
సాక్షి, హైదరాబాద్: మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసింది. 6399 అంగన్‌వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఆయా జిల్లా కలెక్టర్లు.. నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా అంగన్‌వాడీలు పనిచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment