తొలిసారిగా బదిలీలకు వెబ్‌కౌన్సెలింగ్ విధానం
హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 16వ తేదీనుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. బదిలీల్లో తొలిసారిగా వెబ్‌కౌన్సెలింగ్‌ను ప్రవేశపెడుతున్నందున దీనిపై టీచర్ల సంఘాలకు అవగాహన, అనుమానాల నివృత్తికి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నమూనా ప్రక్రియను నిర్వహించింది. డెరైక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డెరైక్టర్ సంధ్యారాణి, జాయింట్ డెరైక్టర్ రమణకుమార్, అడిషనల్ డెరైక్టర్ గౌరీశంకర్, ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు, సంఘాల నేతలు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి, కత్తి నరసింహారెడ్డి, పాండురంగ వరప్రసాద్, కమలాకర్‌రావు, హృదయరాజు, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. రేషన లైజేషన్ ఉత్తర్వులు శుక్రవారం విడుదల కావడంతో మరో రెండు రోజుల్లో బదిలీల షెడ్యూల్ ఉత్తర్వులు కూడా విడుదల చేయనున్నామని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.
సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను అనుసరించి 2013లో బదిలీ అయిన టీచర్లు వారు కోరుకున్న స్థానం ఖాళీగా ఉంటే ముందే రిలీవ్ చేస్తారు. లేనిపక్షంలో వెబ్‌కౌన్సెలింగ్‌లో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను జిల్లాల్లోని అన్ని మండలాలకు సమానంగా పంచాలని సంఘాల నేతలు కోరారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో భార్యాభర్తల బదిలీకి సంబంధించి సాఫ్ట్‌వేర్ సమగ్రంగా లేదని సంఘాలు అభిప్రాయపడ్డాయి. భార్యాభర్తల ప్రాధాన్యం కింద బదిలీ కోరుకొనేవారు డివిజన్ యూనిట్‌గా ఖాళీలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వివరించారు.
16 నుంచి టీచర్ల బదిలీలు!
Published Sat, Aug 8 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM
Advertisement
Advertisement