విద్యాశాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాలవిద్య డైరెక్టరేట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే రెండు స్కూళ్లను విలీనం చేసే అధికారాన్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. పాఠశాల విద్య డైరెక్టర్ ఇ.నర్సింహారెడ్డి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. తాజా యూడైస్ డేటాను పరిగణనలోనికి తీసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని సూచించారు.
చాలా స్కూళ్లలో విద్యార్థులున్నా, టీచర్లు ఉండటం లేదని, టీచర్లు ఎక్కువగా ఉన్నచోట విద్యార్థులు ఉండటం లేదని గుర్తించారు. టీచర్లు లేని స్కూళ్లలో విద్యార్థులు చేరినా, తిరిగి వారు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు. దీన్ని నివారించేందుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే కాంప్లెక్స్‌లో రెండు స్కూళ్లు ఉంటే, వాటిని విలీనం చేసేందుకు విద్యాశాఖ అనుమతించింది. ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉండాలో విద్యాశాఖ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment