ల బస్సులు, ఆటోలు ఈ ఏడాది ఫీజులు పెంచా యి. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్నారు. వీరిలో 28 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 30 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు, 11500 వరకూ ప్రైవేటువి ఉన్నాయి.
ప్రవేశాలు పెరిగేనా?
ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లల్లో ఎక్కువ మందిని చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో వినూత్నంగా చేపడుతున్నారు. వాస్తవానికి గత కొన్నేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరడం క్రమంగా తగ్గుతోంది. 1–5 క్లాసుల వరకూ చేరికలు కొంత ఆశాజనకంగా ఉన్నా, ఆ తర్వాత క్లాసుల్లో ఎన్‌రోల్‌మెంట్ పడిపోతోంది. 5వ తరగతి తర్వాత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళల్లో చేరుతున్నారు.
ఈ పరిణామాలపై ప్రతీ ఏటా అధికారులు నివేదికలు ఇస్తూనే ఉన్నారు. సరిదిద్దేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సమ గ్ర శిక్ష ప్రాజెక్టు అధ్యయనం ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యా ర్థులు కూడా ఉండటం లేదని తేలింది. 1–5 తరగతుల వరకూ క్లాసుకు 40–60 మంది విద్యార్థులు ఉంటున్నారు. 5వ తరగతి నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయింది.
ప్ర భుత్వ స్కూళ్ళు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత వేధించడం, సకాలంలో పుస్తకాలు రాకపోవడం, వచ్చినా పంపిణీ జరగకపోవడం, ఈ కారణంగా బోధన కుంటుపడటం ప్రధాన కారణాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా రు. 1–5 తరగతులకు దిగువ మధ్య తరగతి కు టుంబాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ మంచి విద్య ను అందించాలనే అభిప్రాయంతో ఉంటున్నాయి. దీనికోసం తల్లిదండ్రులు పట్టణాలకు వెళ్తున్నారు.
బదిలీలు, పదోన్నతులపై కసరత్తు
సాంకేతికంగా ప్రభుత్వ స్కూళ్లు ఈ నెల 12 నుంచి తెరుచుకుంటున్నా... బోధనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకూ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడతారు. ఉపాధ్యాయులంతా ఈ హడావిడిలో ఉండే వీలుంది. ఇప్పటికీ అన్ని స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందలేదు. వీలైనంత త్వరగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment