Transfers of teachers
-
టీచర్ల సర్దుబాటుకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాలవిద్య డైరెక్టరేట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే రెండు స్కూళ్లను విలీనం చేసే అధికారాన్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. పాఠశాల విద్య డైరెక్టర్ ఇ.నర్సింహారెడ్డి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. తాజా యూడైస్ డేటాను పరిగణనలోనికి తీసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని సూచించారు.చాలా స్కూళ్లలో విద్యార్థులున్నా, టీచర్లు ఉండటం లేదని, టీచర్లు ఎక్కువగా ఉన్నచోట విద్యార్థులు ఉండటం లేదని గుర్తించారు. టీచర్లు లేని స్కూళ్లలో విద్యార్థులు చేరినా, తిరిగి వారు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు. దీన్ని నివారించేందుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే కాంప్లెక్స్‌లో రెండు స్కూళ్లు ఉంటే, వాటిని విలీనం చేసేందుకు విద్యాశాఖ అనుమతించింది. ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉండాలో విద్యాశాఖ సూచించింది. -
25 వేల మంది ఎస్జీటీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ చేపట్టిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 25 వేల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) బదిలీ ఉత్తర్వులు అందాయి. వీరితో పాటు స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు.. అంతా కలిపి ఇప్పటివరకూ 40 వేల మందికి స్థానచలనం కలిగింది. కొత్తగా కేటాయించిన స్థానాల్లో వీలైనంత త్వరగా చేరాలని, విద్యార్థుల బోధనకు ఇబ్బంది లేకుండా చూడాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం టీచర్లకు సూచించింది. కాగా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించేందుకు అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వారంలో సమస్యలన్నీ పరిష్కరించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు కొలిక్కి.. టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం కోర్టు వివాదాలు, ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలతో కొన్నేళ్లుగా జటిలంగా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత 317 జీవో అమలు సందర్భంగానూ ఈ వ్యవహారం అనేక సమస్యలకు దారి తీసింది. సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జూనియర్లు దూర ప్రాంతాలకు వెళ్లారని, భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తమైంది. కాగా ప్రస్తుతం ఇవన్నీ కొలిక్కి వచ్చినట్టేనని అధికారులు చెబుతుండగా, మరోవైపు బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. సమస్యలేంటి? స్కూల్ అసిస్టెంట్లు వివిధ సబ్జెక్టులకు బోధించే అర్హత ఉండటంతో అన్నింటికీ ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఒక్కదాంట్లోనే ప్రమోట్ చేయాలి. ఉదాహర ణకు సైన్స్, మేథ్స్ రెండు ప్రమోషన్లు వచ్చిన వ్యక్తి ఏదో ఒక దాంట్లోనే చేరతారు. దీంతో ఒక పోస్టు ఖాళీ అవుతుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇస్తే ప్రస్తుతం 17 వేల మంది విధుల్లో చేరారు. దీంతో మిగతా దాదాపు 2 వేల మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వివిధ మండలాల్లో ఒకే ఊరు పేరుతో ఉన్న స్కూళ్ళు ఉండటంతో ఆన్లైన్లో సమస్యలు వచ్చాయి. వీటిని సరి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వారం రోజుల్లో సమస్యల పరిష్కార ప్రక్రియ పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖాళీలపై దృష్టి అన్ని స్థాయిల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు ముగియడంతో పాఠశాల విద్యాశాఖలో వాస్తవ ఖాళీలపై అధికారులు దృష్టి పెట్టారు. స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య, అవసరమైన టీచర్ల లెక్కతో హేతుబధ్దీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన మేరకు కొన్ని బదిలీలు చేసే ఆలోచనలో ఉంది. విద్యార్థులు లేని స్కూళ్ళల్లో ఎక్కువగా ఉన్న టీచర్లను.. విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్ళకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం క్షేత్రస్థాయిలో టీచర్ పోస్టుల ఖాళీలు గుర్తించాల్సి ఉంటుంది. మలీ్టజోన్–1, జోన్–2 పరిధిలో దాదాపు 11 వేల మంది ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. దీంతో ఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే విధంగా 2 వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. హెచ్ఎంల పదోన్నతులతో కూడా కలుపుకుంటే మొత్తం 18,942 మందికి ప్రమోషన్లు దక్కాయి. ఈ ఏడాది చివరి నాటికి రిటైర్ అయ్యే టీచర్లను కలుపుకుంటే దాదాపు 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
నేటి నుంచి మళ్లీ బడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి. 2024–25 విద్యా సంవత్సరం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల టీచర్లు, విద్యార్థుల్లో హడావుడి∙కన్పి స్తోంది. సర్కారీ స్కూళ్లలో ఈసారి ఎక్కువ మందిని చేర్పించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. స్కూళ్ళల్లో వసతులపై పెద్ద ఎత్తున ప్ర చారం చేస్తోంది. మార్కెట్లో దుస్తులు, పుస్తకాల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రైవేటు స్కూ ళ్ల బస్సులు, ఆటోలు ఈ ఏడాది ఫీజులు పెంచా యి. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్నారు. వీరిలో 28 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 30 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు, 11500 వరకూ ప్రైవేటువి ఉన్నాయి. ప్రవేశాలు పెరిగేనా? ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లల్లో ఎక్కువ మందిని చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో వినూత్నంగా చేపడుతున్నారు. వాస్తవానికి గత కొన్నేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరడం క్రమంగా తగ్గుతోంది. 1–5 క్లాసుల వరకూ చేరికలు కొంత ఆశాజనకంగా ఉన్నా, ఆ తర్వాత క్లాసుల్లో ఎన్రోల్మెంట్ పడిపోతోంది. 5వ తరగతి తర్వాత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళల్లో చేరుతున్నారు. ఈ పరిణామాలపై ప్రతీ ఏటా అధికారులు నివేదికలు ఇస్తూనే ఉన్నారు. సరిదిద్దేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సమ గ్ర శిక్ష ప్రాజెక్టు అధ్యయనం ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యా ర్థులు కూడా ఉండటం లేదని తేలింది. 