helpers
-
అంగన్వాడీల్లో రిటైర్మెంట్ లొల్లి!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లు తప్పకుండా రిటైరవ్వాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంచాలకులు నిర్మల కాంతి వెస్లీ తరఫున సంయుక్త సంచాలకులు కేఆర్ఎస్ లక్ష్మీదేవి మెమో విడుదల చేశారు. ఈ మెమోను రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంక్షేమాధికారులు, సీడీపీఓలు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఆదివారం పంపించారు. ప్యాకేజీపై పెదవి విరుపు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ ప్యాకేజీపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెదవి విరుస్తున్నారు. పదవీ విరమణ ప్యాకేజీ కింద అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ప్రభుత్వం జీఓ 10ని జారీ చేసింది. అయితే దీనిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్యాకేజీపై మార్పులు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాలు సద్దుమనిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్యాకేజీ సవరణల ఊసు లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పదవీవిరమణ ప్రక్రియ అమల్లోకి వచి్చంది.ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు నిండిన వారు విధుల నుంచి తప్పుకోవాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సూచించింది. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ సమాచారాన్ని అంగన్వాడీల యాప్ (ఎన్‌హెచ్‌టీఎస్–ఈఎంఎస్) నుంచి కూడా తొలగించాలని ఆదేశించింది. దీనిపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్యాకేజీని మార్పు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి తప్పుకోబోమని చెబుతున్నారు. ఈ అంశంపై త్వరలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెబుతున్నారు.టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలి అంగన్వాడీ టీచర్, హెల్పర్లు సగటున 30–40 ఏళ్లపాటు సేవలందించి 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతున్నారు. అంతకాలం సేవలందించే వారికి ప్రభుత్వం అత్తెసరు ఆర్థిక సాయం ఇవ్వాలనుకోవడం సరికాదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సాయంలో మార్పులు చేయాలి. కనీసం అంగన్వాడీ టీచర్‌కు రూ. 2 లక్షలు, హెల్పర్‌కు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలి. అప్పటివరకు పదవీ విరమణ పొందకుండా విధులు నిర్వహించేందుకు అంగీకరించాలి. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనకు దిగుతాం. – ఎం.సాయిశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నాటి హామీలు ఏమయ్యాయి? గౌరవవేతనం పెంపు కోసం గతేడాది మేం సమ్మె చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవ వేతనాలు పెంచడంతోపాటు పదవీ విరమణ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా వేతన పెంపు, రిటైర్మెంట్ ప్యాకేజీ మాటెత్తడం లేదు. – పి.రజిత, అంగన్వాడీ టీచర్, కరీంనగర్ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మెరుగైన పదవీవిరమణ ప్యాకేజీ ఇస్తామని, వేతనాలు కూడా పెంచుతామని అప్పట్లో సమ్మె చేసిన చోటుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదు. టీచర్లకు రూ. 18 వేలు జీతం ఇస్తామని, రిటైర్మెంట్ ప్యాకేజీ రెట్టింపు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ అమల్లోకి రాలేదు. – టేకుమల్ల సమ్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
అంగన్వాడీల్లో వేతన యాతన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు వేతన కష్టాలు తీరడం లేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి వారికి వేతనాల్లేవు. మరోవైపు సమ్మె కాలానికి సంబంధించిన బకాయిలు సైతం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా పదో తేదీలోపు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందేవి. కానీ ఏడాది కాలంగా ఈ చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు విడుదల కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 59వేల మంది అంగన్వాడీ సిబ్బంది రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక హెల్పర్ చొప్పున పోస్టులు మంజూరైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 59వేల మంది టీచర్లు, హెల్పర్లు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. అంగన్వాడీ టీచర్‌కు నెలకు రూ.13650 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా... హెల్పర్‌కు రూ.7800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం మంజూరు చేస్తోంది. ప్రతి నెలా జాప్యమే.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన చెల్లింపుల్లో ప్రతి నెలా జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలో లేక ఇతరత్రా కారణాలతో వేతన చెల్లింపుల్లో కాస్త ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ.. ప్రతి నెలా ఇదే పరిస్థితి తలెత్తుతుండడం పట్ల వారు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో వేతన చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలకు ప్రతి నెలా రూ.70 కోట్లు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల గౌరవవేతనానికి సంబంధించి ప్రతి నెలా సగటున రూ.70కోట్ల బడ్జెట్ అవసరం. ఈ లెక్కన ఏటా రూ.840 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. గత కొంత కాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ సమస్యతో వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కమిషనరేట్‌కు ఫిర్యాదులు వేతన చెల్లింపుల్లో జాప్యంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నుంచి రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హె ల్పర్ల సంఘం ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌కు వే ర్వేరుగా వినతి పత్రాలు సమరి్పంచింది. వేత న చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరింది. -
అంగన్వాడీల సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్, ముషీరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె య«థాతథంగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందువల్లే సమ్మెను కొనసాగిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో సమ్మె విరమించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన వేతనాలను ఏమేరకు పెంచుతామనే అంశాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. వేతనాల అంశాన్ని సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినప్పుడు అంగన్వాడీలకు కూడా పెంచుతామని హామీ ఇచ్చారని వివరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపాదనలు అమలు చేయాలని కోరితే మంత్రి హరీశ్‌రావు పరిశీలిస్తామని చెప్పారని, స్పష్టతనివ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు. గ్రాట్యుటీ అంశాన్ని సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. సమ్మె విరమించాలని మంత్రి హరీశ్‌రావు కోరారని, కానీ జేఏసీ మంత్రికి నిర్ణయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ నెల 4న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్‌తో భేటీ అయిన వారిలో సీఐటీయూ నేతలు పి.జయలక్ష్మి, సునీత, ఏఐటీయూసీ నేతలు ఎన్.కరుణకుమారి, ఎం.సాయిశ్వరి, కె.చందన, జేఏసీ నేతలు భూపాల్, ఓ.ఈశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఉన్నారు. మరింత పట్టుదలతో సమ్మె: ఏఐటీయూసీ నేత విజయలక్ష్మి అంగన్వాడీలు మరింత పట్టుదలతో సమ్మె కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకురాలు బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డీ.యూసఫ్, ఎస్.బాలరాజులు పిలుపునిచ్చారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి సరిగ్గా హామీ రాకపోవడం, మిగిలిన డిమాండ్లపైనా స్పష్టత లేకపోవడంచో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. -
అంగన్వాడీలకూ పీఆర్సీ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థిరీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని, ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరుగుతాయన్నారు. ఆదివారం అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లు, ఇతర సమస్యలను మంత్రి ముందు ఉంచారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని,ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలను కూడా పెంచుతామని భరోసానిచ్చారు. ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ డిమాండ్లపై నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి భారతి హోలికేరినీ ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, రెండు రోజుల్లో ఆయా ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. -
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్/ కైలాస్‌నగర్ (ఆదిలాబాద్)/జగిత్యాల క్రైం/సుభాష్ నగర్ (నిజామాబాద్): అంగన్వాడీల్లోని టీచర్లు, హెల్పర్లు తలపెట్టిన సమ్మె పదోరోజూ ఉధృతంగా కొనసాగింది. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించారు. టీచర్లు, హెల్పర్లు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీ టీచర్ల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసు పెన్షన్, ఆరోగ్య పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఉద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఆదిలాబాద్‌లో జుట్లు పట్టుకుని.