నెల్లూరు బాలాజీ కెమికల్స్లో అగ్నిప్రమాదం | Fire accident at balaji chemicals in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు బాలాజీ కెమికల్స్లో అగ్నిప్రమాదం

Published Fri, Aug 9 2013 8:37 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Fire accident at balaji chemicals in nellore district

స్టోన్హౌస్పేట బాలాజీ కెమికల్స్లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ సంస్థ భద్రత సిబ్బంది అగ్నిమాపకశాఖకు, పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అగ్నిమాపకశాఖ శకటాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

 

మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదం వల్ల రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని యాజమాన్యం తెలిపింది. షార్ట్సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement