Government and private schools
-
సర్కార్ బడికి క్యూ
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి మీ పిల్లలను మా పాఠశాలలో జాయిన్ చేయించాలని తల్లిదండ్రులను కోరుతుంటారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో సీన్రివర్స్గా మారింది. తల్లిదండ్రులే తమ పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ప్రవేశాల కోసం క్యూ కడుతున్నారు. అది ఎక్కడ అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. ఈ పాఠశాలను మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యాబోధన అందిస్తుండటంతో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పాఠశాలలో 1,208 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలోనే మూడో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలగా దీనికి గుర్తింపు వచ్చింది. 6 నుంచి 10వ తరగతి వరకు.. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికిగాను 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 6వ తరగతిలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదే పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5వ తరగతి పూర్తి చేసి.. 6వ తరగతి ప్రవేశం కోసం 61 మంది వచ్చారు. ఇంకా 129 సీట్లకు ఇతర పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు 161 సీట్లు ఖాళీగా ఉండగా 630 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దీంతో ప్రతిభ ఉన్న వారికి అవకాశం కలి్పంచాలనే ఉద్దేశంతో ఈ నెల 13న విద్యార్థులకు ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఇఫ్లూ దత్తతఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. 9వ తరగతి విద్యార్థులకు స్పాని‹Ù, ఫ్రెంచ్, స్పోకెన్ ఇంగ్లిష్ నేరి్పస్తున్నారు. 150 మంది విద్యార్థులకు వివిధ భాషలు నేరి్పంచారు. ఈ ఏడాది మరో 150 మందికి నేరి్పంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. గురు, శుక్ర వారాల్లో ఆన్లైన్లో బోధిస్తుండగా, తరగతిగదిలో శనివారం ప్రొఫెసర్లు నేరుగా వచ్చి బోధిస్తున్నారు. విద్యార్థులు ధారాళంగా స్పాని‹Ù, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతున్నారు. డ్రామా, స్కిట్లు, సాంగ్స్ కూడా పాడుతున్నారు.రోబోటిక్స్... ఇందిరానగర్ పాఠశాలలో రోబోటిక్స్ విద్యను హైదరాబాద్‌కు చెందిన సోహం అకడమిక్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది. మూడు సంవత్సరాలుగా ప్రతీ ఏడాది 100 మంది విద్యార్థులకు నేరి్పస్తున్నారు. వారంలో రెండు రోజులు క్లాసులు నిర్వహిస్తున్నారు.గర్వపడుతున్నాం.. మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పింస్తుండటంతో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. అందుకు గర్వపడుతున్నాం. విద్యార్థుల తాకిడి పెరగడంతో స్క్రీనింగ్‌కు పరీక్ష పెట్టాం. వీటిలో వచి్చన మార్కులు, వారి కుటుంబపరిస్థితిని బట్టి అడ్మిషన్లు ఇస్తాం. ఈ నెల 20తేదీలోగా ఎంపిక పూర్తవుతుంది. – రాజప్రభాకర్‌రెడ్డి, హెచ్ఎం, జెడ్పీ హైసూ్కల్, ఇందిరానగర్ సీటు కోసం వచ్చాను మా తమ్ముడి భార్య చనిపోయింది. నా మేనల్లుడిని ఇందిరానగర్ స్కూల్లో 6వ తరగతిలో చేరి్పంచేందుకు వచ్చాను. పరీక్ష రాయించాను. ఇందులో చదివితే విద్యావంతుడు అవుతాడని నమ్మకంతో సీటు కోసం తిరుగుతున్నా. – బాలలక్ష్మి, సిద్దిపేటఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ ఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ ప్రవేశపెట్టారు. కరీంనగర్‌కు చెందిన 9వ బెటాలియన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. 8వ తరగతి నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ⇒ ఈ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీ, కా ర్పొరేట్ కళాశాలలో ఉచిత సీట్లకు ఎంపికవుతున్నారు. 2023–2024 విద్యా ఏడాదిలో 231 మంది పదో తరగతి పరీక్ష రాయగా 229 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇటీవల విడుదలైన పాలిసెట్‌లో వెయ్యిలోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. -
నేటి నుంచి మళ్లీ బడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి. 2024–25 విద్యా సంవత్సరం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల టీచర్లు, విద్యార్థుల్లో హడావుడి∙కన్పి స్తోంది. సర్కారీ స్కూళ్లలో ఈసారి ఎక్కువ మందిని చేర్పించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. స్కూళ్ళల్లో వసతులపై పెద్ద ఎత్తున ప్ర చారం చేస్తోంది. మార్కెట్లో దుస్తులు, పుస్తకాల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రైవేటు స్కూ ళ్ల బస్సులు, ఆటోలు ఈ ఏడాది ఫీజులు పెంచా యి. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్నారు. వీరిలో 28 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో 30 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు, 11500 వరకూ ప్రైవేటువి ఉన్నాయి. ప్రవేశాలు పెరిగేనా? ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లల్లో ఎక్కువ మందిని చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో వినూత్నంగా చేపడుతున్నారు. వాస్తవానికి గత కొన్నేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరడం క్రమంగా తగ్గుతోంది. 1–5 క్లాసుల వరకూ చేరికలు కొంత ఆశాజనకంగా ఉన్నా, ఆ తర్వాత క్లాసుల్లో ఎన్రోల్మెంట్ పడిపోతోంది. 5వ తరగతి తర్వాత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళల్లో చేరుతున్నారు. ఈ పరిణామాలపై ప్రతీ ఏటా అధికారులు నివేదికలు ఇస్తూనే ఉన్నారు. సరిదిద్దేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సమ గ్ర శిక్ష ప్రాజెక్టు అధ్యయనం ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యా ర్థులు కూడా ఉండటం లేదని తేలింది. 1–5 తరగతుల వరకూ క్లాసుకు 40–60 మంది విద్యార్థులు ఉంటున్నారు. 5వ తరగతి నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయింది. ప్ర భుత్వ స్కూళ్ళు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత వేధించడం, సకాలంలో పుస్తకాలు రాకపోవడం, వచ్చినా పంపిణీ జరగకపోవడం, ఈ కారణంగా బోధన కుంటుపడటం ప్రధాన కారణాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా రు. 1–5 తరగతులకు దిగువ మధ్య తరగతి కు టుంబాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ మంచి విద్య ను అందించాలనే అభిప్రాయంతో ఉంటున్నాయి. దీనికోసం తల్లిదండ్రులు పట్టణాలకు వెళ్తున్నారు. బదిలీలు, పదోన్నతులపై కసరత్తు సాంకేతికంగా ప్రభుత్వ స్కూళ్లు ఈ నెల 12 నుంచి తెరుచుకుంటున్నా... బోధనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకూ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడతారు. ఉపాధ్యాయులంతా ఈ హడావిడిలో ఉండే వీలుంది. ఇప్పటికీ అన్ని స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందలేదు. వీలైనంత త్వరగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది. -
వడివడిగా.. బడికి
నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం స్కూళ్లను అలంకరించిన ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు సర్కార్ బడుల్లో మాత్రం సమస్యలే స్వాగతతోరణాలు కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లు సిటీబ్యూరో: వేసవి సెలవుల అనంతరం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 40 రోజులపాటు ఆటపాటలతో కాలక్షేపం చేసిన చిన్నారులంతా బడిబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫారాలను సిద్ధం చేసుకున్న విద్యార్థులు కొత్త బ్యాగులతో స్కూళ్లల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చిన్నారులకు పాఠ్య పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, యూనిఫారాల కొనుగోళ్లతో గత వారం రోజులుగా తల్లిదండ్రులు బిజీగా గడిపారు. నగరవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సుమారు 50 వేల మంది చిన్నారులు తొలిసారిగా బడుల్లోకి అడుగుపెడుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలో కోటి ఆశలు, శతకోటి ఠమొదటిపేజీ తరువాయి ఆకాంక్షలతో బడిలో అడుగు పెడుతున్న చిన్నారులకు ఆల్ ది బెస్ట్. ముస్తాబైన స్కూళ్లు.. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ నగరంలో ప్రత్యేక వాతావరణం చోటుచేసుకుంది. షాపులన్నీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడుతున్నాయి. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేం దుకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లన్నీ ఇప్పటికే (తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం) అలంకరించాయి. సర్కారు స్కూళ్లు మాత్రం పాత సమస్యలతోనే స్వాగతం పలుకనున్నాయి. పెరిగిన పుస్తకాల ధరలు పేపర్ ధర పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది అన్ని రకాల పుస్తకాల ధరలు 5 నుంచి 10 శాతం పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగానే పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పుస్తకాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు పలు ప్రైవేటు స్కూళ ్లలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు తమ వద్దే కొనాలని యాజమాన్యాలు షరతులు పెట్టాయి. ఇప్పటికే 95 శాతం మంది విద్యార్థులు తమకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఈ ఏడాది కేవలం స్కూల్ విద్యార్థుల వల్ల సాధారణ మార్కెట్ (బ్యాగులు, బూట్లు, యూనిఫారమ్ తదితరాలన్నీ కలిపి)లో దాదాపు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అంచనా. మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువు‘కొంటున్నది’ఇలా.. తరగతి ట్యూషన్ ఫీజు ట్రాన్స్పోర్ట్ పుస్తకాలు అడ్మిషన్ ఫీజు నర్సరీ-యూకేజీ 18,000 7,500 2,500 10,000 1,2,3వ తరగతులకు 23,000 10,000 3,000 10,000 4,5వ తరగతులకు 28,000 12,000 3,400 15,000 6,7వ తరగతులకు 33,000 15,000 3,500 20,000 8,9వ తరగతులకు 38,000 15,000 4,000 20,000 10వ తరగతికి 42,000 15,000 4,000 20,000 నోట్: ఇవీకాక యూనిఫారాలు, షూ అండ్ సాక్స్, టై, లోగో, బెల్ట్‌ల ఖర్చు అదనం.