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో పలువురు అంగన్వాడీలు, పోలీసులకు గాయాలయ్యాయి. అంగన్వాడీలను నిలువరించే క్రమంలో తలమడుగు ఎస్సై ధనశ్రీ ఓ అంగన్వాడీ జుట్టు పట్టుకుని నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు అంగన్వాడీలు ఎస్సై ధనశ్రీని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు పలువురిని పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొంతమంది అంగన్వాడీలు స్టేషన్‌కు చేరుకుని బైఠాయించడంతో కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు. వారంతా తిరిగి కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన కొనసాగించడంతో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా సమ్మె శిబిరానికి చేరుకున్న తర్వాత బేల మండలం సదల్పూర్ అంగన్వాడీ టీచర్ ప్రగతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాలలో పోలీసులపై దాడి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ముట్టడి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు పలువురు అంగన్ వాడీలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఈశ్వర్రావు తదితరులు అంగన్వాడీల ఆందో ళనకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు కూడా అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారితో పాటు సీఐటీయూ నాయకులు గేట్లు ఎక్కి లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. -
హెల్ప్ మి
వారు ఒంటరివారు..రేషన్ డీలర్‌గా బతుకు బండి లాగుతున్నారు. సరుకుల పంపిణీ చేసేందుకు సహాయక (హెల్పర్)ని ప్రభుత్వం నియమించకపోవడంతో కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీలో ఆపసోపాలు పడుతున్నారు. నామినీగా భార్యాభర్తలో ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా వచ్చే అంతంతమాత్రం ఆదాయానికి ఇద్దరు ఒకేచోట ఉండిపోతే పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినీ బదులుగా హెల్పర్లను నియమించాలని వేడుకొంటున్నారు. ఉయ్యూరులోని 0682020 నంబర్ రేషన్ దుకాణాన్ని ఒక మహిళా డీలర్ నిర్వహిస్తున్నారు. ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. బతుకుతెరువు కోసం రేషన్ డీలర్ గా ఉన్నారు. జీవిత భాగస్వామి లేకపోవడంతో నామినీని పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. హెల్పర్‌ను నియమించుకునే అవకాశం ఇవ్వమని కోరుతున్నా స్పందనలేదు. విజయవాడ సర్కిల్–2 కార్యాలయ పరిధిలో పి.వెంకటేశ్వరరావు( నంబర్ 0684263 ) రేషన్ డిపో నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య లేదు. ఒంటరిగా ఉండటంతో ప్రభుత్వం నిబంధనల ప్రకారం నామినీని నియమించుకునే అవకాశం లేదు. తాను ఒక్కడినే దుకాణం నడపుకోలేనని హెల్పర్ కావాలని కోరినా స్పందన శూన్యం. సాక్షి, విజయవాడ : జీవనోపాధి కోసం రేషన్ దుకాణం నడిపే డీలర్ల మెడపై ప్రభుత్వం ఆంక్షల కత్తి పెడుతోంది. దీంతో డీలర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తలాతోక లేకుండా తీసుకున్న నిర్ణయాలు కొంతమంది డీలర్లకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగి జీవిస్తూ, రేషన్ దుకాణం నడుపుకునే డీలర్లకు నామినీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నామినీలకు బదులుగా హెల్పర్లకు అవకాశం ఇవ్వమని డీలర్లు ముక్తకంఠంతో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా వారికి చుక్కలు చూపిస్తోంది. నామినీలను తగ్గించడంతో ఇబ్బందులు రేషన్ దుకాణాన్ని ఒక డీలరే నడుపుకోలేరని గతంలో ఇద్దరు నామినీలను ఇచ్చేవారు. రేషన్ డీలర్ వేలిముద్రలతో పాటు మరో ఇద్దరి వేలిముద్రలు ఈపోస్ మిషన్‌లో నమోదు చేసే వారు. డీలర్ దుకాణంలో లేని సమయంలో మిగిలిన ఇద్దరిలో ఎవరైనా సరుకులు ఇచ్చే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఇద్దరు నామినీలను తీసి వేసి కేవలం భార్య లేదా భర్త మాత్రమే నామినీగా ఉండాలని వారే సరుకులు పంపిణీ చేయాలని నిబంధన విధించింది. భర్త పేరుతో రేషన్ దుకాణం ఉంటే భార్య, భార్య పేరుతో ఉంటే భర్త వేలిముద్రలు మాత్రమే ఈపోస్ మిషన్ తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. భార్య, భర్త మినహా ఇతరుల వేలిముద్రలు నమోదు చేయడానికి వీలు లేదు. రెండో నామినీని తొలగించారు. కొండనాలుకకు మందేస్తే... రేషన్ దుకాణాలు బినామీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని విమర్శలు రావడంతో బినామీలను అరికట్టేందుకు అధికారులు ఇద్దరు నామినీలను తొలగించి, జీవిత భాగస్వామిని మాత్రమే నామినీగా ఉంచారు. కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడినట్లు ఇప్పుడు ఈ నిబంధన కొంతమంది డీలర్లకు శాపంగా మారింది. జిల్లాలో 2,147 రేషన్ దుకాణాలు ఉండగా అందులో 73 దుకాణాల డీలర్లకు జీవిత భాగస్వాములు లేరు. ఇప్పుడు వారికి నామినీని పెట్టుకునే అవకాశం లేకపోయింది. దీంతో డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు. డీలర్లకు కష్టాలు ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప ఇతర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో డీలర్లు కటుంబాలు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో జీవిత భాగస్వాములు కూడా వేరే పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారిని మాత్రమే నామినీగా నియమించడం వల్ల వాళ్లు మరో పనిచేసుకునే వీలులేకుండా పోయింది. హెల్పర్స్ను నియమించాలని మంత్రికి వినతి చౌకధరల దుకాణదారుల సంఘం రాష్ట్ర నాయకులు ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును కలిసి నామినీకి బదులుగా హెల్పర్స్ను నియమించుకునేందుకు అవకాశం కల్పించమని కోరారు. హెల్పర్‌కు వేతనం కాని, కమీషన్ కాని ప్రభుత్వం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కేవలం రేషన్ దుకాణం నిర్వహిస్తే ఆదాయం సరిపోక నామినీలు కూడా వేరొక పనిచేసుకుంటున్నారని వివరించారు. నామినీకి బదులుగా హెల్పర్ వేలిముద్రను ఈపోస్ మిషన్‌లో తీసుకోవాలని కోరుతున్నారు. అయితే దీనిపట్ల మంత్రి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. హెల్పర్స్ను అనుమతించం కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం డీలర్లు కోరిన విధంగా హెల్పర్స్‌ని నియమించడం సాధ్యపడదు. అయితే జీవిత భాగస్వామి లేని పక్షంలో డీలర్ రేషన్‌కార్డులో ఉన్న వారిలో ఒకరిని నామినీగా నియమిస్తాం. – డీఎస్వో నాగేశ్వరరావు హెల్పర్‌ను నియమించండి నామినీకి బదులుగా హెల్పర్‌ను ఇవ్వమని ఇప్పటికే మంత్రిని కలిసి విన్నవించాం. హెల్పర్‌ను ఇస్తే డీలర్లకు ఉపయుక్తంగా ఉంటుంది. డీలర్ల కుటుంబ సభ్యులు మరో పని చేసుకునే అవకాశం ఉంటుంది. – కె.కొండ(జేమ్స్), రేషన్‌డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
బహ్రెయిన్‌లో ఆపద్బాంధవులు
రాయికల్(జగిత్యాల): ఉన్న ఉరిలో ఉపాధి కరువవడంతో బహ్రెయిన్ దేశంకు వెళ్లిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కార్మికులు పడుతున్న కష్టాలను చూసి చలించి పోయిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన రాధారపు సతీశ్‌కుమార్ 2012లో 25మంది సభ్యులతో కలిసి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో జగిత్యాల జిల్లాకు చెందిన ఊట్‌పెల్లికి చెందిన బొలిశెట్టి వెంకటేష్, మెట్‌పెల్లికి చెందిన లింబాద్రి, వేంపేట్‌కు చెందిన మగ్గిడి రాజేందర్‌తోపాటు వివిధ జిల్లాకు చెందిన సభ్యులతో కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. బహ్రెయిన్‌లోని వివిధ కంపెనీ ల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఏదైన ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన, మృతిచెందిన వారందిరికీ అండదండగా ఉంటూ ఆపద సమయంలో మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. క్షతగాత్రులకు కుటుంబసభ్యుల్లా సేవలందిస్తున్నారు. మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతూ మృతిచెందిన వారి కుటుంబసభ్యులను ఆదుకోవడానికి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ సభ్యులంతా కలిసి తమకు వచ్చిన జీతంలో కొంత డబ్బును జమ చేస్తున్నారు. మల్లాపూర్ మండలం సాతారంకు చెందిన కొమ్మ శంకర్, కామరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన బట్టు సేవ్య, గాం«ధారి మండలం కొడంగల్‌కు మారుకంటి బాబు, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేటకి చెందిన సాయన్న, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవనగర్‌కి చెందిన రాజన్న, నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మెండోరకి చెందిన అల్లెపు గంగారం ఇటీవల బహ్రెయిన్‌లో మృతిచెందగా వారి మృతదేహాలను సొంతఖర్చులతో స్వగ్రామాలకు పంపించారు. మెట్‌పెల్లి మండలం రంగరావుపేటకు చెందిన గుగ్లావత్ రాజేందర్ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి పోగా మందుల ఖర్చులు, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేటకు చెందిన సాయన్నకు పక్షవాతం రావడంతో, ఖానాపూర్ మండలానికి చెందిన బైరగొని సంజీవ్ కడుపులో కణితి పెరగడంతో వారు స్వగ్రామానికి వెళ్లేలా విమాన ఛార్జీలు అందజేశారు. అంతే కాకుండా కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌కు చెందిన రాజన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ. 20వేలు అందజేశారు. వీరి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్, ఎంపీ కవిత అభినందించారు. సేవ.. సంతృప్తినిస్తుంది నిరక్షరాస్యులైన కార్మికులు ఏజెంట్ల మాయమాటలు నమ్మి బెహరాన్ దేశంకు వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వారిని ఆదుకోవడంతోపాటు, తోచిన సాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25మంది సభ్యులతో కలిసి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఏర్పాటు చేశారు. తద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. – రాధారపు సతీశ్‌కుమార్ -
ఓటేసేందుకు సహాయకులు కావాలి