1–5 తరగతుల వరకూ క్లాసుకు 40–60 మంది విద్యార్థులు ఉంటున్నారు. 5వ తరగతి నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయింది. ప్ర భుత్వ స్కూళ్ళు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత వేధించడం, సకాలంలో పుస్తకాలు రాకపోవడం, వచ్చినా పంపిణీ జరగకపోవడం, ఈ కారణంగా బోధన కుంటుపడటం ప్రధాన కారణాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా రు. 1–5 తరగతులకు దిగువ మధ్య తరగతి కు టుంబాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ మంచి విద్య ను అందించాలనే అభిప్రాయంతో ఉంటున్నాయి. దీనికోసం తల్లిదండ్రులు పట్టణాలకు వెళ్తున్నారు. బదిలీలు, పదోన్నతులపై కసరత్తు సాంకేతికంగా ప్రభుత్వ స్కూళ్లు ఈ నెల 12 నుంచి తెరుచుకుంటున్నా... బోధనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకూ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడతారు. ఉపాధ్యాయులంతా ఈ హడావిడిలో ఉండే వీలుంది. ఇప్పటికీ అన్ని స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందలేదు. వీలైనంత త్వరగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది. -
టీచర్ల బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్య కమిషనర్ ఎ.దేవసేన శుక్రవారం విడుదల చేశారు. రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు సంబంధించి శనివారం నుంచి మొదలయ్యే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 18,495 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మినహా మిగతాచోట్ల కోర్టు కేసు లు పరిష్కారం కావడంతో అన్ని స్థాయిల ప్రమో షన్లను ఏకకాలంలో చేపడుతున్నారు.వాస్తవానికి టీచర్ల పదోన్న తులు, బదిలీల ప్రక్రియను 2023 ఫిబ్రవరిలోనే మొదలుపెట్టారు. కానీ నోటిఫి కేషన్ ఇచ్చిన వెంటనే నాన్ స్పౌజ్‌లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్టులో కోర్టు బదిలీలు, పదోన్నతులపై స్టే ఇచ్చింది.తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడంతో స్టే ఎత్తివేసింది. దీంతో సెప్టెంబర్‌లో షెడ్యూల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మల్టీజోన్–1లో హెచ్ఎంల స్థాయిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. హెచ్ఎంలు (గ్రేడ్–2) 1,788 మందికి, స్కూల్ అసిస్టెంట్లు, సమాన కేడర్‌కు చెందిన 10,684 మందికి పదోన్నతులు కల్పించారు.ఈ సమయంలోనే జోన్ వివాదం తలెత్తడంతో జోన్–2లో హెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులు చేపట్టాలని భావించారు. కానీ ప్రమోషన్లకు టెట్ అర్హత ఉండాలన్న ఎన్సీటీఈ నిబంధనను క్రోడీకరిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే ఇవ్వడంతో మళ్ళీ పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా కేసులు పరిష్కారం కావడం, 2010 ఆగస్టు 23 కన్నా ముందు నియామకం జరిగిన టీచర్లకు టెట్ అవసరం లేదని ఎన్సీటీఈ స్పష్టత ఇవ్వడంతో బదిలీలు, ప్రమోషన్లకు మార్గం సుగమం అయ్యింది.ఎంతమందికి పదోన్నతులు?కేటగిరీ పదోన్నతి లభించే వారుహెచ్ఎం గ్రేడ్–2 763స్కూల్ అసిస్టెంట్ 5,123ప్రైమరీ స్కూల్ హెచ్ఎం 2,130లాంగ్వేజ్ పండిట్లు,స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజ్),స్కూల్ అసిస్టెంట్లు 10,479(ఫిజికల్ ఎడ్యుకేషన్) మొత్తం 18,495 -
పండుగ తరువాతే టీచర్ల బదిలీ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ప్రక్రియను సంక్రాంతి సెలవుల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. పండుగ సెలవుల తర్వాతే ఆయా టీచర్లు తమకు కేటాయించిన కొత్త పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టీచర్ల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆప్షన్ల నమోదును ఇప్పటికే పూర్తిచేయించిన విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం వాటిని పూర్తిగా ఫ్రీజ్ చేశారు. నిజానికి సంక్రాంతికి ముందే బదిలీ ఉత్తర్వులు జారీచేయాలని ముందు భావించినప్పటికీ కొన్ని కారణాలవల్ల సెలవుల తర్వాతకు ఆ ప్రక్రియను వాయిదా వేశారు. బదిలీల ప్రక్రియలో విద్యాశాఖ జాగ్రత్తలు.. ఈసారి బదిలీల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా బదిలీల కారణంగా ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చర్యలు చేపట్టింది. అలాగే.. – టీచర్లలో ఒకే స్కూలులో 8 ఏళ్లు సర్వీసు నిండిన వారికి, ప్రధానోపాధ్యాయుల్లో ఒకేచోట 5 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి తప్పనిసరి బదిలీ నిబంధన పెట్టారు. – ఇతరులలో ఒకేచోట కనీసం రెండేళ్లు నిండిన వారికి బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. – రెండేళ్ల కన్నా తక్కువ సర్వీసు పూర్తిచేసిన వారికి కారణాలతో కూడిన అభ్యర్థన పూర్వక బదిలీ దరఖాస్తుకు వీలు కల్పించారు. 16వేల పోస్టులు బ్లాక్ మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ఇబ్బంది లేకుండా.. అందరూ పట్టణ, మైదాన ప్రాంతాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా 16వేల పోస్టులను విద్యాశాఖ బ్లాక్ చేసింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం ఉండదు. పోస్టులను బ్లాక్ చేస్తున్న అంశాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఈ సమాచారాన్ని మండలాల వారీగా అందరికీ తెలిసేలా బోర్డుల్లో ప్రదర్శించారు. పోస్టులు బ్లాక్ చేయకుంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 స్కూళ్లలో ఉన్న 10,198 పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయే ప్రమాదముంది. దీనివల్ల ఉపాధ్యాయుల్లేక ఆ పాఠశాలలు మూతపడే అవకాశముండేది. 76వేల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఇదిలా ఉంటే.. 76,119 బదిలీలకు సంబంధించి దాదాపు అంతా బదిలీకి వీలుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కంపల్సరీ కేటగిరీలో 26,117 పోస్టులు, రిక్వెస్టు కేటగిరి కింద 50,002 ఖాళీ పోస్టులకు వెబ్ ఆప్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా విద్యాశాఖ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించింది. అలాగే, వెబ్ ఆప్షన్ సమయంలో సర్వర్లు మొరాయిస్తున్నాయన్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని, జిల్లాల వారీగా సర్వర్లు విభజించారు. పాయింట్ల ఆధారంగా బదిలీలు ఉపాధ్యాయుల సర్వీసుతో పాటు వారి పనితీరును కూడా బదిలీల్లో విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుంది. వీటికి కొన్ని పాయింట్లను కేటాంచింది. విడో, భార్యాభర్తలు, తీవ్ర ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇలా కొన్ని కేటగిరీల వారికి ప్రాధాన్యతనిస్తూ అదనపు పాయింట్లు ఇచ్చింది. ఆ ప్రకారం పాయింట్ల మెరిట్ ప్రాతిపదికన బదిలీలు చేయనున్నారు. ఈ ప్రక్రియ మేన్యువల్‌గా కాకుండా పారదర్శకంగా కంప్యూటర్ ద్వారా ఆటోమేటిగ్గా జరిగేలా కంప్యూటర్ జనరేటెడ్ బదిలీ ఉత్తర్వులు జారీచేయనున్నారు. -
పారదర్శకంగా టీచర్ల బదిలీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వెబ్ కౌన్సెలింగ్ విధానంలో నిర్వహిస్తున్నామని, దీనివల్ల టీచర్లకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. వారు తమకు అందుబాటులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్లు నమోదు చేయవచ్చన్నారు. మాన్యువల్‌లో పది నిమిషాల సమయం కూడా ఉండదని, అదే ఆన్లైన్ కౌన్సెలింగ్ వల్ల 5 రోజుల సమయం దొరుకుతుందని చెప్పారు. పైగా ఇతరులు వదిలేసిన ఖాళీలకు కూడా ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశముంటుందన్నారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను అన్ని జాగ్రత్తలు తీసుకొని సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ నెల 16 నుంచి 21 వరకు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తుది కేటాయింపులుంటాయన్నారు. 4 కేటగిరీలుగా బదిలీలు.. 20 శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ–1గా, 14.5 శాతం హెచ్ఆర్ఏ ప్రాతాలను కేటగిరీ–2గా, 12 శాతం హెచ్ఆర్ఏ ప్రాంతాలను కేటగిరీ–3 గా, 12 శాతం కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ–4గా విభజించి.. బదిలీలు చేస్తున్నట్లు తెలిపారు. సర్వీసును బట్టి ఏడాదికి 0.5 వంతున మార్కులు కేటాయించి.. వాటి ఆధారంగా బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. నిబంధనల ప్రకారం సర్దుబాటు ప్రక్రియ చేసి మిగులు పోస్టులు, ఖాళీలను కలిపి 4 కేటగిరీలకు సమానంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు. గిరిజన, మారుమూల ప్రాంత స్కూళ్లలో కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా బదిలీలు చేపడుతున్నామన్నారు. అన్ని పోస్టులను ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల.. కేటగిరీ–4లో ఉన్న మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ఎవరూ వెళ్లే పరిస్థితి ఉండదని.. దీంతో అక్కడ ఉపాధ్యాయుల సమస్య ఏర్పడుతుందన్నారు. అందుకే 15 వేల పోస్టులను బ్లాకు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టులను మళ్లీ బదిలీల ప్రక్రియ ద్వారానే భర్తీ చేస్తామన్నారు. కొత్త ఉపాధ్యాయ నియామకాలకు ముందు మళ్లీ ఈ బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. ఆ సమయంలో బ్లాక్‌లో పెట్టిన ఈ పోస్టులను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసి.. ఆ తర్వాత మిగిలే ఖాళీలను డీఎస్సీలో ఎంపిౖకైన వారితో భర్తీ చేస్తామన్నారు. మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా ఆ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలను గౌరవిస్తామన్నారు. -
టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
‘నాడు – నేడు’ నా మనసుకు చాలా నచ్చిన కార్యక్రమం. దీని కింద పాఠశాలల నిర్మాణాల్లో, పనుల్లో నాణ్యత కోసం పాటించాల్సిన పద్ధతులకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపొందించాలి. దీనిని సంబంధిత విభాగాలకు పంపించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్‌నూ భాగస్వామ్యం చేయాలి. గవర్నమెంట్ అంటే నాసిరకం కాదు.. క్వాలిటీ అన్న పేరు రావాలి. 6 నుంచి 10 తరగతుల పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలి. విద్యార్థులకు వస్తున్న మార్కులు, వారు చూపిస్తున్న ప్రతిభపై సమాచారాన్ని సేకరించి అనలైజ్ చేయాలి. ఏయే సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారో గుర్తించి.. నేర్చుకోవడంలో వారికున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక పద్ధతులు, విధానాలను రూపొందించాలి. డిజిటల్ లెర్నింగ్ కోసం సమగ్రంగా యాప్ రూపకల్పన చేయాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్ సదుపాయం కూడా ఉండేలా చూడాలి. సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి. తద్వారా టీచర్లు, విద్యార్థులు ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. ఈ అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాలి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విద్యార్థుల సంఖ్య ఆధారంగా, వారి అవసరాల మేరకే టీచర్లను నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని కచ్చితంగా పాటిస్తూ బదిలీలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మంచి చేయడానికి టీచర్ల బదిలీలు దోహదం చేసేలా విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. జూలై 15 తర్వాత ఆన్లైన్ విధానంలో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే దానిపై మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. 2017లో అనుసరించిన పద్ధతుల కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలా వరకు మూతబడ్డాయని సమావేశంలో చర్చకు వచ్చింది. సమీక్షలో సీఎం ఆదేశాలు, అధికారులు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే నూతన కుర్చీలు, బెంచీలు, సీలింగ్ ఫ్యాన్లు, తాగునీటి వాటర్ప్లాంట్లను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలకు మంచి జరగాలి ► ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి.. విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు ఎలా పంపాలి.. అనే కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగింది. ► అక్టోబర్, నవంబర్ నెలలు వచ్చినా యూని ఫామ్స్, పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు పిల్లల కు మంచి చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. ► పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరినీ ఇబ్బందులకు గురి చేయొద్దు. అధికారులు అందరూ కూర్చొని టీచర్ల రీ పొజిషన్‌కు సంబంధించి విధి విధా నాలు రూపొందించాలి. ► ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందించడానికి విప్లవాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చురుగ్గా పనులు ► నాడు –నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలి. దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలి. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలి. ► నాడు – నేడు పనులకు సంబంధించి రూ.533 కోట్లు పేరెంట్స్ కమిటీల ఖాతాల్లో ఉన్నాయని అ«ధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధిక నిధులు ఖర్చయ్యాయని, లాక్డౌన్ సడలింపులతో గత వారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని చెప్పారు. ► ప్రత్యేకంగా జేసీలను నియమించడం వల్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని అధికారులు వివరించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొమ్మినేనివారిపాలెం (యెండ్లూరు) గ్రామంలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతి గదులకు కరెంటు వైరింగ్, ఫ్లోరింగ్ పనులు చేస్తున్న దృశ్యం మధ్యాహ్న భోజనం నాణ్యత బావుండాలి ► గోరుముద్ద కింద పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతో ఉండాలి. పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడడు. ► కలెక్టర్లు, జేసీలు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి. దీన్ని విధిగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలి. స్కూల్లో సదుపాయాలపై ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఏ సమస్య ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫోన్ చేసేలా ఆ నంబర్‌ను ప్రదర్శించాలి. సమస్యలు ఉంటే తల్లిదండ్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ► పాఠశాలలు, అందులోని బాత్రూమ్స్ను పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ► జగనన్న విద్యా కానుక కోసం ఈ నెల 8, 9 తేదీలలో షూస్ కోసం విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ► సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి రాజ శేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం సూచనల మేరకే టీచర్ల బదిలీలు టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకే బదిలీలు చేప డతాం. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయి. టీచర్లు బదిలీల కోసం ఎవరి చుట్టూ తిరగా ల్సిన అవసరం లేదు. పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యేలోపు బదిలీలు ఉంటాయి. ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం ఆదేశించారు. – ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రివర్స్ టెండరింగ్‌లో రూ.144.80 కోట్లు ఆదా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు, పరికరాల కొనుగోళ్లలో ఇప్పటి వరకు రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.144.80 కోట్లను ఆదా చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు. వస్తువులు, పరికరాల కోసం దాదాపు రూ.890 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామని, శానిటరీ ఐటమ్స్ కాకుండా మిగతా వాటికి టెండర్లు కూడా ఖరారు చేశామని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తొలి దశలో చేపడుతున్న పనుల పురోగతిని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న పిల్లలు కూర్చునే బల్లల నమూనాలతో పాటు వాటర్ ప్యూరిఫైర్, ఫిల్టర్, అల్మరాలు, సీలింగ్ ఫ్యాన్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి ► పాఠశాలలకు అవసరమైన వస్తువులు, ఫర్నిచర్.. తదితర వాటి కొనుగోలు కోసం సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లడం ద్వారా సమయానికి వాటిని పొందడమే కాకుండా, నాణ్యత ఉంటుంది. బిడ్డింగ్‌లో పోటీ కారణంగా తక్కువ ధరకే లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ► గవర్నమెంట్ స్కూళ్లలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఫర్నిచర్ ఏర్పాటు చేయడమే కాదు, వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చే నెల చివరి నాటికి అన్ని స్కూళ్లలో ఏర్పాట్లు పూర్తి కావాలి. ఏవేవి ఎన్నెన్నంటే.. ► తొలి దశలో 15,715 స్కూళ్ల మార్పులో భాగంగా 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. 1 నుంచి 3వ తరగతి వరకు 1.50 లక్షల బల్లలు, 4 నుంచి 6వ తరగతి వరకు మరో 1.50 లక్షల బల్లలు, 7 నుంచి 10వ తరగతి వరకు డ్యుయల్ డ్రాలతో కూడిన 2.10 లక్షల బల్లలు కొనుగోలు చేస్తోంది. టీచర్ల కోసం 89,340 కుర్చీలు, టేబుళ్లు, 72,596 గ్రీన్ చాక్ బోర్డులు, 16,334 అల్మారాలు, 1,57,150 ఫ్యాన్ల కొను గోలుకు టెండర్లు ఖరారు చేసింది. -
ఫిర్యాదు చేస్తే పేరు గల్లంతు
టీచర్ల బదిలీల్లో కొనసాగుతున్న గందరగోళం - ఫిర్యాదులు చేసిన వారి దరఖాస్తులు గల్లంతు - బదిలీకి ముందుగా దరఖాసు చేసినా అదే పరిస్థితి - ఆందోళనలో ఉపాధ్యాయులు ఒంగోలు వన్‌టౌన్: ఉపాధ్యాయుల బదిలీల గడువు ముగింపు దశకు చేరుకున్నా బదిలీలపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తప్పుడు సమాచారంతో కొందరు ఉపాధ్యాయులు అధిక పాయింట్లు పొందారని ఫిర్యాదు చేసిన వారి బదిలీ దరఖాస్తులే ఆన్లైన్లో గల్లంతు కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా షెడ్యూల్‌కు ముందే చేసిన బదిలీ దరఖాస్తులూ ఆన్లైన్లో కనిపించడం లేదు. ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినా.. అందులో సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. 500కు పైగా ఫిర్యాదులు.. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మొత్తం 500 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయి. కొందరు ఉపాధ్యాయులు అదనపు పాయింట్లకు దరఖాస్తు చేసుకోగా మరికొందరు ఇతర ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా పదో తరగతి సగటు ఉత్తీర్ణత, పాఠశాల సగటు పనితీరుపై ఫిర్యాదు చేశారు. కొంతమంది అక్రమంగా స్పౌజ్ వాడుకుంటున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల చేసిన వారి దరఖాస్తుల గల్లంతు.. బదిలీల్లో లబ్ధి పొందేందుకు కొందరు దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని కొందరు ఉపాధ్యాయులు అక్రమార్కులపై ఫిర్యాదులు చేశారు. అయితే ఈ ఫిర్యాదులను సైతం ఆన్లైన్లో నమోదు చేయాల్సి రావడంతో వారు ఇబ్బందులు పడ్డారు. నిబంధనల ప్రకారం ఏ ఉపాధ్యాయుడి మీద ఫిర్యాదు చేస్తున్నారో సీనియారిటీ జాబితాలో ఆ ఉపాధ్యాయుని నంబరు నమోదు చేసి, ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వివరించాలి. అయితే ఫిర్యాదు చేస్తున్న ఉపాధ్యాయులు ఇది తెలియక ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వారి నంబర్‌నే నమోదు చేశారు. దీంతో ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా వారి పేర్లు సీనియారిటీ జాబితాలో తొలగిపోయాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నా గల్లంతే.. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ముందుగా దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల పేర్లు కొన్ని సీనియారిటీ జాబితాలో గల్లంతయ్యాయి. ప్రధానంగా సీనియారిటీ జాబితాలో 50 సంఖ్యతో మొదలయ్యే నంబర్లలో కొన్ని ఉపాధ్యాయుల పేర్లు గల్లంతయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 15 మంది పేర్లు ఈ విధంగా గల్లంతనట్లు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. వీరి దరఖాస్తులు ఎంఈఓ లాగిన్‌లో గానీ, డీఈఓ లాగిన్‌లో గానీ కనిపించడం లేదు. దీంతో వీరి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ 15 మంది ఉపాధ్యాయుల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు డీఈఓ పంపించారు. షెడ్యూల్‌పై అయోమయం ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌పై ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఆయా తేదీల్లో నిర్దేశించిన పనులు మాత్రమే జరగాల్సి ఉంది. అయితే ఆ తేదీలు ముగిసినా ఆప్షన్లు క్లోజ్ కాకుండా ఉండటంతో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రాథమిక సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు 25వ తేదీతో గడువు ముగిసినా 28వ తేదీ వరకు అభ్యంతరాలు తెలుపుకునేందుకు కంప్లైంట్ బాక్స్ ఆన్లైన్లో ఓపెన్ అవుతూనే ఉంది. ఆన్‌లైన్‌తో అవస్థలు.. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి అన్ని ప్రక్రియలు ఆన్లైన్లోనే చేయాల్సి రావడంతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ప్రధానంగా సీనియారిటీ జాబితాలు చూసుకునేందుకు వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని కొందరు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నారు. తొలిసారి వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినా అందులో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. -
24, 25 తేదీల్లో టీచర్ల బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్
షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్: టీచర్ల బదిలీలకు ఈ నెల 24, 25 తేదీల్లో వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రేషనలైజేషన్, ఖాళీల ప్రకటనకు విద్యాశాఖ గతంలో తేదీల ను ప్రకటించింది. ఈ మేరకు 7వ తేదీలోగా రేషనలైజేషన్‌ను పూర్తిచేయనున్నారు. 9న పాఠశాలల వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీలను ప్రకటిస్తారు. 10 నుంచి 12వ తేదీవరకు ఆన్లైన్లో బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించి, వాటి ప్రింటవుట్లను ఎంఈఓ, డిప్యుటీ డీఈవోలకు సమర్పించాలి. 11 నుంచి 13 వరకు ఈ దరఖాస్తులను డీఈవోలు స్వీకరిస్తారు.ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు సీనియార్టీ జాబితాలు రూ పొందిస్తారు. 14న పెర్ఫార్మెన్సు పాయింట్లు, ఎన్టైటిల్మెంటు పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియార్టీ జాబితాను ప్రకటిస్తారు. 15 నుంచి 17 వరకు ఈ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలుంటే సంబంధిత ఆధారాలతో వాటిని అప్లోడ్ చేయాలి. 19వ తేదీన ఈ అభ్యంతరాలపై పరిష్కారాలు, ఇతర సమాచారాలను జిల్లాల విద్యాశాఖాధికారులు వెబ్సైట్లో పోస్టు చేస్తారు. 20, 21 తేదీల్లో ఆయా టీచర్లు తమ బదిలీ దరఖాస్తుపై అంగీకారం తెలుపుతూ ఖరారు చేయాలి. 23న తుది విడత సీనియార్టీ జాబితా, పనితీరు, ఎన్టైటిల్మెంటు పాయింట్లతో సహా వెబ్సైట్లో పొందుపరుస్తారు. 24, 25 తేదీల్లో ఆయా ఖాళీలను అనుసరించి టీచర్లు, హెడ్మాస్టర్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవలి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్సైట్లో బదిలీ ఉత్తర్వులను అధికారులు జారీచేస్తారు.అభ్యర్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగానే అలాట్‌మెంటు జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ సంధ్యారాణి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని అంశాలకు కటాఫ్ తేదీని ఆగస్టు 31గా పరిగణించనున్నారు. -
బదిలీలకు ‘పనితీరు’ ఆధారం!
25శాతం పరిగణనలోకి తీసుకుంటామంటున్న అధికారులు ప్రక్రియ జాప్యానికేనంటున్న ఉపాధ్యాయ సంఘాలు హైదరాబాద్: టీచర్ల బదిలీల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం రోజుకోరకమైన కొర్రీలు పెడుతుండడమే దీనికి కారణం. తాజాగా టీచర్ల పనితీరు ఆధారంగా బదిలీలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రేషనలైజేషన్ పూర్తయినందున ఇక బదిలీ జీఓ రావడమే తరువాయి అని ఎదురుచూస్తున్న టీచర్లకు తాజా నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలతో మెరిట్ ఆధారంగా బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ఉత్తీర్ణత, పాఠశాలల నిర్వహణలో ఆయా ఉపాధ్యాయుల భాగస్వామ్యం, ప్రాజెక్టుల నిర్వహణ త దితర అంశాల ఆధారంగా ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయిస్తామని ఆ శాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘సాక్షి’తో పేర్కొన్నారు. బదిలీలకు నిర ్ణయించిన మొత్తం పాయింట్లలో 25శాతం ఈ మెరిట్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. మెరిట్‌కు ప్రామాణికమేమిటని, ఏ ప్రాతిపదికన గుర్తిస్తారని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. మాటిమాటికీ బదిలీలను వాయిదా వేస్తూ ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, గేయానంద్, శ్రీనివాసులురెడ్డి, నాగేశ్వరరావు విమర్శించారు. లక్షలాది రూపాయలు చేతులు మారడంతో ప్రభుత్వ బదిలీలపై పైరవీలు నడుస్తున్నాయని, దీనివల్లనే సాధారణ బదిలీలు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ పేరిట ప్రభుత్వం ఈ ఏడాది సాధారణ బదిలీలు వాయిదా వేయాలని చూస్తోందని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. మెరిట్ నిబంధన గందరగోళానికి దారితీసి బదలీల ప్రక్రియ జరగకుండా నిలిచిపోతుందని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాలిరెడ్డి, ఓబుళపతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు మరో ప్రకటనలో కోరారు. -
