షార్ట్ సర్య్కూట్: ముగ్గురు లైన్మెన్ల మృతి | 3 died due to short circuit in nellore district | Sakshi

షార్ట్ సర్య్కూట్: ముగ్గురు లైన్మెన్ల మృతి

Oct 3 2015 9:33 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది.

నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కదిరినాయుడు పల్లిలో శనివారం షార్ట్ సర్య్కూట్ తో ముగ్గురు లైన్ మెన్ లు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. వాటిని మరమ్మత్తు చేస్తుండగా..ఒక్కసారిగా ఈదురు గాలులు వచ్చాయి.

దీంతో మరో లైన్ కు సంబంధించిన విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లైన్ మైన్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు వేణు(30), శ్రీను(35), శ్రీనివాసులు(30)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement