షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ
హైదరాబాద్: టీచర్ల బదిలీలకు ఈ నెల 24, 25 తేదీల్లో వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రేషనలైజేషన్, ఖాళీల ప్రకటనకు విద్యాశాఖ గతంలో తేదీల ను ప్రకటించింది. ఈ మేరకు 7వ తేదీలోగా రేషనలైజేషన్‌ను పూర్తిచేయనున్నారు. 9న పాఠశాలల వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీలను ప్రకటిస్తారు. 10 నుంచి 12వ తేదీవరకు ఆన్‌లైన్లో బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించి, వాటి ప్రింటవుట్లను ఎంఈఓ, డిప్యుటీ డీఈవోలకు సమర్పించాలి. 11 నుంచి 13 వరకు ఈ దరఖాస్తులను డీఈవోలు స్వీకరిస్తారు.ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు సీనియార్టీ జాబితాలు రూ పొందిస్తారు. 14న పెర్ఫార్మెన్సు పాయింట్లు, ఎన్‌టైటిల్‌మెంటు పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియార్టీ జాబితాను ప్రకటిస్తారు.
15 నుంచి 17 వరకు ఈ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలుంటే సంబంధిత ఆధారాలతో వాటిని అప్‌లోడ్ చేయాలి. 19వ తేదీన ఈ అభ్యంతరాలపై పరిష్కారాలు, ఇతర సమాచారాలను జిల్లాల విద్యాశాఖాధికారులు వెబ్‌సైట్లో పోస్టు చేస్తారు. 20, 21 తేదీల్లో ఆయా టీచర్లు తమ బదిలీ దరఖాస్తుపై అంగీకారం తెలుపుతూ ఖరారు చేయాలి. 23న తుది విడత సీనియార్టీ జాబితా, పనితీరు, ఎన్‌టైటిల్‌మెంటు పాయింట్లతో సహా వెబ్‌సైట్లో పొందుపరుస్తారు. 24, 25 తేదీల్లో ఆయా ఖాళీలను అనుసరించి టీచర్లు, హెడ్మాస్టర్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవలి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్‌సైట్లో బదిలీ ఉత్తర్వులను అధికారులు జారీచేస్తారు.అభ్యర్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగానే అలాట్‌మెంటు జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ సంధ్యారాణి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని అంశాలకు కటాఫ్ తేదీని ఆగస్టు 31గా పరిగణించనున్నారు.
24, 25 తేదీల్లో టీచర్ల బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్
Published Sat, Sep 5 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement
Advertisement