టీడీపీ ఎమ్మెల్యేల తరపున రెండు బదిలీలు
టీచర్ల బదిలీల్లో అలా చేస్తే మాకు ఇబ్బందులుండవు: మంత్రి ప్రత్తిపాటి గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రజా ప్రతినిధులుగా తమ రాజకీయ అనుచరులు, అయిన వారికి పనులు చేసి పెట్టాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాష్ట్రంలోని ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే తరపున ఇద్దరేసి ఉపాధ్యాయులను బదిలీ చేస్తే మంత్రిగా తమకు రాజకీయపరమైన ఇబ్బందులుండవని పేర్కొన్నారు. అలా కాకపోతే తాము కోరిన పనులు చేయడంలేదని ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. గుంటూరులో ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం టెన్త్ ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ విషయాలన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని కోరుతున్న ఉపాధ్యాయులే రాజకీయంగా ఒత్తిడి తెచ్చి అక్రమ పద్ధతుల్లో బదిలీలు అడుగుతున్నారని మంత్రి తెలిపారు. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన టీచర్లు బదిలీల కోసం పక్క దారి పట్టవద్దని ఆయన సూచించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, డీఈవో కె.వి.శ్రీనివాసులురెడ్డి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. -
ఇక టీచర్లకు వెబ్ కౌన్సెలింగ్
ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ విడుదల కానుం ది. ఈలోగా ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయమని రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందినట్లు విద్యాశాఖ సిబ్బంది తెలిపారు. చిత్తూరు (గిరింపేట):జిల్లాలో 16వేల ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, సుమారు 4వేల మంది బదిలీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. రెండేళ్ల నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు స్థానచలనం పొందనున్నారు. బదిలీ కావాల్సిన వారు ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రక్రియ ప్రారంభించే నాటికి ఉన్న ఖాళీలు, 8 ఏళ్ల సర్వీసు నిండిన ఖాళీల వివరాల క్రమబద్ధీకరణతో వచ్చిన ఖాళీల జాబితాను వెబ్సైట్లో విద్యాశాఖ పొందుపరచనుంది. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గడువు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఇలా.. ఉపాధ్యాయులు తొలుత వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని సంబంధిత ఎంఈవోకు, ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి. అవసరమైన ధ్రువీకరణపత్రాలు అందజేయాలి. ఎంఈవో, హెచ్ఎంలు దరఖాస్తును, సర్టిఫికెట్లను పరిశీలించి వాటిని ధ్రుువీకరిస్తూ డీఈవోకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. వీటిని డీఈవో పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయునికి ఎన్టైటిల్మెంట్ పాయింట్లను కేటాయిస్తారు. దరఖాస్తు గడువు ముగిసిన అనంతరం ఒక రోజులో పాయింట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. దీని ఆధారంగా ప్రాధాన్య క్రమాన్ని సూచిస్తూ జాబితా తయారుచేసి వెబ్సైట్లో పొందుపరుస్తారు. దీనిపై అభ్యంతరాలుంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలకు రెండు మూడు రోజుల సమయం కేటాయిస్తారు. అభ్యంతరాల పరిశీలన తరువాత తొలి జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తుదారులు తుది ప్రాధాన్యతను పరిశీలించి తమకు క్యాడర్లో ఎవరు దరఖాస్తు చేశారో.. ఏఏ పాఠశాలలకు అవకాశం ఉంటుందో చూసుకుని ధ్రువీకరించాలి. ఒకసారి ధ్రువీకరణ చేస్తే ఆ ఉపాధ్యాయుని స్థానం కూడా ఖాళీల జాబితాలోకి వెళ్తుంది. అయితే ఉన్న స్థానం పోతుందనే ఆందోళన చెందాల్సినవసరం లేదు. ధ్రువీకరణ చేయగానే ఉపాధ్యాయుడి ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పాస్వర్డ్ వస్తుంది. దీంతో వెబ్సైట్లోకి లాగిన్ అయితే క్యాడర్‌కు సంబంధించిన ఖాళీలు చూపుతుంది. ఖాళీల ప్రాధాన్య క్రమంలో ఉపాధ్యాయులు ఎంపికచేసుకోవాలి. తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఖాళీల జాబితాలో ప్రాధాన్యం ఇవ్వాల్సిఉంటుంది. ఉదాహరణకు ఒక క్యాడర్లో 500 ఖాళీలుంటే అన్నింటికీ ఆప్షన్లు ఇవ్వాలి. రెండు నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాని ఉపాధ్యాయులు తమకు అవసరమైన పాఠశాలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గరిష్ట పరిమితి 199 ఆప్షన్లను కల్పిస్తారు. ఉపాధ్యాయులు ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా చివరి ఆప్షన్‌గా తాను పనిచేస్తున్న పాఠశాలను విధిగా చేర్చాలి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన ఐదు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఆన్లైన్ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. బదిలీ అయిన ప్రాంత సమాచారం మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందుతుంది. -
త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు
అధికారులకు సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. వెబ్ ఆధారితంగా బదిలీలు చేయాలని సీఎం సూచించారని, ఈ మేరకు త్వరలోనే విధివిధానాలు, షెడ్యూల్ విడుదలవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతిభ, పనితీరు, ఫలితాల ఆధారంగా బదిలీలు జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు నెల రోజుల్లో ల్యాప్‌టాప్‌లు అందించాలన్నారు. ఫలితాల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గ్రేడింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వాలని వెల్లడించారు. రాష్ట్రంలో వంద శాతం స్వచ్ఛ విద్యాలయాలు ప్రధానమంత్రి న రేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ విద్యాలయాల లక్ష్యాన్ని రాష్ట్రంలో వందశాతం పూర్తి చేశామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. షెడ్యూల్ విడుదల చేయాలి: ఎస్టీయూ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తి నరసింహారెడ్డి, సుధీర్‌బాబు బుధవారం ఓ ప్రక టనలో ప్రభుత్వాన్ని కోరారు. -
16 నుంచి టీచర్ల బదిలీలు!