- మాకు చదువురాదు – దేశం నేతల ఆధ్వర్యంలో జేసీకి దరఖాస్తు చేసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు కర్నూలు(అగ్రికల్చర్): తమకు చదువురాదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సహాయకులను ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు సోమవారం తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారి అయిన జేసీ హరికిరణ్‌ను కలిసి దరఖాస్తు చేసుకున్నారు. శాసనమండలి లోకల్ అథారిటీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. అయితే నిరక్షరాస్యులు, అంధులు, బలహీనులు సహాయకుడిని నియమించుకొని ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇది అధికార పార్టీ నేతలకు కలసి వచ్చింది. ఓటర్లు నిజంగా తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారో లేదో అనే భయంతో దగ్గరుండి సహాయకుల కోసం దరఖాస్తు చేయించడం గమనార్హం. దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు సోమవారమే కావడంతో చదువురాని వారితో పాటు అనుమానం ఉన్న వారికి సహాయకులను నియమింపచేసి వారి ద్వారా తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలనే లక్ష్యంతో దేశం నేతలు ఎంపీటీసీలను జేసీ కార్యాలయానికి తీసుకువచినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లు మొన్నటి వరకు 1084 మంది ఉన్నారు. వీరిలో నంద్యాల ఎమ్మెల్యే మరణించడంతో ఓటర్ల సంఖ్య 1083కు తగ్గింది. ఇందులో ఎంపీటీసీ సభ్యులు 804 మంది ఉన్నారు. వీరిలోనే చాలామంది సహాయకుల కోసం కలెక్టరేట్‌కు వచ్చారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులో్ల 18 ఏళ్లు నిండిన వారిని సహాయకులుగా నియమిస్తారు. అయితే దేశం నేతలు కొంత మంది ఎంపీటీసీ కుటుంబ సభ్యులపై అనుమానంతో ఇతరులను సహాయకులుగా నియమించేందుకు దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. వీటిపై జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. -
సహాయకులను అనుమతించం
- అంధులు, నిరక్షరాస్యులకు మినహాయింపు - వీరు 13వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలి - స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరికిరణ్ తెలిపారు. కర్నూలు, ఆదోని, నంద్యాల రెవెన్యూ డివిజన్ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహాయకులను అనుమతించబోమన్నారు. అంధులు, చదువులేని, బలహీనులై ఉండి ఓటు వేయలేని స్థితిలో ఉన్నవారు సహాయకుల కోసం తగిన ఆధారాలతో ఈ నెల 13వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాల్నారు. దరఖాస్తు ఫారాన్ని వెబ్సైట్(ఠీఠీఠీ.జుuటnౌౌ .్చp.జౌఠి.జీn)నుంచి పొందాలన్నారు. 18 ఏళ్లు నిండి, ఫొటో గుర్తింపు కార్డున్న వారినే సహాయకునిగా నియమించుకోవాలన్నారు. -
కలెక్టరేట్ ఎదుట ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ల ధర్నా
ముకరంపుర : ప్రైవేట్ విద్యాసంస్థల బస్‌డ్రైవర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ఆ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు గుడికందుల సత్యం మాట్లాడుతూ ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు డ్రైవర్లు, హెల్పర్లకు రూ.6–8 వేల వేతనం మాత్రమే ఇస్తూ శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని అన్నారు. 75 శాతం ప్రైవేట్ స్కూళ్లలో హెల్పర్లను నియమించకుండా డ్రైవర్లతోనే అన్ని పనులు చేయిస్తున్నారని, పీఎఫ్, బోనస్ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మిక శాఖ జిల్లా ఉపకమిషనర్ సమక్షంలో ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు జూన్ నుంచి కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి హామీని విస్మరించారని తెలిపారు. హామీలను అమలు చేయకుంటే ఆగస్టు మొదటి వారంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల కిషన్, అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు పి.నర్సింగం, నగర ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాస్, వేములవాడ అధ్యక్షుడు ఎం.రవి, ప్రధాన కార్యదర్శి తిరుపతి, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులున్నారు. -
షార్ట్ సర్య్కూట్: ముగ్గురు లైన్మెన్ల మృతి
-
షార్ట్ సర్య్కూట్: ముగ్గురు లైన్మెన్ల మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కదిరినాయుడు పల్లిలో శనివారం షార్ట్ సర్య్కూట్ తో ముగ్గురు లైన్ మెన్ లు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. వాటిని మరమ్మత్తు చేస్తుండగా..ఒక్కసారిగా ఈదురు గాలులు వచ్చాయి. దీంతో మరో లైన్ కు సంబంధించిన విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లైన్ మైన్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు వేణు(30), శ్రీను(35), శ్రీనివాసులు(30)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
డిగ్రీ ఉంటేనే.. అంగన్వాడీ కొలువు!
వర్కర్ పోస్టుల విద్యార్హత పెంపునకు ఉన్నతాధికారుల ప్రతిపాదన * హెల్పర్ల విద్యార్హతనూ 10వ తరగతికి పెంచే అవకాశం * ప్రభుత్వామోదం లభిస్తే వెంటనే నోటిఫికేషన్ విడుదల * త్వరలో 1,800 అంగన్వాడీ వర్కర్ పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇటీవల గౌరవ వేతనాలను పెంచిన ప్రభుత్వం తాజాగా వారికి ఉండాల్సిన కనీస విద్యార్హతలను కూడా పెంచాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు టెన్త్ విద్యార్హతతోనే అంగన్వాడీ వర్కర్ల నియామకం జరగ్గా ఉన్నతాధికారులు తాజాగా సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఇకపై‘అంగన్వాడీ కొలువు’కు కనీస అర్హత డిగ్రీ కానుంది. హెల్పర్ల విద్యార్హతను ఏడవ తరగతి నుంచి టెన్త్‌కు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. వివిధ జిల్లాల్లో పలు సీడీపీవో ప్రాజెక్టుల కింద సుమారు 1,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మహిళా శిశుసంక్షేమ విభాగం ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పథకాల సమగ్ర అమలు కోసమే.. మహిళలు, బాలల సంక్షేమం కోసం కేంద్రంతోపాటు తాము ప్రవేశపెడుతున్న వివిధ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చే యాలంటే అంగన్వాడీ వర్కర్లకు తగిన విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లుగా డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు దొరకని పక్షంలో.. ఏం చేయాలనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ‘ఏ’ కేటగిరీ కింద, గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీలను ‘బి’ కేటగిరీగా విభజించాలని నిర్ణయించారు. ‘ఏ’ కేటగిరీ అంగన్వాడీల్లో వర్కర్ పోస్టుల భర్తీ విషయంలో డిగ్రీ కలిగిన అభ్యర్థులనే పరిగణన లోకి తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్లకు కనీస అర్హతను ఇంటర్మీడియట్గా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళా, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 35,334 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 31,606 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుకాగా, 3,728 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అంగన్వాడీల్లో బాధ్యతలు ఇలా.. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు గౌరవ వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 23నే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కేంద్రాల వర్కర్లకు గతంలో రూ.4,200లుగా ఉన్న వేతనాన్ని రూ.7 వేలకు, మినీ అంగన్వాడీల్లో పనిచేసే వర్కర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.2,200 నుంచి రూ. 4,500కు పెంచింది. వర్కర్లు నిర్వహించాల్సిన విధులు, చేపట్టాల్సిన బాధ్యతలను కూడా పెంచింది. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లకు 24 రకాల విధులను సూచించింది. అంగన్వాడీ వర్కర్లు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూలింగ్ నిర్వహించాలి. ఇమ్యునైజేషన్, డీవార్మింగ్ నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను భాగస్వాములను చేయాలి. ఐసీడీఎస్ వేదికల (ఐజీఎంఎస్‌వై, ఆర్ ఎస్బీకే, కెఎస్వై.. తదితర)తో సమన్వయం చేసుకోవాలి. ఆపై ప్రభుత్వం అప్పగించిన ఏ బాధ్యతలనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. -
‘ప్రశ్నిస్తే అంగన్వాడీలను తీసేస్తారా’
సాక్షి, హైదరాబాద్: సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ తీవ్రంగా ఖండించింది. దీనిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు జి.బేబీరాణి, పి.రోజా ఒక ప్రకటన విడుదల చేశారు.