తొలిసారిగా బదిలీలకు వెబ్‌కౌన్సెలింగ్ విధానం హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 16వ తేదీనుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. బదిలీల్లో తొలిసారిగా వెబ్‌కౌన్సెలింగ్‌ను ప్రవేశపెడుతున్నందున దీనిపై టీచర్ల సంఘాలకు అవగాహన, అనుమానాల నివృత్తికి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నమూనా ప్రక్రియను నిర్వహించింది. డెరైక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డెరైక్టర్ సంధ్యారాణి, జాయింట్ డెరైక్టర్ రమణకుమార్, అడిషనల్ డెరైక్టర్ గౌరీశంకర్, ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు, సంఘాల నేతలు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి, కత్తి నరసింహారెడ్డి, పాండురంగ వరప్రసాద్, కమలాకర్‌రావు, హృదయరాజు, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. రేషన లైజేషన్ ఉత్తర్వులు శుక్రవారం విడుదల కావడంతో మరో రెండు రోజుల్లో బదిలీల షెడ్యూల్ ఉత్తర్వులు కూడా విడుదల చేయనున్నామని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను అనుసరించి 2013లో బదిలీ అయిన టీచర్లు వారు కోరుకున్న స్థానం ఖాళీగా ఉంటే ముందే రిలీవ్ చేస్తారు. లేనిపక్షంలో వెబ్‌కౌన్సెలింగ్‌లో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను జిల్లాల్లోని అన్ని మండలాలకు సమానంగా పంచాలని సంఘాల నేతలు కోరారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో భార్యాభర్తల బదిలీకి సంబంధించి సాఫ్ట్వేర్ సమగ్రంగా లేదని సంఘాలు అభిప్రాయపడ్డాయి. భార్యాభర్తల ప్రాధాన్యం కింద బదిలీ కోరుకొనేవారు డివిజన్ యూనిట్‌గా ఖాళీలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వివరించారు. -
టీచర్ల సంఖ్యకు మించి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. టీచర్ల సంఖ్యకు మించి దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లలో 1.28 లక్షల మంది వరకు టీచర్లు ఉండగా బదిలీల కోసం 1,41,909 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటిసారి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించడం వల్ల చాలామంది టీచర్లు ఒకటికి రెండు, మూడు దర ఖాస్తులను సబ్మిట్ చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో డూప్లికేట్ అయిన దరఖాస్తుల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు ఈసారి 0-19 మంది పిల్లలు ఉన్న స్కూళ్లకు ఒక్కో టీచర్‌ను ఇవ్వాలని అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని స్కూళ్లకు కూడా టీచర్లను కేటాయించనున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 31 నాటికి 456 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు లేరని విద్యాశాఖ లెక్క తేల్చింది. అయితే ఈసారి ప్రవేశాల సందర్భంగా విద్యార్థులు ఎవరైనా ఆయా స్కూళ్లలో చేరారా? లేదా? అన్న విషయం తెలియదు. దీంతో ఆ 456 స్కూళ్లకు కూడా ప్రస్తుతం టీచర్లను కేటాయిస్తారు. గ్రామాల్లో తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవిధంగా చర్యలు చేపట్టినా వారిని కొనసాగిస్తారు. లేదంటే ఆ టీచర్లను సమీపంలోని స్కూళ్లకు డెప్యుటేషన్‌పై పంపించే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ లెక్కలను తేల్చే పనిలో విద్యాశాఖ పడింది. ప్రస్తుతం పాఠశాలల్లో అవసరానికి మించి (సర్ప్లస్) దాదాపు ఐదారు వేల మంది వరకు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు వారిని ఈ బదిలీల్లో అవసరం ఉన్న స్కూళ్లకు పంపించనున్నారు. శుక్రవారం ప్రాథమిక సీనియారిటీ జాబితాలను ప్రకటించారు. శని, ఆదివారాల్లో సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం వంటి చర్యలు చేపట్టనున్నారు. 6వ తేదీన తుది సీనియారిటీ జాబితాలను ప్రకటించి 7వ తేదీ నుంచి బదిలీల కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు తెలిపారు. 7వ తేదీన ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 8వ తేదీన స్కూల్ అసిస్టెంట్లకు, హెడ్మాస్టర్లకు పదోన్నతులు కల్పిస్తారు. 9 నుంచి 11వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు చేపడతారు. 12న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు కల్పిస్తారు. 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఎస్జీటీల బదిలీలు చేపడతారు. ఇవీ జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఆదిలాబాద్ 11,489 హైదరాబాద్ 3,662 కరీంనగర్ 16,898 ఖమ్మం 13,314 మహబూబ్‌నగర్ 19,739 మెదక్ 14,999 నల్లగొండ 17,562 నిజామాబాద్ 13,601 రంగారెడ్డి 13,204 వరంగల్ 17,441 -
కటాఫ్ జూలై 1
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు సోమవారం విడుదల చేశారు. బదిలీలకు జూలై 1వ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఒక టీచర్ ఉండేలా హేతుబద్ధీకరణ చేపట్టాలని అందులో పేర్కొన్నారు. బదిలీల కోసం టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూలై 1 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవోలకు తెలియజేశారు. మార్గదర్శకాలు.. 1. హేతుబద్ధీకరణలో గుర్తించిన అదనపు ఎస్జీటీ పోస్టులను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆధారంగా అవరోహణ క్రమంలో కేటాయించాలి 2. ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు కాగా మిగిలిన ఎస్జీటీ పోస్టులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా పండిట్ల స్థానంలో కేటాయించాలి 3. ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయగా మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇటీవల అప్‌గ్రేడై పోస్టులు మంజూరవని పాఠశాలలకు కేటాయించాలి. ఇంకా మిగిలితే ప్రాథమికోన్నత పాఠ శాలలకు, తర్వాత అధికంగా విద్యార్థులున్న పాఠశాలలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి 4. స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్) లేకుంటే భాషా పండితుల పోస్టులనే కొనసాగించాలి 5. ఉన్నత పాఠశాలలకు సరిపడినంత మంది సబ్జెక్ట్ టీచర్లను ఇవ్వలేనపుడు అక్కడి ఎస్జీటీ పోస్టులను అక్కడే కొనసాగించాలి 6. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టును ప్రాథమిక పాఠశాలలకు తరలించాలి 7. హెచ్ఆర్ఏలో మార్పుల వల్ల స్కూళ్ల కేటగిరీలు మారితే ఆ దామాషాలోనే ఉపాధ్యాయులకు పాయింట్లను లెక్కించాలి 8. సక్సెస్ స్కూళ్లగా మారిన బాలికోన్నత పాఠశాలలు కో-ఎడ్యుకేషన్‌గానే మార్చాలి. 9. భాషలు మినహా మిగతా ఉపాధ్యాయులందరికీ బదిలీల కౌన్సెలింగ్‌ను మీడియంవారీగా నిర్వహించాలి 10. ఆన్లైన్లో నమోదు చేయని దరఖాస్తులను అంగీకరించరు 11. బదిలీలకు ఖాళీలు చూపి, టీచర్లు చేరే సమయంలో ఖాళీలు లేవని పేర్కొంటే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలుంటాయి 12. పాఠ్యపుస్తకాల రచయితలను రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లుగా గుర్తించి పాయింట్లు కేటాయించాలి 13. సెప్టెంబర్ 5న జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారికే అవార్డు పాయింట్లివ్వాలి 14. గతేడాది డైస్లో విద్యార్థుల సంఖ్య పొరపాటుగా నమోదై ఉంటే హాజరు రిజిస్టర్లు, వార్షిక పరీక్షాపత్రాలను డీఈవోలు పరిశీలించి డీఎస్‌ఈకి నివేదించాలి 15. ఏజెన్సీ ప్రాంతంలో పదోన్నతులను జీవో నంబరు 3 ప్రకారం ఇవ్వాలి 16. ప్రతి స్కూల్లో కనీసం ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడుండేలా చూడాలి 17. 2011లో అదనంగా ఉన్న ఫిజికల్ సైన్స్ టీచర్లను గణితం బోధనకు తరలించారు. ప్రస్తుతం ఆ స్కూళ్లకు గణితం పోస్టు అవసరమైతే అక్కడ వారినే కొనసాగించాలి 18. అదనంగా ఉన్నట్లు తేలి ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను డీఈవో కార్యాలయంలో రిజర్వ్ చేయాలి. వాటిని తదుపరి పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి 19. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే సమీప స్కూలును కోరుకోవాలి. ఇద్దరూ టీచర్లై తప్పనిసరిగా బదిలీ అవుతుంటే ఒకరు ఎక్కడికైనా కోరుకోవచ్చు. రెండోవారు మాత్రం మొదట బదిలీ అయిన వారికి సమీపంలో కోరుకోవాలి 20. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపున్న ఆసుపత్రుల్లో చికిత్సకు సంబంధిత వైద్యులిచ్చిన ధ్రువపత్రాలను ప్రాధాన్యతా కేటగిరీ బదిలీలకు అనుమతించాలి 22. 610 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ అయి రిలీవ్ కాకుండా కొనసాగుతున్న టీచర్లను ప్రస్తుత బదిలీల్లో అనుమతించాలి 23. బదిలీల కౌన్సెలింగ్ రోజు హాజరైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీగా పరిగణించాలి 24. తప్పనిసరి బదిలీల్లో ఉండి కౌన్సెలింగ్‌కు హాజరవని టీచర్లు, హెచ్ఎంలను కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు బదిలీ చేయాలి 25. బదిలీ ఉత్తర్వులు పొందిన టీచర్లు వెంటనే రిలీవై మర్నాడే కొత్త స్కూళ్లలో చేరాలి. ఏవిధమైన వెయింటింగ్ పీరియడ్ ఇవ్వరు. -
పోస్టే లేదు... ఉత్తర్వులు రెడీ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం నెలకొంది. కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వం అక్రమంగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వులు కొన్నింటిలో స్పష్టత లేకపోవడంతో ఏమిచేయాలన్న విషయంలో విద్యాశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. విద్యాశాఖాధికారులకు లేని అధికారాలను కట్టబెట్టి బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు. ఖాళీగా ఓ పోస్టుకు ముగ్గురు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం, అసలు ఖాళీ లేని పోస్టులకు సైతం బదిలీ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఖాళీగా లేని పోస్టులకు కొత్తగా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్న ఉపాధ్యాయులను ఆ స్థానాల్లో నియమిస్తే న్యాయపరమైన వివాదాలు వస్తాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జేడీ ప్రస్తావనేదీ... కొణిజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టుకు దిరిశవంచ జెడ్పీ హైస్కూలు హెచ్.ఎం. వై.పూర్ణచంద్రరావు, కురిచేడు హైస్కూలు హెచ్ఎం. బి.అరుణకుమారి, మీర్జాపేట హెచ్ఎం పి.హనుమంతరావుకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్ణచంద్రరావు ఇంటి పేరును కూడా తప్పుగా (అంటే ‘వై’కు బదులుగా ‘పి’)గా పేర్కొన్నారు. వాస్తవంగా హైస్కూలు ప్రధానోపాధ్యాయులను నియమించడం, బదిలీ చేసే అధికారం ఆర్జేడీకి మాత్రమే ఉంది. అయితే ఈ ముగ్గురు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో ఆర్.జె.డి. ప్రస్తావనే లేదు. జిల్లా విద్యాశాఖాధికారి మాత్రమే తదుపరి చర్యలు చేపట్టమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఈ విషయంలో తగు చర్యలు సూచించచాలని కోరుతూ డీఈఓ ప్రభుత్వ ఆర్.జె.డి.కి లేఖ రాశారు. కనిగిరి మండలం తాళ్ళూరు ఎంపీపీఎస్‌లో ఎల్.ఎఫ్,ఎల్, హెచ్ఎంగా పని చేస్తున్న కె.పద్మజ, దర్శి మండలం తూర్పు చవటపాలెం ఎంపీపీఎస్‌కు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఈ పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం. పోస్టే లేదు. కొత్తపట్నం మండలం అల్లూరు ఎం.పి.పి.ఎస్. సీఈలో ఒక పోస్టు మాత్రమే ఖాళీ ఉంది. ఈ పోస్టుకు అదే మండలం కె.పల్లెపాలెం ఎంపిపిఎస్లో ఎస్జీటీగా పని చేస్తున్న బి.లక్షీతులసి బదిలీ ఉత్తర్వులు పొందారు. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు ఎంపీపీఎస్‌లో ఎస్.జి.టి.గా పని చేస్తున్న ఎస్.రమాదేవి అల్లూరు ఎం.పి.పి.ఎస్.కు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు.అయితే ఈ పాఠశాలలో పోస్టు ఖాళీగా లేదు. పెద్దారవీడు మండలం శానికవరం జెడ్పీ హైస్కూలులో హిందీ స్కూలు అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఉప్పాల పద్మజ యద్దనపూడి మండలం పూనూరు జెడ్పీ హైస్కూలుకు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఈ పాఠశాలలో స్కూలు అసిస్టెంట్ హిందీ పోస్టు ఖాళీగా లేదు. ఉత్తర్వులున్నా వివాదమే వెలిగండ్ల మండలం పి.నాగులవరం జెడ్పీ హైస్కూలులో ఇంగ్లీష్ స్కూలు అసిస్టెంట్‌గా పని చేస్తున్న గుండ్లాపల్లి వెంకటనాగమారుతీ మార్కాపురం మండలం కలనూతల జెడ్పీ హైస్కూలుకు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే వెంకటనాగమారుతీ నియామకంపై వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈమె బదిలీ ఉత్తర్వులను అమలు చేసే విషయంలో స్పష్టతనివ్వాలని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు లేఖ రాస్తున్నారు.